Toxicology Report
-
ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం..
ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వైద్యశాస్త్ర విభాగానికి సంబంధించి ఇటీవలి కాలం (2017)లో... హైకోర్టు క్రిమినల్ అప్పీల్ నం. 326లో వెల్లడించిన ఆదేశాలను అనుసరించి, ఒక సమూల ప్రక్షాళనకై ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. హైకోర్టు న్యాయమూర్తులు తమ తీర్పులో శవపరీక్షల నిర్వహణలో పాటించాల్సిన శాస్త్రబద్ధమైన ప్రమాణాలు, తదనంతరం తయారు చేసే నివేదికల నిబద్ధతపై విస్తృతంగా చర్చించారు. ఆధునిక సమాజంలో ప్రజల అసహజ మరణాలకు గల కారణాలను తెలుసుకోవడం, దోషులను శిక్షించడం, నేరాలను నివారించడం ప్రభుత్వాల బాధ్యత. ఈ ప్రక్రియలో పోలీసులు, కోర్టు లతో పాటు ఫోరెన్సిక్ వైద్యుల పాత్ర చెప్పుకోదగ్గది.గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున వైద్యుల నియామకాలు జరిగిన పుణ్యమా అని చాలాచోట్ల ఫోరె న్సిక్ వైద్యులు అందుబాటులో ఉండడంచేత శవపరీక్షలు నాణ్యతా ప్రమాణాలతో నిర్వహించడానికి అవకాశం ఏర్పడింది. అయితే హైకోర్టు ఆశించిన విధంగా న్యాయ వైద్య శాస్త్రంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడానికి నియమ నిబంధనావళి రూపొందించడం ఈ విశేషజ్ఞుల కమిటీకి పెద్ద కష్టమైన పని కాకపోయినప్పటికీ... దానిని ఆచరణలో పెట్టాలంటే మన శవాగారాలను ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాల చోట్ల శవాలను భద్రపరిచే శీతల వ్యవస్థ (కోల్డ్ స్టోరేజ్) అవసరాలకు సరిపోయేలా లేదు.మన మార్చురీలలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ.. ముఖ్యంగా ద్రవ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి వుంది. శవపరీక్షలు చేయడానికి కావల్సిన ఆధునిక పనిముట్లు చాలాచోట్ల అందుబాటులో లేవు. ప్రపంచం అంతా ఎలక్ట్రిక్ రంపాలతో పుర్రెలను తొలచి మెదడును పరీక్షిస్తుంటే, మనం మాత్రం పాత పద్ధతిలో ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం. కొన్ని అసహజ మరణాలను పరిశోధించడానికి బాడీ శాంపుల్స్‌ను దూరంగా ఉన్న ప్రయోగశాలలకు పంపాల్సి ఉంటుంది, అప్పటివరకు ఆ నమూనాలను పరిరక్షించడానికి డీప్ ఫ్రీజర్లు, అవి చెడిపోకుండా ఉండడానికి ప్రత్యేక సంరక్షక ద్రవ్యాలు అవసరం అవుతాయి. ఈ ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పన పని నాణ్యతను పెంచడానికి ఎంతగానో దోహదపడతాయి.చదవండి: నిజంగా పవన్ కల్యాణ్‌కు ఆ ధైర్యం ఉందా?ఆంధ్రప్రదేశ్‌లోని న్యాయ వైద్య శాస్త్ర ప్రయోగశాలలు (ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీస్) అనేక విష పదార్థాల కారణంగా మరణించినవారి శవపరీక్షలలో పరిమాణాత్మక ఫలితాలను అందించ లేకపోతున్నాయి. అనేక విషాలను గుణాత్మకంగా గుర్తించడంలో పేలవంగా ఉన్నాయి. కాలం చెల్లిన విశ్లేష ణాత్మక విషశాస్త్ర పద్ధతులు (ఎనటికల్ టాక్సికాలజీ) ఉపయోగించడమే దీనికి గల ముఖ్య కారణం. ఎఫ్ఎస్ఎల్లు న్యాయ వైద్య విభాగం మధ్య సరిగ్గా సమన్వయం లేక పోవడం కొన్ని కేసుల న్యాయ విచారణ విఫలమయ్యేందుకు కూడా కారణ మవుతోంది.మొత్తంగా న్యాయ వైద్యశాస్త్ర విభాగం బాగుపడాలంటే... మన మార్చురీలలో, న్యాయ వైద్య ప్రయోగశాలల్లో, పోలీస్ వ్యవస్థలో, అలాగే సంబంధిత వ్యక్తులకు వృత్తి పట్ల అంకిత భావంలో పెను మార్పులు అవసరం.– కట్టంరెడ్డి అనంత రూపేష్ రెడ్డిసహాయ ఆచార్యులు, న్యాయ వైద్య శాస్త్రం– విష విజ్ఞాన శాస్త్రం, ఆంధ్ర వైద్య కళాశాల -
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మీరు కార్లలో ప్రయాణిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ప్రయాణికులు కార్ల నుంచి వెదజల్లే క్యాన్సర్ కారక రసాయనాలను పీల్చుకుంటున్నారంటూ సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది.అమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ విభాగానికి చెందిన నేషనల్ టాక్సాలజీ ప్రోగ్రామ్ (ఎన్టీపీ) కార్ల గురించి ద్రిగ్భాంతికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది.2015 నుంచి 2022 మధ్యఎన్‌టీపీ పరిశోధకులు 2015 నుంచి 2022 మధ్య 101 ఎలక్ట్రిక్, గ్యాస్, హైబ్రిడ్ కార్ల క్యాబిన్ ఎయిర్‌పై అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో 99 శాతం కార్లలో అగ్నిప్రమాదాల్ని నివారించే టీసీఐపీపీ (అంటే ట్రిస్(1-క్లోరో-2-ప్రొపైల్) ఫాస్ఫేట్) అనే రసాయనం ఉందని పరిశోధకులు గుర్తించారు. దీంతో పాటు క్యాన్సర్ కారకాలైన టీడీసీఐపీపీ, టీసీఈపీ అనే రసాయనాలు ఉన్నట్లు నిర్ధారించారు.ఎలాంటి ప్రయోజనం లేదనితాజా అధ్యయనంపై ఎన్హెచ్టీఎస్ఏ (యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్) స్పందించింది. వాహనాల లోపల వెదజల్లే ఫైర్ రిటార్డెంట్ రసాయనాల ప్రమాణాలను అప్డేట్ చేయాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాదు అమెరికా హెల్త్ విభాగం జరిపిన అధ్యయనంలో కార్లలో అన్వేక కారణాల వల్ల వ్యాపించే మంటల్ని అదుపుచేసే రసాయనాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పరిశోధకలు స్పష్టం చేశారు. ఇదొక్కటే పరిష్కారంగ్రీన్ సైన్స్ పాలసీ ఇన్స్టిట్యూట్ సీనియర్ శాస్త్రవేత్త లిడియా జాహ్ల్ మాట్లాడుతూ.. కార్లలో ప్రయాణించే సమయంలో కిటికీలు తెరవడం, నీడలో లేదా గ్యారేజీలలో పార్కింగ్ చేయడం ద్వారా కార్ల నుంచి రసాయనాల నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపారు. -
వరంగల్ సీపీ రంగనాథ్ చేతికి టాక్సికాలజీ రిపోర్ట్
-
సహనటులే విషం పెట్టి చంపారా?
తిరువనంతపురం: దక్షిణాధి భాషల్లో నటించి మంచి పేరు గడించిన కళాభవన్ మృతి వెనుక పలు రహస్యాలు వెలుగుచూసే అవకాశాలు ఉన్నాయి. ఆయన దేహంలో ఎంతో ప్రమాదకరమైన విషపదార్థాలను వైద్యులు గుర్తించడంతో పోలీసులు ఈ కేసును ప్రత్యేకంగా భావిస్తున్నారు. కళాభవన్ అత్యంత సన్నిహితంగా ఉండే నటులు జాఫర్ ఇడుక్కి, థరికిదా సాభులను ఇంకొందరని శనివారం మధ్యాహ్నం నుంచి విచారించడం ప్రారంభించారు. అయితే, వీరే ఏదైనా దురాగతానికి పాల్పడి ఉంటారా లేక ఆ ఘటనకు సంబంధించిన సమాచారం ఏదైనా దొరుకుతుందనే ఉద్దేశంతో వారిని విచారిస్తున్నారా అనే విషయాన్ని మాత్రం పోలీసులు స్పష్టం చెప్పడం లేదు. ఏదేమైనా రెండు మూడురోజుల్లో ఆయన డెత్ మిస్టరీ మాత్రం వీడిపోతుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. -
కళాభవన్ మణి దేహంలో విషపదార్ధాలు
కొచ్చి: విలక్షణ నటుడు కళాభవన్ మణి మృతిపై మిస్టరీ వీడలేదు. కళాభవన్ మణి మరణం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనేది ఇంకా తేలలేదు. ఆయన దేహంలో విషపదార్ధాలు ఉన్నట్టు టాక్సీకాలజీ రిపోర్ట్ లో వెల్లడైంది. ఆయన మృతదేహం నుంచి సేకరించిన నమూనాకు కొచ్చిలోని కక్కనాడ్ ప్రాంతీయ రసాయన పరీక్షా కేంద్రంలో టాక్సికాలజీ టెస్టులు చేశారు. ప్రమాదకరమైన క్రిమిసంహారిణి 'క్లోర్ పిరిఫొస్' అవశేషాలు ఉన్నట్టు పరీక్షల్లో వెల్లడైంది. దీంతో పాటు మిథైల్, ఇథైల్ ఆల్కహాల్ కూడా ఉన్నట్టు తేలిందని జాయింట్ కెమికల్ ఎగ్జామినర్ కె. మురళీధరన్ నాయర్ చెప్పారు. ఎవరైనా ఆయనకు విషపదార్దాలు ఇచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. 45 ఏళ్ల కళాభవన్ మణి ఈ నెల 6న కొచ్చిలోని తన నివాసంలో మృతి చెందారు. కాలేయ సంబంధ వ్యాధితో ఆయన మరణించినట్టు భావించారు. పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. కళాభవన్ మణి సహాయకులు ముగ్గురిని ప్రశ్నించారు. ఆయన మరణంపై అనుమానాలున్నాయని మణి భార్య నిమ్మె చెప్పారు. తమ కుటుంబంలో ఎటువంటి కలతలు లేవని ఆమె స్పష్టం చేశారు. ఆయనకు స్నేహతులు మద్యం తాగడం అలవాటు చేశారని వెల్లడించారు. అటాప్సి రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తామని మణి సోదరుడు ఆర్ ఎల్వీ రామకృష్ణన్ తెలిపారు.