
ప్రముఖ జపనీస్ కార్ల తయారీ సంస్థ భారతీయులకు షాకివ్వనుంది. త్వరలో దేశీయంగా హోండా సిటీ సెడాన్, అమేజ్ సబ్ కాంపాక్ట్ మోడల్స్ ధరల్ని పెంచనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
రూ.11.49లక్షల ప్రారంభ ధరతో హోండా ఐదో జనరల్ సిటీ సెడాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను,హోండా సిటీ హైబ్రిడ్ వర్షన్ ధర రూ.20.39లక్షల వరకు, హోండా సిటీ ప్రస్తుత ప్రారంభ ధర రూ.11.57లక్షలు, హోండా అమేజ్ రూ.7.05లక్షల ధరలతో విడుదల చేసింది.
అయితే, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా కార్ల ధరల్ని పెంచేందుకు హోండా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా సెప్టెంబర్ నుంచి సిటీ, అమేజ్ ధరల పెంపు ఉంటుందంటూ వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఈ ధరల పెంపుపై హోండా అధికార ప్రకటన చేయాల్సి ఉంది.