Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

China imposes additional 84% tariff on US goods1
అమెరికాకు షాకిచ్చిన చైనా

బీజింగ్‌: ప్రతీకార సుంకాల విధింపులో అమెరికా- చైనాలు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఖయ్యానికి కాలుదువ్వుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald trump) మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఇందులో భాగంగా బుధవారం అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34 శాతం టారిఫ్‌ను 84శాతానికి పెంచుతూ చైనా (China Raises Tariffs On US Goods) నిర్ణయం తీసుకుంది. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకాలపై సోమవారం ఆయన మండిపడటం, మంగళవారం మధ్యాహ్నం లోపు వాటిని వెనక్కు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేయడం తెలిసిందే. ఆ హెచ్చరికలను డ్రాగన్‌ దేశం బేఖాతరు చేసింది. బెదిరింపులకు జడిసేది లేదని కుండబద్దలు కొట్టింది. ‘‘మా విషయంలో అమెరికా తప్పులపై తప్పులు చేస్తోంది. ఈ బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగే ప్రసక్తే లేదు. చివరిదాకా పోరాడి తీరతాం.#BREAKING 🇨🇳#CHINA to lift additional tariffs to 84% on ALL imported🇺🇸, effective from April 10th.As I said, don't underestimate China's determination to safeguard its legitimate rights and interesting when facing the U.S. global #tariffs bully. pic.twitter.com/BxlKxCGzXw— Shen Shiwei 沈诗伟 (@shen_shiwei) April 9, 2025 మా ప్రయోజనాల పరిరక్షణకు ఎందాకైనా వెళ్తాం. 50 శాతం టారిఫ్‌లు విధిస్తే మావైపు నుంచీ అంతకంతా ప్రతీకార చర్యలుంటాయి’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్‌ జియాన్‌ మంగళవారం ప్రకటించారు. వాణిజ్య, టారిఫ్‌ యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని హితవు పలికారు. అయినా చైనా ఈ విషయమై తమతో చర్చలకు వస్తుందని ఎదురు చూస్తున్నట్టు ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ‘‘వాళ్లూ ఏదో ఒక ఒప్పందానికి రావాలనే ఆశ పడుతున్నారు. కానీ ఎక్కణ్నుంచి మొదలు పెట్టాలా అని సతమతమవుతున్నారు’’ అన్నారు.కానీ మంగళవారం డెడ్‌లైన్‌ ముగిసినా చైనా నుంచి అలాంటి సూచనలేవీ రాకపోవడంతో వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ కరోలిన్‌ లెవిట్‌ మీడియా ముందుకొచ్చారు.‘చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది’ అని ప్రకటించారు! దాంతో అగ్ర రాజ్యాల టారిఫ్‌ పోరు ముదురు పాకాన పడింది.చైనాపై మార్చిలోనే అమెరికా 20 శాతం సుంకాలు విధించడం, గత వారమే ట్రంప్‌ మరో 34 శాతం బాదడం తెలిసిందే. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు ఏకంగా 104 (Trump's 104%) శాతానికి చేరాయి! టారిఫ్‌లపై చైనాతో చర్చలకు చాన్సే లేదని సోమవారమే ట్రంప్‌ బెదిరించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదు.

Anitha Could Not Answer Reporters Questions On Jagan Security Failure2
జగన్‌ భద్రతా వైఫల్యంపై రిపోర్టర్ల ప్రశ్నలు.. నీళ్లు నమిలిన హోంమంత్రి

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రత వైఫల్యంపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి వంగలపూడి అనిత నీళ్లు నమిలారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడిగితే ఎలా అంటూ చిందులు తొక్కారు. ప్రశ్న అడిగే రిపోర్టర్లతో ఆగు ఆగు అంటూ వాగ్వాదానికి దిగారు.1100 మందితో భారీ భద్రత కల్పిస్తే హెలికాప్టర్ దగ్గరకు ప్రజలు ఎలా దూసుకు వెళ్లారంటూ రిపోర్టర్ ప్రశ్నించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలీసులు కాపలా పెట్టాలా అంటూ హోంమంత్రి అసహనం వ్యక్తం చేశారు. జనాలు ఎక్కువగా వస్తారని మీ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా?. లేదా మీ ఇంటిలిజెన్స్ బలహీనంగా ఉందా..?. డ్రోన్ సీసీ కెమెరా వ్యవస్థ అంతా మీ చేతుల్లోనే ఉంది కదా?’’ అంటూ రిపోర్టర్ల ప్రశ్నలు అడుగుతుండగానే సమాధానం చెప్పలేక మధ్యలోనే హోం మంత్రి వెళ్లిపోయారు.కాగా, శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన సందర్భంగా పోలీసుల భద్రతా వైఫల్యం మరోసారి బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఓ మాజీ సీఎం వచ్చినప్పుడు పోలీ­సులు కనీస భద్రత చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవు­తోంది. మంగళవారం వైఎస్‌ జగన్‌ పర్యటనలో అడుగ­డుగునా భద్రతా లోపాలు కనిపించాయి.పాపిరెడ్డిపల్లికి వచ్చే రహదా­రుల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకు­నేందుకు ఇచ్చిన ప్రాధాన్యతను పోలీసులు.. జగన్‌ భద్రత విషయంలో చూపకపో­వడం గమనార్హం. హెలిప్యాడ్‌ వద్ద చోటు చేసుకున్న ఘటనే దీనికి నిదర్శనం. తమ అభిమాన నేతను చూసేందుకు వేలాది­మంది హెలిప్యాడ్‌ వద్దకు పోటెత్తారు. జగన్‌ ప్రయాణిస్తున్న హెలి­కా­ప్టర్‌ అక్కడికి చేరుకోగానే జనం తాకిడి అంతకంతకు ఎక్కువైంది. అక్కడ నామమాత్రంగా ఉన్న పోలీసులు వారిని అదుపు చేయలేక చేతులెత్తేశారు.హెలికాప్టర్‌ చుట్టూ జన సందోహం గుమిగూడటంతో చాలాసేపు జగన్‌ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అభి­మా­నుల తాకిడితో హెలికాప్టర్‌ విండ్‌ షీల్డ్‌ దెబ్బతింది. దీంతో వీఐపీ భద్రతా కారణాల రీత్యా తిరుగు ప్రయాణంలో ఆయన్ను తీసుకెళ్లలేమని పైలెట్లు స్పష్టం చేశారు. కొద్దిసేపటికి హెలికాప్టర్‌ తిరిగి వెళ్లిపోయింది. జగన్‌ రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లారు. జగన్‌ పర్యటనల సమయంలో అరకొర పోలీసు భద్రతపై పార్టీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూరితంగానే ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు.

Top Court Raps Centre On Emergency Aid In Road Accident Cases Details3
ఇది తీవ్రమైన ఉల్లంఘనే.. కేంద్రానికి ‘సుప్రీం’ చీవాట్లు

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స (Cashless Treatment) అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వ అలసత్వాన్ని సుప్రీం కోర్టు మందలించింది. ఈ విషయాన్ని తీవ్ర ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ బుధవారం సంబంధిత అధికారులకు సమన్లు జారీ చేసింది.ప్రమాదం జరిగిన వెంటనే సమీప ఆసుపత్రిలో ఉచిత వైద్య సాయం కల్పించడమే క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ స్కీమ్‌ ఉద్దేశం. ప్రత్యేకించి గోల్డెన్‌ అవర్‌ (ప్రమాదం జరిగిన గంటలోపే)తో సహా రోడ్డు ప్రమాద బాధితులందరికీ దీన్ని వర్తింపజేయాల్సి ఉంటుంది. దీని అమలుకుగానూ కేంద్రానికి సుప్రీం కోర్టు మార్చి 14వ తేదీని గడువుగా ప్రకటించింది. అయితే గడువు దాటినా కేంద్రం ఇంతదాకా దీనిని అమలు చేయలేదు.‘‘ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగిసిపోయింది. దీనిని తీవ్రమైన కోర్టు ఆదేశాల ఉల్లంఘనగా పరిగణిస్తున్నాం’’ అని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా ధర్మాసనం బుధవారం వ్యాఖ్యానించింది. ఈ అలసత్వానికి సంబంధించి రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సీనియర్‌ అధికారులకు కోర్టు సమన్లు జారీ చేసింది. ‘‘అధికారులు కోర్టులకు హాజరైతేనే మా ఆదేశాలను తీవ్రంగా పరిగణిస్తారు. ఈ విషయాన్ని మా సుదీర్ఘ అనుభవం ద్వారా మేం తెలుసుకున్నాం. ఏప్రిల్‌ 28వ తేదీన సమన్లు అందుకున్నవాళ్లు కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలి. సకాలంలో చికిత్స అందకపోవడంతో రోడ్డు ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ.. ఒక్క విషయాన్ని మేం స్పష్టంగా చెప్పదల్చుకున్నాం. ఎటువంటి పురోగతి సాధించలేదని మేం గనుక గుర్తిస్తే కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేస్తాం అని జస్టిస్‌ ఓకా సంబంధిత అధికారులను హెచ్చరించారు.రోడ్డుప్రమాదాల సమయంలో ఆ దారిన వెళ్లేవాళ్లు, పోలీసులు,కొన్నిసార్లు ఆస్పత్రులు కూడా ఎవరైనా ముందుకు వస్తారేమో అని ఎదురు చూస్తున్నాయి. ఇది ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.ఇదిలా ఉంటే.. 2023 డిసెంబర్‌లో నగదు రహిత చికిత్స (Cashless Treatment) అందించే విషయంలో కేంద్రం తొలి అడుగు వేసింది. ప్రమాదాల్లో (Road Accidents) గాయపడిన బాధితులకు ఉచిత, నగదు రహిత వైద్య చికిత్స అందించడం ఎంవీఏ యాక్టు 2019లో భాగం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తున్నాయి. అయితే.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహకారంతో రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వశాఖ దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంది.రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాణాంతకంగా ఉన్న సమయంలో.. ప్రత్యేకించి గోల్డెన్‌ అవర్‌ టైంలో రోడ్డు ప్రమాద బాధితుడి ప్రాణాలు రక్షించే చికిత్స కోసం నగదు చెల్లింపులు చేయడానికి ఎవరూ లేనప్పుడు ఈ పథకం వర్తిస్తుంది. క్యాష్‌లెస్‌ ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్‌ స్కీమ్‌ కింద.. రోడ్డు ప్రమాదాలకు గురైన వాళ్ల చికిత్స కోసం ఏడు రోజులకుగానూ లక్షా 5 వేల రూపాయల ఖర్చు భరిస్తుంది. అయితే ఇది ప్రమాదం జరిగిన 24 గంటలలోపు పోలీసులకు తెలియజేస్తేనే!. ఇక..ఆస్పత్రులు మోటార్‌ వెహికిల్స్‌ యాక్ట్ ఫండ్‌ నుంచి ట్రీట్‌మెంట్‌ సొమ్మును‌ రీయింబర్స్‌మెంట్‌ ద్వారా పొందుతాయి. ఇదికాక.. అదనంగా హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో మరణించిన వాళ్ల కుటుంబాలకు ప్రభుత్వం రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా అందిస్తుంది. అయితే.. ఏడాదిన్నరగా ఈ పథకాన్ని ఆచరణలో పెట్టాలనే ప్రయత్నాలు మాత్రం ముందుకు సాగడం లేదు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన సరైన విధివిధానాలతో ఓ పథకం రూపొందించాలంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇదే కాకుండా.. మోటార్‌ వెహికిల్స్‌ యాక్ట్‌(సవరణ చట్టం)లోని సెక్షన్‌ 162(2) ప్రకారం.. ఇన్సూరెన్స్‌ కంపెనీలు కూడా బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. కానీ, ఇది కూడా అమలు కావడం లేదని సర్వోన్నత న్యాయస్థానం గుర్తించింది.

Shubman Gill Continues In Top, Rizwan Climbs 2 Places In Latest ICC ODI Rankings4
నంబర్‌ వన్‌గా కొనసాగుతున్న శుభ్‌మన్‌ గిల్‌

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోలేదు. ప్రపంచవాప్తంగా ఉన్న ఆటగాళ్లంతా ఐపీఎల్‌తో బిజీగా ఉండగా.. పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ మాత్రమే వన్డే సిరీస్‌ ఆడాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు జట్లకు చెందిన కొందరు ఆటగాళ్ల ర్యాంక్‌లు మాత్రమే మారాయి. బ్యాటింగ్‌లో టీమిండియా ప్రిన్స్‌ శుభ్‌మన్‌ గిల్‌ టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. పాకిస్తాన్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌, టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత్‌ నుంచి విరాట్‌ (5), శ్రేయస్‌ అయ్యర్‌ (8) టాప్‌-10లో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 72 పరుగులు చేసిన పాక్‌ కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 21వ స్థానానికి చేరగా.. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ ఏకంగా 12 స్థానాలు మెరుగుపర్చుకుని 89 స్థానానికి చేరాడు.బౌలర్ల ర్యాంకింగ్స్‌లో శ్రీలంక స్పిన్నర్‌ మహీశ్‌ తీక్షణ​ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత్‌ రిస్ట్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌, సౌతాఫ్రికా స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత్‌ నుంచి కుల్దీప్‌తో పాటు రవీంద్ర జడేజా (9) ఒక్కడే టాప్‌-10లో ఉన్నాడు. పాక్‌తో సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన సహా 10 వికెట్లు తీసిన న్యూజిలాండ్‌ పేసర్‌ బెన్‌ సియర్స్‌ ఏకంగా 64 స్థానాలు మెరుగపర్చుకుని 100వ స్థానానికి చేరాడు. పాక్‌ పేసర్‌ నసీం​ షా ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని 43వ స్థానానికి ఎగబాకాడు.ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. మరో ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాడు మహ్మద్‌ నబీ రెండో స్థానంలో నిలిచాడు. జింబాబ్వే ఆటగాడు సికందర్‌ రజా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత్‌ నుంచి టాప్‌-10లో రవీంద్ర జడేజా (9) ఒక్కడే ఉన్నాడు. జడ్డూ ఓ స్థానం మెరుగుపర్చుకుని 10 నుంచి 9కి చేరాడు. పాక్‌తో జరిగిన సిరీస్‌లో 85 పరుగులు చేసి 2 వికెట్లు తీసిన మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (5) రెండు స్థానాలు మెరుగుపర్చుకుని టాప్‌-5లోకి వచ్చాడు.

Union Minister Jitan Manjhi Granddaughter Dead5
కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు దారుణ హత్య

పాట్నా: కేంద్రమంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ (Jitan Ram Manjhi) మనవరాలు సుష్మాదేవి (Sushma Devi) దారుణ హత్య కలకలం రేపుతోంది. సుష్మాదేవిని ఆమె భర్త రమేష్‌ సింగ్‌ నాటు తుపాకీతో కాల్చి చంపాడు.గయా ఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. బీహార్ రాష్ట్రం,గయా జిల్లా అటారి పోలీస్ స్టేషన్ పరిధిలోని తేటువా గ్రామానికి చెందిన జితన్‌ రామ్‌ మాంఝీ మనవరాలు సుష్మా దేవి (32),రమేష్ సింగ్ దంపతులు. 13ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. సుష్మాదేవీ వికాస్‌ మిత్రగా పనిచేస్తుండగా.. ఆమె భర్త రమేష్‌ సింగ్‌ ఓ వాహన యజమానిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఉన్న సుష్మాను భర్త రమేష్‌ గన్నుతో కాల్చి చంపాడు. అనంతరం పరారయ్యాడు. ఈ ఘటన సమయంలో వేరే గదిలో ఉన్న పూనమ్‌, సుష్మా పిల్లలు పరిగెత్తుకొని రాగా రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉంది. కాల్పులమోతతో ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.మృతురాలి సోదరి పూనమ్ కుమారి మాట్లాడుతూ..తన అక్కను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి రమేష్‌ తన వద్ద ఉన్న గన్నుతో కాల్చి చంపినట్లు చెప్పారు. తన అక్క మరణానికి కారణమైన రమేష్‌కు కఠిన శిక్ష విధించాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గయా జిల్లా ఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూఈ ఘటనపై గయా జిల్లా ఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడారు. సుష్మాను ఆమె భర్త రమేష్‌ సింగ్‌ నాటు తుపాకీతో కాల్చి చంపాడు. ఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) బృందం ఆధారాలను సేకరించింది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమత్తం మగధ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించాం. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం’అని తెలిపారు. జితన్ రామ్ మాంఝీ ఎవరు?మనవరాలి హత్యపై గయ లోక్‌సభ ఎంపీ, సూక్ష్మ,చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రి జితన్ రామ్ మాంఝీ స్పందించలేదు. జితన్‌ రామ్‌ మాంఝీ బీహార్‌ సీఎంగా పనిచేశారు. హిందుస్థానీ అవామ్ మోర్చా సెక్యులర్ వ్యవస్థాపకుడు.

Rajinikanth Reveals Why He Opposed Jayalalithaa6
నా స్పీచ్‌తో అతని పదవి పోయింది.. రజనీకాంత్‌ కీలక వ్యాఖ్యలు

సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మధ్య కొన్నాళ్ల పాటు రాజకీయ వైర్యం కొనసాగిన సంగతి తెలిసిందే. 1996లో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల సమయంలో రజనీకాంత్, జయలలిత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "జయలలిత మళ్లీ అధికారంలోకి వస్తే, దేవుడు కూడా తమిళనాడును రక్షించలేడు" అని ఆయన చేసిన ప్రకటన రాజకీయ రంగంలో సంచలనం రేపింది. ఈ వ్యాఖ్యలు ఆ ఎన్నికల్లో జయలలిత అధికారం కోల్పోవడానికి ఒక కారణంగా నిలిచాయి. తాజాగా ఈ ‘రాజకీయ వివాదం’పై రజనీకాంత్‌ స్పందించారు. జయలలితను తీవ్రంగా వ్యతిరేకించడానికి గల కారణం ఏంటో ఆయన వివరిస్తూ.. మాజీ మంత్రి వీరప్పన్‌ పట్ల జయలలిత వ్యవహరించిన తీరే.. తనను వ్యతిరేకంగా మాట్లాడేలా చేసిందని చెప్పారు.వీరప్పన్‌ పదవి పోయిందిసినీ నిర్మాత, రాజకీయ నాయకుడు ఆర్.ఎం. వీరప్పన్, రజనీకాంత్‌ మధ్య మంచి స్నేహబంధం ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కలయికలో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు వచ్చాయి. వీరప్పన్‌ సత్య మూవీస్‌ బ్యానర్‌పై నిర్మించిన ‘బాషా’ చిత్రం అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా 100 రోజుల వేడుకలో రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యల కారణంగా వీరప్పన్‌ మంత్రి పదవి కోల్పోవలసి వచ్చిందట. ఈ వేడుకల్లో రజనీకాంత్‌ మాట్లాడుతూ.. తమిళనాడులో వారసత్య రాజకీయాల కారణంగా బాంబు సంస్కృతి పెరిగిపోయిందని.. రాష్ట్రం ఓ స్మశానంలా మారిందని అన్నారు. రజనీ వాఖ్యలు జయలలిత కోపానికి కారణం అయ్యాయట. దీంతో మంత్రిగా ఉన్న వీరప్పన్‌ని పదవి నుంచి తొలగించారట. జయలలితపై వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇదే ప్రధాన కారణం అని రజనీ అన్నారు.వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దని చెప్పారు ‘నేను జయలలితకు వ్యతిరేకంగా మాట్లాడటం వెనుక వ్యక్తిగత కారణాలు ఏమీ లేవు. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం, ఆ రోజుల్లో పరిస్థితులను బట్టి అలా మాట్లాడాను. అయితే నా స్పీచ్‌ కారణంగా వీరప్పన్‌ పదవి పోయిందని తెలిసి చాలా బాధపడ్డాను. మరుసటి రోజు ఫోన్‌ చేసి మాట్లాడాను. జయలలితతోనూ మాట్లాడతానని చెప్పాను. అయితే వీరప్పన్‌ మాత్రం దానికి అంగీకరించలేదు. ‘నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దను. నాకు ఏ పదవి అవసరం లేదు’ అని చెప్పారు. ఆయన ఈ విషయాన్ని లైట్‌ తీసుకున్నా.. నేను చాలా బాధపడ్డాను. జయలలితను తీవ్రంగా వ్యతిరేకించడానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటి’ అని రజనీకాంత్‌ అన్నారు. వీరప్పన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన ‘ఆర్‌వీఎం: ది కింగ్‌మేకర్‌’ డాక్యుమెంటరీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీకాంత్‌ ఈ వివాదం గురించి స్పందించాడు.

Cm Revanth Key Comments On Bjp At Ahmedabad Aicc Meeting7
అహ్మదాబాద్‌ వేదికగా.. ప్రధానిపై సీఎం రేవంత్‌ ఘాటు వ్యాఖ్యలు

అహ్మదాబాద్‌ (గుజరాత్‌): మతాల మధ్య ప్రధాని మోదీ చిచ్చుపెడుతున్నారని.. గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడ్సే సిద్ధాంతాన్ని మోదీ ప్రోత్సహిస్తున్నారని.. ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వం అంటూ రేవంత్‌ వ్యాఖ్యానించారు.వచ్చే రోజుల్లో బీజేపీని ఓడించే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలి. దేశంలో కుల గణన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. బ్రిటీష్‌ వాళ్లు ఎలా దేశాన్ని లూటీ చేశారో.. బీజేపీ నేతలు కూడా అలానే లూటీ చేస్తున్నారు. బిట్రీష్‌ వాళ్ల కంటే బీజేపీ వాళ్లే ప్రమాదకరం. బ్రిటీష్‌ వాళ్లను తరమికొట్టినట్టే బీజేపీని కూడా ఓడగొట్టాలి. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు.’’ అని రేవంత్‌ చెప్పుకొచ్చారు.

Now Chandrababu Got Paradala CM Tag Officially8
పరదాల మాటున చంద్రబాబు ఇంటి నిర్మాణానికి భూమి పూజ

అమరావతి, సాక్షి: ఎట్టకేలకు ఏపీలో సొంతింటి నిర్మాణం పనులు చేపట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఉండవల్లిలోని కరకట్టపై ‘అక్రమ’ నివాసంలో ఆయన నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. వరదలు వచ్చిన ప్రతీసారి ఆ నివాసం మునిగిపోతూ వస్తోంది.బుధవారం ఉదయం వెలగపూడిలో పరదాల మాటున సీఎం చంద్రబాబు నివాసానికి భూమి పూజ జరిగింది. సచివాలయం వెనుక.. ఎమ్మెల్యేల క్వార్టర్ల సమీపంలో ఈ ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారాయన. ఇందుకోసం ఐదెకరాల భూమిని కొనుగులు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలెవరికీ ఆహ్వానం పంపించలేదు. అలాగే.. ఆ స్థలం వైపుగా ఎవరూ వెళ్లకుండా అధికారులు గ్రీన్‌ పరదాలు ఏర్పాటు చేశారు. ఇవాళ జరిగిన నారా వారి గృహ శంకుస్థాపన మహోత్సవంలో నారా లోకేష్‌ దంపతులు పాల్గొన్నారు. మనవడు దేవాన్ష్‌ను చంద్రబాబు పూజలో కూర్చోబెట్టుకున్నారు. ఇప్పటికే చంద్రబాబుకి హైదరాబాద్‌లో ప్యాలెస్‌లాంటి ఇల్లు ఉంది. మూడు దశాబ్దాలకు పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ సొంతిల్లు లేకపోవడంతో ఆ మధ్య బాగా విమర్శలు వచ్చాయి. దీంతో అక్కడా ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు సీఎం హోదాలో ఏపీలో కొత్తింటిని నిర్మించుకోబోతున్నారు. ఐదెకరాల భూమిలో.. 25 వేల గజాల్లో హైదరాబాద్‌ ప్యాలెస్‌ను తలదన్నెలా భవనం నిర్మించబోతున్నట్లు సమాచారం.

Odela 2 Event: Lady police officer steals the show while protecting Tamannaah9
వారెవ్వా.. పోలీసు అఫీసర్‌... తమన్నాను మించి క్రేజ్‌

తమన్నా తన రాబోయే చిత్రం ఓదెల- 2 ను ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్‌లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ ప్రమోషన్స్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరీ ముఖ్యంగా ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షింస్తోంది. తమన్నా సెక్యూరిటీ పోలీసు అధికారిణి అద్భుతమైన భద్రతా నైపుణ్యాలు విశేషంగా నిలుస్తోంది.తమన్నా ప్రమోషన్ ఈవెంట్‌కు హాజరవ్వడం కోసం ముంబైలోని తన నివాసం నుంచి బయటకు వచ్చింది. రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతూ ఉన్న తమన్నాకు మించి ఆమెకు ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసు ఆఫీసర్‌ అందర్నీ ఆకర్షించింది. తమన్నాకు రక్షణ కల్పిస్తూ...రద్దీ రోడ్‌లో ఆమెకు మార్గాన్ని క్లియర్ చేసింది. అక్కడున్న వారిని తప్పుకోమని కోరుతూ.. సైడ్‌ సైడ్‌ అంటూ తమన్నాకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించింది. ‘సైడ్‌ సైడ్‌’ అంటూ అక్కడున్న వారిని నియంత్రిస్తున్న ఆమె వీడియో వైరల్‌గా మారింది.ఆమె పని తీరుపై నెటిజనులు ప్రశంసలు కురిపించారు. డ్యూటీలో ఆమె అంకితభావానికి, నైపుణ్యానికి ముగ్ధులయ్యారు, వాటే పోలీస్‌ ఆఫీసర్‌ అని ఒకరు, "మహారాష్ట్ర లేడీ పోలీస్ ఆఫీసర్" మరో యూజర్‌ కమెంట్‌ చేశారు. దీంతో హీరోయిన్ తమన్నాకు మించి క్రేజ్ సంపాదించుకుంది ఈ మహిళా పోలీసు అధికారి. View this post on Instagram A post shared by Bollywood Pap (@bollywoodpap)

Know how to convert credit card payments into EMIs with SBI Card Flexipay10
క్రెడిట్‌ కార్డ్‌ బిల్లుల భారం.. ఉందిగా ఉపాయం!

ప్రస్తుతం క్రెడిట్‌ కార్డుల (credit card) వినియోగం బాగా పెరిగింది. దీంతో ఖర్చుల మీద నియంత్రణ లేక క్రెడిట్‌ కార్డుల బిల్లులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇలా వచ్చిన భారీ మొత్తం బిల్లులను ఒకేసారి కట్టడానికి కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందు కోసమే దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌ ఎస్‌బీఐ (SBI) క్రెడిట్‌ కార్డు వినియోగదారుల కోసం ప్రత్యేక ఫీచర్‌ అందుబాటులో ఉంది.క్రెడిట్ కార్డు పెద్ద మొత్తం బిల్లుల నిర్వహరణను ‘ఎస్‌బీఐ కార్డ్ ఫ్లెక్సీపే’ సదుపాయం సులభతరం చేస్తుంది. ఈ ఫీచర్‌ ద్వారా కార్డుదారులు పెద్ద కొనుగోళ్లను సులభమైన నెలవారీ వాయిదాలుగా (EMI) మార్చుకోవచ్చు. తద్వారా ఒకేసారి ఏకమొత్తం చెల్లించాల్సిన ఇబ్బందిని లేకుండా చేసుకోవచ్చు. అసలేంటీ ఎస్‌బీఐ ఫ్లెక్సీపే ఫీచర్.. అర్హత ప్రమాణాలు, ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.ఎస్‌బీఐ ఫ్లెక్సీపేఫ్లెక్సీపే అనేది ఎస్‌బీఐ కార్డ్ అందించే ఫీచర్. ఇది మీ లావాదేవీలను సులభమైన వాయిదాలుగా మార్చుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. రూ.500 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలను ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. ఇది మూడు, ఆరు, తొమ్మిది, 12, 18, 24 నెలలు వంటి రీపేమెంట్ కాలపరిమితి ఎంపికలను అందిస్తుంది.ఇక రూ.30,000 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్లకు 36 నెలల ఈఎంఐ ప్లాన్ ఎంచుకోవచ్చు. ఫ్లెక్సీపే కోసం కనీస బుకింగ్ మొత్తం రూ .2,500, అయితే ఇది ఆఫర్ల ఆధారంగా మారవచ్చు. అలాగే, గత 30 రోజుల్లో చేసిన లావాదేవీలను ఫ్లెక్సీగా మార్చుకోవచ్చు. క్రెడిట్‌ కార్డు బిల్లులను ఈఎంఐలను మార్చుకునే ముందు మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోను ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది.ఈఎంఐలుగా మార్చుకోండిలా..ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వినియోగదారులు తమ ఎస్‌బీఐ కార్డ్ ఆన్‌లైన్ ఖాతాలోకి లాగిన్ అయి, 'ఈఎంఐ అండ్ మోర్' విభాగానికి వెళ్లి 'ఫ్లెక్సీపే' ఎంచుకోవచ్చు. మార్చాలనుకుంటున్న లావాదేవీని, తగిన కాలపరిమితిని ఎంచుకుని అభ్యర్థనను ధృవీకరించండి.అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఎస్‌బీఐ కార్డ్ కస్టమర్ సర్వీస్ హెల్ప్‌ లైన్‌కు కూడా కస్టమర్లు కాల్ చేసి కస్టమర్ సపోర్ట్ టీమ్ సహాయంతో ఈఎంఐ మార్పిడిని అభ్యర్థించవచ్చు. వాళ్లు మీకు ప్రక్రియపై మార్గనిర్దేశం చేస్తారు.అలాగే వినియోగదారులు ఎస్‌బీఐ కార్డ్ మొబైల్ యాప్‌లోనూ ఫ్లెక్సీపే ఎంపికను యాక్సెస్ చేయవచ్చు. అవసరమైతే లావాదేవీ మొత్తాన్ని సవరించి, కాలపరిమితిని ఎంచుకుని అప్లయి చేయవచ్చు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement