న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ చిన్న నగరాలకు విస్తరించనుంది. జమ్ము, కాన్పూర్, పాట్నా వంటి 10 నగరాల్లో 20 వర్క్‌షాప్స్ ఏర్పాటు చేయనున్నట్టు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు.
ఇటువంటి నగరాల నుంచి లగ్జరీ కార్లకు డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సర్వీస్ కోసం కస్టమర్లు 2 గంటలకు మించి డ్రైవింగ్ చేయకూడదన్న ఆలోచనతో మినీ మెట్రోలపై దృష్టిసారించామని వివరించారు.
ప్రస్తుతం ఇటువంటి మినీ మెట్రోలు, చిన్న మార్కెట్ల నుంచి తమ కంపెనీకి 30 శాతం అమ్మకాలు నమోదవుతున్నాయని గుర్తు చేశారు. కాగా, కొత్త జీఎల్‌ఏ ఎస్‌యూవీ, ఏఎంజీ జీఎల్‌ఈ 53 మోడళ్లను కంపెనీ బుధవారం ప్రవేశపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment