ప్రముఖ జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్‌కు భారీ షాక్ తగిలింది. బెంజ్ కార్లలో బ్రేకింగ్ సిస్టమ్‌లో లోపాల్ని జర్మన్ ఫెడరల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఎత్తిచూపించింది. వెంటనే బెంజ్‌కు చెందిన 1మిలియన్ కార్లను రీకాల్ చేయాలని స్పష్టం చేసింది.
న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ ప్రకారం.. 2004 - 2015 మధ్య కాలంలో తయారు చేసిన ఎంఎల్, జీఎల్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ సిరీస్‌తో పాటు ఆర్ -క్లాస్ లగ్జరీ మినివాన్ వంటి కార్లలో ఈ లోపం తలెత్తినట్లు స్పష్టం చేసింది.
మెర్సిడెస్ సైతం కార్లను రీకాల్‌ను ఏఎఫ్‌పీకి ధృవీకరించింది. కొన్ని సందర్భాలలో బ్రేకింగ్ సిస్టమ్‌లో లోపాలు తలెత్తే అవకాశం ఉందని తెలిపింది. ఇక బెంజ్ ప్రపంచవ్యాప్తంగా 993,000 వాహనాలు రీకాల్ చేయబడుతున్నాయి. వాటిలో 70,000 వెహికల్స్ జర్మనీలో ఉన్నాయని ఏఎఫ్‌పీ నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment