
వలంటీర్లుగా పనిచేసేందుకు దరఖాస్తు చేయండి
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వేసవి సెలవుల్లో బోధించేందుకు వ లంటీర్లు కావాలని, ఆసక్తిగల డిగ్రీ విద్యార్థులు ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. కలెక్టరేట్‌లో బుధవారం స్థానిక సంస్థలు, మున్సిపల్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. సర్కారు బడుల విద్యార్థులకు సమ్మర్ క్యాంపుల ఏర్పాటుకు ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు. ఇందులో డిగ్రీ విద్యార్థులు వ లంటీర్లుగా సేవలు అందించేందుకు ముందుకు రా వాలని సూచించారు. టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. ఈనెలాఖరులోగా రాజీవ్ యువ వికా సం పథకం దరఖాస్తులను పరిశీలించాలని ఆయన అన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను గుర్తించి మే 10లోగా నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇలాంటి వారిని గురుకులాల్లో చేర్పిస్తామని అన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద గుర్తించిన గ్రామాలకు మంజూరైన 1,940 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా ప్రారంభించేలా లబ్ధిదారు లను ప్రోత్సహించాలని ఆదేశించారు. బేస్‌మెంట్ స్థాయి వరకు పనులు పూర్తయితే తొలివిడత రూ.లక్ష విడుదల చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈనెల 11న ప్రతీపల్లె, పట్టణం, వార్డులో ఆరేళ్లలోపు వయసుగల పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. ఎత్తు, బరువు తక్కువ పిల్లలకు బాలామృతం ప్లస్, ఇతర పోషకాహారం అందించాలన్నారు. జెడ్పీ సీఈవో నరేందర్, డీఆర్డీవో కాళిందిని, డీపీవో వీరబుచ్చయ్య, డీఎంహెచ్‌వో అన్నప్రసన్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
భూసమస్యలు పరిష్కరించాలి
ఓదెల(పెద్దపల్లి): భూ సమస్యలను పరిష్కరించాల ని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం, హాస్టల్‌ను ఆయన తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ, ధరణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచొద్దన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తహసీల్దార్ సునీత, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఏఈఈ జగదీశ్ పాల్గొన్నారు.
● కలెక్టర్ కోయ శ్రీహర్ష