Maybach
-
దేశంలో ఖరీదైన కారు ఈయన దగ్గరే.. ఇప్పుడు మరో కారు..
దేశంలో అత్యంత ఖరీదైన కార్లు ఉన్న వ్యాపారవేత్తల గురించి మాట్లాడేటప్పుడు ముఖేష్ అంబానీ, గౌతమ్ సింఘానియా, రతన్ టాటా వంటి పేర్లు మాత్రమే వినిపిస్తాయి. అయితే భారత్‌లో అత్యంత ఖరీదైన కారు వీఎస్ రెడ్డి అనే వ్యాపారవేత్త దగ్గర ఉంది.బెంట్లీ ముల్సానే ఈడబ్ల్యూబీ సెంటినరీ ఎడిషన్ దేశంలో అత్యంత ఖరీదైన కారు. దీని ధర రూ .14 కోట్లు. ముఖేష్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ సింఘానియా వంటివారి వద్ద ఉన్న రోల్స్ రాయిస్, ఫెరారీ కార్ల కంటే దీని ధర ఎక్కువ. దీని ఓనర్ వీఎస్ రెడ్డి ఇప్పుడు రూ .3.34 కోట్లు పెట్టి కొత్త మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 680 కారు కొన్నారు.మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 680.. మేబాచ్ ఎస్-క్లాస్ ప్రీమియం వెర్షన్. ఇందులో 6.0-లీటర్ టర్బోఛార్జ్డ్ వి12 ఇంజన్ ఉంది. ఇది 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌తో ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 610బీహెచ్పీ పవర్, 900ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.ఎవరీ వీస్ రెడ్డి అంటే..ప్రముఖ న్యూట్రాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన బ్రిటిష్ బయోలాజికల్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టరే వీఎస్ రెడ్డి. 'ది ప్రోటీన్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పేరొందిన కర్ణాటకకు చెందిన వీఎస్ రెడ్డి పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. తాను ఆటోమోటివ్ ఔత్సాహికుడినని, దేశంలోని అన్ని బ్రాండ్ల కార్లు తన వద్ద ఉండాలనుకుంటానని ఈవీవో ఇండియా మ్యాగజైన్‌తో మాట్లాడుతున్న సందర్భంగా వీఎస్ రెడ్డి చెప్పారు. -
రూ.3 కోట్లు పెట్టి దుల్కర్ సల్మాన్ కొన్న కొత్త కారు ఏంటో తెలుసా?
సౌత్ ఇండియా స్టార్ హీరోలు, కేరళకు చెందిన తండ్రీకొడుకులు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్‌లకు కార్లంటే అమితమైన మోజు. వారి వద్ద పలు ప్రత్యేకమైన, ఖరీదైన కార్లు ఉన్నాయి. వారికి '0369 గ్యారేజ్' పేరుతో ప్రత్యేక కార్ల కలెక్షన్ ఉంది. అందులో కార్లన్నిటికీ రిజిస్ట్రేషన్ నంబర్ 0369. తాజాగా ఈ గ్యారేజీకి సరికొత్త మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారు చేరింది. (ఐఫోన్ 15 రాకతో కనుమరుగయ్యే ఐఫోన్ పాత మోడళ్లు ఇవే..) GLS 600 అనేది మెర్సిడెస్ బెంజ్ నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ. ఈ కారు కంపెనీ అల్ట్రా-లగ్జరీ విభాగమైన మెర్సిడెస్-మేబ్యాక్ కిందకు వస్తుంది. 0369 గ్యారేజ్‌లోకి చేసిన GLS 600 మమ్మద్ కుట్టి పేరు మీద రిజిస్టర్ అయింది. ఇది మమ్ముట్టి అసలు పేరు. మమ్ముట్టి కుమారుడు యువ హీరో దుల్కర్ సల్మాన్ బ్లాక్ కలర్ GLS 600 కారును డెలివరీ తీసుకుంటున్న వీడియో ఇంటర్నెట్లో కనిపించింది. ఇది కేరళ రాష్ట్రంలో కొనుగోలు చేసిన మొదటి మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారు. తన అన్ని కార్ల మాదిరిగానే ఈ కారును కూడా మమ్ముట్టి 0369 నంబర్‌తో రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ ప్రత్యేక నంబర్ కోసం రూ.1.85 లక్షలు చెల్లించినట్లు సమాచారం. ఇక మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారు ధర సుమారు రూ. 2.92 కోట్లు (భారత్‌లో ఎక్స్-షోరూమ్ ధర). దక్షిణ భారతదేశం నుంచి ఈ మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారును కొన్న రెండో సినీ నటుడు దుల్కర్ సల్మాన్. ఇతని కంటే ముందు తెలుగు హీరో రామ్ చరణ్ 2022లోనే ఈ కారును కొన్నారు. వీరితో పాటు అర్జున్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, కృతి సనన్, రణ్వీర్ సింగ్, అనిల్ కపూర్, శిల్పా శెట్టితో సహా మరికొంత మంది బాలీవుడ్ ప్రముఖులు కూడా తమ కార్ కలెక్షన్లకు ఈ GLS 600ని జోడించారు. -
మెర్సిడెజ్ నుంచి మరో ఖరీదైన కారు
వెబ్‌డెస్క్ : మెర్సిడెస్ బెంజ్ నుంచి మరో కారు ఈ రోజు మార్కెట్లోకి రానుంది. స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) సెగ్మెంట్లో సరికొత్త మెహ్‌బెక్ జీఎల్ఎస్ 600 కారును ఈ రోజు మెర్సిడెజ్ ఇండియాలో లాంచ్ చేయనుంది. పూర్తిగా విదేశాల్లోనే తయారైన కార్లు ఇండియాకు దిగుమతి చేసి ఇక్కడ విక్రయించనున్నారు. కారు ఖరీదు రూ. 2.50 కోట్ల పైమాటే ఖరీదైన లగ్జరీ కార్లకు మెర్సిడెజ్ సంస్థ పెట్టింది పేరు. మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ సిరీస్‌లో స్టాండర్డ్ మోడల్ ధరనే రూ. 1.05 కోట్లుగా ఉంది. ఇక మెర్సిడెస్ ఎస్యూవీ సెగ్మెంట్లో ప్రీమియం కేటగిరికి చెందిన మెహ్‌బెక్ జీఎల్ఎస్ 600 కారు ధర రూ. 2.50 కోట్లు ఉంచవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మెహ్‌బెక్ ప్రత్యేకతలు మెర్సిడెజ్ ఎస్యూవీ విభాగంలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్‌గా మెహ్‌బెక్ మోడల్స్‌కి గుర్తింపు ఉంది. కొత్త మోడల్లో 4.0 లీటర్ టర్బో ఛార్జ్డ్ వీ 8 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. మాగ్జిమమ్ పవర్ అవుట్‌పుట్ 550 బీహెచ్‌పీగా ఉంది. గరిష్టంగా 730ఎన్ఎమ్ టార్క్ లభిస్తుంది. నైన్స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఈ కారు ఇండియాలో లభిస్తుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఓ బార్బర్.. 150 లగ్జరీ కార్లకు యజమాని
బెంగళూరు: అతనికి ఓ రోల్స్ రాయ్స్, 11 మెర్సిడెజ్, 10 బీఎండబ్ల్యూ, 3 ఆడి, 2 జగ్వార్ కార్లు ఉన్నాయి. ఈ మధ్య జర్మనీ నుంచి మేబ్యాచ్ కారు కొనుగోలు చేశాడు. దీని ఖరీదు అక్షరాలు 3.2 కోట్ల రూపాయలు. బెంగళూరులో ఇలాంటి కార్లు మూడు మాత్రమే ఉన్నాయి. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, మరో బిల్డర్ తర్వాత ఈ కారు కొన్నది ఆయనే. ఈ ఖరీదైన కార్లను అద్దెకు ఇస్తుంటాడు. ఇంతకీ ఆయన ఎవరంటే.. ఓ బార్బర్. ఓ హెయిర్ కట్ చేస్తే 75 రూపాయలు తీసుకుంటాడు. ఓ బార్బర్ దగ్గర ఇన్ని ఖరీదైన కార్లు ఉన్నాయంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అయినా ఇది అక్షరాలా నిజం. బెంగళూరులోని 45 ఏళ్ల రమేష్ బాబు అనే బార్బర్ ఆదర్శనీయమైన విజయగాథ ఇది. ఓ బార్బర్ గా కెరీర్ ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదుగుతూ 150 లగ్జరీ కార్లకు యజమాని అయ్యారు. అయినా ఇప్పటికీ ఆయన రోజూ సెలూన్ లో పనిచేస్తారు. రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీకి ఆయన యజమాని. కోట్లాది రూపాయల కంపెనీకి యజమాని అయినా రమేష్ తన మూలాలను మరచిపోలేదు. రోజూ సెలూన్లో కనీసం ఐదు గంటలు పనిచేస్తారు. రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్లకు ఆయనే హెయిర్ కట్ చేస్తారు. గత 30 ఏళ్లుగా ఆయన దినచర్య ఇది. సెలూన్లో పనిచేయడం ఆయన వృత్తిలో ఓ భాగం మాత్రమే. రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ ద్వారా ఖరీదైన కార్లను అద్దెకు ఇస్తూ బిజినెస్ చేస్తుంటారు. ఆయన ఖరీదైన రోల్స్ రాయ్స్ కారులో తిరుగుతుంటారు. గత నెలలో మేబ్యాచ్ కారును కొనుగోలు చేశారు. మాల్యా, మరో బిల్డర్ దగ్గర తర్వాత ఈ మోడల్ కారు తనవద్దే ఉందని రమేష్ గర్వంగా చెబుతారు. 'నాకు దేవుడి దయ ఉంది. ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నా. ప్రతి లగ్జరీ కారునూ కొనుగోలు చేయాలన్నది నా కల. వీటిని డ్రైవింగ్ చేస్తుంటే థ్రిల్‌గా ఉంటుంది. నేనెప్పుడూ నా మూలాలను మరవను. నాన్న చనిపోయాక పేదిరకం అనుభవించాం. అమ్మ ఎన్నో కష్టాలుపడి మమ్మల్ని పోషించారు. అందుకే నేను ఇప్పటికీ సెలూన్లో పనిచేస్తుంటా' అని రమేష్ చెప్పారు. ఆయన తొమ్మిదో ఏట ఉన్నప్పుడు తండ్రి మరణించారు. పదోతరగతి పూర్తయ్యాక చదువుకు స్వస్తి చెప్పి తండ్రిలా బార్బర్‌గా కెరీర్ ప్రారంభించారు. సెలూన్లో పనిచేస్తూనే 1994లో ఓ మారుతి వ్యాన్ తీసుకుని అద్దెలకు ఇవ్వడం ప్రారంభించారు. ఇదే ఆయన జీవితాన్ని మార్చివేసింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ లగ్జీరీ కార్లకు యజమాని అయ్యారు.