రోస్బర్గ్కు తొలి ‘పోల్’ | Chinese GP Qualifying: Nico Rosberg on pole, Lewis Hamilton last | Sakshi
Sakshi News home page

రోస్బర్గ్కు తొలి ‘పోల్’

Published Sun, Apr 17 2016 1:16 AM | Last Updated on Sun, Sep 3 2017 10:04 PM

రోస్బర్గ్కు తొలి ‘పోల్’

రోస్బర్గ్కు తొలి ‘పోల్’

చివరి స్థానం నుంచి హామిల్టన్   
నేడు చైనా గ్రాండ్‌ప్రి

 షాంఘై (చైనా): ఫార్ములావన్ సీజన్‌లోని తొలి రెండు రేసుల్లోనూ విజేతగా నిలిచిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ మూడో విజయంపై దృష్టి పెట్టాడు. శనివారం జరి గిన చైనా గ్రాండ్‌ప్రి రేసు క్వాలిఫయింగ్ సెషన్‌లో రోస్‌బర్గ్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 35.402 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సంపాదించాడు. గత రెండు రేసుల్లో ‘పోల్ పొజిషన్’ సాధించిన  ప్రస్తుత ప్రపంచ చాంపియన్  హామిల్టన్‌కు క్వాలిఫయింగ్ సెషన్ కలిసిరాలేదు.

కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో క్వాలిఫయింగ్ తొలి సెషన్‌లో ల్యాప్ కూడా పూర్తి చేయకుండానే వైదొలిగాడు. దాంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ చివరి స్థానం నుంచి మొదలుపెడతాడు. 2014లో హంగేరి గ్రాండ్‌ప్రి తర్వాత హామిల్టన్ ఒక రేసును చివరి స్థానం నుంచి ప్రారంభిస్తుండటం ఇదే తొలిసారి. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు  పెరెజ్, హుల్కెన్‌బర్గ్ వరుసగా ఏడు, పది స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు.

 గ్రిడ్ పొజిషన్స్: 1. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 2. రికియార్డో (రెడ్‌బుల్), 3. రైకోనెన్ (ఫెరారీ), 4. వెటెల్ (ఫెరారీ), 5. బొటాస్ (విలియమ్స్), 6. క్వియాట్ (రెడ్‌బుల్), 7. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 8. కార్లోస్ సెయింజ్ (ఎస్టీఆర్), 9. వెర్‌స్టాపెన్ (ఎస్టీఆర్), 10. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 11. మసా (విలియమ్స్), 12. అలోన్సో (మెక్‌లారెన్), 13. బటన్ (మెక్‌లారెన్), 14. గ్రోస్యెన్ (హాస్), 15. ఎరిక్సన్ (సాబెర్), 16. నాసర్ (సాబెర్), 17. మాగ్నుసన్ (రెనౌ), 18. గుటిరెజ్ (హాస్), 19. పాల్మెర్ (రెనౌ), 20. హర్యాంతో (మనోర్), 21. వెర్లీన్ (మనోర్), 22. హామిల్టన్ (మెర్సిడెస్).

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement