
హామిల్టన్‌కే పట్టం
అబుదాబి: విజేతను తేల్చే రేసులో సంయమనంతో డ్రైవ్ చేసిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఒకే విజయంతో రెండు లక్ష్యాలను సాధించాడు. ఆదివారం జరిగిన 2014 ఎఫ్1 సీజన్ చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. దాంతోపాటు ఈ ఏడాది డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌నూ కైవసం చేసుకున్నాడు. 2008లో తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన హామిల్టన్ కెరీర్‌లో ఇది రెండో ప్రపంచ టైటిల్.
55 ల్యాప్‌ల అబుదాబి రేసును ఈ మెర్సిడెస్ డ్రైవర్ గంటా 39 నిమిషాల 02.619 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. 19 రేసుల ఈ సీజన్‌ను హామిల్టన్ 11వ విజయంతో ఘనంగా ముగింపు పలికాడు. మారిన నిబంధనల ప్రకారం సీజన్ చివరి రేసులో రెట్టింపు పాయింట్లు లభిస్తాయి. ఫలితంగా హామిల్టన్ 384 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు.
‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన రోస్‌బర్గ్‌కు తొలి మలుపు వద్దే హామిల్టన్ ఓవర్‌టేక్ చేశాడు. రెండో స్థానం నుంచి రేసును ఆరంభించిన హామిల్టన్ రెండో ల్యాప్ నుంచే ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించాడు. కారులో సమస్య తలెత్తడంతో రోస్‌బర్గ్ ఆఖరికి 14వ స్థానంతో సరిపెట్టుకొని ఒక్క పాయింట్ కూడా నెగ్గలేకపోయాడు.
భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్, పెరెజ్ వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. గత నాలుగేళ్లుగా ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన వెటెల్ ఈ సీజన్‌లో ఒక్క విజయాన్ని దక్కించుకోలేకపోవడం గమనార్హం. 2015 సీజన్ మార్చి 15న ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రితో మొదలవుతుంది.
కన్‌స్ట్రక్టర్స్
చాంపియన్‌షిప్ (టాప్-5)
స్థానం జట్టు పాయింట్లు
1 మెర్సిడెస్ 701
2 రెడ్‌బుల్ 405
3 విలియమ్స్ 320
4 ఫెరారీ 216
5 మెక్‌లారెన్ 181
డ్రైవర్స్ చాంపియన్‌షిప్ (టాప్-5)
స్థానం డ్రైవర్ జట్టు పాయింట్లు
1 హామిల్టన్ మెర్సిడెస్ 384
2 రోస్‌బర్గ్ మెర్సిడెస్ 317
3 రికియార్డో రెడ్‌బుల్ 238
4 బొటాస్ విలియమ్స్ 186
5 వెటెల్ రెడ్‌బుల్ 167
గమ్యం చేరారిలా...
స్థానం డ్రైవర్ జట్టు సమయం పాయింట్లు
1 హామిల్టన్ మెర్సిడెస్ 1:39:02.619 50
2 మసా విలియమ్స్ 1:39:05.195 36
3 బొటాస్ విలియమ్స్ 1:39:31.499 30
4 రికియార్డో రెడ్‌బుల్ 1:39:39.856 24
5 బటన్ మెక్‌లారెన్ 1:40:02.953 20
6 హుల్కెన్‌బర్గ్ ఫోర్స్ ఇండియా 1:40:04.767 16
7 పెరెజ్ ఫోర్స్ ఇండియా 1:40:13.679 12
8 వెటెల్ రెడ్‌బుల్ 1:40:14.664 8
9 అలోన్సో ఫెరారీ 1:40:28.432 4
10 రైకోనెన్ ఫెరారీ 1:40:30.439 2