సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అడవిలో చెట్లు కొట్టుకునే కూలోడు అంతర్జాతీయ స్మగ్లర్‌గా ఎదిగిన కథ ‘పుష్ప’ సినిమా. వాస్తవానికి అలాంటి ఘటనలు నిజ జీవితంలో జరగవు. కానీ.. ఉమ్మడి కరీంనగర్‌లో పీ డీఎస్ బియ్యం కొనుగోలు చేసి.. అధిక ధరలకు ఇ తర రాష్ట్రాలకు ఎగుమతి చేసే వ్యాపారిని చూస్తే ని జమే అనిపిస్తోంది. ‘ఏక్ రూపాయ్‌వాలా’ కోడ్ నే మ్‌తో అధికారులు ముద్దుగా పిలుచుకునే ఈ స్మగ్లర్ నెట్‌వర్క్ ఒకప్పుడు పాత కరీంనగర్ జిల్లాకే పరిమి తం. నేడు ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. రెండేళ్ల క్రితం ఉమ్మడి జిల్లా దాటి మహారాష్ట్రలో ఎంటర్ అ య్యాడు.
ఆ సమయంలో అతడి దందా.. పీడీఎస్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్న తీరును ‘సాక్షి’ దినపత్రిక ‘ఏక్ రూపాయ్‌వాలా’ శీర్షికన వ రుస కథనాలు ప్రచురించింది. వీటిపై డీజీపీ కార్యాలయం స్పందించి దాడులకు ఆదేశించింది. అప్పటి కరీంనగర్ సీపీ సత్యనారాయణ నేతృత్వంలో టా స్క్‌ఫోర్స్ బృందాలు వరుస దాడులతో విరుచుకుపడ్డాయి. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిని బైండోవర్ కూడా చేశాయి. దీంతో కొంతకా లం సదరు వ్యాపారి, అతని అనుచరులు కార్యకలాపాలు నిలిపివేశారు.
సైకిళ్లతో మొదలై.. గూడ్స్ రైళ్లలో తరలించే స్థాయికి..
ఒకప్పుడు గ్రామాల్లో సైకిళ్లపై తిరుగుతూ.. పీడీఎస్ బియ్యాన్ని సేకరించి వాహనాల్లో తరలించడంలో ఏక్ రూపాయ్‌వాలాది అందెవేసిన చేయి. అప్పట్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు వ రుసగా రావడం.. పత్రికల్లో వరుస కథనాలు రావడంతో అతడి వ్యాపారం సుప్తావస్థలోకి వెళ్లింది. ఆ తర్వాత కొత్త పద్ధతిలో వ్యాపారంలోకి దిగాడు. అధి కారులకు లంచాలిస్తూ.. మహారాష్ట్రకు బియ్యం తరలించడం కంటే అధికారికంగానే ఎగుమతి చేయాల ని నిర్ణయించాడు. అదునుకోసం చూస్తున్న అతడికి తమిళనాడు తెలంగాణ ప్రభుత్వానికి బియ్యం కో సం చేసిన వినతి ఆసరాగా దొరికింది.
రూ.37.50కు కిలో చొప్పున కావాలని తమిళనాడు కోరడం.. ఆ డీల్ రద్దు కావడంతో ‘ఏక్ రూపాయ్‌వాలా’ రంగంలోకి దిగాడు. కిలో రూ.31.50కే ఇస్తామని డీల్ కుది ర్చినట్లు సమాచారం. ఎగుమతికి కావాల్సిన బి య్యంలో తనవంతుగా పీడీఎస్ రైస్ ఇచ్చేందుకు సి ద్ధమయ్యాడు. అతడికి కావాల్సినంత బియ్యం ఇచ్చేందుకు ఉమ్మడి జిల్లాలోని పలువురు రైస్‌మిల్లర్లు కూడా సమ్మతించారని తెలిసింది. ఇందులో కస్ట మ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ఉన్నట్లు తెలిసింది.
వా రం వ్యవధిలో దాదాపు ఐదు వేల టన్నుల బియ్యాన్ని కరీంనగర్ నుంచి గూడ్స్ ద్వారా ఎగుమతి చేసినట్లు సమాచారం. వీటివిలువ దాదాపు రూ.160 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. డిమాండ్ నేపథ్యంలో మరోరూ.60 కోట్ల విలువైన 2వేల ట న్నుల బియ్యాన్ని తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు మరో గూడ్స్‌రేక్ (కొన్ని బోగీలతో కూ డిన రైలు)ను ఇప్పటికే బుక్‌చేశారని సమాచారం. ఇంత జరుగుతున్నా.. సివిల్ సప్లయి అధికారులు, పోలీసులకు సమాచారం లేకపోవడం గమనార్హం.
అటెన్షన్ డైవర్షన్‌లో అందెవేసిన చేయి..
తెలంగాణ, మహారాష్ట్రలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలో ‘ఏక్ రూపాయ్‌వాలా’ది అందె వేసిన చే యి. అచ్చం వీరప్పన్ తరహాలో.. పోలీసులు బందో బస్తుల్లో నిమగ్నమయ్యే సందర్భాల్లోనే భారీ వాహనాల్లో టన్నుల కొద్దీ బియ్యం రాష్ట్ర సరిహద్దులు దా టిస్తాడు. ఇపుడు బహిరంగ దందా చేస్తున్న నేపథ్యంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.
తమ పై సివిల్ సప్లయీస్, పోలీసుల కన్ను పడకుండా.. గణేశ్ ఉత్సవాల్లో అధికారులు తలమునకలైన సందర్భాన్ని వాడుకుని రైలు ద్వారా తెలివిగా.. పకడ్బందీగా తమిళనాడుకు బియ్యం ఎగుమతి చేశా డు. త్వరలో ఎన్నికలకోడ్ రాబోతోంది. కోడ్ వస్తే వాహన తనిఖీలు పెరుగుతాయి. దానికి ముందే రెండోవిడత సరుకు పంపేలా ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. కిలో రూపాయి బియ్యాన్ని రూ. 4 లేదా రూ.5 కమీషన్ చొప్పున విక్రయించే ‘ఏక్ రూపాయ్ వాలా’ నేడు రూ.వందల కోట్ల వ్యాపారా నికి పడగలెత్తిన తీరు సినిమా కథను తలపిస్తోంది.
ఫిర్యాదు వచ్చింది చర్యలు తీసుకుంటాం
కరీంనగర్ నుంచి తమిళనాడుకు సీఎంఆర్ బియ్యం అక్రమంగా వెళ్తున్నాయని మాకు అధికారికంగా ఫిర్యాదు వచ్చింది. వెంటనే అడిషనల్ కలెక్టర్, సివిల్ సప్లయీస్ ఉన్నతాధికారులకు చేరవేశాను. వారు స్పందించి రంగంలోకి దిగారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం.
– రవీందర్ సింగ్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment