చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు.
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా రవాణా యధేచ్ఛగా సాగుతోంది. తాజాగా అక్రమంగా తరలిస్తున్నఎర్రచందనం దుంగలను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లిలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో తరలిస్తున్న ఎర్రచందనాన్ని అధికారులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆటోను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.