మీరు కార్లలో ప్రయాణిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత‍్త. ప్రయాణికులు కార్ల నుంచి వెదజల్లే క్యాన్సర్ కారక రసాయనాలను పీల్చుకుంటున్నారంటూ సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది.
అమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ విభాగానికి చెందిన నేషనల్ టాక్సాలజీ ప్రోగ్రామ్ (ఎన్‌టీపీ) కార్ల గురించి ద్రిగ్భాంతికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది.
2015 నుంచి 2022 మధ్య
ఎన్‌టీపీ పరిశోధకులు 2015 నుంచి 2022 మధ్య 101 ఎలక్ట్రిక్, గ్యాస్, హైబ్రిడ్ కార్ల క్యాబిన్ ఎయిర్‌పై అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో 99 శాతం కార్లలో అగ్నిప్రమాదాల్ని నివారించే టీసీఐపీపీ (అంటే ట్రిస్(1-క్లోరో-2-ప్రొపైల్) ఫాస్ఫేట్) అనే రసాయనం ఉందని పరిశోధకులు గుర్తించారు. దీంతో పాటు క్యాన్సర్ కారకాలైన టీడీసీఐపీపీ, టీసీఈపీ అనే రసాయనాలు ఉన్నట్లు నిర్ధారించారు.
ఎలాంటి ప్రయోజనం లేదని
తాజా అధ్యయనంపై ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ (యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్) స్పందించింది. వాహనాల లోపల వెదజల్లే ఫైర్ రిటార్డెంట్ రసాయనాల ప్రమాణాలను అప్‌డేట్ చేయాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాదు అమెరికా హెల్త్ విభాగం జరిపిన అధ్యయనంలో కార్లలో అన్వేక కారణాల వల్ల వ్యాపించే మంటల్ని అదుపుచేసే రసాయనాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పరిశోధకలు స్పష్టం చేశారు.
ఇదొక్కటే పరిష్కారం
గ్రీన్ సైన్స్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ శాస్త్రవేత్త లిడియా జాహ్ల్ మాట్లాడుతూ.. కార్లలో ప్రయాణించే సమయంలో కిటికీలు తెరవడం, నీడలో లేదా గ్యారేజీలలో పార్కింగ్ చేయడం ద్వారా కార్ల నుంచి రసాయనాల నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment