
బుడాపెస్ట్: ఫార్ములావన్ (ఎఫ్1) తాజా సీజన్‌లో మెర్సిడెస్ డ్రైవర్, ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ మళ్లీ మెరిశాడు. శనివారం జరిగిన హంగేరి జీపీ క్వాలిఫయింగ్‌లో ఈ బ్రిటన్ డ్రైవర్ పోల్ పొజిషన్‌ను దక్కించుకున్నాడు. ల్యాప్‌ను అందరికంటే ముందుగా ఒక నిమిషం 15.419 సెకన్లలో పూర్తి చేసి ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించనున్నాడు.
సీజన్‌లో హామిల్టన్‌కిది మూడో పోల్‌కాగా... ఓవరాల్‌గా 101వది. బొటాస్ (మెర్సిడెస్) రెండో స్థానంలో నిలువగా... వెర్‌స్టాపెన్ మూడో స్థానంలో నిలిచాడు. నేడు జరిగే ప్రధాన రేసు సాయంత్రం గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment