సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలపై సమాజ్‌వాదీ పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలతో కలిసి పోరాడాలని సమాజ్‌వాదీ పార్టీ నేషనల్ సెక్రటరీ డాక్టర్ జగదీష్ యాదవ్ అన్నారు. గురువారం గ్రేటర్ హైదరాబాద్ సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, సామాజికవేత్త దండుబోయిన నిత్య కళ్యాణ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడు మదిరె నర్సింగ్‌రావు నేషనల్ సెక్రటరీ డాక్టర్ జగదీష్ యాదవ్‌తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా కళ్యాణ్ యాదవ్ మాట్లాడుతూ త్వరలో గ్రేటర్ వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న కార్యక్రమాలతో పాటు సభ్యత్వ నమోదు, సామాజిక కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. నేషనల్ సెక్రటరీ జగదీష్ యాదవ్ సూచించినట్లుగా త్వరలోనే ప్రజా సమస్యలపై కూడా పోరాటాలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment