ఆ బాలికకు నాలుగు రోజులు నరకం చూపించారు | Delhi Police cracks major human trafficking case, rescues minor girl pushed into flesh trade | Sakshi
Sakshi News home page

ఆ బాలికకు నాలుగు రోజులు నరకం చూపించారు

Published Wed, Dec 9 2015 5:03 PM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM

ఆ బాలికకు నాలుగు రోజులు నరకం చూపించారు

ఆ బాలికకు నాలుగు రోజులు నరకం చూపించారు

న్యూఢిల్లీ: కరువుతోనో.. కడుపుమాడ్చుకుంటూనో తనమానానతాను తల్లిదండ్రులతో ఉంటున్న ఓ బాలిక జీవితం ఊహించని విధంగా అంధకార కూపంలో పడిపోయింది. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న వ్యక్తి ఆ బాలిక కుటుంబాన్ని నమ్మించాడు. ఆమెకు పని ఇప్పిస్తానని చెప్పి ఏకంగా పశ్చిమబెంగాల్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చాడు. అక్కడ కరోల్ బాగ్ అనే ప్రాంతంలోని ఓ నివాసంలో పెట్టాడు. అప్పటికే కరోల్ బాగ్ ఆ చుట్టుపక్కల వ్యభిచార రాకెట్ హవా నడుస్తోంది.

అమాయకురాలైన ఆ బాలికకు తను ఎక్కడికి వచ్చానో కూడా తెలియదు. ఇంట్లో బంధించిన ఆ దుర్మార్గుడు ఆ బాలికకు పోర్న్ వీడియోలు చూపించి అత్యాచారం చేశాడు. కొట్టి పొట్టి దుస్తులు వేయించి వాహనాల్లో ఆయా ప్రాంతాలకు వ్యభిచారం చేయించడం కోసం తిప్పాడు. నాలుగు రోజులపాటు రోజుకు 15 మంది నుంచి 20మంది వరకు ఆ బాలికతో బలవంతపు వ్యభిచారం చేయించాడు. ఆ పనికి ఆ బాలిక తిరస్కరించడంతో దారుణంగా చిత్రహింసలు పెట్టారు.

బెల్టులతో కొట్టారు. బలవంతంగా మత్తుపానీయాలు, సిగరెట్లు తాగించారు. ఏవో మాత్రలు మింగించారు. నాలుగు రోజుల్లోనే నరకం అంటే ఎలా ఉంటుందో ఆ బాలికకు చూపించి రాక్షసులు మనుషుల్లోనే ఉన్నారు మరెక్కడో లేరో అనేలా చేశారు. చివరికి అప్పటికే ఎప్పటి నుంచో కరోల్ బాగ్ అనే ప్రాంతం పోలీసులకు సమస్యగా మారడంతోపాటు అపస్మారక స్థితిలో ఉన్న ఆ బాలికను గుర్తించిన ఓ మహిళ ఆ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో ఢిల్లీ పోలీసులు పంజా విసిరారు. వరుస రైడింగ్ లు చేసి చివరకు వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ క్రమంలో పలువురు పారిపోగా ఒకరిని మాత్రం అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల పర్యవేక్షణలో ఆమెకు ఢిల్లీలో వైద్య చికిత్స అందుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement