
వెబ్‌డెస్క్ : మెర్సిడెస్ బెంజ్ నుంచి మరో కారు ఈ రోజు మార్కెట్‌లోకి రానుంది. స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) సెగ్మెంట్‌లో సరికొత్త మెహ్‌బెక్ జీఎల్‌ఎస్ 600 కారును ఈ రోజు మెర్సిడెజ్ ఇండియాలో లాంచ్ చేయనుంది. పూర్తిగా విదేశాల్లోనే తయారైన కార్లు ఇండియాకు దిగుమతి చేసి ఇక్కడ విక్రయించనున్నారు.
కారు ఖరీదు రూ. 2.50 కోట్ల పైమాటే
ఖరీదైన లగ్జరీ కార్లకు మెర్సిడెజ్ సంస్థ పెట్టింది పేరు. మెర్సిడెజ్ బెంజ్ జీఎల్‌ఎస్ సిరీస్‌లో స్టాండర్డ్ మోడల్ ధరనే రూ. 1.05 కోట్లుగా ఉంది. ఇక మెర్సిడెస్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రీమియం కేటగిరికి చెందిన మెహ్‌బెక్ జీఎల్‌ఎస్ 600 కారు ధర రూ. 2.50 కోట్లు ఉంచవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మెహ్‌బెక్ ప్రత్యేకతలు
మెర్సిడెజ్ ఎస్‌యూవీ విభాగంలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్‌గా మెహ్‌బెక్ మోడల్స్‌కి గుర్తింపు ఉంది. కొత్త మోడల్‌లో 4.0 లీటర్ టర్బో ఛార్జ్‌డ్ వీ 8 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. మాగ్జిమమ్ పవర్ అవుట్‌పుట్ 550 బీహెచ్‌పీగా ఉంది. గరిష్టంగా 730ఎన్‌ఎమ్ టార్క్ లభిస్తుంది. నైన్‌స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఈ కారు ఇండియాలో లభిస్తుంది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment