
అమెరికాలో ‘ఖని’ యువకుడు మృతి
కోల్‌సిటి(రామగుండం): గోదావరిఖనికి చెందిన సాఫ్ట్ట్‌వేర్ లక్కేడి శ్రీధర్‌రెడ్డి(42) అమెరికాలో మృతి చెందారు. కుటుంబ స భ్యుల కథనం ప్రకారం.. స్థానిక ఎల్బీనగర్‌కు చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి లక్కేడి మాధవరెడ్డి ప్రస్తుతం ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు శ్రీధర్‌రెడ్డి పదేళ్లుగా అమెరికాలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఆయన భార్య కూడా అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. వీరికి కూతురు, కుమారుడు ఉ న్నారు. మూడు నెలల క్రితం శ్రీధర్‌రెడ్డి క్యాన్సర్‌కు గురయ్యారు. అక్కడే చికిత్స పొందుతున్నా రు. కొడుకును చూసుకోవడానికి రెండు నెలల క్రితం తండ్రి మాధవరెడ్డి కూడా అమెరికా వె ళ్లారు. ఈ నేపథ్యంలోనే భారతకాలమానం ప్ర కారం మంగళవారం సాయంత్రం శ్రీధర్‌రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతదేహాన్ని భారత్‌కు తరలించడానికి ఆలస్యం అయ్యే అవకాశాలు ఉండడంతో అమెరికాలోనే అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడ జరిగిన రెడ్డి అంత్యక్రియలను గోదావరిఖనిలోని అతడి సోదరుడు రమణారెడ్డి, బంధువులు ఆన్‌లైన్ లో వీక్షించారు.
పోయిందనుకున్న బంగారం దొరికింది
మల్యాల(చొప్పదండి): ఏమరుపాటులో ఓ గృహిణి ఓ వ్యక్తికి బియ్యం విక్రయించింది. అయితే అందులో మూడు తులాల బంగారం దాచిన విషయాన్ని మరిచిపోయింది. మరుసటి రోజు విషయం గమనించిన ఆ గృహిణి సదరు వ్యక్తిని పట్టుకుని విచారించడంతో బంగారం దొరికింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మల్యాల మండలం నూకపల్లికి చెందిన ఓ గృహిణి మూడు రోజుల క్రితం దొడ్డుబియ్యాన్ని ఓ వ్యక్తికి విక్రయించింది. అందులో మూడు తులాల బంగారాన్ని దాచిన విషయాన్ని మరిచిపోయింది. అదేరోజు సాయంత్రం బంగారం దాచిన విషయం గుర్తుకొచ్చి.. బియ్యం కొనుగోలు చేసిన వ్యక్తి కోసం గాలించింది. అయినా అతడి ఆచూకీ లభించలేదు. రెండురోజులు క్రితం సదరు వ్యక్తి నూకపల్లికి రాగా.. గృహిణి అతడిని ప్రశ్నించింది. తాను బంగారాన్ని చూడలేదని, బియ్యాన్ని గొల్లపల్లి మండలం గుంజపడుగుకు చెందిన ఓ వ్యక్తికి విక్రయించినట్లు చెప్పడంతో మంగళవారం సదరు మహిళా కుటుంబసభ్యులు గుంజపడుగుకు వెళ్లి బియ్యంలో వెదికారు. అందులో బంగారం బయటపడడంతో ఊపిరిపీల్చుకున్నారు.
యువతి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: పోచమ్మవాడలో గంగధరి ప్రసన్నలక్ష్మీ(28) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఉప్పునీటి గంగాధర్ కుమార్తె ప్రసన్నలక్ష్మీని వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన గంగధరి తిరుపతికి ఇచ్చి 2023లో వివాహం చేశారు. వీరికి ఏడాది బాబు ఉన్నాడు. తిరుపతి వెళ్లేందుకని ఇటీవలే జగిత్యాలలోని పుట్టింటికి వచ్చింది. ఇంతలో ఏమైందో తెలియదుగానీ.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
కర్మకాండకు వెళ్లి యువకుడు గల్లంతు
జగిత్యాలక్రైం: కర్మకాండకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో యువకుడు గల్లంతైన సంఘటన జగి త్యాలలో చోటుచేసుకుంది. స్థానిక మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన నీలి మల్లికార్జున్ నా నమ్మ ఇటీవల మృతిచెందింది. బుధవారం కర్మకాండ నిర్వహించారు. శ్మశానవాటిక పక్కనే ఉ న్న చింతకుంట చెరువులో స్నానం చేస్తుండగా మల్లికార్జున్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గ ల్లంతయ్యాడు. గజఈతగాళ్లను రంగంలోకి దింపినా ఆచూకీ లభ్యం కాలేదు. యువకుడు మృతి చెంది ఉంటాడని కుటుంబీకులు రోదిస్తున్నారు.