Peddapalli District News
-
నీడ లేదు.. నీరూ లేదు..!
కూర్చునేందుకు కుర్చీ ఉండదు.. నిలబడదామంటే నీడ ఉండదు.. కనీసం తాగునీరు దొరకదు.. అత్యవసర పరిస్థితుల్లో మరుగుదొడ్లను వినియోగించుకుందా మంటే ముక్కుపుటాలు అదిరే కంపు.. ఇవీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్లలో కనిపించే పరిస్థితులు. నియోజకవర్గ కేంద్రాల్లో బస్టాండ్లు ఉన్నా సౌకర్యాలు లేకపోగా.. మండల కేంద్రాల్లో కనీసం బస్టాండ్లు కూడా కరువయ్యాయి. మరికొన్ని ప్రధాన గ్రామాల్లో ప్రయాణ ప్రాంగణాలు లేక ప్రయాణికులు ఎండలోనే బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయడంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. వీరంతా ఎండలోనే నిల్చొని బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం.. అంటూ ప్రచారం చేసుకునే అధికారులు ప్రయాణ ప్రాంగణాలలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ఉమ్మడి జిల్లాలో ప్రయాణ ప్రాంగణాలు లేక.. ఉన్నా సౌకర్యాలు కరువై ప్రయాణికులు పడుతున్న కష్టాలపై ‘సాక్షి’ ఫోకస్. – వివరాలు 8లో.. -
యూడైస్ ప్లస్ పునఃపరిశీలన
జ్యోతినగర్(రామగుండం): విద్యా వ్యవస్థను బలోపేతం చేసేక్రమంలో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన యూడైస్ ప్లస్ పరిశీలన కార్యక్రమం ప్రారంభమైంది. బుధవారం ఎన్టీపీసీ సుభాష్‌నగర్ పాఠశాలను కరీంనగర్ డైట్ కళాశాల విద్యార్థిని మాసుమా రికార్డులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్, మౌలిక వసతులు, ఉపాధ్యాయులు, తరగతి గదుల సంఖ్య, మూత్రశాలలు తదితర అంశాలపై ఆ రా తీస్తున్నామన్నారు. నివేదికను యూడైస్‌లో పొందుపరిచిన ఆ తర్వాత మార్పులు, చేర్పుల గురించి హెచ్ఎం శారదకు వివరించారు. క్లస్ట ర్ రిసోర్స్ పర్సన్ రామ్‌కుమార్ ఉన్నారు. లెక్చరర్ల ఇంటింటి ప్రచారం రామగుండం: పదో తరగతి పరీక్షలు రాసిన వి ద్యార్థుల కోసం స్థానిక ప్రభుత్వ జూనియర్ క ళాశాల లెక్చరర్లు బుధవారం ఇంటింటా పర్యటించారు. అంతర్గాం మండలం పొట్యాల, మ ద్ధిర్యాల తదితర గ్రామాల్లో ప్రిన్సిపాల్ చింతల మోహన్ ఆదేశాల మేరకు లెక్చరర్లు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను కలిశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని గ్రూపులు, వసతులు, ని ష్ణాతులైన అధ్యాపకులు తదితర అంశాల గు రించి వివరించారు. తమ పిల్లలను ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేర్పించాలని కోరారు. 30లోగా దరఖాస్తు చేయాలి పెద్దపల్లిరూరల్: ‘టెట్’ కోసం ఆసక్తిగల ఉపాధ్యాయులు ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని డీఈవో మాధవి తెలిపారు. ఇందుకోసం అభ్యర్థులు https://tgtet.apton line.in/tgtet/ వెబ్సైట్లో దరఖాస్తు నమోదు చేసుకోవాలని డీఈవో సూచించారు. ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ పెద్దపల్లిరూరల్: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణ కోసం కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధ వారం తెలిపారు. సన్నరకం ధాన్యం క్వింటాల్ రూ.500 బోనస్ వర్తింపజేస్తామన్నారు. ఐకేపీ, ప్యాక్స్‌లు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు గోనె సంచులు, లారీల ట్రాన్స్పోర్ట్ విషయంలో ఇబ్బందులు ఉంటే 79950 50780 ఫోన్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కంట్రోల్‌రూమ్ ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షిస్తుందని, రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్‌నంబర్ 08728–224045కు ఫోన్‌చేసి ఫిర్యాదు అందించాలని ఆయన పేర్కొన్నారు. ముగిసిన ‘సబార్డినేట్’ పరీక్షలు రామగిరి(మంథని): మంథని జేఎన్టీయూలో బుధవారం జ్యుడీషియల్, మినీస్టరియల్, సబార్డినేట్ ఆన్లైన్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహించారని అధికారు లు తెలిపారు. ఉదయం వేళ 100 మందికి 67 మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యా హ్నం సెషన్లో జరిగిన పరీక్షకు 56 మంది హా జరు కాగా 44 మంది గైర్హాజరయ్యారని ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామగిరి ఎస్సై చంద్రకుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు చేపట్టారు. నేటి నుంచి ‘భూ భారతి’పై సదస్సులు పెద్దపల్లిరూరల్: భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన భూ భారతి(ఆర్వోఆర్) చట్టంపై ఈనెల 17 నుంచి 28వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 17న అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి, ఎన్టీపీసీ టీటీఎస్ మిలీనియం హాల్, 19న ధర్మారం మండలం నందిమేడారం, 21న ఎలిగేడు మండలం ఎలిగేడు, జూలపల్లి మండలం గోల్డెన్ ఫంక్షన్‌హాల్, 22న రామగిరి మండలం సెంటినరీకాలనీ సింగరేణి కమ్యూనిటీహాల్, కమాన్‌పూర్ మండలం నాగారం, 23న మంథని మండలం నాగారం, 24న ఓదెల మండల కేంద్రం, ముత్తారం తహసీల్దార్ కార్యాలయం, 25న పాలకుర్తి మండలం పాలకుర్తి, కాల్వశ్రీ రాంపూర్ రెడ్డి ఫంక్షన్‌హాల్, 26న సుల్తానాబాద్ మండలం సుద్దాల, 28న పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. రోజూ ఉదయం 10.00 గంటలకు ఒకటి, మధ్యాహ్నం 2.00 గంటలకు మరో అవగాహన సదస్సు ఉంటుందన్నారు. -
అకాలం.. అపార నష్టం
ముత్తారం/ఓదెల/రామగిరి: జిల్లాలోని ముత్తారం, ఓదెల, రామగిరి మండలాల్లో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వడగళ్లవాన కురిసింది. ముత్తారం మండలం ఓడేడ్, ముత్తారం, పారుపల్లి, అడవిశ్రీరాంపూర్, ఖమ్మంపల్లి, మైదంబండ, మచ్చుపేట, కేశనపల్లి, లక్కారంతోపాటు ఓదెల మండలం పొత్కపల్లి, జీలకుంట, పొత్కపల్లి, ఇందుర్తి, బాయమ్మపల్లె తదితర గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి చేతికి అందే దశలోని వరి పంట నేలవాలింది. ఈసారి అత్యధికంగా సాగైన ఆడ, మగ(సీడ్) పంట నేలపాలు కావడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. బలమైన గాలిదుమారానికి మామిడికాయలు రాలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో బుధవారం సాయంత్రం వర కూ కొన్నిగ్రామాలు అంధకారంలోనే ఉండిపోయాయి. ముత్తారం మండలంలో దాదాపు 11 కరెంట్ స్తంభాలు విరిగి సుమారు రూ.3లక్షల వరకు నష్టం వాటిల్లిందని ట్రాన్సకో ఇన్చార్జి ఏఈ సంతోష్‌రెడ్డి తెలిపారు. వరి పంటను మండల వ్యవసాయాధికారి అనూష, ఏఈవోలు బుధవారం పరిశీలించారు. ముత్తారం మండలంలోని వివిధ గ్రామాల్లో దాదాపు 2వేల ఎకరాల్లో వరి, 40 ఎకరాల్లో మామిడితోటల నష్టం వాటిల్లిందని ఏవో తెలిపారు. ఉన్నతాధికారులకు నివేదిస్తామని అన్నారు. అదేవిధంగా ఓదెల మండలం పొత్కపల్లి, జీలకుంట, పొత్కపల్లి, ఇందుర్తి, బాయమ్మపల్లె తదితర గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లోని వరి పంట దెబ్బతిన్నదని ఏవో భాస్కర్ తెలిపారు. ఈమేరకు బుధవారం ఆయన ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఓదెల మండలం ఇందుర్తిలోని తొడెటి శ్రీనివాస్‌కు చెందిన ఇల్లు కూలింది. అప్రమత్తమైన శ్రీనివాస్ కుటుంబసభ్యులు వెంటనే బయటకు పరుగెత్తి ప్రాణాలతో బయటపడ్డారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. ఓదెల మండలం జీలకుంట, బాయమ్మపల్లె, శానగొండ, పొత్కపల్లిలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నాయకులు కొండపాక నర్సింహాచారి, పులి కొముర య్య, కుక్కల మహేందర్, దాత రాకేశ్పటేల్, పు ల్ల సదయ్యగౌడ్, అనిల్, కృష్ణ పాల్గొన్నారు. రామగిరి మండలం బేగంపేటలోని రాందేని బక్కయ్యకు చెందిన 5 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ముత్తారం, ఓదెల మండలాల్లో అకాల వర్షంతో ఆగమాగం రెండు వేల ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం అన్నదాతకు కన్నీళ్లు మిగిల్చిన వడగళ్ల వాన -
నాణ్యమైన ధాన్యానికి మద్దతు ధర
● నిర్దేశిత తేమశాతం వచ్చాకే మార్కెట్‌కు తేవాలి ● అన్నదాతలకు కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచనలు సుల్తానాబాద్(పెద్దపల్లి): నిర్దేశిత తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ వేణుతో కలిసి స్థానిక వ్యవసాయ మార్కెట్‌ను కలెక్టర్ బుధవారం సందర్శించారు. కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు, రవాణాలో హమాలీ సమస్య తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కేటాయించిన రైస్ మిల్లులకే ధాన్యం తరలించాలని సూచించారు. గ్రేడ్ ఏ– రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.2,320, సాధారణ రకం క్వింటాల్‌కు రూ.2,300 మద్దతు ధర చెల్లించాలని అన్నారు. జిల్లా పౌర సరఫరాల మేనేజర్ శ్రీకాంత్, అధికారి రాజేందర్, తహసీల్దార్ రాంచందర్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, డిప్యూటీ తాహసీల్దార్ మహేశ్, మార్కెట్ కార్యదర్శి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, జిల్లాలో 90 రైస్ మిల్లులకే ధాన్యం కేటాయించారని, మిగతా మిల్లులకు కూడా ధాన్యం కేటాయించాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మోరపల్లి తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి కలెక్టర్‌కు విన్నవించారు. అయితే, బకా యి పడిన మిల్లులకు ధాన్యం కేటాయించేది లేదని, బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన వాటికి కేటాయిస్తామని ఆయన వివరించారు. హమాలీ సమస్య పరిష్కరించాలని పలువురు కలెక్టర్‌కు విన్నవించారు. -
చెప్పుకోలేని బాధలకు పరిష్కారం లేదా?
● కమాన్‌చౌరస్తా, జెండా కూడలిలో మూత్రశాలలు లేవు ● ఇబ్బందులు ఎదుర్కొంటున్న పట్టణవాసులు, చిరువ్యాపారులు అధికారులు చొరవ చూపాలి జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలోని ప్రధాన కూడళ్లలో సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలి. మూత్రవిసర్జన కోసం కనీస ఏర్పాట్లు చేయాలి. కమాన్, ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చొరవచూపి సులభ్‌కాంప్లెక్స్ నిర్మించాలి. – కనుకుంట్ల సదానందం, సామాజిక కార్యకర్త స్థలం అందుబాటులో లేదు పెద్దపల్లిలో మరోరెండు పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాల్సిన అవసరముంది. ఇందుకోసం నిధులు ఉన్నాయి. స్థలమే లభించడం లేదు. కమాన్ ప్రాంతంలోని పెట్రోల్ బంక్ టాయిలెట్లను వినియోగించుకోవచ్చు. ఈ మేరకు నిర్వాహకులకు తగిన సూచనలు ఇచ్చాం. – ఆకుల వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్, పెద్దపల్లి పెద్దపల్లిరూరల్: అసలే జిల్లా కేంద్రం.. పట్టణంతోపాటు సమీప గ్రామీణులు వివిధ అవసరాల కోసం రోజూ ఇక్కడకు వచ్చిపోతుంటారు. ఒకటి, రెంటికి పబ్లిక్ టాయిలెట్లు లేక ఉక్కబట్టుకుంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే కమాన్ చౌరస్తా, జెండా చౌరస్తాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. మహిళల బాధ చెప్పుకోలేనిది.. తమ అవసరాల కోసం పెద్దపల్లికి వచ్చే పరిసర మండలాలు, గ్రామాల ప్రజలు మల, మూత్రవిసర్జ నకు నానాతిప్పలు పడుతున్నారు. మహిళల బాధ లు వర్ణణాతీతం. పట్టణంలోని ప్రధాన కూరగాయల మార్కెట్‌కు సమీపంలో (సాగర్రోడ్డువైపు) నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చివెళ్లే చిరువ్యాపారులు, కూరగాయలు, పండ్లు అమ్ముకునే రోజూవారీ వ్యాపారులు పొద్దంతా శ్రమించి సంపాదించిన సొమ్ములో రూ.20 నుంచి రూ.30 వ రకు మల, మూత్రవిసర్జనకే వెచ్చించాల్సి వస్తోంద ని వాపోతున్నారు. మూత్రవిసర్జనకు డబ్బులు వ సూలు చేస్తున్న నిర్వహకులతో కొందరు వాగ్వాదానికి దిగుతున్నారు. సులభ్ కాంప్లెక్స్‌ల వద్ద ‘మూ త్రవిసర్జన ఉచితం’ అనే బోర్డు ఏర్పాటు చేసేలా అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు. స్థలం అందుబాటులో లేకనే.. పట్టణంలోని కమాన్ ప్రాంతంలో గల పెట్రోల్ బంకు వద్ద సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని గతంలో తీర్మానించారు. అక్కడ పనులు ప్రారంభించకున్నా కనీసం సమీపంలో మరోచోట కూడా పబ్లిక్ టాయిలెట్ నిర్మించలేకపోయారు. దీంతో ఈ ప్రాంతానికి వచ్చిన వారంతా మూత్ర, మల విసర్జనకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళలు గోస పడుతుండ్రు వివిధ పనుల నిమిత్తం పెద్దపల్లికి వచ్చేవారికి కనీస సౌకర్యాలు లేవు. మల, మూత్రవిసర్జనకు పడుతున్న బాధలు అన్నీఇన్నీకాదు. ముఖ్యంగా పల్లెల నుంచి వచ్చిన మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కమాన్ ప్రాంతంలో సులభ్‌కాంప్లెక్స్ నిర్మించాలి. – జ్యోతి, సీఐటీయూ నాయకురాలు పెద్దపల్లి కమాన్‌చౌరస్తా ప్రాంతంలో సులభ్ కాంప్లెక్స్ సౌకర్యం లేదు.. పట్టణవాసులతోపాటు వివిధ పనుల కోసం వచ్చే సమీప గ్రామస్తులు ఒకటి, రెంటికి అవస్థలు పడుతున్నారు.. ఒప్పందం చేసుకుని ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభించడం లేదు.. గత్యంతరం లేక నేను నిరసన తెలియ జేయాల్సి వస్తోంది.. – అప్పటి కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఇలా ప్రాస్తావించాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. -
యువ‘వికాసం’!
దరఖాస్తుల● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనూహ్య స్పందన ● వరుస సెలవులు, సర్వర్ సమస్యలతో దరఖాస్తులకు ఇబ్బందులు ● చాలా మందికి ఇంకా అందని కులం, ఆదాయం, రేషన్ కార్డులు ● గడువు పెంచాలని దరఖాస్తుదారుల వినతులురాజీవ్ యువ వికాసానికి వచ్చిన దరఖాస్తులుపెద్దపల్లి 47,470జగిత్యాల 31,128రాజన్న సిరిసిల్ల 23,477కరీంనగర్ 29,000సాక్షిప్రతినిధి, కరీంనగర్: యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువవికాస పథకానికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనూహ్య స్పందన వచ్చింది. దరఖాస్తు ప్రక్రియలో తీవ్ర సమస్యలు ఎదురైనా దరఖాస్తులు వెల్లువెత్తాయి. సర్వర్ లోపాలతో పాటు సాంకేతిక సమస్యలతో దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగడంతో వేల మంది పథకం కోసం దరఖాస్తు చేసుకోకముందే గడువు ముగియడంతో నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం మెరుగైన రాయితీతో రూ.4 లక్షల వరకు విలువైన యూనిట్లు మంజూరు చేయనుండటంతో యువత ఈ పథకానికి భారీగా దరఖాస్తు చేసుకోవాడానికి ఆసక్తి చూపారు. గడువు ముగిసేనాటికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,31,075 మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. సర్వర్ సమస్యలతో కేంద్రాల వద్ద బారులు రాజీవ్ యువ వికాసం దరఖాస్తు చేయడానికి రూపొందించిన ఓబీఎంఎంఎస్ పోర్టల్‌లో సర్వర్ సమస్యలు నెలకొన్నాయి. దీంతో మీ సేవ కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. కొన్నిసార్లు అప్లికేషన్ చివరిదశకు వెళ్లిన సమయంలో సర్వర్ మొరాయించగా, దరఖాస్తు సమర్పించిన తర్వాత అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ కాకపోవడంలాంటి సమస్యలు ఎదురయ్యాయి. ఒకవేళ మళ్లీ దరఖాస్తు చేస్తే అల్రెడీ అప్లైడ్ అని రావడం, దరఖాస్తు సమయంలో తరచూ సర్వర్ ఎర్రర్ మెసేజ్ రావడమనేది పరిపాటిగా మారింది. దీంతో ఒక్కో దరఖాస్తు చేయడానికి కనీసం అరగంటకు పైగా ఎదురుచూడాల్సి వచ్చింది. సెలవులతో అర్జీలు పెండింగ్‌లో రేషన్‌కార్డు లేకుంటే ఆదాయ ధ్రువీకరణ ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఆ సర్టిఫికెట్ల కోసం మీసేవ కేంద్రాలకు పరుగులు తీశారు. ఐతే రాజీవ్ యువవికాసం పథకం దరఖాస్తులు స్వీకరించినప్పటి నుంచి వరుస సెలువులు సైతం దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురిచేశాయి. రంజాన్, ఉగాది, జగ్జీవన్‌రామ్ జయంతి, తాజాగా రెండో శనివారం, ఆదివారం, సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆఫీసులు పనిచేయలేదు. దీంతో ఆదాయం, కులం సర్టిఫికెట్లు పెండింగ్ దరఖాస్తులు ఎలా పరిష్కారమవుతాయని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు మీసేవ కేంద్రాల ద్వారా రెవెన్యూ కార్యాలయాలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లక్షల్లో క్యాస్ట్, ఇన్‌కం ధ్రువీకరణ పత్రాలకు అర్జీలు వచ్చాయి. వీటిలో వేలల్లోనే దరఖాస్తులను మాత్రమే అధికారులు ఆమోదించారు. దీంతో ధ్రువీకరణ పత్రాలు అందని చాలామంది యువతీయువకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరేళ్ల తర్వాత సుమారు ఆరేళ్ల తర్వాత నిరుద్యోగుల కోసం స్వయం ఉపాధి పథకాన్ని అమలు చేస్తుండంతో యువత దీనిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ మార్చి 15వ తేదీన ప్రారంభించినప్పటికీ రుణాల పరిమితి, కేటగిరీలు, రాయితీ నిధులకు సంబంధించి స్పష్టత రాలేదు. మార్చి 25వ తేదీన ఈ పథకం విధివిధానాలపై సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఆ తరువాత ఈబీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణ చేపట్టింది. గడవు పెంచుతూ 14 వరకు సమయం ఇచ్చింది. తాజాగా మరోసారి గడువు పెంపుపై ఆశలు పెట్టుకున్నారు. కుల ధ్రువీకరణ పత్రం లేక దరఖాస్తు తిరస్కరణ కుల ధ్రువీకరణ పత్రం కోసం వారం రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నా. తహసీల్దార్ కార్యాలయంలో సైట్ ఓపెన్ కావడం లేదని వారు దానిని అప్లోడ్ చేయలేదు. దీంతో నాకు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ రాలేదు. దీంతో నేను దరఖాస్తు చేసుకోలేకపోయాను. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసే నంబరు వేసినప్పటికీ యువ వికాస పథకంలో తీసుకోవడం లేదు. దీంతో ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వీలు లేకుండా పోయింది. – ఏదుల కిరణ్‌కుమార్, జగిత్యాల -
వైద్య కళాశాలకు దేహదానం
ఓదెల/సుల్తానాబాద్(పెద్దపల్లి): కొలనూర్ గ్రామానికి చెందిన జీగురు ఓదెలు అనారోగ్యంతో చనిపోయారు. ఆయన పార్థివదేహాన్ని బుధవారం కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీకి అప్పగించారు. తొలుత మృతుడి నివాసంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్ సమక్షంలో సదాశయ ఫౌండేషన్, లయన్స్ క్లబ్, సుల్తానాబాద్ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. మృతుడి కుమారులు జీగురు నాగయ్య, ఐలయ్య, రవీందర్, రాంచందర్ నేతృత్వంలో పార్థివదేహాన్ని ప్రతిమ మెడికల్ కాలేజీ నిర్వాహకులకు అప్పగించారు. మృతుడి భార్య జీగురు కనకలక్ష్మి సైతం గతంలో శరీరదానానికి అంగీకరించారు. ఈకార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయండి
కరీంనగర్‌టౌన్: వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట ప్రాంతాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరారు. రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేక సహాయ (ఎస్ఏఎస్సీఐ) పథకం కింద నిధులను మంజూరు చేయాలని విన్నవించారు. సిరిసిల్ల లేదా సిద్దిపేట జిల్లాల్లో సైనిక్‌స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విన్నవించారు. ఈమేరకు న్యూఢిల్లీలో బుధవారం కలిసి వినతిపత్రాలు అందించారు. కేంద్రం సైనిక్‌స్కూల్‌ను మంజూరుచేస్తే భూమి, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సైనిక్‌స్కూల్ మంజూరు చేయండి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, గజేంద్రసింగ్ షెకావత్‌లకు బండి సంజయ్ వినతి -
ఉద్యోగం రావడం లేదనే మనస్తాపంతో యువతి ఆత్మహత్య
గోదావరిఖని: ఎంకాం చదివి ఎన్ని పరీక్షలు రాసినా ఉద్యోగం రావడం లేదనే మనస్తాపంతో పీజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గోదావరిఖని వన్‌టౌన్ ఎస్సై భూమేశ్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పవర్‌హౌస్‌కాలనీకి చెందిన చుంచు ప్రత్యూష(26) బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉన్నత చదువులు చదవి ఎన్ని పరీక్షలు రాసినా ఉద్యోగం రావడం లేదని కొంతకాలంగా మదనపడుతోంది. ఇదేవిషయాన్ని ఇంట్లో చెబుతూ బాధపడుతుండేది. ఈక్రమంలో బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో రేకులషెడ్డు పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉద్యోగం రాలేదని తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై తన మూడో కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి చుంచు విఠల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. -
జీజీహెచ్‌లో పనిచేయని ఫ్రీజర్లు
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని ప్రభు త్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో బాడీ ఫ్రీజర్లు ప నిచేయడం లేదు. మార్చురీలో మూడు ఫ్రీజర్లు ఉండాల్సి ఉండగా, ఒకటే పనిచేస్తోంది. మిలిగిన రెండు పనిచేయడం లేదు. దీంతో ఎక్కువ సంఖ్యలో మృతదేహాలు మార్చురీకి వచ్చినప్పుడు వాటిని ఫ్రీ జర్‌లో పెట్టేందుకు అవకాశం లేకపోవడంతో ఆస్ప త్రి సిబ్బందితోపాటు మృతుల కుటుంబాలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం రా త్రి ప్రత్యూష అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం పోస్టుమార్టం చేయాల్సి ఉంది. దీంతో ఆ మృతదేహాన్ని మార్చురీలో ఉంచడానికి వన్‌టౌన్ పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. సోమవారం రాత్రి రైలు ప్రమాదంలో మృతి చెందిన ఓ యువకుడి మృతదేహాన్ని పని చేస్తున్న ఫ్రీజర్‌లో పెట్టి ఉంచడంతో ఆస్పత్రి సి బ్బంది ఏం చేయలేమని చేతులెత్తేశారు. దీంతో యువతి మృతదేహం పాడవకూడదని భావించిన మృతురాలి తండ్రి విఠల్.. డబ్బులు వెచ్చించి అద్దె కు ఫ్రీజర్బాక్స్ తెప్పించి అందులో తన కూతురు మృతదేహాన్ని పెట్టాల్సి వచ్చిందని ఆవేదనతో తెలిపాడు. బోధాన ఆస్పత్రిగా అభివృద్ధి చెందుతున్న జీజీహెచ్‌లో అన్నివసతులు కల్పిస్తున్నామని చెబుతున్న అధికారులు.. క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా వ్యవహరించడం శోచనీయమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనిచేయని ఫ్రీజర్లపై అనేక ఫిర్యాదులు వచ్చినా స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యంత్రాంగం తీరుపై నిరసన -
అభివృద్ధి పనుల పరిశీలన
ఎలిగేడు(పెద్దపల్లి): ఉపాధిహామీ ద్వారా ధూళికట్ట గ్రామంలో చేపట్టిన మట్టిరోడ్డు పనులను డీఆర్డీవో కాళిందిని బుధవారం పరిశీలించారు. నిర్మాణం తీరు, ఉపాధిహామీ కూలీలకు కల్పించి తాగునీరు, నీడ తదితర సౌకర్యాలపై ఆరా తీశారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆరబోసిన ధాన్యం, తేమశాతం తనిఖీ చేశారు. ఎలిగేడు, ఽసుల్తాన్పూర్ గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిచారు. ఈకార్యక్రమంలోఎంపీడీవో భాస్కర్‌రావు, టీ సెర్ప్ ఏపీఎం సుధాకర్, ఈజీఎస్ ఏపీవో సదానందం, సీసీలు, ఫీల్డ్అసిస్టెంట్లు ఉపాధిహామీ కూలీలు పాల్గొన్నారు. వివరాలు సేకరిస్తున్న డీఆర్డీవో కాళిందిని -
‘భట్టి’ని కలిసిన కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు
గోదావరిఖని: డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్(డీఎంఎఫ్టీ) నిధులు విడుదల చేయాలని కోరుతూ కోల్బె ల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయనను కలిసి లేఖ అందజేశారు. కోల్‌బెల్ట్ ప్రాంత అభివృద్ధి కి నిధులు త్వరగా విడుదల చేయాలన్నారు. కో ల్బెల్ట్ ప్రాంతాల్లో మైనింగ్‌తో ప్రజల ఆరోగ్యం, జీ వన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంద న్నారు. స్థానిక ప్రజలకు మౌలిక సదుపాయాలు, మంచినీటి సరఫరా, రహదారి, ఆరోగ్య శిబిరాలు, విద్యా సౌకర్యాలు కల్పించేందుకు ఈనిధులు ఎంత గానో తోడ్పతాయని అన్నారు. ఇప్పటికే నిధులు మంజూరైనా విడుదల విషయంలో ఆలస్యం జరుగుతోందన్నారు. డిప్యూటీ సీఎం స్పందిస్తూ.. ప్రత్యే కంగా మైనింగ్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, ప్ర భుత్వ ప్రాధాన్యత, సంబంధిత శాఖలతో చర్చించి, త్వరితగతిన నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజ్‌ఠాకూర్, గంట సత్యనారాయణ, బీర్ల ఆయిలయ్య తదితరులు ఉన్నారు. -
నీడ లేదు.. నీరూ లేదు..!
సిరిసిల్ల పాత బస్టాండులో నీడలేని ప్లాట్‌ఫామ్స్ ● కరీంనగర్ స్మార్ట్‌సిటీలో బస్షెల్టర్లు నామమాత్రం. వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు ఎదురుగా మానకొండూరు, తిమ్మాపూర్, బెజ్జంకి, కమాన్ ప్రాంతంలో ఉన్న నిలువనీడ కరువయ్యింది. కోర్టు ఎదురుగా చొప్పదండి , పెద్దపల్లికి వెళ్లే రూట్లో బస్‌షెల్టర్ లేకపోవడంతో జనం ఎండలో నిలబడుతున్నారు. ● రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం, సహా ఇల్లంతకుంట, గంభీరావుపేట, కోనరావుపేట, బోయినపల్లిలో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదు. పలుగ్రామాల్లో బస్సులు నిలిపే స్థలం, బస్సుషెల్టర్లు లేవు. జిల్లా కేంద్రంలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. పట్టణానికి దూరంగా ఉన్న కొత్తబస్టాండ్‌లో ప్రయాణికులు నామమాత్రంగా వెళ్తుంటారు. పాతబస్టాండ్ ఏరియానే నిత్యం వందలాది మందితో కిటకిటలాడుతోంది. ఇక్కడ ప్లాట్‌ఫామ్స్‌పై నిలువనీడలేదు. ప్రయాణికులు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ బస్సుల కోసం నీరిస్తున్నారు. ఇల్లంతకుంటలో తాగునీటి వసతిలేదు. మూత్రశాలలు, మరుగుదొడ్ల సదుపాయం లేదు. కోనరావుపేట, గంభీరావుపేటలో ప్రయాణ ప్రాంగంణం నిరుపయోగంగా ఉంది. ప్రయాణికులు బస్సుల కోసం దుకాణాల నీడలో నిలబడుతున్నారు. ● జగిత్యాల జిల్లా రాయికల్, కథలాపూర్, ఇబ్రహీంపట్నం, పెగడపల్లిలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. రాయికల్ పాతబస్టాండ్‌లో కూర్చునేందుకు, నీడలేదు. ఇబ్రహీంపట్నంలో బస్ షెల్టర్ల వద్ద బస్సులు ఆపడంలేదు. దీంతో ప్రయాణికులు రోడ్లపై నిలబడుతున్నారు. తాగునీటి వసతీ లేదు. పెగడపల్లిలో తాగునీరు కరువైంది. ఉన్న టాయిలెట్స్ సరిగాలేవు. కథలాపూర్‌లో కనీస వసతులు లేవు. టాయిలెట్ కోసం దూరప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌లో ప్రయాణికులు బస్సుల కోసం ఎండలో నిరీక్షిస్తున్నారు. కరీంనగర్–గోదావరిఖని రాజీవ్ రహదారిలో బస్షెల్ట ర్లు లేకపోవడంతో ప్రయాణికులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నారు. బొమ్మకల్, చల్మెడ ఆనందరావు ఆస్పత్రి, గోపాల్పూర్, ఇరుకుల్ల, మొగ్ధుంపూ ర్ గ్రామాల స్టేజీలపై బస్ షెల్టర్లు లేకపోవడంతో ప్ర యాణికులు బస్సుల కోసం ఎండలోనే నిరీక్షిస్తున్నారు. – సిరిసిల్లటౌన్/ గంభీరావుపేట/ కోనరావుపేట/బోయినపల్లి/రాయికల్/ కథలాపూర్/కాల్వశ్రీరాంపూర్/పెగడపల్లి అధ్వానంగా ఆర్టీసీ బస్టాండ్లు, షెల్టర్లు ప్రయాణికులకు ఎండ కష్టాలు తాగడానికి నీరులేదు.. ఒంటికి, రెంటికి తిప్పలే ఓ వైపు ఎండలు మండుతున్నాయి. ఎండవేడిమికి జనం నానా అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారి కష్టాలు వర్ణనాతీతం. చంటిపిల్లల తల్లులు, మహిళలు, వృద్ధులు పడరానిపాట్లు పడుతున్నారు. బస్సుల కోసం ఎదురు చూడడం.. వేసవి తాపం.. గొంతు తడుపుకోవడానికి కనీసం నీటివసతి కరువు. డీహైడ్రేషన్.. బస్టాండ్, బస్టాప్‌లలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఎండవేడిమికి తట్టుకోలేక నరకం అనుభవిస్తున్నారు. -
ప్రజాస్వామ్యంలో ప్రెస్ ఫోర్త్ ఎస్టేట్
వేములవాడ: ప్రజాస్వామ్యంలో ప్రెస్ ఫోర్త్ ఎస్టేట్‌గా ఉంటూ ప్రజలకు, ప్రభుత్వాలకు వారధులుగా పనిచేస్తున్నారని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రెస్‌క్లబ్‌లోని సమావేశ మందిరాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు పాత్రికేయ మిత్రులతో 1987 నుంచి అనుబంధం ఉందని, ఒకప్పుడు రుద్రంగి నుంచి వేములవాడకు వచ్చి వార్తలు అందించిన మిత్రులు ఉన్నారని గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియాతో మంచి, చెడు రెండు ఉంటున్నాయన్నారు. త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్తలాలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే వేములవాడ ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏఐతో పొంచి ఉన్న ముప్పు – ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి పత్రికరంగంలో మార్పులు వస్తూనే ఉన్నాయని.. ప్రింట్ నుంచి ఎలక్ట్రానిక్.. ఆతర్వాత సోషల్‌మీడియా వచ్చిందని.. ఇప్పుడు ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)తో మరించి ముప్పు పొంచి ఉందని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. దేశ ప్రధాని, ఆర్థికశాఖ మంత్రి మాట్లాడినట్లు వీడియోలు వైరల్ చేస్తూ హైరానా సృష్టించిన విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏఐ, దాని పరిణామాలపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో శిక్షణ తరగతులు నిర్వహించామని, త్వరలోనే వేములవాడలో రెండు రోజులపాటు శిక్షణ తరగతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఐజేయూ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విరాహత్ అలీ మాట్లాడుతూ వేములవాడ ప్రెస్‌క్లబ్ ముందు నుంచి అన్ని రంగాల్లో ముందుందన్నారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, వైస్‌చైర్మన్ కనికరపు రాకేశ్, అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మణ్, కార్యదర్శి మహేశ్, కార్యవర్గ సభ్యులు, పాత్రికేయులు పాల్గొన్నారు. పాత్రికేయులు ప్రజాసేవకులు కరోనా తర్వాత పాత్రికేయరంగం మారింది ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌తో కలిసి ప్రెస్‌క్లబ్ సమావేశ మందిరం ప్రారంభం -
భద్రతకు భరోసా
● సింగరేణిలో సేఫ్టీ మేనేజ్మెంట్ అమలు ● ఏటా తగ్గుతున్న బొగ్గుగని ప్రమాదాలు ● ఎస్వోపీ, సీవోపీపై ప్రత్యేక దృష్టి ● ప్రతీఒక్కరికి రక్షణ పరికరం పంపిణీ ● సగానికి తగ్గిన ప్రమాదాలుగోదావరిఖని: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలోని సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది. యాజమాన్యం తీసుకుంటున్న పకడ్బందీ చర్యలు, కార్మికుల అప్రమత్తత ఇందుకు కారణమని అధికారులు వివరిస్తున్నారు. 2021 సంవత్సరంలో జరిగిన ప్రమాదాల్లో 13 మంది ఉద్యోగులు చనిపోతే.. గతేడాది ప్రమాదాల సంఖ్య సగానికి తగ్గింది. 2021లో సీరియస్ ప్రమాదాలు 122 జరిగితే.. గతేడాది 88 ప్రమాదాల్లో 88మందికి తీవ్ర గాయాలయ్యాయని సింగరేణి రికార్డులు చెబుతున్నాయి. ప్రతీ కార్మికుడికి రక్షణపై ప్రత్యేక శిక్షణ ప్రతీకార్మికునికి వృత్తి శిక్షణతోపాటు పీరియాడికల్ ట్రైనింగ్ ఇస్తూ రక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. కీలకప్రాంతాల్లోని కోల్కట్టర్లు, ట్రామర్లకు రెండేళ్ల కోసారి రీ ట్రైనింగ్ ఇస్తున్నారు. సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్వోపీ), కోడ్ ఆఫ్ ప్రాక్టీస్(సీవోపీ)పై ప్రతీఒక్కరిపై తర్ఫీదు ఇస్తున్నారు. పనిస్థలాల్లో ప్రమాదాల నియంత్రణకు పనిపై అవగాహన పెంచుకోవడం ఒక ఎత్తయితే.. కార్మికులు తమ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించడం కీలకంగా మారుతోంది. దీంతో ప్రమాదాలు తగ్గుతున్నాయి. సూపర్వైజర్లపై ప్రధాన దృష్టి పనిస్థలాలను పర్యవేక్షించే సూపర్వైజింగ్ సిబ్బందికి ప్రమాదాల నియంత్రణపై సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్(ఎస్ఎంపీ)పై శిక్షణ ఇస్తున్నారు. ప్రమాద ప్రాంతాలు సందర్శించి ఘటనకు దారితీసిన అంశాలపై అధ్యయనం చేసేందుకు రూట్‌కెనాల్ అనాలసిస్ చేపడుతున్నారు. అలాంటి ప్రమాదం పునరావృతం కాకుండా ఇది ఎంతోదోహదం చేస్తోంది. సేఫ్టీటూల్స్ వినియోగంపై.. సింగరేణిలోని అన్ని విభాగాల ఉద్యోగులకు యాజమాన్యం సేఫ్టీ మెటీరియల్ అందిస్తోంది. బూట్లు, టోపీ, లైట్తోపా పీపీఈ కిట్లు సరఫరా చేస్తోంది. ట్రేడ్స్మెన్లు, సూపర్వైజర్లు, కార్మికులు సేఫ్టీ టూల్స్ వినియోగించడంపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తోంది. ఎలక్ట్రికల్ ఉద్యోగులు విద్యుత్ షాక్‌కు గురికాకుండా ప్రత్యేకమైన షూస్ అందిస్తోంది. ఒక్కోసారి 11 కేవీషాక్ వచ్చినా తట్టుకునేలా ఈ షూస్ పనిచేస్తాయని యాజమాన్యం చెబుతోంది. మెటీయల్ తరలింపుపైనా.. భారీ యంత్ర, పరికరాలు, ఇతర వస్తువుల తరలింపుపైనా యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. లోడింగ్, అన్లోడింగ్ సందర్భంగా ప్రత్యేక జాగ్రత్త లు తీసుకుంటోంది. బరువు ఎత్తే సమయంలో సేఫ్టీ యంత్రాలు వినియోగిస్తోంది. తద్వారా ప్రమా దాలు తగ్గాయని యాజమాన్యం చెబుతోంది. భూగర్భ గనుల్లో గతంలో తరచూ ప్రమాదాలు అధికంగా జరిగేవి. పనిస్థలాల్లో రక్షణ చర్యలు పటిష్టం చేయడంతో ఇప్పుడు సత్ఫలితాలు వస్తున్నాయి. ప్రమాదాల నియంత్రణపై ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకోవడంతో వాటిసంఖ్య గణనీయంగా తగ్గింది. మానవతప్పిదాలతో ఎక్కడైనా ప్రమాదం జరిగితే నియంత్రణకు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ద్వారా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ప్రమాద ప్రాంతాలకు సూపర్వైజర్లను పంపించి రూట్‌కెనాల్ అనాలసిస్ ద్వారా నివేదిక తయారు చేస్తున్నారు. అలాంటి ప్రమాదాలు పునావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. -
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
జిల్లా సమాచారం ● ఊపందుకుంటున్న వరి కోతలు ● ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలివస్తున్న వడ్లుపెద్దపల్లిరూరల్: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వరికోతలు పూర్తి చేసిన రైతులు వడ్లను కొనుగోలు కేంద్రాలకు తరలించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈసారి కూడా హార్వెస్టర్లతోనే వరి కోతలు ముమ్మరం చేశారు. దిగుబడి అంచనా 4.50లక్షల మెట్రిక్ టన్నులు జిల్లాలో ఈసారి 1,98,201 ఎకరాల్లో వరి సాగైంది. సుమారు 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అఽధికారులు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందుబాటులో ప్యాడీ క్లీనర్లు.. నిబంధనలకు అనుగుణంగా ధాన్యంలో చెత్తాచెదారం, మట్టిపెళ్లలు తొలగించేందుకు ప్యాడీ క్లీనర్లు, తూర్పార పట్టేయంత్రాలు, తేమశాతం నిర్ధారించే పరికరాలు, తూకం యంత్రాలు సిద్ధం చేశామని అధికారులు వివరించారు. పాత పద్ధతిన ధాన్యం శుభ్రం చేసే యంత్రాలు 521 ఉండగా, లేటెస్ట్ టె క్నాలజీతో కూడిన మరో 154 ప్యాడీ క్లీనర్లు అందుబాటులోకి తీసుకొచ్చామని వారు తెలిపారు. వీటిని అత్యధికంగా ధాన్యం నిల్వలు ఉండే కొనుగోలు కేంద్రాల్లో వినియోగిస్తామని వారు వివరించారు. 1.12 కోట్ల గన్నీ సంచులు అవసరం.. ధాన్యం కోసం దాదాపు 1.12 కోట్ల గన్నీ సంచులు అవసరమవుతాయని అంచనా వేశారు. ప్రస్తుతానికి 20 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయని, అవసరాన్ని బట్టి మరిన్నొ తెప్పిస్తామని పేర్కొన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించేందుకు 150 లారీలను సిద్ధం చేశారు. హమాలీలను అందుబాటులో ఉంచారు. కొనుగోలు కేంద్రాలు 324 వరి సాగు విస్తీర్ణం(ఎకరాల్లో) 1,98,201 దిగుబడి అంచనా(మెట్రిక్ టన్నుల్లో) 4,50,000 ప్యాడీ క్లీనర్లు(పాతవి) 521 ప్యాడీ క్లీనర్లు(ఆధునికమైనవి) 154 అవసరమయ్యే గన్నీ సంచులు 1,12,00,000 అందుబాటులో ఉన్నవి 20,00,000 రవాణా కోసం సిద్ధం చేసిన లారీలు 150 -
ప్రజలు ఓట్లు వేస్తేనే మంత్రి పదవి వచ్చింది
● మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ రామగిరి(మంథని): కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేస్తేనే మంత్రి పదవి వచ్చిందని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తించాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సూచించారు. సెంటినరీకాలనీ తెలంగాణ చౌరస్తాలోని అసంపూర్తి కల్వర్టు పనులను ఆయన మంగళవారం పరిశీలించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా అభివృద్ధి పనులు చేయడంలో మంత్రి విఫలమయ్యారన్నా రు. అయినా, మళ్లీ శిలాఫలకాలు వేస్తున్నారని, కమాన్‌పూర్ తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారని విమర్శించారు. ముందుగా మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయా లని హితవు పలికారు. ఓడేడు వంతెన గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఓటు విలువ తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ, నా యకులు శంకేశీ రవీందర్, కాపురబొయిన భాస్కర్, కుమార్ యాదవ్, అల్లం తిరుపతి, దేవ శ్రీనివాస్, కొండవేన ఓదేలు, బుర్ర శంకర్, బుద్దె ఉదయ్, రోడ్డ శ్రీనివాస్, కలవేన సదానందం పాల్గొన్నారు. -
నిర్మాణ రంగంపై ధరల ప్రభావం
సుల్తానాబాద్(పెద్దపల్లి): పెరిగిన సిమెంట్ ధరలు నిర్మాణ రంగంపై ప్రభావం చూపుతాయని పలు వురు ఇళ్ల నిర్మాణదారులు పేర్కొంటున్నారు. బ్రాండ్‌ను బట్టి బస్తాపై రూ.70 నుంచి రూ.100 వరకు ధర పెరిగింది. అసలే వేసవి కావడంతో ఇళ్ల నిర్మా ణం జోరుగా సాగుతోంది. పెరిగిన సిమెంట్ ధరలతో తమపై మరింత ఆర్థిక భారం పడుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 28మంది డీలర్లు.. జిల్లాలో సిమెంట్ హోల్‌సేల్ డీలర్లు సుమారు 28 మంది వరకు ఉన్నారు. వీరికితోడు పట్టణాలు, గ్రా మాల్లో రిటైల్ డీలర్లు కూడా వ్యాపారం సాగిస్తున్నా రు. అయితే, అధిక స్టాక్ హోల్‌సేల్ డీలర్లు తెప్పించుకుని నిల్వ చేసుకుంటారు. సిమెంట్ పరిశ్రమ యజమానులు ధరలు పెంచడంతో డీలర్లు సైతం చేసేదేమీలేక పెంచిన ధరలు అమలు చేస్తున్నారు. రెండేళ్లుగా నిలకడగానే.. సుమారు రెండేళ్ల నుంచి సిమెంట్ ధరలు నిలకడగానే ఉంటున్నాయని, అయితే, ఈనెలలోనే ధరలు ఒక్కసారిగా పెరిగాయని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. ఈ ప్రభావం రిటైల్ రంగంపై ఉంటుందని వారు అంటున్నారు. ఒక్కోబస్తాపై గతంలో రూ.250 ధర ఉండగా ఈనెలలో రూ.280 – రూ.390 వరకు ధర పలుకుతోంది. బ్రాండ్, నాణ్య తను బట్టి ఈ ధరల్లో హెచ్చుతగ్గులూ ఉంటున్నా యి. మరోవైపు.. స్టీల్ ధరలు సైతం క్వింటాల్‌కు రూ.6,500 నుంచి రూ.8,000 వరకు పలుకుతోందని ఇళ్ల నిర్మాణదారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిర్మాణాలపైనా ప్రభావం.. జిల్లాలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, పె ద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. పెరిగిన సిమెంట్ ధరలు వీటిపై ప్రభావం చూపే అవకాశం ఉందని కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అంటున్నారు. పెరిగిన సిమెంట్ ధరలు ఒక్కో బస్తాపై రూ.100 వరకు పెంపుసబ్సిడీపై ఇవ్వాలి నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. నిర్మాణం పూర్తిచేసేందుకు సిమెంట్ అవసరం. ఇప్పుడు సిమెంట్ ధర పెరి గింది. ఇది మాకు ఆర్థికంగా భారం అవుతుంది. ప్రభుత్వమే ఆలోచన చేసి రాయితీపై సిమెంట్ అందించాలి. – దాసరి రాజమల్లు, ఇందిరమ్మ లబ్ధిదారు, కాట్నపల్లి -
సమస్యల పరిష్కారానికే ‘భూభారతి’
● రేపటి నుంచి అవగాహన సదస్సులు ● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం ‘భూభారతి’ ఆర్వోఆర్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి అధికారులతో భూభారతి అమలు తీరుపై సమీక్షించారు. ఈనెల 17 నుంచి 30వరకు భూ భారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీరోజు కనీసం రెండు గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పెండింగ్ ధరణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్, మార్కింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, తహసీల్దార్లు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లుండొద్దు.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు ఉండొద్దని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. అర్హులైన పేదలకే ఇళ్లు కేటాయించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించిందని, అందులో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో మంజూరు చేశామని, మిగతా వాటిని అర్హులైన వారికి కేటాయించాలన్నారు. ఈనెల 22 నుంచి 30 వ తేదీ వరకు మరోసారి క్షేత్రస్థాయి తనిఖీ చేయాలని ఆయన చెప్పారు. అనర్హులను జాబితా నుంచి తొలగించాలన్నారు. ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, డీఆర్డీవో కాళిందిని, డీపీవో వీరబుచ్చయ్య, సీఈవో నరేందర్ పాల్గొన్నారు. తాగునీటి ఇబ్బందులు రావొద్దు.. వేసవి ముగిసే వరకూ ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయాలని ఆయన అన్నారు. తాగునీటి సమస్యలు ఉంటే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇందుకోసం నిధులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. గ్రిడ్ ఈఈ పూర్ణచందర్రావు, ఇంట్రా ఈఈ గంగాధర శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. -
వసతులు కల్పించాలి
కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలి. ఎండ తీవ్రత అధికంగా ఉంది. నీడ కోసం పందిర్లు వేయించాలి. తాగునీటి వసతి కల్పించాలి. నాణ్యతను బట్టి ధాన్యం తూకం వేసేలా అధికారులు చొరవ చూపాలి. – వేణుగోపాల్‌రావు, రైతు, నిట్టూరు సాఫీగా కొనుగోళ్లు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందుల్లేకుండా కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకున్నాం. కనీస వసతులు కల్పిస్తాం. రైతులు కూడా నాణ్యమైన ధాన్యం తీసుకొస్తే త్వరగానే తూకం వేసేందుకు వీలు ఉంటుంది. – ప్రవీణ్, డీఎం, సివిల్ సప్లయీస్ సమస్యలుంటే చెప్పండి కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు విక్రయించి రైతులు మద్దతు ధర పొందాలి. ఒక్కగింజ కూడా దండి కొట్టకుండా కొనుగోలు చేస్తారు. ఏమైనా సమస్యలు తలెత్తితే నా దృష్టికి తీసుకురండి. వాటిని సత్వరమే పరిష్కరిస్తాం. – విజయరమణారావు, ఎమ్మెల్యే, పెద్దపల్లి -
పత్తి రైతుపై విత్తన భారం
● పెరిగిన ధరలతో అన్నదాతల్లో ఆందోళన ● ప్యాకెట్ ధర ప్రస్తుతం రూ.864 ● వచ్చే వానాకాలం నుంచి రూ.901 సాక్షి, పెద్దపల్లి: వచ్చే వానాకాలం నుంచి పత్తి రైతులపై విత్తన ధరలు ఆర్థికభారం కానున్నాయి. విత్తనాల ధర పెంపుతో మోయలేని భారం పడనుంది. ఇప్పటికే పత్తి సాగులో రైతులు అనేక వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్నారు. ఏటా దిగుబడి తగ్గుతుండగా.. పెరుగుతున్న పెట్టుబడులు, ప్రకృతి వైపరీత్యాలు, ఎరువుల ధరలు అన్నదాతలను సతమతం చేస్తున్నాయి. ఇవి చాలవన్నట్లు ప్రస్తుతం పెరిగిన ప త్తి విత్తన ధరలు పిడుగులా తయారయ్యాయి. 475 గ్రాములు.. రూ.901 కేంద్ర వ్యవసాయ శాఖ పత్తి విత్తన ప్యాకెట్(475 గ్రాములు)ధరను రూ.901గా నిర్ణయిస్తూ ఇటీవల ప్రకటన విడుదల చేసింది. పత్తి పంట సాగులో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న తాము పెరిగిన విత్తన ధరతో మరింత నష్టపోవాల్సి వస్తుందని అ న్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రెండెకరాల విస్తీర్ణంలో పత్తి సాగుకు 475 గ్రా ముల 5 ప్యాకెట్లు అవసరమవుతాయి. జూన్ మొద టి, రెండోవారంలో విత్తనాలు వేస్తుండగా.. అక్టోబ రు చివరివారంలో దిగుబడి ప్రారంభమవుతుంది. ఎకరా పత్తి సాగుకు దాదాపు రూ.40 వేల – రూ.50 వేల దాకా ఖర్చు చేస్తున్నా గిట్టుబాటు కావడం లేద ని రైతులు వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు పత్తి విత్తనాలకు సబ్సిడీ ఇచ్చి రైతులు న ష్టపోకుండా చూడాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. విత్తన ధరలు (475 గ్రాములు ప్యాకెట్ రూ.లలో) సంవత్సరం ధర 2021 767 2022 810 2023 853 2024 864 2025 901 -
పతకాలు సాధించిన విద్యార్థులకు ప్రశంసలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు జాతీయ కరాటే పోటీల్లో బంగారు పతకాలు సాధించారని కరాటే మాస్టర్ సతీశ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ఆరో జాతీయస్థాయి కుంగ్ ఫూ చాంపియన్‌షిప్ – 2025లో స్థానిక గవర్నమెంట్ హైస్కూల్‌కు చెందిన చరిష్మా, మీనాక్షి, మేఘన, సంరక్షిత, మైథిలి, అభినయ్, విజ్ఞాన్ హైస్కూల్‌కు చెందిన విఘ్నేష్, సాయికార్తీక్, కీర్తన, హరిణి, శ్రీహర్షిణి వివిధ విభాగాల్లో బంగారు, వెండి పతకాలు సాధించారని ఆయన వివరించారు. విద్యార్థులను ప్రభుత్వ హైస్కూల్ హెచ్ఎం రత్నాకర్‌రెడ్డి తదితరులు అభినందించారు. -
రాజ్యాంగ స్ఫూర్తితోనే‘ప్రజాపాలన’
మంథని/గోదావరిఖనిటౌన్/పాలకుర్తి/పెద్దపల్లిరూరల్/కమాన్‌పూర్/: రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాసంక్షేమం ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంథని పట్టణంతోపాటు ముత్తారంలోని వివిధ ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు మంత్రి శ్రీధర్‌బాబు, కలెక్టర్ కోయ శ్రీహర్ష తదితరులు హాజరయ్యారు. తొలుత అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించడంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చేసిన కృషి ఎంతో ఉందన్నారు. జిల్లా కేంద్రంలో అంబేడ్కర్‌కు నివాళి అర్పించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ.. ఆ తర్వాత అమర్‌నగర్‌లోని ఓ హోటల్ వద్ద టీతాగారు. మంథని, కమాన్‌పూర్, ధర్మారం తదితర మండలాల్లో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సభల్లో పాల్గొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు జిల్లా కేంద్రంతోపాటు ఎలిగేడు, జూలపల్లి, సుల్తానాబాద్ తదితర మండలాల్లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో సీపీ అంబర్ కిశోర్ ఝా, గోదావరిఖని జీఎం ఆఫీసు గ్రౌండ్లో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టులో జనరల్ మేనేజర్ అలోక్ కుమార్ త్రిపాఠి, ఆర్ఎఫ్సీఎల్లో సీజీఎం ఉదయ్ రాజహంస తదితరులు అంబేడ్కర్‌కు నివాళి అర్పించారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. గోదావరిఖని మున్సిపల్ కార్యాలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పాలకుర్తి మండలంలోని వివిధ గ్రామాల్లోనూ ఆయన పాల్గొని ప్రసంగించారు. నాయకులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్‌కు నివాళి
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి సోమవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతావని రాజ్యాంగాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించారని, ఈమేరకు ఆయన జయంతిని నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. ఎస్సీ వెల్పేర్ ఆఫీసర్ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీఐఎస్ఎఫ్ సేవలు భేష్ జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ– రామ గుండం తెలంగాణ ప్రాజెక్టులో సీఐఎస్ఎఫ్ చేస్తున్న భద్రతా చర్యలు భేషుగ్గా ఉన్నాయని జీఎం అలోక్ కుమార్ త్రిపాఠి అన్నారు. ప్రాజెక్టులోని సీఐఎస్ఎఫ్ వింగ్ సోమవారం ఏర్పా టు చేసిన కార్యక్రమంలో సీనియర్ కమాండెంట్ అరవింద్ కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. అగ్నిమాపక దినోత్సవం సందర్భంగా వారంపాటు వివిధ విభాగాల్లో పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. డిప్యూటీ కమాండెంట్ (అగ్నిమాపక) వీకే శాస్త్రి, ఏజీఎం(హెచ్ఆర్) బిజయ్‌కుమార్ సిగ్దర్, అధికారులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. 17న సీఎంపీఎఫ్ ట్రస్ట్‌బోర్డు సమావేశం గోదావరిఖని: సీఎంపీఎఫ్ ట్రస్ట్‌బోర్డు సమావేశం ఈనెల 17న న్యూఢిల్లీలో జరగనున్నట్లు బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య తెలిపారు. బీఎంఎస్ తరఫున లక్ష్మారెడ్డి కొత్తకాపు, ఆశిష్మూర్తి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సీఎంపీఎఫ్‌లో జరిగిన అవినీతి, అక్రమాలు, కనీస పింఛన్ రూ.5వేలు చెల్లించడం తదితర అంశాలపై ఇందులో చర్చిస్తారని పేర్కొన్నారు. సీఎంపీఎఫ్ ఆన్లైన్ చేయడం, రివైజ్డ్ పీపీవోలు, పింఛన్ ఫండ్ పెంపు, స్థిరీకరణ, పింఛన్ ఫండ్‌కు నిధులు, కాంట్రాక్ట్ కార్మికులకు తప్పనిసరిగా సీఎంపీఎఫ్ వర్తించేలా సమావేశంలో ప్రస్తావిస్తారని ఆయన వివరించారు. -
అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు
మంథని/ముత్తారం: ఇళ్లులేని అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నా రు. ఇళ్ల మంజూరులో పైరవీలకు తావులేదన్నారు. మంథని, ముత్తారం మండలాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. మంథని మండలం ఎక్లాస్పూర్ – ముత్తారం – ఖమ్మంపల్లి రోడ్డు పునరుద్ధరణకు రూ.11.90 కోట్లు, ఖమ్మంపల్లి – ఓడేడు వరకు 15 కి.మీ. బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.30 కోట్లు, మంథని – ఓడేడు వరకు 19 కి.మీ. బీటీ రోడ్డు పనులకు రూ.60 కోట్లు వెచ్చించి పనులు చేపట్టామని మంత్రి అన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం, సులభమైన ప్రయాణం కోసం రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. భగుళ్లగుట్ట వరకు భక్తులు సులభంగా ప్రయాణం చేసేందుకు రూ.2 కోట్లతో రోడ్డు నిర్మిస్తున్నామని, విద్యుత్ లైన్ పనులు పూర్తిచేసుకున్నామని మంత్రి తెలిపారు. మంథనిలో రూ.కోటి ఖర్చు చేస్తూ అన్ని హంగులతో ఎస్సీ కమ్యూనిటీహాల్ నిర్మిస్తామని, ఇందులో చిన్న గ్రంథాలయం, స్టడీ సర్కిల్ ఏర్పాటు చే స్తున్నామని అన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, ఆర్అండ్ బీ ఎస్ఈ కిషన్‌రావు, ఈఈ భావ్‌సింగ్, ఆర్డీవో సురేశ్, నాయకులు కొత్త శ్రీని వాస్, శశిభూషణ్ కాచే, తొట్ల తిరుపతి, పెండ్రు రమాదేవి, ఐలి ప్రసాద్, వొడ్నా ల శ్రీనివాస్, మంథని సత్యం, చోప్పరి సదానందం, దొడ్డ బాలాజీ, మద్దెల రాజయ్య, గోవిందుల పద్మ, యాదగిరిరావు, ఏలువాక కొమురయ్య, మామిడిపల్లి బాపన్న, రాయమల్లు, మాతంగి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
అజాత శత్రువు శ్రీపాదరావు
● రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ గోదావరిఖని: అజాత శత్రువు దుద్దిళ్ల శ్రీపాదరావు అని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా స్థాని క బస్టాండ్ ఎదుట ఉన్న శ్రీపాదరావు విగ్రహానికి ఆదివారం ఆయన పూలమాల వేసి ఘనంగా నివా ళి అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, శ్రీపాదరా వు రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని అ న్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయన చేసిన సే వలు చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్, పెద్దెల్లి ప్రకా శ్, తిపారపు శ్రీనివాస్, రాజిరెడ్డి పాల్గొన్నారు. హనుమాన్ విగ్రహ పనుల పరిశీలన రామగుండం: రామునిగుండాల కొండపై చేపట్టిన 108 అడుగుల విగ్రహ నిర్మాణ ప్రగతిని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ శనివారం రాత్రి పరిశీలించారు. పనుల్లో పురోగతి, బడ్జెట్, సాంకేతిక అంశాలపై అధికారులతో చర్చించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గాలిపెల్లి తిరుపతి, నాయకులు కాంతాల శ్రీనివాస్‌రెడ్డి, సంగణవేణి శేఖర్ పాల్గొన్నారు. -
గుట్టపై గంగమ్మ
● ఒకప్పటి నేరెళ్ల .. నేటి రైతుల జీవనేల ● ప్రకృతికి అనుగుణంగా పంటల సాగు ● వీరునితండా గిరిజనుల ఆదర్శ సాగుసిరిసిల్ల: ఎత్తయిన గుట్టలు.. కాకులు దూరని కారడవి.. మధ్యలో ఉంటుంది వీరునితండా. ఏంటి ఈ తండా ప్రత్యేకత అనుకుంటే.. అంతకుమించి విజయగాథ ఉంది. వీరుని తండా రైతులు ఒక్కబోరు కూడా వేయించకుండానే వ్యవసాయం చేస్తున్నారు. 196 ఎకరాల్లో 36 బావుల ఆధారంగా పంటలు పండిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలకొద్ది ఫీట్ల లోతులో బోర్లు వేయిస్తూ అప్పులపాలవుతున్న రైతులను చూశాం. కానీ వీరునితండా రైతులు ప్రకృతి ఇచ్చిన కానుకను అందిపుచ్చుకొని వ్యవసాయబావులు.. వర్షాధారంగా పంటలు పండిస్తున్నారు. వీరునితండా రైతుల విజయగాథ.. 8లోu -
వేలానికి మా యూనియన్ వ్యతిరేకం
బొగ్గు గనుల వేలంలో సింగరేణి యాజమాన్యం పాల్గొనడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. సింగరేణిలో కార్మికుల ఓట్లతో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందిన నాయకులు వేలానికి అనుకూలంగా మంత్రికి లేఖ ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిద్వారా సంస్థకు తీరని అన్యాయం జరుగుతుంది. – తుమ్మల రాజారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, సీఐటీయూ మంత్రిని కలుస్తాం గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు వేలానికి అనుకూలంగా లేఖ ఇవ్వడం సరికాదు. గతంలో డిప్యూటీ సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విన్నవిస్తాం. ఇప్పటికే ఐక్యవేదిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. గెలిచిన కార్మిక సంఘాల తీరును ఎండగడుతాం. భవిష్యత్‌లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. – రియాజ్ అహ్మద్, ఐక్య వేదిక కన్వీనర్ -
వైభవంగా నృసింహుని రథోత్సవం
జూలపల్లి(పెద్దపల్లి): పెద్దాపూర్ శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో ఆదివారం ర థోత్సవం నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు, ప్రతినిధులు సురేశ్‌రెడ్డి, గొట్టెముక్కుల రజని, జెల్ల శేఖర్‌యాదవ్, నర్సింహ యాదవ్, భారతి పాల్గొన్నారు. ఆకట్టుకున్న గాంధీ వేషధారణ జాతరలో దుకాణాలు ఏర్పాటు చేశారు. కొంద రు వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఓ బాలు డు మహాత్ముడి వేషధారణతో ఆకట్టుకున్నాడు. ఓదెల మల్లన్నకు పట్నాలు ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి స న్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఉ మ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు మహారాష్ట్ర నుంచి కూడా పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఒగ్గు పూజారులతో స్వామివారికి పట్నాలు వేయించారు. ఆలయ జూనియర్ అసిస్టెంట్ కుమారస్వామి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ప్రజాసమస్యల్ని ఎత్తిచూపారుగోదావరిఖనిటౌన్: నిస్పక్షపాతంగా, నిర్భయంగా వార్తలు రాసి కార్మిక, ప్రజాసమస్యలను ఎ త్తిచూపిన కలం యోధుడు కేపీ రామస్వామి అ ని పలువురు వక్తలు అన్నారు. సీనియర్ జర్న లిస్ట్ కేపీ రామస్వామి వర్ధంతి సందర్భంగా ఆదివారం నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. జ్యోతి ఫౌండేషన్ నిర్వహణలో కేపీ రామస్వామి కుటుంబ సభ్యులు స్థానిక బస్టాండ్ సమీపంలోని ప్రగతి నిరాశ్రయుల ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. విఠల్‌నగర్ లోని అమ్మపరివార్ ఆశ్రమంలో అన్నదానం చే శారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు పూదరి కూమార్ మాట్లాడుతూ, నిజాలను నిర్భయంగా రాసిన జర్నలిస్టు కేపీ రామస్వామి అని అన్నారు. ప్రతినిధులు సుభద్ర, కేపీ శ్రీనివాస్, కేపీ రాజ్‌కుమార్, మొగిలిపాక శ్రీనివాస్, జనగామ గట్ట య్య, తిరుపతిరెడ్డి, కుమార్, దండె విజయ్‌కుమార్, దబ్బెట శంకర్, కరాటే శ్రీనివాస్, మూ ల శంకర్, శివ, శ్రీనివాస్ఽ, ధరణి వంశీ, ఆశ్రమ నిర్వాహకులు నాగరాజు, కరణ్ పాల్గొన్నారు. నూతన కార్యవర్గం పెద్దపల్లిరూరల్: జిల్లా కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసి యేషన్ ఎన్నికలు ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. పెద్దపల్లికి చెందిన మాడూరి వినోద్ వరుసగా మూడోసారి ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. స్థానిక న్యాయవాది ఉప్పు రాజు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అధ్యక్షుడిగా వినోద్, ప్రధాన కార్యదర్శిగా కె.రాజేందర్, కోశాధికారిగా పోలు సతీశ్ ఎన్నిౖకైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ‘కాలనీ’లో క్రైస్తవుల ర్యాలీ యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): స్థానిక సీ ఎస్ఐ సెయింట్ జాన్స్ చర్చిలో క్రైస్తవులు మ ట్టల ఆదివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం చర్చి ఆవరణను శుభ్రం చేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్ కెబ్యులా వాట్సప్ మాట్లాడారు. ఈకార్యక్రమంలో చర్చి కమిటీ సభ్యులు, విద్యార్థులు, క్రైస్తవులు పాల్గొన్నారు. -
కోతలు లేకుండా కొనుగోళ్లు
● చివరి గింజవరకూ ధాన్యం సేకరిస్తాం ● సన్నవడ్లకు బోనస్‌తో రైతుల్లో సంబురం ● ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని/కమాన్‌పూర్/రామగి రి: రైతులు త మ పంట అమ్ముకునేందు కు అసౌకర్యం కలుగకుండా ఏ ర్పాట్లు చేస్తున్నామని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించా రు. జూలపల్లిలో కమాన్‌పూర్ పీఏసీఎస్ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు ప్రారంభించారు. మంథని, రామగిరి, కమాన్‌పూర్ తదితర ప్రాంతాల్లో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపా దరావు వర్ధంతి సభల్లో ఆయన పాల్గొని శ్రీపాదరా వుకు ఘనంగా నివాళి అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుల కష్టాలు దూరమయ్యాయ న్నారు. గతప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో క్వింటాల్‌పై 4కిలోల కోత విధించిందని, ఇప్పు డు గింజ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చే స్తూ, రైతుల బ్యాంకు ఖాతాల్లో వెంటనే డబ్బులు జ మచేస్తున్నామన్నారు. సన్నవడ్లకు రూ.500 బోనస్ చెల్లించడంతో రైతుల్లో సంబురం నెలకొందన్నారు. ప్రతినిధులు శ్రీనివాస్, ప్రకాశ్‌రెడ్డి, రాజబాబు, సతీశ్‌కుమార్, ఓదెలు, కిషన్‌రెడ్డి, లక్ష్మి ఉన్నారు. -
అంబేడ్కర్ మార్గం అనుసరణీయం
పెద్దపల్లిరూరల్/రామగుండం/సుల్తానాబాద్: అంబేడ్కర్ చూపిన మార్గం అనుసరణీయమని బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్, జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. పెద్దపల్లిలో ఆదివారం అంబేడ్కర్ విగ్రహాన్ని శుద్ధి చేశారు. సంజీవరెడ్డి రా మగుండంలో ఈ కార్యక్రమం చేపట్టారు. నాయకు లు ఠాకూర్ రాంసింగ్, మోర మనోహర్, అరుణ్, స తీశ్, సదానందం, శ్రీనివాసరావు, దిలీప్‌కుమార్, చ క్రధర్రెడ్డి, రాజేందర్, రమేశ్, నర్సింగం, మంథని కృష్ణ, రవి, వంశీ, రవీందర్, వెంకటేశం ఉన్నారు. కాగా, సుల్తానాబాద్‌లో ఈనెల 15న నిర్వహించే బీ జేపీ ఆత్మీక సమ్మేళనానికి ఎమ్మెల్సీలు కొమురయ్య, అంజిరెడ్డి హాజరవుతారని సంజీవరెడ్డి తెలిపారు. -
కటింగ్‌లకు కాలం చెల్లింది
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కాల్వశ్రీరాంపూర్/పెద్దపల్లిరూరల్/ఎలిగేడు/ఓదె ల: ‘కాంగ్రెస్ సర్కార్ వచ్చింది.. ధాన్యం దోపిడీ ఆ గింది.. గత ప్రభుత్వాలు ధాన్యం బస్తాల తూకంలో మోసం, కటింగ్‌లు చేశాయి.. ఇప్పుడు వాటికి కా లం చెల్లింది’ అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలం అంకంపల్లె, మడిపెల్లికాలనీ, పాతమడిపెల్లి, ఆశన్నపల్లె, పెగడపల్లి, కాల్వశ్రీరాంపూర్‌లో ఆదివారం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. పెద్దపల్లి మండలం హన్మంతునిపేట, కొత్తపల్లిలో క్రికెట్ పోటీల కు హాజరయ్యారు. ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు తానిపర్తి కాంతారావు సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఓదెల మండలం కొలనూర్‌లో మహనీయుల జయంతిలో పా ల్గొన్నారు. సుల్తానాబాద్‌లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో ఆయన మా ట్లాడారు. కాంగ్రెస్ పాలనలో చి‘వరి’ భూములకూ సాగునీరు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. -
టెండర్లలో పాల్గొనాల్సిందే..
సింగరేణిలో చాలా బొగ్గు గనులు మూతపడే స్థితికి చేరాయి. ప్రస్తుత కార్మికులతోపాటు మరోతరానికి ఇందులో ఉపాధి కల్పించేలా చూడాలి. అందుకే కొత్త బొగు ్గగనులు తప్పనిసరి. ఇందుకోసం సింగరేణి వేలంలో పాల్గొనాల్సిందే. ఈ విషయంపై గనుల శాఖ మంత్రి భట్టి విక్రయార్కకు ఇటీవల మేం లేఖ అందజేశాం. – వాసిరెడ్డి సీతారామయ్య, అధ్యక్షుడు, ఏఐటీయూసీ సంస్థ భవిష్యత్ కోసమే.. కొత్తగనులు రావాలంటే టెండర్లలో పాల్గొనాల్సిందే. దీనికి కేంద్రప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. సింగరేణి భవిష్యత్ కోసం కొత్తగనులు తప్పనిసరి. ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడాలి. లేకుంటే వేలాది మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుంది. – జనక్‌ప్రసాద్, సెక్రటరీ జనరల్, ఐఎన్టీయూసీ -
సత్వర చికిత్స.. సింగరేణి భరోసా
● ధీర్ఘకాలిక వ్యాధుల జాబితాలో ‘లివర్ సిర్రోసిస్’ ● ఆమోదించిన కోలిండియా యాజమాన్యం ● సింగరేణి కార్మికులకు ఎంతోప్రయోజనం నిర్ణయం సంతోషం లివర్ సిర్రోసిస్ను ధీర్ఘకాలిక వ్యాధుల జాబితాలో చేర్చడం సంతోషకరం. ఈ నిర్ణయం బాధితులకు ఎంతోఊరటనిస్తుంది. సింగరేణి అండగా ఉంటుందనే భరోసా ఉంటుంది. – కల్లూరి రాజయ్య, ఈపీ ఆపరేటర్, ఓసీపీ–3 అనేక ప్రయోజనాలు కోలిండియా యాజమాన్యం లివర్ సిర్రోసిస్ను ధీర్ఘకాలిక వ్యాధుల జాబితాలో చేర్చడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. కాలేయం పనిచేయని వారికి సరైన సమయంలో సరైన చికిత్స అందుతుంది. – మేడ రాంమూర్తి, ఎంవీ డ్రైవర్, జీడీకే–5 ఓసీపీ దీర్ఘకాలిక వ్యాధులు ఇవే.. ● గుండె సంబంధిత, టీబీ, కాన్సర్, లెప్రసీ, పక్షవాతం, మూత్రపిండ సంబంధిత, హెచ్ఐవీ, మెదడు సంబంధిత, తాజాగా లివర్ సిర్రోసిస్.. గోదావరిఖని: బొగ్గు గని కార్మికుల ధీర్ఘకాలిక వ్యాధుల జాబితాలో లివర్ సిర్రోసిస్ వచ్చి చేరింది. కోలిండియా యాజమాన్యం ఈవ్యాధిని అధికారికంగా ఆమోదించింది. దీంతో బొగ్గు గని కార్మికులకు ప్రత్యేక వేతనంతో కూడిన సెలవు పొందే అవకాశం లభించింది. ఇప్పటివరకు ఉన్న వ్యాధులకు తోడు మెడికల్ అటెండెన్స్ రూల్స్ ప్రకారం దీర్ఘకాలిక వ్యాధుల జాబితాలో లివర్ సిర్రోసిస్ను కూడా చేర్చింది. దీంతో సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 40వేల మంది పైచిలుకు కార్మికులకు దీని ద్వారా ప్రయోజనం కలుగనుంది. దీర్ఘకాలిక వ్యాధుల బారినపడితే.. బొగ్గు గనుల్లో పనిచేస్తూ దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడితే సింగరేణి సంస్థ వైద్యం కోసం అయ్యే పూర్తి ఖర్చులు భరించనుంది. ఇప్పటివరకు బొగ్గుగని కార్మికులకు గుండె సంబంధిత, టీబీ, కాన్సర్, లెప్రసీ, పక్షవాతం, మూత్రపిండ సంబంధిత, హెచ్ఐవీ, మెదడు సంబంధిత వ్యాధులకు అయ్యే వైద్య ఖర్చులను యాజమాన్యం భరిస్తోంది. కోలిండియా యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందంతో తాజా గా లివర్ సిర్రోసిస్‌కు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తద్వారాఈవ్యాధి బారిన పడిన సింగరేణి ఉద్యోగులు పలు ప్రయోజనాలు పొందనున్నారు. కార్మిక సంఘాల డిమాండ్ మేరకు.. గతేడాది డిసెంబర్ 12న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో జరిగిన 11వ నేషనల్ కోల్‌వేజ్ ఒప్పందం నాలుగో స్టాండర్డరైజేషన్ సమావేశంలో లివర్ సిర్రోసిస్ను కూడా ధీర్ఘకాలిక వ్యాధుల జాబితాలో చేర్చాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశా యి. ఈక్రమంలో దీనికి కోలిండియా యాజమా న్యం అంగీకరించింది. దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించిన విధంగా లివర్ సిరోసిస్ను కూడా లిస్టులో చేర్చారు. ఈమేరకు సింగరేణి సంస్థ మెడికల్ బోర్డు మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ ఆస్పత్రికి పంపించేందుకు అంగీకరించింది. మిగతా వాటి మాదిరిగానే.. తాజా నిర్ణయం ద్వారా లివర్ సిర్రోసిస్ వ్యాధిని మె డికల్ బోర్డు నిర్ధారణ చేసేవరకు బాధితుడికి ప్ర త్యేక సెలవు మంజూరు చేసి 50 శాతం (మూల వేతనం+ వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్+ స్పెషల్ డియర్ నెస్ అలవెన్స్) చెల్లించనున్నారు. దీంతో ప్రత్యేక సెలవుతో కూడిన వేతనం చెల్లించనున్నారు. లివర్ సిర్రోసిస్ అంటే.. లివర్(కాలేయ)సిర్రోసిస్ అనేది దీర్ఘకాలిక సమస్య. కాలేయ సంబంధిత వ్యాధులు, మద్యపానంతో వ స్తుంది. కాలేయం మచ్చ కణజాలాలు(ఫైబ్రోసిస్) పెరిగి లివర్ సిర్రోసిస్‌కు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది చివరి దశ. శరీరంలోని హానికర వ్యర్థాలను తొలగించి, రక్తాన్ని శుభ్రం చేయడంలో కాలేయం కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యమైన పోషకాలను తయారు చేస్తుంది. సింగరేణి ప్రాంతంలో ఈ వ్యాధి బారినపడేవారి సంఖ్య అధికంగా ఉంటోందని డాక్టర్లు వివరిస్తున్నారు. ప్రధానంగా ఆల్కహాల్, వైరల్ డిసీజ్, ఫ్యాటీ లివర్‌తో ఈ వ్యాధి బారినపడుతున్నారని అంటున్నారు. బాధితులు ఎక్కువే లివర్ సిర్రోసిస్ వ్యాధి బారిన పడుతున్న సింగరేణి కార్మికుల సంఖ్య ఎక్కువగానే ఉంది. దీర్ఘకాలికంగా ఆల్కాహాల్ తాగితే లివర్ సిర్రోసిస్ బారినపడతారు. వైరల్ ఇన్ఫెక్షన్, ఫ్యాటీ లివర్‌తో లివర్ దెబ్బతిని ఈ వ్యాధికి దారితీస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే లివర్ బండగా మారి ఫంక్షనింగ్ ఆగిపోతుంది. – డాక్టర్ కిరణ్‌రాజ్‌కుమార్, సీఎంవో, సింగరేణి బీఎంఎస్ కృషితోనే.. మా యూనియన్ కృషితోనే లివర్ సిర్రోసిస్ దీర్ఘకాలిక వ్యాధుల జాబితాలో చేర్చారు. యూనియన్ బొగ్గు ప రిశ్రమల ఇన్చార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి గతేడాది జరిగిన సమావేశంలో ఈ డిమాండ్ చేశారు. దీంతో కోలిండియా యాజమాన్యం అంగీకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కార్మికుల సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం చేస్తాం. – యాదగిరి సత్తయ్య, బీఎంఎస్ అధ్యక్షుడు -
బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి
● పార్టీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి పెద్దపల్లిరూరల్: రాష్ట్రాభివృద్ధి తమ పార్టీతోనే సా ధ్యమని, ప్రజలు తమకే మద్దతుగా నిలవాలని బీ జేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, మాజీ ఎ మ్మె ల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘గాం చలో.. ఘర్ చలో’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి స్థానిక బాలాజీనగర్‌లో ఇంటింటా పర్యటించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం కిలో బియ్యం ఇస్తూ.. లబ్ధిదారుల ఇళ్లు వెళ్లి ఆ బియ్యమే తిని వస్తున్నారని ఎద్దేవా చేశారు. నాయకులు చక్రధర్‌రెడ్డి, సతీశ్, సదానందం, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. నిరుద్యో సమస్య పరిష్కరిస్తాం కమాన్‌పూర్(మంథని): వచ్చే ఎన్నికల్లో తమ పా ర్టీని గెలిపిస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. ‘గాం చలో.. బస్తీ చలో’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అర్హులైన ప్రతీఒక్కరికి అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు కొయ్యడ సతీశ్, మచ్చగిరి రాము, దండె లక్ష్మీనారాయణ, మట్ట శంకర్, జంగపెల్లి అజయ్, మల్లారపు అరుణ్, భూంపెల్లి మొండయ్య, కొమ్ము శ్రీనివాస్, వడ్లకొండ తిరుపతిగౌడ్, రమేశ్, కనుకయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహిళా కార్మికులపై వేధింపులు
● వేతనాలు నిలిపివేసిన బల్దియా అధికారులు ● ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన కార్మికులు ● అధికారుల తీరుపై నేతల ఆగ్రహంకోల్సిటీ(రామగుండం): బల్దియా నర్సరీ మహిళా కార్మికులను అధికారులు మానసికంగా వేధిస్తున్నారని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు వై.యాకయ్య, నడిపెల్లి మురళీధర్‌రావు ఆరోపించారు. బల్దియా ఆవరణలో శనివారం నర్సరీ మహిళా కార్మికులు తమ గోడును నాయకుల ఎదుట వెళ్లబోసుకున్నారు. ఈనెల వేతనాలు తమకు నిలివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నాయకులు వై.యాకయ్య, నడిపెల్లి మురళీధర్‌రావు మాట్లాడుతూ ఆర్నెల్లుగా కార్మికులను వేధిస్తున్నారన్నారు. ఓ అధికారి తమ ఇంటికి వచ్చి పిల్లలకు చదువు చెప్పాలని ఒత్తిడి చేశారని, చదువు చెప్పేంత చదువు తమకు రాదని, తాము రాలేమని సదరు అధికారికి కార్మికులు చెబితే వేధిస్తున్నారని ఆరోపించారు. మహిళా కార్మికురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికారిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. -
రూ.4.5 కోట్లు.. 20 ఆఫీసులు
● అన్ని ప్రభుత్వ ఆఫీసులు ఒకేచోట ● ఇటీవల శంకుస్థాపన చేసిన ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు ● పనులు పట్టాలెక్కేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు ● ప్రజలకు మరింత చేరువలో సర్కారు సేవలు ● మండల కేంద్రాల్లోనూ నిర్మించేందుకు సన్నాహాలు మంథని: జిల్లాల పునర్విభజన తర్వాత గతప్రభు త్వం అన్ని జిల్లాల్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలను ఒకేచోట నిర్మించింది. ప్రజలకు సర్కారు సేవలను మరింత చేరువ చేయాలనే ల క్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. అనుకున్నట్లే ప్ర భుత్వ ఆశయం నేరవేరింది. ఇదే తరహాలో డివిజన్ కేంద్రమైన మంథనిలోనూ రెవెన్యూ డివిజనల్ కా ర్యాలయంతోపాటు మిగతా అన్నిప్రభుత్వ శాఖలతో కలిపి సమీకృత కార్యాలయాల నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ప్రగతిలో అగ్రభాగాన నిలిపే దిశగా మంథని నియోజకవర్గ రూపరేఖలు మార్చేలా మా స్టర్ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్న ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు ప్రా రంభించారు. సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో మంథనిని ప్రగతి పథంలో తీసుకెళ్లి అగ్రభాగాన నిలిపేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతు న్నారు. ఈ క్రమంలోనే ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఒకేచోట సమీకృత కార్యాలయాలు నిర్మిస్తున్నట్లు శంకుస్థాపన సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. మంథని మున్సిపల్ కార్యాలయానికి నూతన భవనం, పట్టణంలో 50 పడకల ప్రభుత్వ ఆస్పతి.. ఇలా అనేక అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మండల కేంద్రాల్లోనూ.. మండల కేంద్రాల్లోనూ సమీకృత ప్రభుత్వ కార్యా లయాలు నిర్మించేలా ప్రణాళిక తయారు చేశా రు. ఈ క్రమంలోనే కమాన్‌పూర్, రామగిరి మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. వీటితోపాటు ముత్తారంలో కూడా అన్ని అఫీసులు ఒకే చోట ఉండేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. అనేక ప్రభుత్వ శాఖలకు పక్కా భవనాలు లేక అద్దె భవనాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. సమీకృత కార్యాలయాలు నిర్మిస్తే అన్నిశాఖలకు సొంతభవ నాలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తా యి. ప్రభుత్వానికి అద్దెభారం తప్పనుంది. అంతేగాకుండా.. ఆ మూలకు ఓ ఆఫీ.. ఈ మూలన మరో కార్యాలయం ఉండటంతో వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు చిరునామా లభించక నానాఇబ్బందులు పడుతున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోటుకు చేరితే సమయం కలిసి వస్తుంది. ఆర్థికంగా ఆదా అవుతుంది. ప్రజలకు చిరునామా తెలుసుకోవడంలో గందరగోళం ఉండదు. అన్ని కార్యాలయాలు ఒకేచోట ప్రజలకు సౌకర్యం అన్ని ప్రభుత్వ ఆఫీసులు ఒకేచోట నిర్మించడం ద్వారా ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. దళారీ వ్యవస్థ కనుమరుగవుతుంది. పనులు త్వరగా పూర్తవుతాయయి. – బూడిద తిరుపతి, నాగారం, మంథని పారదర్శకత ఉంటుంది ప్రభుత్వ కార్యాయాల న్నీ ఒకేచోట ఉంటే అధికారుల్లో పారదర్శకత పెరుగుతుంది. డివిజన్‌స్థాయి అధికారి సైతం అందుబాటులో ఉంటే మండలస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉంటారు. సంక్షేమ పథకాల వివరాలు సులభంగా తెలిసే వీలుంటుంది. – గోటికార్ కిషన్, మంథని మంథని పట్ట ణంలో ఆర్డీవో కా ర్యాలయంలోపాటు త హసీల్దార్, ఆర్ అండ్ బీ, ఆర్ డబ్ల్యూఎస్, హార్టికల్చర్, ఎ ౖకై ్సజ్, ఎంపీడీవో, నీటిపారుదల, విద్య, వ్యవసా య, ఎస్టీవో, ఐసీడీఎస్, సబ్ రిజిస్ట్రార్, అటవీ, వెటర్నరీ, లేబర్, ఎస్సీ, బీసీ వెల్పేర్, ఎండోమెంట్ తదితర సుమారు 20 ప్రభుత్వ ఆఫీసులు ఒకేచోట ఉండేలా అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఇందుకోసం రూ.4.5కోట్లతో భవన సముదాయాలు నిర్మించనున్నారు. -
ఉక్కపోత.. దోమల మోత
● విద్యుత్ సరఫరాలో అంతరాయం ● సింగరేణి కార్మికులకు నిద్రాభంగం ●● సబ్‌స్టేషన్‌లో సిబ్బంది లేక అవస్థలు ● పోతనకాలనీ సమస్యలు పట్టని సింగరేణి యాజమాన్యంఇబ్బంది పడుతున్నం ఏదైనా కారణంతో కరెంట్ సరఫరా ఆగిపోతే పునరుద్ధరించేవారు లేరు. అసలే ఎండకాలం. ఉక్కపోతగా ఉంటుంది. దోమలు కుడుతున్నయి. చిన్నపిల్లలు, ముసలోళ్లు చాలా ఇబ్బంది పడుతున్నరు. – సౌమ్య, పోతనకాలనీ వెంటనే నియమించాలి కరెంట్ పోతే కారణం చె ప్పేందుకు, ఎప్పుడు వస్తు ందనే సమయం చెప్పేందు కు ఎవరిని సంప్రదించాలో తెలియడం లేదు. సింగరేణి యాజమాన్యం స్పందించి వెంటనే ఎలక్ట్రీయషన్ను నియమించాలి. – లావణ్య, పోతనకాలనీ త్వరలోనే నియమిస్తాం ఆర్జీ–2 ఏరియాలోని పోతనకాలనీ విద్యుత్ సబ్ స్టేషన్ ఎలక్ట్రీషియన్ ఇటీవల ఉద్యోగ విరమణ చేశారు. ఆ పోస్టు కొన్ని నెలల నుంచి ఖాళీగా ఉంది. సమస్య పరిష్కరిస్తాం. ఇందుకోసం త్వరలోనే ఎలక్ట్రీషియన్‌ను నియమిస్తాం. – ఎర్రన్న, ఏజీఎం, ఆర్జీ–2యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): విధులు నిర్వర్తించి ఇళ్లకు చేరుకునే సింగరేణి కార్మికులను ఉక్క పోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దోమలు ఎడాపెడా వా యిస్తున్నాయి. ఫలితంగా సెకండ్, నైట్డ్యూ టీ చేసి వచ్చిన వారు సరిగి నిద్రపోవడంలేదు. ఫస్ట్, బీ– తదితర షిఫ్ట్‌లు చేసిన వారికీ విశ్రాంతి తీసుకోవడం గగనంగా మారుతోంది. ఇదంతా స్థానిక పోతనకాలనీలోని దుస్థితికి అద్దంపడుతోంది. సిబ్బంది లేరు.. తరచూ సమస్యలు.. సింగరేణి ఆర్జీ–2 ఏరియా పరిధిలోని పోతనకాలనీలో 85 బ్లాక్‌లు, వాటి పరిధిలో 1,180 క్వార్టర్లు ఉ న్నాయి. ఇందులోని 1,180 కార్మిక కుటుంబాలు ని వాసం ఉండగా, దాదాపు 3వేల మందికి పైగా జనా భా ఉంటుంది. వీరి కోసం సమీపంలోనే సింగరేణి యాజమాన్యం 33/3.3 కేవీ సామర్థ్యంతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించింది. కానీ, అందులో సిబ్బందితోపాటు ఎలక్ట్రీషియన్‌ను నియమించలేదు. గంటల తరబడి నిరీక్షణ.. ఏదోఒక కారణంతో విద్యుత్ సరఫరాలో అంతరా యం ఏర్పడితే మరమ్మతు చేసేందుకు సిబ్బంది ఎవరూ అందుబాటులో ఉండడంలేదు. దీంతో గంటల తరబడి సరఫరా నిలిచి కార్మిక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఉదయంపూట కరెంట్ సరఫరా ఆగిపోతే ఎప్పుడు వస్తుందో తెలియని దుస్థితి నెలకొంది. అసలే వేసవి.. ఆపై ఉక్కపోత.. రాత్రివేళ దోమల మోత.. కార్మిక కుటుంబాలేకాదు.. కార్మికులకూ నిద్రాభంగం కలుగుతోంది. తద్వారా పనిస్థలాల్లో సరిగా విధులు నిర్వర్తించే పరిస్థి తి ఉండదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎలక్ట్రీషియన్ పోస్టు ఖాళీ.. పోతనకాలనీ సబ్‌స్టేషన్‌లో నియమించిన ఎలక్ట్రీషియన్ నాలుగు నెలల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. దీంతో ఎలాంటి సమస్య తలెత్తినా పరిష్కారానికి నోచుకోవడం లేదు. సమాచారం కోసం సబ్‌స్టేషన్‌కు వెళ్లినా ఎవరూ అందుబాటులో ఉండడంలేదు. తాళం వేసిన కార్యాలయమే దర్శనమిస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యైటింక్లయిన్‌కాలనీ సబ్‌స్టేషన్‌లో పనిచేసే ఎలక్ట్రీషియన్.. అక్కడ విధులు ముగించుకుని పోతనకాలనీకి వస్తేనే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. అప్పటిదాకా కరెంట్ కోసం కార్మిక కుటుంబాలు నిరీక్షించాల్సి వస్తోంది. రాత్రివేళ విద్యుత్ సరఫరా ఆగిపోతే.. ఆ రోజంతా జాగారం చేయడమేనని కార్మిక కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు స్పందించాలి పోతనకాలనీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఎలక్ట్రీషియన్‌ను వెంటనే నియమించాలి. కరెంట్ పోతే కార్మిక కుటుంబాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అధికారులు ఇప్పటికై నా స్పందించాలి. – పద్మ, పోతనకాలనీ సిబ్బందిని నియమించాలి గోదావరిఖని: మహాకవిపోతనకాలనీలో విద్యుత్ సిబ్బంది లేక కా ర్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని ఐఎన్టీయూసీ ఆర్జీ– 2 ఉపాధ్యక్షుడు బదావత్ శంకర్‌నాయక్ అన్నారు. శనివారం ఆర్జీ–2 జీఎం వెంకటయ్య, ఎస్వోటూ జీఎం రాముడు, వర్క్‌షాప్ ఏజీఎం ఎర్రన్నకు వినతిపత్రం అందజేశారు. ఎలక్ట్రీషియన్ లేక కాలనీ రోజుల తరబడి చిమ్మచీకట్లో ఉంటోందని తెలిపారు. తద్వా రా దొంగల బెడద పెరిగిందన్నారు. నాయకులు నాచగోని దశరథంగౌడ్, సాలిగామ మల్లేశ్, ఆకుల రాజయ్య, తోకల సమ్మయ్య, గోపాల్‌రావు, వంగ సురేశ్, శ్రీనివాస్, మధు పాల్గొన్నారు. -
రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
గోదావరిఖని: రాజ్యాంగ పరిరక్షణ ప్రతీపౌరుని బా ధ్యత అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. స్థానిక ప్రధాన చౌరస్తాలో రాజ్యాంగ పరిరక్షణ యా త్రను శనివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం ‘విభజించి పాలించు’ పద్ధతితో దేశాన్ని ము క్కలు చేస్తోందని విమర్శించారు. సామాన్యుల హ క్కులు కాలరాస్తూ, కార్పొరేట్ శక్తులు, ధనవంతు లకే మద్దతు ఇస్తోందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, శ్రీనివాస్, పెద్దెల్లి ప్రకాశ్, పాతిపెల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ధర్మాన్ని కాపాడాలి ఓదెల(పెద్దపల్లి): రూపునారాయణపేట భక్తాంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే విజయరమణారావు–పావని దంపతులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. పొత్కపల్లి సింగిల్‌విండో చైర్మన్ సుమన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన బ్రహ్మోత్సవాలు
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): చిన్నకల్వలలో ని శ్రీమహమ్మాయిదేవీ బ్రహ్మోత్సవాలు శనివా రం వైభవంగా ముగిశాయి. ఈనెల 8న వేడుకలు ప్రారంభమయ్యాయి. చివరిరోజు మహాపూర్ణాహుతి హోమం, శ్రీహనుమాన్ జయంతి, మహాపడి నైవేద్య నివేదన, పల్లకీసేవ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని నిర్వాహకుడు కృష్ణమాచార్యులు తదితరులు తెలిపారు. కార్పొరేట్లకే కేంద్రం మద్దతు రామగుండం: ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న కేంద్రప్రభుత్వం.. మతతత్వం, దేశభక్తి పేరిట విభజించి పాలిస్తోందని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్, ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యురాలు కె.రమ వి మర్శించారు. అంతర్గాం మండల కేంద్రంలో శ నివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కుల, మతాల మధ్య విద్వేషాలు రెచ్చ గొట్టి పాలన సాగించడంతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్య క్తం చేశారు. నాయకులు జూపాక శ్రీనివాస్, కే జీ రామచందర్, గుజ్జుల సత్యనారాయణరెడ్డి, ఆడెపు శంకర్, గుమ్మడి వెంకన్న, గొల్లపల్లి చంద్రయ్య, మార్త రాములు, పెండ్యాల రమేశ్, కో డిపుంజుల లక్ష్మి, కట్ట తేజేశ్వర్, తీగుట్ల రాము లు, కుమార్, మార్త రాధ, కొట్టె స్వరూప, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. జాతీయ పోటీలకు ఎంపిక ధర్మారం(ధర్మపురి): స్థానిక ఆదర్శ(మోడల్ స్కూల్) విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న బైకని శరణ్య ఫుట్‌బాల్ అండర్ –19 జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ ఈరవేని రాజ్‌కుమార్ తెలిపా రు. మహబూబ్‌నగర్‌లో గతేడాది నవంబర్ 25 నుంచి 27 వరకు జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపిందన్నారు. ఈనెల 15 నుంచి 21వరకు మణిపూర్‌లోని ఇంపాల్‌లో జరిగే పోటీ ల్లో మనరాష్ట్ర జట్టు తరఫున శరణ్య హాజరవుతుందన్నారు. శరణ్యను ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, పీఈటీలు కొమురయ్య, మేకల సంజీవరావు, ఉపాధ్యాయులు అభినందించారు. వక్ఫ్‌బోర్డు బిల్లు రద్దు చేయాలి పెద్దపల్లిరూరల్: ముస్లింలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సవరించిన వక్ఫ్‌బోర్డు బిల్లును రద్దు చేయాలని ముస్లిం, ఇస్లామిక్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుతో ము స్లింలు తమ ఆస్తులపై హక్కులు కోల్పోయే ప రిస్థితి వచ్చిందన్నారు. నాయకులు ముఫ్తి సాధిక్, మొహియుద్దిన్, ఫహీం, ఫయాజ్ అహ్మద్రష్డీ, షేక్ రుకునుద్దిన్, ముఫ్తి మజహర్ ఖాస్మీ, ఉస్మాన్ ఫక్రుద్దిన్, ముప్తి సయ్యద్ నవీద్, సైఫ్ హుస్సామీ, అతీఖుర్రెహమాన్, తాండ్ర సదానందం తదితరులు పాల్గొన్నారు. వంటశాలకు శంకుస్థాపన సుల్తానాబాద్(పెద్దపల్లి): నీరుకుల్ల రోడ్డులోని ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయ పరిసరాల్లో వంటశాల నిర్మాణానికి శనివారం భూమిపూజ చేశారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ శనిగరపు శంకరయ్య, దాతలు అల్లం సత్యనారాయణ–భాగ్యలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్ పాల్గొన్నారు. -
మోదీ పాలనకు ప్రజామోదం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నీతివంతమైన పాలననే ప్రజానీ కం కోరుకుంటోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు క ర్రె సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం బీ జేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో వారు స మావేశమయ్యారు. ప్రపంచంలోని అగ్రదేశాలకు తీసిపోని విధంగా మనదేశాన్ని ప్రధాని తీర్చిదిద్దారని వారు అన్నారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతీకార్యకర్త, నాయకుడు ఇంటింటికీ తీసుకెళ్లాలని వారు కోరారు. నాయకులు జంగ చక్రధర్‌రెడ్డి, ఠాకూర్‌రాంసింగ్, అల్లెంకి ప్రకాశ్, నర్సింగ్, సతీశ్, దిలీప్‌కుమార్, సమ్మయ్య, శ్రీనివాసరావు, రవి, మంథెన కృష్ణ, రాజేందర్, మనోహర్, నరేశ్, గోపి, రమేశ్, మల్లారెడ్డి, సందీప్, పిట్టల వినయ్, సంతోష్, రాజేశ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఇండియావైపు ప్రపంచ దేశాల చూపు.. ప్రపంచ దేశాలన్నీ ఇండియా వైపు చూస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. సుల్తానాబాద్ సుభాష్‌నగర్‌లో చేపట్టిన ‘గాం చలో – బస్తీ చలో’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు కడారి అశోక్ రావు, సౌదరి మహేందర్ యాదవ్, చాతరాజు రమేశ్, కూకట్ల నాగరాజు, వేగోళం శ్రీనివాస్‌గౌడ్, లంక శంకర్, ఏగోలపు సదయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కాషాయ‘కొండ’
● భక్తజన సంద్రమైన కొండగట్టు ● వైభవంగా అంజన్న చిన్నజయంతి వేడుకలు ● జైశ్రీరాం.. జైహనుమాన్ నామస్మరణలతో మార్మోగిన ‘కొండ’ ● భారీగా తరలివచ్చిన దీక్షాపరులు.. భక్తులు ● పర్యవేక్షించిన కలెక్టర్ సత్యప్రసాద్, ఈవో, అధికారులుజగిత్యాల: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు కాషాయమయమైంది. జై శ్రీరా మ్, జై హనుమాన్ నామస్మరణతో అంజన్న సన్నిధి మార్మోగింది. ఆలయంలో హనుమా న్ చిన్నజయంతి వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. జయంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం నుంచి దీక్షాపరులు వేలాదిగా తరలివస్తున్నారు. సాయంత్రం వరకు సుమారు 30 వేల మంది మాల విరమణ చేయగా.. అర్ధరా త్రి వరకు సంఖ్య భారీగా పెరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, నిజామాబా ద్, ఇతర జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చారు. అర్ధరాత్రి తర్వాత లక్షన్నరకు పైగా భక్తుల రాకతో కొండ కిక్కిరిసిపోయింది. కోనేటిలో స్నానమాచరించిన భక్తులు, క్యూలైన్ ద్వారా వెళ్లి ఇరుముడి సమర్పించి, మాల విరమణ చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరోరెండు రోజుల పాటు జరుగనున్న జయంతి ఉత్సవాలకు రద్దీ కొనసాగనుంది. జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఏర్పాట్లను పరిశీలించారు. మెడికల్క్యాంప్లో మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉండాలన్నారు. కోనేరును తరచూ శుభ్రం చేయాలన్నా రు. ఆయన వెంట డీఎస్పీ రఘుచందర్, పంచాయతీ అధికారి మదన్మోహన్ తదితరులు ఉన్నారు. -
బాలికా విద్యకు అధిక ప్రాధాన్యం
● ఉన్నతంగా ఎదిగేందుకు పూలే ఆదర్శం ● కలెక్టర్ కోయ శ్రీహర్ష, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ● జిల్లాలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి పెద్దపల్లిరూరల్: సమాజంలో గౌరవంతోపాటు జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే చదువుతోనే సాధ్యమని గుర్తించి విద్య ప్రాముఖ్యతను చాటిచెప్పిన మహనీయుడు జ్యోతిబాపూలే అని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జ్యోతిబాపూలే జయంతిలో ఆయన మాట్లాడారు. బాలికావిద్యకు పూలే దంపతులు చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బొంకూరి శంకర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రంగారెడ్డి, సి– విభాగం సూపరింటెండెంట్ బండి ప్రకాశ్, తహసీల్దార్ రాజయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు. బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి ‘పూలే’ గోదావరిఖని/గోదావరిఖనిటౌన్/రామగుండం: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబాపూలే అని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణ య్య, రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. జీడీకే–5గనిపై ఏర్పాటు చేసిన జ్యోతిబాపూలే విగ్రహాన్ని వారు ఆవిష్కరించి మాట్లాడారు. ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, బీసీ సంఘం ఫౌండర్ పంజాల శ్రీనివాస్, అధ్యక్షులు వసంత్‌కుమార్, పెరుమాళ్ల శ్రీనివాస్, చంద్రశేఖర్, అనిల్‌గబాలే, దీటి చంద్రమౌళి, మల్లేశం, వూట్ల దేవాచారి, ఏసీపీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, స్థానిక రాజేశ్ థియేటర్ సమీపంలో నిర్వహించిన జ్యోతిబా పూలే జయంతి సభలో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ఏసీపీ రమేశ్, కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్, తిప్పారపు శ్రీనివాస్, పెద్దెల్లి ప్రకాశ్, దాసరి ఉమ, సాంబమూర్తి పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలోని శ్రీరేణుకా ఎల్లమ్యను కృష్ణయ్య దర్శించుకొని పూజలు చేశారు. అంతకుముందు రైలులో రామగుండం రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆర్.కృష్ణయ్యకు బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. నా యకులు చిలువేరు కుమార్, ఏరుకొండ తిరుపతి, బడికెల కరుణాకర్, కందుల పోశం పాల్గొన్నారు. సీవరేజ్ ప్లాంట్ పనులు వేగవంతం చేయాలి వ్యర్థ జలాలను శుద్ధి చేసే సీవరేజ్ ప్లాంట్ పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ సూ చించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. రూ.88 కోట్లతో ఐదు సీవరేజ్ ప్లాంట్లు మంజూరయ్యాయని, పనులు త్వరగా ప్రారంభించి గడువులోగా పూర్తిచేయాలని సూచించారు. అధికారులు రామన్, దేవేందర్‌రెడ్డి, మౌనిక, మనోజ్, భాను తదితరులు పాల్గొన్నారు. -
పదోన్నతి ప్రశ్నార్థకం
● ఇంకా విడుదలకాని 2023–24 పీఆర్పీ బకాయిలు ● సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ● ఆందోళనకు సిద్ధమైన సింగరేణి కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్గోదావరిఖని: సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, ఆర్థికపరమైన ప్రయోజనాల కోసం సింగరేణి కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉద్యమించేందుకు సిద్ధమవుతోంది. ప్రధానంగా పెర్ఫార్మెన్ రిలేటెడ్ పే(పీఆర్పీ) చెల్లించాలని పట్టుపడుతోంది. గతఆర్థిక సంవత్సరంతోపాటు పదేళ్ల క్రితం నాటి బకాయిలూ చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఇందుకోసం దశలవారీ ఆందోళనలు చేపట్టి సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అధికారుల్లో నిరాశ, నిస్పృహ.. సింగరేణిలోని చాలామంది అధికారులు నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ప్రధానంగా అంతర్గత పదోన్నతులకు నిబంధనలు అడ్డంకిగా మారడం, అధికారుల సంఘంలోని గత నాయకులు సమస్యలపై స్పందించకపోవడంతో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. ఇటీవల నిర్వహించిన అధికారుల సంఘం ఎన్నికల్లో సీఎంవోఏఐ అధ్యక్షుడిగా లక్ష్మీపతిగౌడ్తోపాటు కొత్త కార్యవర్గం ఎన్నికైంది. ఈ నేపథ్యంలో అధికారుల సమస్యలు పరిష్కరించాలని సీఎంవోఏఐ యాజమాన్యం దృష్టికి తీసుకొస్తూనే ఉంది. 2007 – 2014 మధ్య అందని పీఆర్పీ బకాయిలు పీఆర్పీ బకాయిల కోసం రిటైర్డ్ అధికారులు ఎదురుచూస్తూనే ఉన్నారు. బకాయిలు రాకుండానే ఇ ప్ప టికే చాలామంది అధికారులు ఉద్యోగ విరమణ చే శారు. వీరిలో కొందరు కోర్టుకు వెళ్తే అనుకూల తీ ర్పు వచ్చినట్లు సంఘం నాయకులు చెబుతున్నారు. అయినా బకాయిల చెల్లింపులో కదలిక లేదు. ఆందోళనలకు సమాయత్తం.. అధికారుల సమస్యల పరిష్కారం కోసం ఏరియాల వారీగా నిరసన ప్రదర్శనలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. తొలుత నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టనున్నారు. ఆ తర్వాత సీఎండీ, విద్యుత్ శాఖ మంత్రి, చివరకు సీఎంకు వినతిపత్రాలు అందజేసి ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. అంతర్గత పదోన్నతుల్లో అన్యాయం అంతర్గత పదోన్నతుల్లో సింగరేణి అధికారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అంటున్నారు. ఎక్స్టర్నల్ అధికారులకు పదోన్నతి కల్పిస్తున్నా.. అంతర్గతంగా పదోన్నతుల్లో అన్యాయమమే జరుగుతోందని వారు పేర్కొంటున్నారు. ఏడేళ్లుగా ఈ విషయంలో తీవ్రఅసంతృప్తికి లోనవుతున్నారు. ఫస్ట్‌క్లాస్ పాసైన అభ్యర్థుల విషయంలో కూడా అన్యాయమే జరుగుతోంది. గత స్ట్రక్చరల్ సమావేశంలో ఆమోదించినా.. ఇప్పటికీ చలనం లేకపోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లవుతోంది.అధికారుల ప్రధాన డిమాండ్లు.. పెండింగ్ ఉన్నవాటటితోపాటు 2023 – 2024 పీఆర్పీ వెంటనే చెల్లించాలి 2007 – 2014 వరకు ఉన్న బకాయిలు కూడా ఇవ్వాలి న్యాయబద్ధమైన పదోన్నతి పాలసీ అమలు చేయాలి కోలిండియాలోని పదోన్నతి పాలసీని సింగరేణిలోనూ అమలు చేయాలి ఫస్ట్‌క్లాస్ మేనేజర్ల విషయంలో ఇటీవల జారీచేసిన సర్క్యులర్‌లో మార్పులు చేయాలి విచారణ సమయంలో రావాల్సిన బెనిఫిట్స్ ఆపవద్దు కోలిండియా ప్రకారం డిజిగ్నేషన్స్ కేటాయించాలి క్షేత్రస్థాయి అధికారుల సౌకర్యాలు ఆధునికీకరించాలి ఆస్పత్రి సౌకర్యాలు ఆధునికీకరించి, రిటైర్డ్ అధికారులకు మెడికల్ కార్డు అందించాలి ఉచిత విద్యుత్, ఐఐటీ ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలి. -
పదకొండైనా దవాఖానా తెరవలే
ఇది సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలోని పల్లెదవాఖానా. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడు డాక్టరును సంప్రదించేందుకు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు దవాఖానా వద్దకు వచ్చాడు. అప్పటికింకా ఆస్పత్రి తలుపులు తెరవలేదు. దాదాపు పదకొండు గంటలు దాటినా వైద్యసిబ్బంది, వైద్యులెవరూ అటువైపు రాలేదు. ఈ దృశ్యం ‘సాక్షి’ కెమెరాకు చిక్కడంతో వాట్సాప్ ద్వారా వైద్యాధికారి దృష్టికి వెళ్లింది. దీంతో పది నిమిషాల్లోనే సిబ్బంది ఆస్పత్రికి చేరుకున్నారని గ్రామస్తులు తెలిపారు. పల్లె, పట్టణ దవాఖానాలు, పీహెచ్‌సీలను కలెక్టర్‌తోపాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నా సిబ్బంది తీరు మారకపోవడం శోచనీయం. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
‘ఖని’ బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
● అధ్యక్ష, కార్యదర్శులుగా టి.సతీశ్, ఎస్.సంజయ్‌కుమార్ ఎన్నిక గోదావరిఖనిటౌన్: గోదావరిఖని బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. అధ్యక్షుడిగా తౌటం సతీశ్, ప్రధాన కార్యదర్శిగా సిరిగ సంజయ్‌కుమార్ ఎన్నికయ్యారు. మొత్తం 207మంది ఓటర్లలో 199 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అధ్యక్ష స్థానానికి పోటీపడిన తౌటం సతీశ్‌కు 71 ఓట్లు, బల్మూరి అమరేందర్‌రావుకు 59 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షులుగా పోటీచేసిన దేశెట్టి అంజయ్యకు 100 ఓట్లు రాగా, బోడ సమ్మయ్యకు 61 ఓట్లు వచ్చాయి. దీంతో అంజయ్య గెలుపొందారు. సంయుక్త కార్యదర్శిగా ముచ్చకుర్తి కుమార్, కోశాధికారిగా ఎండీ ఉమర్, స్పోర్ట్స్, కల్చరల్ సెక్రటరీగా ఎ.ప్రదీప్‌కుమార్, సీనియర్ కార్యవర్గ సభ్యుడిగా పంగ శంకర్ ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు శ్రీనివాసరావు, అనిల్‌కుమార్ తెలిపారు. నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. -
నేడు ‘డయల్ యువర్ డీఎం’
మంథని: స్థానిక ఆర్డీసీ డిపో పరిధిలో శనివా రం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ శ్రావణ్‌కుమార్ శుక్రవారం తెలిపారు. ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 వరకు ప్రయాణికులు తమ సమస్యలు, సలహాలు, సూచనలు చేయాలని ఆయన సూచించారు. ఇందు కోసం 99592 259 23 మొబైల్ నంబరుకు ఫోన్‌చేయాలని ఆయన కోరారు. ఐఎన్టీయూసీ బలోపేతానికి కృషి జ్యోతినగర్(రామగుండం): ఐఎన్టీయూసీ బలోపేతానికి కృషి చేస్తానని ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడైన భూమళ్ల చందర్ అన్నారు. స్థానిక ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐఎన్టీయూసీ జా తీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి తనను యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వు లు జారీచేయడం అభినందనీయమన్నారు. కా ర్మికుల పక్షాన ఉద్యమించి వారి సమస్యలను పరిష్కరించడంలో ముందు వరుసలో నిలుస్తా నని ఆయన అన్నారు. నాయకులు వేముల కృష్ణయ్య, ఆరెపల్లి రాజేశ్వర్, జమీల్‌పాషా, గోశిక రవి, బొద్దుల శ్రీనివాస్, వెంకటేశ్, లక్ష్మయ్య, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఫార్వర్డ్‌బ్లాక్ నిరసన పెద్దపల్లిరూరల్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తు న్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో దేశరా జధాని ఢిల్లీలో శుక్రవారం ఆందోళన చేపట్టా రు. ఈ ఆందోళనలో ఏఐఎఫ్బీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బండ సురేందర్‌రెడ్డి, పెద్దపల్లికి చెందిన నాయకుడు బొంకూరి సురేందర్ సన్నీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, నిత్యావసర సరుకుల ధరల పెంపు తదితర అంశాలపై పోరాటం సాగిస్తామని వారు అన్నారు. కార్యక్రమంలో నాయకులు కల్లెపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. క్వింటాల్ పత్తి రూ.7,458 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో శుక్రవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,458 ధర పలికిందని మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. కనిష్టంగా రూ.5,608, సగటు ధర రూ.7,231గా నమోదు అయ్యిందని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగుల కోసమే గ్రంథాలయాలుధర్మారం(ధర్మపురి): నిరుద్యోగ యువకుల కోసమే ఆధునిక గ్రంథాలయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షల్లో నెగ్గాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్ కోరారు. మండల కేంద్రంలో చేపట్టే గ్రంథాలయ భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. అద్దె భవనంలోని లైబ్రరీ భవనంలో ఇంటర్నెనెట్, కూలర్ సౌకర్యం కల్పించిన ఆయన.. ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ సహకారంతో త్వరలోనే భవన నిర్మాణం చేపడతామని తెలిపారనీ కార్యక్రమంలో నాయకులు లాపుడ్య రూప్లానాయక్, అరిగే లింగయ్య, పాలకుర్తి రాజేశంగౌడ్, నాగభూషణం, గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, సోగాల తిరుపతి, కాంపెల్లి రాజేశం, కమలేశ్, ఓరం చిరంజీవి, పాలకుర్తి సాయివినీత్ తదితరులు పాల్గొన్నారు. బల్దియా అటెండర్ సస్పెన్షన్ పెద్దపల్లిరూరల్: మున్సిపల్ అటెండర్ పోల రమేశ్‌ను సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తుండడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ తెలిపారు. ఈనెల 1 నుంచి విధులకు గైర్హాజరు కావడంతోపాటు మెమో జారీచేసినా వివరణ ఇవ్వలేదని ఆయన వివరించారు. -
జలం.. గరళం
● పవిత్ర గోదావరిలో కలుస్తున్న వ్యర్థాలు ● నేరుగా తాగేందుకు పనికిరావంటున్న అధికారులు ● ఫిల్టర్ చేయడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం ● ఇంకా నిర్మాణ దశలోనే ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ కలుషిత నీటితో ఇప్పటి వరకు నమోదైన కేసులు హైపటైటిస్ : 6 పాజిటివ్(రెఫరల్) ఆస్పత్రిలో చేరినవారు : 30మంది గోదావరిఖని: పవిత్ర జలాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. వ్యర్థ్యాలు, రసాయనాలు, మురుగునీరు చేరి దుర్వాసన వెదజల్లుతున్నాయి. రంగు, రుచి మారి కంపు కొడుతున్నాయి. ఈ నీరు తాగడానికి కాదు కదా.. రోజూవారి అవసరాలకు కూడా పనికిరాదని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నా.. కార్మిక కాలనీలకు గోదావరి నీరు తప్ప మరోమార్గంలేకుండాపోయింది. నీటికి అడ్డుకట్ట వేసి.. గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీల్లోని కార్మిక కుటుంబాలతో పాటు సింగరేణి క్వార్టర్లకు ఆనుకుని ప్రైవేట్కాలనీలకూ గోదావరి నీరు సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం గోదావరి ఖని సమీపంలోని ఇంటెక్వెల్ నుంచి పంపుల ద్వా రా తాగునీరు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం నది లో నీటి లభ్యత తగ్గింది. ఎగువ నుంచి వచ్చే వ్య ర్థ్యాలు నదిలోని కొద్దిపాటి నీటిలో కలుస్తున్నాయి. ఆ నీటికే అడ్డుకట్ట వేసిన సింగరేణి యాజమాన్యం.. పంపింగ్ చేస్తూ కార్మిక కాలనీలకు తరలిస్తోంది. బొగ్గు గనుల నీరు కలిపి.. గోదావరిఖని ప్రాంతానికి రోజూ 18 ఎంఎల్డీ(మిలియన్ లీటర్స్ పర్ డే) యైటింక్లయిన్‌కాలనీకి 8 ఎంఎల్డీ, సెంటినరీకాలనీకి 5 ఎంఎల్డీ నీటిని యాజమాన్యం అందిస్తోంది. అయితే, గోదావరి నీ రు సరిపోక ఆర్జీ–1, 2, 3 ఏరియాల్లోని బొగ్గు గను ల నుంచి వెలువడే నీటిని ఫిల్టర్‌బెడ్‌లో శుభ్రం చేసి సరఫరా చేస్తున్నారు. ఈనీరు జిడ్డుగా ఉంటోందని కార్మిక కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నగర మురుగు నదిలోకే.. రామగుండం నగరంలో రోజూ వెలువడే 32 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు గోదావరి నదిలోనే కలుస్తున్నాయి. సీవరేజ్ ప్లాంట్లు ఉన్నా.. జీవితకాలం ముగియడంతో పనిచేయడం లేదు. దీంతో వ్యర్థాలు, డ్రైనేజీ నేరుగా నదిలో కలుస్తున్నాయి. ప్రభుత్వానికి అనేకసార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. నేరుగా ఆర్ఎఫ్సీఎల్ వ్యర్థాలు కూడా.. ఆర్ఎఫ్సీఎల్ నుంచి వెలువడే వ్యర్థాలు కూడా గో దావరి నదిలో కలుస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆ సంస్థకు నోటీసులు జారీ చేశారు. అయి నా, నదీజలాలు విషతుల్యమవుతూనే ఉన్నాయి. వ్యాధుల బారినపడుతున్న కార్మికులు గోదావరి నీటిని ఫిల్టర్లలో శుభ్రం చేసి కార్మిక కాలనీలకు పంపింగ్ చేస్తున్నారు. ఫిల్టర్లలో సరిగా శుభ్రంకాక ఆ నీటిని తాగుతున్న వారు వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రధానంగా హైపటైటిస్– ఏతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. కలుషిత నీటితోనే హైపటైటిస్ బారిన పడుతున్నారని సింగరేణి వైద్యాధికారి ఉత్తర్వులు జారీచేయడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. నిర్మాణ దశలో ర్యాపిడ్ గ్రావిటీ జీడీకే–2ఏ సమీపంలో రూ.14.5 కోట్ల వ్యయంతో 35ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన గ్రావిటీ ఫిల్టర్‌ను సింగరేణి ఏర్పాటు చేస్తోంది. జూలై వరకు నిర్మాణం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే మిషన్ భగీరథ తరహాలో కార్మిక కుటుంబాలకు మినరల్ వాటర్ అందుతుంది. -
ఇదే చి‘వరి’ తడి
● గడువు ముగిసింది.. అయినా నేటినుంచి ఎస్సారెస్పీ నీరు అందిస్తాం ● అన్నదాతలు సాగునీటిని వృథా చేయొద్దు ● ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లిరూరల్: చివరి ఆయకట్టుకు ఇదేచివరి తడి అని, గురువారం(ఈనెల 10) నుంచి ఎస్సారెస్పీ కాలువల ద్వారా పంటలకు సాగునీరు సరఫరా చేస్తున్నామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. యాసంగిలో పండిస్తున్న వరి, మొక్కజొన్న తదితర పంటలకు సాగునీరు అవసరమని గుర్తించి సీఎం రేవంత్‌రెడ్డి, డెప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. వారు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ డి–83, డి–86 కాలువల ద్వారా సరఫరా అయ్యే నీటిని రైతులు అవసరం మేరకు వినియోగించుకోవాలని ఆయన కోరారు. బాధితుడికి బాసటగా నిలిచి.. అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన ఎలబోతారం రమేశ్ కుటుంబానికి విజ్జన్న యువసేన వ్యవ స్థాపకుడు అల్లం వినోద్‌రెడ్డి ఆర్థికసాయం అందించడంతో భూంనగర్ ప్రాంతంలోని లాండ్రీ షాపును ఎమ్మెల్యే విజయరమణారావు పునఃప్రారంభించా రు. నాయకులు జగదీశ్, శ్రీనివాస్, సంపత్, అమ్రే శ్, సుభాష్‌రావు, డీవీఎస్మూర్తి, అస్లాం ఉన్నారు. ప్రమాదబీమా చెక్కు అందజేత ఓదెల(పెద్దపల్లి): గోపరపల్లె గ్రామానికి చెందిన యాసం మణెమ్మకు పొత్కపల్లి సొసైటీ ద్వారా మంజూరైన రూ.లక్ష విలువైన ప్రమాద బీమా చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. నాయకులు పాల్గొన్నారు. ఎలిగేడు మండలంలో ఎమ్మెల్యే పాదయాత్ర ఎలిగేడు(పెద్దపల్లి): ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు బుధవారం ర్యాకల్‌దేవ్‌పల్లి నుంచి రా ములపల్లి గ్రామం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. నాయకు లు ప్రకాశ్‌రావు, రాజేశ్వర్‌రెడ్డి, నర్సింహయాదవ్, వెంకటేశ్వర్రావు, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
వాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహం
ధర్మపురి: ధర్మపురిలోని శ్రీఅక్కపల్లి రాజరాజేశ్వరస్వామి దేవాలయం సమీపంలోని వాగులో బుధవారం గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించినట్లు ఎస్సై ఉదయ్‌కుమార్ తెలిపారు. సదరు మహిళ 70ఏళ్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. వృద్ధురాలి ఆచూకీ తెలి సిన వారు ధర్మపురి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మృతదేహాన్ని జగిత్యా ల ఏరియా ఆస్పత్రికి తరలించి మార్చురీ గదిలో భద్రంగా ఉంచినట్లు తెలిపారు. బావిలో పడి వ్యక్తి వ్యక్తి మృతివెల్గటూర్: బావిలో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన జగదేవుపేట గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ధర్మపురి మండలం జైన గామానికి చెందిన సంగెపు మహేశ్ (40) ఉపాధి నిమిత్తం ముంబయిలో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. పదేళ్లుగా ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. గ్రామంలోని బంధువుల ఇంట్లో శుభకార్యం నిమిత్తం సోమవారం కుటుంబంతో కలిసి వచ్చాడు. బుధవారం బహిర్భూమికని గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. అదే సమయంలో ఫిట్స్ రావడంతో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. మృతుడి భార్య మంగ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి..వెల్గటూర్: క్రిమిసంహారక మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెంది న సంఘటన ఎండపల్లి మండలం గొడిశెలపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకా రం.. గ్రామానికి చెందిన అల్లె లచ్చయ్య (58) కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. పదిహేనేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నా ఆరోగ్యం బాగుపడడంలేదు. జీవితంపై విరక్తి చెంది సోమవారం క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం మృతిచెందాడు. మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. తండ్రికి కూతురు తలకొరివిగొల్లపల్లి: కూతురే కొడుకై కన్నతండ్రికి తలకొరివి పెట్టిన ఘటన మండలంలోని భీంరాజ్‌పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బక్కయ్యకు ఒక్కతే కూతురు. దండేపల్లి మండలం పాతగూడూరుకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. కొద్దిరోజులుగా కూతురు వద్దనే ఉంటున్నాడు. మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందాడు. దీంతో ఆయన స్వగ్రామమైన భీంరాజ్‌పల్లికి బుధవారం ఉదయం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. బక్కయ్యకు కుమారులు లేకపోవడంతో కూతురు రజిత తండ్రికి తలకొరివి పెట్టింది. అక్రమ కట్టడాలు కూల్చివేతమేడిపల్లి: భీమారంలోని ప్రభుత్వ భూములు కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను తహసీల్దార్ రవికిరణ్ రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సహకారంతో కూల్చివేయించారు. 1308 సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిలో కొందరు సంఘాల పేరిట నిర్మాణాలు చేపట్టారు. మరికొందరు ఆలయాలు, ఈద్గాలు నిర్మించారు. ప్రభుత్వ కార్యాలయాలకు స్థలం లేకపోవడంతో వేరే గ్రామంలో నిర్మిస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో గ్రామస్తులు భూములకబ్జా విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి వాటిని తొలగించాలని, ఆ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని తీర్మానించారు. రెండురోజుల క్రితం రైతు, కుల సంఘాలు తహసీల్దార్ కార్యాలయం ముందు బైటాయించి ఆందోళనకు దిగారు. -
హోమియోతో మొండి వ్యాధులకు చెక్
కరీంనగర్‌టౌన్: హోమియోపతి ప్రపంచవ్యాప్తంగా రెండవ ప్రధాన వైద్యంగా గుర్తించబడింది. సాంప్రదాయ వైద్యానికి స్పందించని దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఈ వైద్యం ఎంతగానో పనిచేస్తుంది. గతంలో తెలుగు రాష్ట్రాల్లో మెదడువాపును నయం చేయడంలో, చికెన్‌గున్యా, స్వైన్‌ఫ్లూ వంటి ఎన్నో వ్యాధులను నయం చేయడంలో హోమియో వైద్యం పనితనం అందరికి తెలిసింది. పలు మొండి వ్యాధులను నయం చేయగల శక్తి ఉందనే నమ్మకంతో ఈ వైద్య విధానాన్ని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. జర్మనీలో 1755 ఏప్రిల్ 10వ తేదీన జన్మించిన డాక్టర్ శామ్యూల్ హానిమన్ తన రెండు దశాబ్దాల పరిశోధన అనంతరం.. ప్రపంచానికి హోమియో వైద్యాన్ని అందించారు. ఆయన స్మృత్యర్థం ఏటా ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచ హోమియోపతి దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జీవనశైలికి అనుగుణంగా మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. సైడ్ ఎఫెక్ట్లు లేని మందులు వాడుతూ రోగాలు నయం చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఏళ్ల తరబడి మందులు వాడాల్సి వచ్చే దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసుకునేందుకు హోమియో సేవలను వినియోగంచుకుంటున్నారు. కీళ్ల, మోకాళ్ల, నడుం నొప్పులు, అర్థరైటిస్, సైనసైటిస్, షుగర్, బీపీ, థైరాయిడ్, కిడ్నీలో రాల్లు, అస్తమా, మలబద్దకం, అర్షమొలుల, సోరియాసిస్, బొల్లి వంటి చర్మవ్యాధులకు హోమియోపతిలో చికిత్స అందుబాటులో ఉంది. శాశ్వత పరిష్కారం కోసం రోగం నయం చేయడంలో కాస్త ఆలస్యమైనా ఖచ్చితంగా ఫలితం ఉంటుందనే నమ్మకమే హోమియోపతి సేవలు పెరగడానికి కారణంగా తెలుస్తోంది. శాశ్వత పరిష్కారం దొరుకుతుండడం ఒక కారణం. ముఖ్యంగా మొండి వ్యాధులకు మెరుగైన చికిత్స అందుతుండడంతో రోగులు హోమియోపతి వైపు మొగ్గుచూపుతున్నారు. రెండో ప్రధాన వైద్యంగా గుర్తింపు నేడు ప్రపంచ హోమియోపతి దినోత్సవం అన్ని వ్యాధులకు చికిత్స హోమియోలో అన్ని వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉంది. సంతానసాఫల్యత, కీళ్లనొప్పులు, మెడనరాల నొప్పి, నడుమునొప్పి, సయాటికా, థైరాయిడ్, హర్మోన్ సంబంధ వ్యాధులు, కిడ్నీ స్టోన్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఖచ్చితమైన చికిత్స అందుతుంది. అస్తమా, తరచు జలుబు, జ్వరం, టాన్సిల్స్ పెరుగుదల, జ్ఞాపకశక్తి తగ్గడం, నిద్రలోమూత్ర విసర్జన వంటి అన్ని వ్యాధులకు హోమియో సమాధానం చెబుతుంది. అందువల్ల హోమియోకు ఆదరణ పెరుగుతోంది. – డాక్టర్ కొడిత్యాల శ్రీనివాస్, మాతృశ్రీ హోమియోక్లినిక్ -
భర్తతోనే కలిసి ఉంటా..
● కరీంపేటలో మహిళ ఆందోళన శంకరపట్నం: భర్తతోనే కలిసి ఉంటానని ఓ మహిళ ఆందోళనకు దిగగా.. పలు మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. బాధితురాలి వివరాల ప్రకారం.. మండలంలోని కరీంపేట గ్రామానికి చెందిన గడ్డం రాజు మొదటి భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు. చొప్పదండి మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన స్వప్నను రెండో వివాహం చేసుకున్నారు. మూడు నెలలుగా స్వప్నను భర్త, అత్తింటివారు వేధిస్తున్నారు. కొంత డబ్బు ఇచ్చి, వదిలించుకోవాలని చూస్తున్నారని, భర్తతోనే కలిసి ఉంటానని స్వప్న ఆరోపించింది. ఆల్ ఇండియా పోలీస్ హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక కరీంనగర్‌స్పోర్ట్స్: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జరుగుతున్న ఆల్ ఇండియా పోలీస్ హ్యాండ్‌బాల్ చాంపియన్ షిప్ క్లస్టర్ పోటీలకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ క్రీడాకారులు ఎంపికై నట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్ష,కార్యదర్శులు తెలిపారు. రామడుగుకు చెందిన అనుపురం సాయికృష్ణ ప్రస్తుతం మంచిర్యాలలో, కుర్మపల్లికి చెందిన పులి మాధవి ప్రస్తుతం రామగుండం కమిషనరేట్‌లో పనిచేస్తున్నారు. వీరి ఎంపికపై ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కాసర్ల ఆనంద్ కుమార్, రమణారావు, సంయుక్త కార్యదర్శి ప్రభాకర్, కోచ్ మూల వెంకటేశ్, వేల్పుల సురేందర్, కృష్ణహరి, శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. -
సన్నరకం ధాన్యానికి ఎర్రరంగు దారం వాడాలి
పెద్దపల్లిరూరల్: యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా ఏర్పాట్లు చేయాలని, సన్నరకం ధాన్యం బస్తాలను ఎర్రరంగు, దొడ్డురకం ధాన్యాన్ని పచ్చరంగు దారంతో సంచులు కుట్టేలా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ వేణు ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమావేశమై పలు సూచనలు చేశారు. తూకం యంత్రాలు, టార్పాలిన్, గన్నీసంచులు, తాగునీరు, విద్యుత్ సరఫరా తదితర సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలన్నారు. సన్న, దొడ్డురకం ధాన్యాన్ని సులభంగా గుర్తించేలా సన్నరకం ధాన్యాన్ని ఎర్రరంగు దారంతో కుట్టించి ఎరుపు రంగుతో ముద్ర వేయించాలన్నారు. దొడ్డురకం ధాన్యాన్ని పచ్చరంగు దారంతో కుట్టేలా చూడాలన్నారు. హమాలీలు, కాంటాలు వేర్వేరుగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి కొనుగోలు చేయాలని, కేటాయించిన మిల్లులకే ధాన్యం తరలించాలని, అక్రమాలకు పాల్పడ్డట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
శుచి.. శుభ్రతకు తిలోదకాలు
కోల్‌సిటీ(రామగుండం): హోటల్, బేకరీ, పాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వెళ్లి ఏదైనా ఆహారం తినాలని అనుకుంటున్నారా? అయితే, చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఆహారం తయారీలో వినియోగించే పదార్థాలు నాసిరకంగా ఉంటున్నాయి. గడువు దాటిన, పురుగులు పట్టిన వాటితోపాటు కల్తీ మసాలాలు, అనేకసార్లు కాచిన నూనె వినియోగిస్తున్నారు. శుభ్రత అస్సలు పాటించడంలేదు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఆహార పదార్థాల్లో కృత్రిమ రంగులు వాడుతున్నట్లు రామగుండం నగర పాలక అధికారులు బుధవారం చేసిన తనిఖీల్లో గుర్తించారు. ధనార్జనే ధ్యేయంగా వ్యాపారం.. బల్దియా పరిధిలోని కొన్ని హోటళ్లు, బేకరీలు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లు ధనార్జనే ధ్యేయంగా వ్యాపారం సాగిస్తున్నాయి. నాణ్యతలేని ఆహార పదార్థాలు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ముఖ్యంగా బేకరీల్లోని ఎగ్‌పఫ్, కర్రీపఫ్ తదితర పదార్థాలు పాచిపోయినా పడేయకుండా వేడిచేసి విక్రయిస్తున్నారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో పరిస్థితి మరీదారుణంగా ఉంది. అనేకసార్లు కాచిన నూనెను నూడిల్స్, ఫ్రైడ్‌రైస్, మంచూరియా తయారీకి వినియోగిస్తున్నారు. వినియోగదారులను ఆకర్షించేందుకు సహజ రంగులకు బదులు సింథటిక్ రంగులు వాడుతున్నారని ఆరోపణలున్నాయి. బిర్యానీ సెంటర్లు, హోటళ్లలోనూ అదే దుస్థితి నెలకొంది. నాణ్యతలేని కూరగాయలు, దినుసులు, కాలంచెల్లిన మసాలాలు, ఇతర సరుకులు వినియోగిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు బల్దియా అధికారులు చేసిన దాడుల్లో నాణ్యతలేమి, గడువుతీరిన ముడిసరుకులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా ఫుడ్ ఇన్స్పెక్టర్లు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బేకరీ నిర్వాహకుడికి రూ.20 వేల జరిమానా గోదావరిఖని లక్ష్మీనగర్‌లోని సిరి కేక్స్, మోర్షాప్ నిర్వాహకుడికి రామగుండం నగర పాలక సంస్థ అధికారులు బుధవారం రూ.20వేల జరిమానా విధించారు. కమిషనర్ (ఎఫ్ఏసీ) అరుణశ్రీ ఆదేశాల మేరకు హెల్త్ అసిస్టెంట్ కిరణ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. బేకరీలో గడువు దాటిన ముడిపదార్థాలు, అపరిశుభ్ర వంటశాలలో కేక్‌లు, మిఠాయిలు తయారు చేస్తూ, నిషేధిత సింగిల్ యూస్ ప్లాస్టిక్ సంచుల్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కాలంచెల్లిన రసాయనాలు, ఇతర పదార్థాలు వినియోగిస్తున్నారని తేల్చారు. ఈ మేరకు జరిమానా విధించారు. ఎన్విరా న్మెంటల్ ఇంజినీర్ మధుకర్, ఎంఐఎస్ ఆ పరేటర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. 4X14CLFDS FM KRZఈ రెండు డబ్బాల్లో కనిపిస్తున్న ఆహార పదార్థాన్ని ఎగ్‌పఫ్, కర్రీపఫ్‌లో పెట్టి విక్రయిస్తున్నారు. మంగళవారం తయారు చేసిన బేకరీ నిర్వాహకులు.. మిలిగిన ఆహారాన్ని బుధవారం ఉపయోగించడానికి ఫ్రిజ్‌లో నిల్వచేశారు. అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెలుగుచూసింది. -
బ్రాస్‌బ్యాండ్ వర్కర్స్ యూనియన్ కార్యవర్గం
సుల్తానాబాద్(పెద్దపల్లి): బ్రాస్ బ్యాండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్ను కున్నట్లు ఎన్నికలు ప్రకటించారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా రాజయ్య, ఉపాధ్యక్షులుగా లింగయ్య, సీహెచ్ గోపాల్, ఎండీ సాహెబ్ హుస్సేన్, సహాయ కార్యదర్శిగా బూరుగు శ్రీకాంత్‌గౌడ్(సుల్తానాబా ద్), కోశాధికారిగా మల్లయ్య, గౌరవ అధ్యక్షుడిగా రామయ్య, కార్యవర్గ సభ్యులుగా జహంగీర్ హు స్సేన్, బొంద్యాలు, అంజయ్య, రఫీ, రవి, రాజు, తిరుపతి, శ్రీనివాస్, లింగయ్య ఎన్నికయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్‌నెట్ బృందం పరిశీలన మంథని: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి తెలుసుకునేందుకు స్కూల్‌నెట్ బృందం జిల్లాలో రెండురోజుల పాటు పర్యటించింది. ప్రస్తుత పరిస్థితులు, అవసరమై వసతుల కల్పనపై అధ్యయనం చేసింది. రాష్ట్రమంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు స్కూల్‌నెట్ సీనియర్ మేనేజర్ శివప్రసాద్, అకడమిక్ మేనేజర్ నర్సింగ్‌దాస్, జిల్లా ప్లానింగ్ కో ఆర్డినేటర్ మల్లేశ్‌గౌడ్ మంథని బాలుర, బాలికల జెడ్పీ, ఉన్నత పాఠశాలలను పరిశీలించారు. బాలుర గురుకుల విద్యాలయం, గుంజపడుగు జెడ్పీ బాలుర హైస్కూల్, ముత్తారం కేజీబీవీ, టీజీఎంఎస్, రామగిరి కేజీబీవీని సందర్శించారు. అనంతరం పెద్దపల్లిలో కలెక్టర్‌ను కలిసి వివిధ అంశాలపై చర్చించారు. భవిష్యత్‌లో చేపట్టబోయే పనులపై కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
కరీంనగర్‌రూరల్: ఓ వ్యక్తి నిర్లక్ష్యానికి పసి ప్రాణం బలైంది. సదరు వ్యక్తి ట్రాక్టర్‌కు ఉన్న తాళం చెవిని తీయకపోవడంతో తెలియక స్టార్ట్ చేసిన చిన్నారి ట్రాక్టర్‌తో సహా బావిలో పడి మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లెకు చెందిన గడ్డం రమ్య– అజీందర్రెడ్డికి ఇద్దరు కూతుర్లున్నారు. పెద్దకూతురు జశ్విత(3)ను మూడు రోజుల క్రితం తన అక్కబావలు అన్నాడి మంజుల– రాజిరెడ్డి ఊరైన కరీంనగర్ మండలం బహుదూర్ఖాన్పేటకు పంపించారు. బుధవారం చింతచెట్టు కొట్టేందుకు కూలీలు రావడంతో చెట్టుకింద ఉన్న ట్రాక్టర్‌ను రాజిరెడ్డి కుమారుడు అభిరామ్‌రెడ్డి చిన్నారి జశ్వితను సీటు పక్కనే కూర్చుండబెట్టుకుని వ్యవసాయబావి ముందు నిలిపి కిందకుదిగి వెళ్లిపోయాడు. ట్రాక్టర్‌పై ఉన్న జశ్విత తాళం చెవిని తిప్పడంతో స్టార్ట్ అయిన ట్రాక్టర్ వేగంగా ముందుకుపోయి బావిలో పడిపోయింది. స్ధానికులు క్రేన్‌సాయంతో ట్రాక్టర్‌ను బావిలో నుంచి బయటకు తీశారు. ట్రాక్టర్ కింద పడిన జశ్విత ఊపిరి ఆడక బావిలోనే మృతిచెందింది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అక్కడికి వచ్చి మృతిచెందిన చిన్నారిని గుండెలకు హత్తుకుని రోధించిన తీరు చూసి స్థానికులు కంటతడిపెట్టారు. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి జశ్విత తండ్రి అజీందర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ ప్రదీప్‌కుమార్ తెలిపారు. ట్రాక్టర్‌తో సహా బావిలోపడి చిన్నారి మృతి -
వలంటీర్లుగా పనిచేసేందుకు దరఖాస్తు చేయండి
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వేసవి సెలవుల్లో బోధించేందుకు వ లంటీర్లు కావాలని, ఆసక్తిగల డిగ్రీ విద్యార్థులు ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. కలెక్టరేట్లో బుధవారం స్థానిక సంస్థలు, మున్సిపల్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. సర్కారు బడుల విద్యార్థులకు సమ్మర్ క్యాంపుల ఏర్పాటుకు ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు. ఇందులో డిగ్రీ విద్యార్థులు వ లంటీర్లుగా సేవలు అందించేందుకు ముందుకు రా వాలని సూచించారు. టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. ఈనెలాఖరులోగా రాజీవ్ యువ వికా సం పథకం దరఖాస్తులను పరిశీలించాలని ఆయన అన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను గుర్తించి మే 10లోగా నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇలాంటి వారిని గురుకులాల్లో చేర్పిస్తామని అన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద గుర్తించిన గ్రామాలకు మంజూరైన 1,940 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా ప్రారంభించేలా లబ్ధిదారు లను ప్రోత్సహించాలని ఆదేశించారు. బేస్మెంట్ స్థాయి వరకు పనులు పూర్తయితే తొలివిడత రూ.లక్ష విడుదల చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈనెల 11న ప్రతీపల్లె, పట్టణం, వార్డులో ఆరేళ్లలోపు వయసుగల పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. ఎత్తు, బరువు తక్కువ పిల్లలకు బాలామృతం ప్లస్, ఇతర పోషకాహారం అందించాలన్నారు. జెడ్పీ సీఈవో నరేందర్, డీఆర్డీవో కాళిందిని, డీపీవో వీరబుచ్చయ్య, డీఎంహెచ్‌వో అన్నప్రసన్నకుమారి తదితరులు పాల్గొన్నారు.భూసమస్యలు పరిష్కరించాలి ఓదెల(పెద్దపల్లి): భూ సమస్యలను పరిష్కరించాల ని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం, హాస్టల్‌ను ఆయన తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ, ధరణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచొద్దన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తహసీల్దార్ సునీత, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఏఈఈ జగదీశ్ పాల్గొన్నారు. ● కలెక్టర్ కోయ శ్రీహర్ష -
హనుమాన్ చిన్న జయంతికి ఏర్పాట్లు చేయండి
జగిత్యాల: హనుమాన్ చిన్న జయంతికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి బుధవారం అధికారులతో సమావేశమయ్యారు. ఈనెల 11 నుంచి జయంతి కార్యక్రమాల నేపథ్యంలో పదో తేదీలోపు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కిందిస్థాయి ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు రోజులపాటు లైటింగ్, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని, 11న రాత్రి నుంచి 13వ తేదీ ఉదయం వరకు సుమారు రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, సుమారు 45వేల మంది భక్తులు మాలవిరమణ చేస్తారని, మూడు రోజులపాటు 14 కౌంటర్లను ఏర్పాటు చేసి సుమారు 5 లక్షల లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఆలయ ప్రాంగణంలో 64 సీసీకెమెరాలు ఉన్నాయని, అదనంగా 50 సీసీకెమెరాలను ఏర్పాటు చేస్తామని, ఆరు మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు. మూడురోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, ఇందుకోసం వేదిక ఏర్పాటు చేసి వందమంది కూర్చునేలా సిట్టింగ్ ఉండాలని సూచించారు. చలువ పందిళ్లు, కోనేరు వద్ద పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని, కల్యాణ కట్ట వద్ద నాయీబ్రాహ్మణులను ఎక్కువగా నియమించుకోవాలని ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో షిఫ్ట్‌ల వారిగా కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ రఘుచందర్, కొండగట్టు ఆలయ ఈవో శ్రీనివాస్‌రావు, మదన్మోహన్, మున్సిపల్ కమిషనర్ స్పందన పాల్గొన్నారు. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ -
కోడికోసం వెళ్లి.. బావిలో పడి..
కమాన్‌పూర్(మంథని): వరి పంటను కోసేందుకు సిద్ధమైన రైతు నామని రాజేశం(70) ఆచారం ప్రకారం పొలం వద్ద కోడిని బలిచ్చే ప్రయత్నంలో సమీప వ్యవసాయ బావిలోపడి దుర్మరణం చెందాడు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం సిద్దిపల్లెలో బుధవారం ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామ శివారులో తనకున్న వరిపొలం వద్దకు బుధవారం ఉదయం కోడిని పట్టుకుని వెళ్లాడు. వరి పైరు కోసేందుకు ముందుగా కోడిని బలి ఇవ్వాలని నిర్ణయించాడు. తనవెంట తెచ్చుకున్న సంచిలోనుంచి కోడిని తీస్తుండగా అది ఎగిరిపోయి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడింది. రాజేశం ఆ కోడిని పట్టుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ఆ బావిలో పడి మృతి చెందాడు. చాలాసేపటి వరకు రాజేశం ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లారు. అక్కడ అటూఇటూ చూడగా ఎక్కడా కనిపించలేదు. చివరకు వ్యవసాయ బావిలో చూడగా శవమై కనిపించాడు. అప్పటిదాకా తమతో ఉన్న రాజేశం బావిలోపడి విగతజీవిగా మారడంతో కుటుంబసభ్యుల విలపించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసుకొన్నారు. వ్యవసాయ బావిలో పడి రైతు దుర్మరణం -
పింఛన్ పెరిగే వరకూ పోరు
గోదావరిఖనిటౌన్: సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్ పెరిగే వరకూ పోరాటం చేస్తామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. నగరంలో బుధవా రం ఆయన పర్యటించారు. తొలుత స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ జంక్షన్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కనీస పింఛన్ రూ.10వేలకు పెంచాలని కేంద్రమంత్రిని డిమాండ్ చేయగా ఆయన స్పందించారని తెలిపా రు. ఎన్టీపీసీ నిర్వాసితులపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీనిపై కేంద్ర మంత్రికి ఫిర్యా దు చేశానని అన్నారు. దళితుల అభ్యున్నతికి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించేలా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ఎంపీ పేర్కొన్నారు. నీటి నిల్వకు స్థలాల గుర్తింపు గోదావరిఖని: సింగరేణి సీఎండీ ఆదేశాల మేరకు ఆ ర్జీ–1 ఏరియాలో నీటి నిల్వల కోసం పలు ప్రాంతాలను అధికారులు బుధవారం గుర్తించారు. ‘సింగరేణి నీటిబిందువు – జల సింధువు’లో భాగంగా మూతపడిన మేడిపల్లి ఓసీపీ పరిసరాల్లోని 6.26 హెక్టార్ల విస్తీర్ణంలో 7 ట్యాంక్‌లను నిర్మించేందుకు స్థలాలను గుర్తించారు. ఎస్వోటూ జీఎం గోపాల్‌సింగ్, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయప్రసా ద్, సివిల్ ఎస్ఈ వరప్రసాద్, సెక్యురిటీ అధికారి వీరారెడ్డి, మేనేజర్ మల్లికార్జున్‌యాదవ్ ఉన్నారు. -
దాహం తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు
పెద్దపల్లిరూరల్: ఎండల తీవ్రత అధికంగా ఉందని, బస్సు ప్రయాణికులతోపాటు కలెక్టరేట్‌కు పనుల నిమిత్తం వచ్చే వివిధ ప్రాంతాల ప్రజల దాహం తీర్చేందుకు చల్లని తాగునీటిని అందించేందుకే చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని క లెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. చలివేంద్రంలో చల్లని నీటిని అందుబాటులో ఉంచి ఇక్కడికి వ చ్చే వారికి అందించాలని అన్నారు. ఏవో శ్రీనివాస్, డీఎంవో ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు. వెలుగుతున్న విద్యుత్ దీపాలు పెద్దపల్లిరూరల్: స్థానిక అ మర్నగర్(పాతకోర్టు) చౌర స్తా వద్ద ఏర్పాటు చేసిన జెండాలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. సుందరీకరించిన ప్రాంతంలో విద్యుత్ దీపాలు వెలిగేలా చర్యలు తీసుకున్నారు. దీంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, పట్టణంలోని సుభాష్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జెండాలు తొలగించి, ఫ్లెక్సీలు కూడా తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ‘యువికా’కు విద్యార్థిని ఎంపిక పాలకుర్తి(రామగుండం): కన్నాల జెడ్పీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న తోడేటి సాయివర్షిత ఇస్రో యంగ్ సైంటిస్ట్ శిక్షణ(యువికా)కు ఎంపికైంది. మేలో ఇస్రోకు చెందిన 7 పరిశోధన కేంద్రాల్లో అంతరిక్ష సాంకేతికత, అనువర్తనాలపై రెండువారాల పాటు ఆవాస శిక్షణ ఇస్తారు. ఇందుకు సాయివర్షిత ఎంపిక కావడంపై ప్రధానోపాధ్యాయుడు కమలాకర్‌రావు, జిల్లా సైన్స్ అధికారి రవినందన్‌రావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ డిపోకు మరో భవనం పెద్దపల్లిరూరల్: జిల్లా తూనికలు, కొలతల శా ఖ కార్యాలయాన్ని ఖాళీ చేయించి ఆ భవనాన్ని కూడా ఆర్టీసీ బస్‌డిపోకు అప్పగించారు. తూని కలు, కొలతల శాఖ కార్యాలయాన్ని కలెక్టరేట్‌లోకి ఇటీవల మార్చారు. పాలశీతలీకరణ కేంద్రం, జిల్లా పశుసంవర్థక శాఖ కార్యాలయాలు ఇంకా తమ సొంతభవనాల్లోనే పనిచేస్తున్నాయి. వాటిని కూడా తొలగిస్తారనే ప్రచారం ఉంది. అయితే పాలశీతలీకరణ కేంద్రం పాడి రైతులకు అనువుగా ఉందని, భవనం కూడా ఇటీవలే నిర్మించిందని ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలుస్తోంది. పశుసంవర్థక శాఖ కార్యాలయాన్ని కూడా త్వరలోనే ఖాళీ చేయించే అవకాశాలున్నట్లు సమాచారం. పత్తి క్వింటాల్ రూ.7,359 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో బుధవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,359 ధర పలికింది. కనిష్టంగా రూ.5,511, సగటు రూ.7,033గా ధర నిర్ధారించామని ఇన్చార్జి కార్యదర్శి మనోహర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 23 వరకు దరఖాస్తుల స్వీకరణ పెద్దపల్లిరూరల్: గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈనెల 23వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని డీఈవో మాధవి తెలి పారు. రాష్ట్రంలో 35 గురుకుల జూనియర్ కాలేజీలు(20 బాలికలు, 15 బాలుర) ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ప్రవేశాలకు అర్హులని, దరఖాస్తుదారులకు మే 10న ప్రవేశపరీక్ష ఉంటుందన్నారు. మెరిట్ ఆధారంగానే సీట్లు కేటాయిస్తారన్నారు. ఆదిలాబాద్, వరంగల్, ఖ మ్మం, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, మ హబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ కేంద్రాల్లో పరీక్ష ఉంటుందని, వివరాల కోసం 040–24734899 ఫోన్‌నంబరులో సంప్రదించాలని తెలిపారు. -
● నాసిరకం ఆహార పదార్థాల విక్రయాలు ● గడువు తీరిన వాటిని అమ్ముతున్న వైనం ● బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో అధ్వానంగా తయారైన పరిస్థితి ● రామగుండం బల్దియా అధికారుల తనిఖీల్లో వెలుగులోకి..
ఇవి కేక్‌లు తయారు చేసేందుకు వినియోగించే రసాయనాలు, ముడిపదార్థాలు. 2022 డిసెంటర్లో వీటిని తయారు చేసినట్లు బాటిళ్లపై ముంద్రించి ఉంది. తయారీ తర్వాత 24 నెలల్లోపే వీటిని వినియోగించాలి. కేక్‌పై పూయడానికి వినియోగిస్తున్న క్రిమ్బాటిల్పై 2023 సెస్టెంబర్ 26న తయారు చేసినట్లు ముద్రించి ఉండగా, 2024 సెప్టెంబర్ 24లోపే వినియోగించాలని ఉంది. రామగుండం బల్దియా అధికారులు బుధవారం ఓ బేకరీలో తనిఖీ చేయగా ఇవి వెలుగులోకి వచ్చాయి. అపరిశుభ్రంగా కనిపిస్తున్న ఈ ఆయిల్ డబ్బాను గమనించారా? గోదావరిఖనిలోని ఓ బేకరీలో ఇందులోని ఆయిల్తోనే సమోసాలు తయారు చేస్తున్నారు. వాడిన ఆయిల్‌నే మళ్లీ వినియోగిస్తున్నారు. రంగుమారి మడ్డిపట్టి ఉంది. బల్దియా అధికారుల తనిఖీల్లో ఇది వెలుగు చూసింది. -
హార్వెస్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
తిమ్మాపూర్: మండలంలోని ఇందిరానగర్ గ్రామంలోని సాయిబాబా ఆలయం సమీపంలో రాజీవ్ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు హార్వెస్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులోని పలువురితోపాటు, హార్వెస్టర్‌పై ఉన్న ఇద్దరు గాయపడ్డారు. డ్రైవర్ వాహనంలోనే ఇరుక్కుపోవడంతో పోలీసుల రెండు గంటలు శ్రమించి బయటకు తీశారు. ఎల్ఎండీ పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి 12:40 గంటల సమయంలో ఇందిరానగర్ గ్రామ సాయిబాబా గుడివద్ద కరీంనగర్ వైపు వెళుతున్న హార్వెస్టర్‌ను హైదరాబాద్ నుంచి కరీంనగర్‌వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. దీంతో హార్వెస్టర్ రోడ్డు అవతలివైపుదూసుకెళ్లి బోల్తాపడింది. బ్లేడ్లు మాత్రం బస్సులు ఇరుక్కుపోయాయి. ఈ ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో బస్సులోని పలువురితోపాటు హార్వెస్టర్‌పై ఉన్న ఇద్దరు గాయపడ్డారు. హార్వెస్టర్ డ్రైవర్ వాహనంలో ఇరుక్కుపోయాడు. స్థానికులు వెంటనే 108, ఎల్ఎండీ పోలీసులు సమాచారం అందించారు. దాదాపు 2 గంటలకు పైగా పోలీసులు, గ్రామస్తులు, హైవే పెట్రోల్ సిబ్బంది, మూడు 108 అంబులెన్స్ సిబ్బంది శ్రమించి బయటకు తీయగా.. మోకాలు విరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివేక్ తెలిపారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఇబ్రహీంపట్నం: మండలకేంద్రంలోని హనుమన్ ఆలయం వద్ద మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి అపసార్మరక స్థితిలో పడి ఉండగా అక్కడే కొందరు 108కు ఫోన్ చేసి మెట్పల్లి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. మృతుడిని గుర్తిస్తే మెట్పల్లి డీఎస్పీ 8712656803, సీఐ 8712656819, ఇబ్రహీంపట్నం ఎస్సై 8712656795కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. తేనెటీగల దాడిలో 11 మంది కూలీలకు గాయాలు మంథని: గాజులపల్లి సమీపంలోని కాలువ వద్ద మంగళవారం ముళ్లపొదలను తొలగిస్తున్న ఉపాధిహామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. గ్రామానికి చెందిన పలువురు కూలీలు ఉపాధిహామీ పనుల్లో భాగంగా కాలువ వద్ద పనిచేస్తున్న క్రమంలో తేనెటీగలు దాడి చేయగా 11 మంది గాయపడ్డారు. వారిని మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న కూలీలను నాయకులు బూడిద గణేశ్, ఆర్ల సందీప్, సురేశ్, లింగయ్య, బావు రవి కోరారు. ఆత్మహత్యకు కారకులైన ముగ్గురికి జీవిత ఖైదు కరీంనగర్‌క్రైం: తమ ఇంటి అమ్మాయిని పెళ్లిపేరుతో వంచించి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఓ యువకుడిని తీవ్రంగా బెదిరించగా అవమానంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితులు ముగ్గురికి జీవిత ఖైదు, రూ.2వేల చొప్పున జరిమానా విధిస్తూ కరీంనగర్ ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నీరజ మంగళవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. రామగుండం మండలం మర్రిపల్లికి చెందిన గూండా శంకరయ్య తన కూతుర్ని ప్రేమపేరుతో నమ్మించి మోసం చేశాడని అదే గ్రామానికి చెందిన దొబ్బల పవన్(21)పై క్రిమినల్ కేసు పెట్టాడు. పవన్ జైలుకు వెళ్లి వచ్చాడు. కొన్నాళ్లకు పవన్‌కు వేరే అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిరింది. విషయం తెలిసిన గూండా శంకరయ్య, అకినపల్లికి చెందిన మండే శ్రీనివాస్, ఎగ్లాస్పూర్కు చెందిన క్యాతం రవీందర్ 2016 ఆగస్టు 21న పవన్‌ను అడ్డగించి నానా బూతులు తిట్టి చనిపో అని అవమానపరిచారు. ఇంటికి వచ్చిన పవన్ జరిగిన విషయాన్ని తన తమ్ముడికి చెప్పి రూంలోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా చనిపోయారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామగుండం పోలీసులు గుండా శంకరయ్య, మెండె శ్రీనివాస్, క్యాతం రవీందర్‌పై కేసు నమోదు చేశారు. అప్పటి ట్రైనీ ఐపీఎస్ అపూర్వరావు కేసు దర్యాప్తు జరిపారు. ఈ కేసులో సాక్షులను అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరెల్లి రాములు కోర్టులో ప్రవేశపెట్టి విచారించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి ముగ్గురికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. దళిత మహిళను వేధించిన వ్యక్తికి ఏడాది జైలు గోదావరిఖని: స్థానిక అడ్డగుంటపల్లెకు చెందిన దళిత మహిళను వేధించిన కేసులో రాజీవ్‌కాలనీకి చెందిన ఆవుల మల్లయ్యకు ఏడాది జైలు శిక్ష, రూ.3వేలు జరిమానా విధించినట్లు వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. అడ్డగుంటపల్లెలో ఒకదళిత మహిళను కులం పేరిట దూషిస్తూ వేధించాడు. దీంతో ఆవుల మల్లయ్యపై 2017లో కేసు నమోదు చేశారు. కరీంనగర్ ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. జడ్జి నీలిమ పూర్వపరాలు పరిశీలించారు. నేరం రుజు కావడంతో మల్లయ్యకు జైలు, జరిమానా విధించారు. సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించిన పోలీస్ కానిస్టేబుల్ మహేందర్, ఏఎస్ఐ తిరుపతిరావు, ప్రభుత్వ న్యాయవాది రాములును పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్‌ఝా, డీసీపీ కరుణాకర్, ఏసీపీ రమేశ్ అభినందించారు. ముగ్గురికి జీవితఖైదు రామగుండం: అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి, ఎగ్లాస్పూర్ గ్రామాలకు చెందిన ముగ్గురికి జీవితఖైదు విధిస్తూ కరీంనగర్ మూడోఅదనపు జిల్లా న్యాయమూర్తి నీరజ మంగళవారం తీర్పు వెలువరించారు. ఎస్సై వెంకటస్వామి కథనం ప్రకారం.. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన దొబ్బల పవన్‌ను 2016వ సంవత్సరంలో పాతకక్షలను దృష్టిలో పెట్టుకొని బెదిరించి, చనిపోవడానికి ముగ్గురు వ్యక్తులు కారకులయ్యారు. ఈ మేరకు మృతుడి తండ్రి దొబ్బల పోచయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి గోదావరిఖని ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్ విచారణ జరిపిన అనంతరం చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు పూర్వపరాలను పరిశీలించిన న్యాయమూర్తి శంకరయ్య(మర్రిపల్లి), శ్రీనివాస్(ఆకెనపల్లి), రవీందర్(ఎగ్లాస్పూర్)పై నేరం రుజువైందని నిర్ధారించారు. వారికి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.వేయి జరిమానా విధించారు. -
నిబంధనల ప్రకారం కేసుల పరిష్కారం
జ్యోతినగర్(రామగుండం): బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ సూచించారు. ఎన్టీపీసీ టెంపరరీ టౌన్షిప్లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు కోయ శ్రీహర్ష, కుమార్ దీపక్, పెద్దపల్లి అదనపు కలెక్టర్ అరుణశ్రీ, పెద్దపల్లి, మంచిర్యాల డీసీపీలు కరుణాకర్, భాస్కర్, జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ బాబు, రీసెర్చ్ అధికారి డి.వరప్రసాద్‌తో కలిసి మంగళవారం ఆయన కేసుల పురోగతిపై సమీక్షించారు. గతంలో జరిగిన సమావేశంలో జారీచేసిన సూచనలు, పనుల పురోగతి, తమ శాఖ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను పలువురు అధికారులు వివరించారు. ఈ సందర్బంగా వడ్డెపల్లి రాంచందర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పకడ్బందీగా నమోదు చేసి, నిందితులకు చట్టం ప్రకారం శిక్ష పడేలా సాక్ష్యాలను ప్రవేశ పెట్టాలన్నారు. నిమ్నవర్గాల యువత పరిశ్రమలు స్థాపించేలా ప్రభుత్వాలు అందించే రాయితీలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. రామగుండం, బెల్లంపల్లిలోని ఇండస్ట్రియల్ పార్క్‌ల్లో ఎస్సీ ఔత్సాహికవేత్తలకు భూ కేటాయింపుల్లో ప్రాధాన్యత కల్పించాలన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన, స్టాండప్ ఇండియా, ముద్ర రుణాలను వ్యాపారవేత్తలకు అందించాలన్నారు. అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం, కులాంతర వివాహాలకు సకాలంలో సాయం అందేలా చూడాలన్నారు. దళితుల భూములు ఆక్రమించే వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేయడం లేదనే మాట వినపడుతోందని, తప్పుడు కేసు కాకుంటే నిందితులను అరెస్టు చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతీ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు కావాలని ఆయన అన్నారు. ప్రభుత్వ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని ఆదేశించారు. శాఖల వారీగా బ్యాక్లాగ్ పోస్టులు, కారుణ్య నియామకాలు, పదోన్నతుల పెండింగ్ వివరాలను అందించాలని కోరారు. ఎన్టీపీసీ, సింగరేణి తదితర ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం చేపట్టే భూసేకరణలో దళితులకు న్యాయమైన పరిహారం అందజేయాలని అన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు పరిహారం అందించామని, రేషన్ డీలర్లుగా వారికి ఉపాధి కల్పించామని, వారి పిల్లలకు గురుకులాలు, కేజీబీవీల్లో చేర్పించి నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం కింద 2024–25లో ఐదుగురు దరఖాస్తు చేసుకోగా ముగ్గురిని ఎంపిక చేసి రూ.47 లక్షలు చెల్లించామని తెలిపారు. కులాంతర వివాహాల కింద ఈ ఏడాది 16 జంటలకు రూ.40 లక్షలు పంపిణీ చేశామని వివరించారు. ఆర్డీవోలు గంగయ్య, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ -
బ్రాస్‌బ్యాండ్ కళాకారుల సంక్షేమానికి కృషి
● పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ● సుల్తానాబాద్‌లో వర్కర్స్ యూనియన్ రెండోమహాసభలు సుల్తానాబాద్(పెద్దపల్లి): బ్రాస్‌బ్యాండ్ కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చొరవ తీసుకుంటామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. స్థానిక సాయిరాం గార్డెన్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్రాస్ బ్యాండ్ వర్కర్స్ యూనియన్ రెండో మహాసభ మంగళవారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, పెళ్లిళ్లు, పేరంటాలు, శుభ, అశుభకార్యాలకు బ్రాస్బ్యాంక్కు మరింత ఆదరణ పెరుగుతోందని అన్నారు. ఈఎస్ఐ సౌకర్యం కల్పించేలా, బ్రాస్ బ్యాండ్ పరికరాలను రాయితీపై అందించేలా, 50ఏళ్ల వయసు దాటిన వారికి పింఛన్ మంజూరు చేసేలా, బ్రాస్‌బ్యాండ్ కళ అంతరించిపోకుండా సీఎం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. అంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి తరలివచ్చిన కళాకారులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. బ్రాస్‌బ్యాండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పారుపల్లి గుణపతి, నాయకులు అంతటి అన్నయ్యగౌడ్, మినుపాల ప్రకాశ్‌రావు, సాయిరీ మహేందర్, కల్లేపల్లి జానీ, సూర శ్యామ్, మహ్మద్ రఫీక్, రామన్న, సాహెబ్ హుస్సేన్, విజయ్ కుమార్, శ్రీకాంత్‌గౌడ్, జహంగీర్ గోపాల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
జీతం ఇమ్మంటే లంచం అడిగాడు
● జమ్మికుంటలో ఏసీబీకి చిక్కిన సెర్ప్ ఉద్యోగి ● రూ.10 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులుజమ్మికుంట: సెర్ప్‌లో వీఏవోగా పనిచేస్తున్న మహిళ తనకు రావాల్సిన ఏడాది గౌరవ వేతనం మంజూరు చేయాలని అడిగితే లంచం డిమాండ్ చేశాడో సెర్ప్ ఉద్యోగి. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. సదరు అధికారి మహిళ నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వివి.రమణమూర్తి వివరాల ప్రకారం.. జమ్మికుంట మండలంలోని పెద్దంపల్లి గ్రామానికి చెందిన దొడ్డె స్వప్న సెర్ప్‌లో వీఏవోగా పనిచేస్తోంది. ఏడాదికి సంబంధించిన రూ.60వేల గౌరవ వేతనం రావాల్సి ఉంది. ఇందుకోసం జమ్మికుంట సెర్ప్ కమ్యూనిటీ కో– ఆర్డినేటర్ పసరకొండ సురేశ్‌ను సంప్రదించింది. గౌరవ వేతనం ఇవ్వాలంటే రూ.20వేలు డిమాండ్ చేశాడు. మొదట రూ.4 వేలు ఇచ్చింది. మిగితా రూ.16వేలు ఇవ్వాలని వేధించడంతో ఏసీబీని ఆశ్రయించింది. వీఏవో నుంచి మంగళవారం రూ.10వేల లంచం తీసుకుంటుండగా సీసీ సురేశ్‌ను ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో పట్టుకున్నారు. కేసు నమోదు చేసి, కరీంనగర్ కోర్టుకు తరలించారు. తనకు రావాల్సిన గౌవర వేతనం ఏడాదికాలంగా పెండింగ్‌లో ఉందని, మంజూరు కోసం సీసీ సురేశ్ డబ్బులు డిమాండ్ చేశాడని స్వప్న వెల్లడించింది. ఏసీబీ దాడుల్లో సీఐలు కృష్ణకుమార్, పున్నం చందర్ పాల్గొన్నారు. -
మిడ్‌మానేరు అడుగంటుతోంది..
● 7.80 టీఎంసీలకు పడిపోయిన నీటిమట్టం ● రెండేళ్లుగా రాని కాళేశ్వరం నీరు ● జూలై వరకు 4 టీఎంసీలు ఉండేలా ప్లాన్మిడ్మానేరు ప్రాజెక్టు స్వరూపం నీటి సామర్థ్యం : 27.55 టీఎంసీలు ప్రస్తుత నీటిమట్టం : 7.80 టీఎంసీలు 2024 ఏప్రిల్ 9న ఉన్న నీరు : 7.13 టీఎంసీలు బోయినపల్లి(చొప్పదండి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్‌మానేరు ప్రాజెక్టులో నీటిమట్టం అడుగంటుతోంది. కొద్ది నెలలుగా శ్రీపాద ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల లేకపోవడంతో ప్రాజెక్టులోని నీరు ఎల్ఎండీ ప్రాజెక్టులోకి తరలిపోయింది. ప్రాజెక్టులోకి గతేడాది జూన్ 24 నుంచి ఇప్పటి వరకు 70 టీఎంసీల ఇన్‌ఫ్లో రాగా, 67 టీఎంసీలు ఔట్‌ఫ్లోగా వెళ్లిపోయింది. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా.. గురువారం నాటికి 7.80 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. గేట్ల ద్వారా విడుదల చేసే అంత నీటిమట్టం ప్రాజెక్టులో లేక పోవడంతో ఎల్ఎండీకి రెండు రివర్ స్లూయిస్ల ద్వారా 2,500 క్యూసెక్కులు, కుడికాల్వకు 300 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 5 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు. మరో ఐదు రోజులు ఆయకట్టుకు నీరు మిడ్‌మానేరు ప్రాజెక్టు మూడు డివిజన్ల కింద సుమారు 50వేల ఎకరాల ఆయకట్టుకు నీరు విడుదల చేస్తున్నారు. కుడి కాల్వ ద్వారా మార్చి 31 వరకే నీటి విడుదల నిలిపి వేయాల్సి ఉండగా.. రైతుల కోరిక మేరకు మరో ఐదు రోజులు పొడగించినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కుడి కాల్వ ద్వారా ఇల్లంతకుంట, గన్నేరువరం, మానకొండూర్, హుస్నాబాద్ మండలాలకు నీరు అందుతోంది. కరీంనగర్ అవసరాలకు ఎల్ఎండీకి నీటి తరలింపు ఏటా ఎల్ఎండీ ఆయకట్టుకు, కరీంనగర్ పట్టణ తాగునీటి అవసరాలకు మిడ్‌మానేరు నీరే పెద్ద దిక్కుగా నిలుస్తోంది. ప్రస్తుతం రెండు రివర్ స్లూ యిస్ గేట్ల ద్వారా కొద్ది రోజులుగా ఎల్ఎండీలోకి 2,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. రెండేళ్లుగా కాళేశ్వరం నీళ్లు బంద్ 2023 జనవరి నుంచి 2023 మార్చి వరకు కాళేశ్వరం నుంచి వరద కాల్వ మీదుగా మిడ్‌మానేరులోకి 26.70 టీఎంసీల మేర నీరు వచ్చి చేరింది. గత రెండేళ్లుగా కాళేశ్వరం నీళ్లు రాకపోవడంతో మిడ్‌మానేరు ప్రాజెక్టు ఖాళీ అవుతూ 7.80 టీఎంసీలకు చేరింది. వీటిలో నుంచే ప్రస్తుతం సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని గ్రామాలకు మిషన్ భగీరథ నీటి పథకానికి రోజుకు 45 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు. జూలై 31 వరకు 4 టీఎంసీలు ఉండేలా.. మిడ్‌మానేరు నుంచి ఎల్ఎండీకి, కుడి, ఎడమ కాల్వల ద్వారా నీరు విడుదల చేసినా జూలై 31 వరకు 4 టీఎంసీల మేర ఉండేలా చూసుకుంటామని ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ఎల్ఎండీకి మరో 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తామన్నారు. ఎల్ఎండీకి, కుడికాల్వకు నీరు ఇచ్చాక 5.08 టీఎంసీల మేర నీరు ప్రాజెక్టులో ఉండేలా చూస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎండకు, ఇతరత్రా సుమారు టీఎంసీన్నర మేర ఆవిరి కానుందని అధికారులు వివరించారు. -
ప్రాణం తీసిన క్రికెట్ బాల్
● చికిత్స పొందుతూ బాలుడి మృతి ● విషాదంలో కుటుంబం వేములవాడ: వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతానికి చెందిన దారం అశ్విత్‌రెడ్డి(10) హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. గంగాధర మండలం రంగారావుపల్లికి చెందిన దారం శ్రీనివాస్‌రెడ్డి వేములవాడలోని కోరుట్లబస్టాండ్ ప్రాంతంలో కొన్నేళ్లుగా మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. శ్రీనివాస్‌రెడ్డికి పదేళ్ల కొడుకు అశ్విత్‌రెడ్డి, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఒంటిపూట బడులు నడుస్తుండడంతో ఈనెల 3న స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అశ్విత్‌రెడ్డి స్నేహితులతో క్రికెట్ ఆడడానికి వెళ్లాడు .ఇంటికి తిరిగి వచ్చి యథావిధిగా మరుసటి రోజు పాఠశాలకు వెళ్లాడు. అయితే పాఠశాలలో తనకు తలనొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే శ్రీనివాస్‌రెడ్డి వెళ్లి వైద్యుడు దగ్గరికి తీసుకెళ్లాడు. తనకు తలపై క్రికెట్‌బాల్ తలిగిందని బాలుడు తెలపడంతో పరీక్షించిన వైద్యులు తలలో రక్తస్రావమవుతున్నట్లుగా వైద్యులు గుర్తించారు. వెంటనే మెరుగైన చికిత్స కోసం కరీంనగర్, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. వెంటనే అక్కడి వైద్యులు ఆపరేషన్ చేశారు. మళ్లీ ఈనెల 7న రెండోసారి కూడా తలకు శస్త్రచికిత్స చేయగా.. మంగళవారం బ్రెయిన్‌డెడ్ అయ్యాడు. నకిలీ వైద్య సర్టిఫికెట్లు సృష్టించిన వ్యక్తి రిమాండ్ఇల్లంతకుంట(మానకొండూర్): మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి ఇచ్చిన వ్యక్తిని మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ తెలిపారు. ఇల్లంతకుంట మండలం గాలిపల్లి పశువైద్యశాలలో ఆఫీసు సబార్డినేటుగా విధులు నిర్వహిస్తున్న కత్తి దేవమ్మ మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. జిల్లా అధికారులు వాటిని పరిశీలించగా నకిలీవని తేలింది. దీంతో నకిలీ మెడికల్ సర్టిఫికెట్ల తయారీలో సంబంధం ఉన్న కరీంనగర్‌కు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ యూసుఫ్‌ను మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే కత్తి దేవమ్మ, జేరిపోతుల సంజీవ్‌లను రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణ కొనసాగుతుందని ఎస్సై తెలిపారు. పుస్తెలతాడు అపహరణవీణవంక: మామిడాలపల్లి గ్రామానికి చెందిన అవరకొండ సరమ్మ ఆరుబయట నిద్రించగా గుర్తు తెలియని పుస్తెలతాడును ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉక్కపోత భరించలేక సోమవారం రాత్రి ఆరుబయట నిద్రించగా తెల్లవారుజామున చూసే సరికి మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు కనిపించలేదు. దీంతో కుటుంబీకులకు చెప్పుకోగా మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తోట తిరుపతి తెలిపారు. మానవత్వం చాటుకున్న గ్రామస్తులు చొప్పదండి: నిరుపేద అర్చకుని భార్య మృతి చెందడంతో అంత్యక్రియలకు తమవంతు సాయం చేసి, అంత్యక్రియల్లో పాల్గొని మానవత్వం చాటుకున్నారు మండలంలోని ఆర్నకొండ గ్రామస్తులు. ఆర్నకొండలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో పదేళ్లుగా నమిలికొండ మురళీకృష్ణ అర్చకుడిగా పని చేస్తున్నాడు. మంగళవారం అర్చకుడి భార్య ఆకస్మిక మృతి చెందగా, పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న అర్చకుడి కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచారు. గంట సమయంలోనే సుమారు రూ.50వేల వరకు పోగు చేసి, దగ్గరుండి అంత్యక్రియలు పూర్తి చేశారు. అర్చక కుటుంబానికి అండగా నిలిచిన గ్రామస్తులకు అర్చక పురోహితుల సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
మధ్యాహ్నం మద్యం తాగితే..
‘ఒక్క బీరు తాగితే ఏమైతంది సారూ.. ఎండ బాగా కొడుతుందని సల్లదనం కోసం ఒకేఒక్క బీరు తాగిన సారూ..’ ఓ మందుబాబు ప్రశ్న ఇది. ట్రాఫిక్ పోలీసులకు ఇలాంటి వింత సమాధానాలు రావడం విసుగెత్తిస్తోంది. ఎండలు దంచికొడుతుండడంతో మందుబాబులు మధ్యాహ్నం వేళ ‘చల్లని మద్యం’ ఎడాపెడా తాగేస్తూ రోడ్లపైకి వచ్చేస్తున్నారు. అయితే, బ్రీత్ ఎనలైజర్‌తో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేయడంతో ఎంచక్కా దొరికిపోతున్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తూ ట్రాఫిక్ పోలీసులు చలాన్లు రాస్తూ ‘సాక్షి’కి ఇలా కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
ఒకే పాడైపె తల్లీకొడుకుల మృతదేహాలు
రుద్రంగి(వేములవాడ): ఫుడ్ పాయిజన్‌తో ఆదివారం మృతిచెందిన తల్లీకొడుకులు కాదాసు పుష్పలత, నిహాల్ అంత్యక్రియలను మంగళవారం నిర్వహించారు. ఒకే పాడైపె తల్లీకొడుకుల మృతదేహాలను అంత్యక్రియలకు తరలించడంతో రుద్రంగి ఘొల్లుమంది. రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన తల్లీకొడుకులు పుష్పలత, నిహాల్ శుక్రవారం రాత్రి రొట్టెలు తిని పడుకోగా.. వాంతులు, విరోచనాలతో ఆస్పత్రిలో చేరి చనిపోయిన విషయం తెలిసిందే. అయితే వీరి మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పుష్పలత భర్త రాజు దుబాయిలో ఉండడంతో అంత్యక్రియలు నిర్వహించలేదు. దుబాయి నుంచి రాజు మంగళవారం మధ్యాహ్నం చేరుకుని భార్య, కొడుకుల మృతదేహాలను చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, రుద్రంగి ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. -
ఆర్మీలో చేరాలని ఉందా..!
● అయితే, స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరుకండి ● కలెక్టర్ చొరవ.. యువతకు ఉచిత శిక్షణ ● సైన్యంలో ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు.. ● ఎన్టీపీసీ, సింగరేణి సంస్థల సహకారం ఉచిత శిక్షణ సమాచారం దరఖాస్తు చేసినవారు : 458 ఇప్పటివరకు శిక్షణకు ఎంపికై నవారు: 153 దరఖాస్తుల స్వీకరణ గడువు : ఈనెల10 దరఖాస్తుల స్వీకరణ పద్ధతి : ఆన్లైన్ పెద్దపల్లిరూరల్: త్రివిధ దళాల్లో యువశక్తి సంఖ్య పెంచాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన అగ్నివీర్ ద్వారా సైన్యంలో చేరేందుకు ముందుకొచ్చే యువతకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఇందుకోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వారందరికీ జిల్లాలోని పోలీసు, వైద్యశాఖల అధికారులు, సిబ్బంది సహకారంతో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తున్నారు. ఆన్లైన్ పద్ధతిలో ఈనెల 10వ తేదీ వరకూ ఆసక్తిగల మరికొందరిని ఎంపిక చేస్తామని అధికారులు వెల్లడించారు. అగ్నిపథ్ – 2022లో.. ఇండియన్ ఆర్మీలో పనిచేసేందుకు 17.5 ఏళ్ల – 21 ఏళ్ల లోపు వయసు గల యువతను అర్హులుగా నిర్ణయించారు. వీరు నాలుగేళ్లపాటు దేశరక్షణలో పాలుపంచుకోవాలి. ఈమేరకు అగ్నిపథ్ పథకాన్ని కేంద్రప్రభుత్వం 2022 జూన్ 14వ తేదీన అమలులోకి తీసుకొచ్చింది. అదేఏడాది సెప్టెంబర్ నుంచి త్రివి ధ దళాల్లోకి 100 మంది అధికారులు, వెయ్యిమంది సైనికుల నియామకానికి శ్రీకారం చుట్టింది. కోవిడ్ మహమ్మరితో నియామక ప్రక్రియ నిలిచిపోయయింది. దీంతో త్రివిధ దళాల్లో ఖాళీలను భర్తీ చేయలేకపోయారు. ఆ కొరతను అధిగమించేందుకు అగ్నివీర్ ద్వారా ఎంపికై న యువతకు ఆర్నెల్లపాటు శిక్షణ ఇస్తారు. మిగతా మూడున్నర ఏళ్లపాటు దేశ సేవకు వినియోగించుకుంటారు. పరీక్షలకు సిద్ధం చేసేలా.. అగ్నివీర్ ద్వారా ఆర్మీ(సైన్యం)లో జనరల్ డ్యూటీ(జీడీ), టెక్నికల్, అసిస్టెంట్, ట్రేడ్స్‌మెన్, సోల్జర్, సి ఫాయి, ఫార్మాలో చేరాలనే ఆలోచనతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తించి ఉచిత శిక్షణ ఇ ప్పించేలా కలెక్టర్ శ్రీహర్ష కార్యాచరణ చేపట్టారు. ఇందుకోసం ముగ్గురు అధికారుల(డీఎంవో ప్రవీ ణ్‌రెడ్డి, డీవైఎస్వో సురేశ్, గోదావరిఖని ఏసీపీ రమే శ్)తో కమిటీ ఏర్పాటు చేశారు. ఆసక్తి గలవారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వారిలో అర్హులను ఎంపిక చేసేందుకు వారం క్రితం స్క్రీనింగ్ టెస్ట్ ని ర్వహించారు. ఇందులో ఎంపికచేసిన వారికి గోదా వరిఖనిలోని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూ పొందించారు. అగ్నివీర్ ద్వారా సైన్యంలోకి యువ తను ఎంపికకు అనుసరించే పద్ధతులు, పరీక్షలను ఇక్కడి అధికారులు పక్కాగా నిర్వహిస్తారు. అభ్యర్థుల్లో ఆత్మస్థయిర్యం పెంపొందించి ఆర్మీలో ఉద్యోగం సాధించేలా శిక్షణ ఇస్తున్నారు.అర్హులనే ఎంపిక చేశాం యువత ఆర్మీలో ఉద్యోగాలు సాధించేలా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. అర్హులను ఎంపిక చేసి ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆర్మీలో చేరేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో 458 మంది వివరాలు తెలుసుకున్నాం. అందులోని ఆసక్తిగలవారికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాం. 153 మందిని అర్హులుగా తేల్చాం. అర్హులు ఇంకా ఎవరైనా ఉంటే ఉచితంగా శిక్షణ ఇప్పిస్తాం. – ప్రవీణ్‌రెడ్డి, ఉచిత శిక్షణ కేంద్రం కో ఆర్డినేటర్నమ్మకం కుదిరింది ఆర్మీలో చేరాలనే ఆశతో అగ్నివీర్ ద్వారా దరఖాస్తు చేసుకున్న. జిల్లాలో అగ్నివీర్ దరఖాస్తుదారుల్లో అర్హులకు ఉచిత శిక్షణ ఇస్తారని తెలుసుకుని ఇక్కడకు వచ్చా. స్క్రీనింగ్ టెస్ట్‌లో ఎంపికై న. ఉద్యోగం వస్తుందన్న నమ్మకం కుదిరింది. సైన్యాధికారులు చేపట్టే పరీక్షలకు ఇక్కడ శిక్షణ పొందుతున్నం. – బొంకూరి మనోజ్, నందిమేడారం ఉద్యోగావకాశాల కోసం .. ఆర్మీలో చేరాలనే ఆశతో అగ్నివీర్‌కు దరఖాస్తు చేసుకున్న యువతకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు దక్కేలా ఉచిత శిక్షణ ఇప్పించాలని నిర్ణయించాం. ఇందుకు ఎన్టీపీసీ, సింగరేణి సంస్థల సహకారం తీసుకుంటున్నాం. గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శిక్షణ ఇప్పిస్తూ, సమీపంలోని క్లబ్లో వసతి కల్పించా లని ప్రాథమికంగా నిర్ణయించాం. – కోయ శ్రీహర్ష, కలెక్టర్ -
ఆడనే అంతం!
● ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు ● గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో దందా ● ఆడపిల్ల అని తెలిస్తే ‘కాలగర్భంలో’ కలిపేస్తున్నారు ● దందాలో ఆర్ఎంపీ, పీఎంపీలదే కీలకపాత్ర ● స్కానింగ్ సెంటర్ నిర్వాహకుల ఇష్టారాజ్యంకరీంనగర్ 142‘ఈ చిత్రంలో వైద్యాధికారులు సీజ్ చేస్తున్న ఆస్పత్రి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోనిది. నిబంధనల ప్రకారం స్కానింగ్ చేసినవారి వివరాలను రెండేళ్ల పాటు భద్రంగా ఉంచటంతో పాటు, ప్రతినెలా తమ ఆస్పత్రిలో జరిగే స్కానింగ్, తదితర వివరాలు జిల్లావైద్యారోగ్యశాఖకు సమర్పించాలి. కానీ, ఈ ఆస్పత్రిని డీఎంహెచ్‌వో తనిఖీ చేయగా స్కానింగ్ యంత్రంలోని హార్డ్‌డిస్క్‌ను మాయం చేయడంతో పాటు, రికార్డులు లేకపోవడంతో సీజ్ చేశారు’. ఉమ్మడి జిల్లాలో స్కానింగ్ కేంద్రాలుపెద్దపల్లి 31జగిత్యాల 78సిరిసిల్ల 35లింగ నిష్పత్తి (2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1,000 మందికి)జిల్లా లింగనిష్పత్తి (0–6 వయసు చిన్నారుల్లో) జగిత్యాల 992 947 పెద్దపల్లి 992 922 కరీంనగర్ 993 931 సిరిసిల్ల 1,014 942‘ఇటీవల వైద్యారోగ్యశాఖ అధికారులు కరీంనగర్లో తనిఖీలు చేపట్టగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 19 స్కానింగ్ సెంటర్లకు నోటీసులు జారీ చేశారు. ఒక సెంటర్లో మొబైల్ స్కానింగ్ మిషన్‌ను సీజ్ చేశారు. అయినా తెరవెనుక దందా దర్జాగా నడుస్తోంది’.‘జగిత్యాల జిల్లాకేంద్రంలోని ఓ నర్సింగ్‌హోమ్‌లో అనుమతి లేని స్కానింగ్ యంత్రాలు మూడు ఉండగా నాలుగునెలల క్రితం వాటిని వైద్యశాఖ ఆధ్వర్యంలో అధికారులు గుర్తించి సీజ్ చేశారు’.సాక్షి,పెద్దపల్లి/కరీంనగర్‌టౌన్/జగిత్యాల: కాసులకు కక్కుర్తిపడుతున్న కొందరు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు, వారికి సహకరిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఆడపిల్ల అని తేలితే కడుపులోనే బిడ్డను కరిగించేస్తున్నారు. లింగనిర్ధారణ నేరమని చెప్పాల్సిన వైద్యులే ఆర్ఎంపీలతో కలిసి ముఠాలుగా ఏర్పడి అక్రమ దందాకు పాల్పడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో గుట్టుచప్పుడు కాకుండా భ్రూణహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఉమ్మడి జిల్లాలో నిరాటంకంగా కొనసాగుతున్నాయి. దీంతో లింగనిష్పత్తిలో అంతరం పెరుగుతోంది. ముఖ్యంగా 0–6 వయస్సు చిన్నారుల్లో పెరుగుతున్న అంతరం ఆందోళన కలిగిస్తుంది. ఆర్ఎంపీ, పీఎంపీలదే కీలకపాత్ర పల్లెలు, పట్టణాల్లోని ఆర్ఎంపీలు, పీఎంపీల సహకారంతో ఉమ్మడి జిల్లాలో లింగనిర్ధారణ దందా సాగుతోంది. కొంత మంది ఆర్ఎంపీ, పీఎంపీలు ధనార్జనే ధ్యేయంగా ముఠాగా ఏర్పడుతున్నారు. స్కానింగ్ సెంటర్లలో మాట్లాడుకుని వ్యవహారం నడిపిస్తున్నారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే ముందస్తుగా ఒప్పందం కుదర్చుకున్న ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లకు మహిళలను పంపించి గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్నారు. ఇదంతా మూడో కంటికి తెలియకుండా జరిగిపోతోంది. రెండు, మూడో కాన్పుపై దృష్టి సారిస్తే.. మొదటి కాన్పులో ఆడపిల్లలు పుట్టినవారికి రెండు, మూడోసారి గర్భం దాల్చిన మహిళలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. 12 వారాల గర్భం కలిగిన మహిళలు తమ వివరాలను వైద్య పరీక్షల కోసం ఏఎన్ఎం వద్ద నమోదు చేసుకుంటారు. తర్వాత 16 నుంచి 20 వారాల్లో మరోసారి వారు వైద్యపరీక్షలకు వచ్చినప్పుడు రికార్డు చేస్తారు. అలాంటి సమయంలో వారు రాకుంటే నిఘా పెట్టి గర్భంతో ఉన్నారా.. లేక అబార్షన్ చేయించుకున్నారనేది తెలుసుకుని విచారణ చేపడితే ఈ దందాకు చెక్ పెట్టవచ్చు.చట్టం ఏం చెబుతుందంటే.. లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని ప్రభుత్వాలు 1994లో తీసుకొచ్చాయి. కడపులోని పిండం ఎదుగుదలను తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ కేంద్రాలను నిబంధనల మేరకు ఏర్పాటు చేసుకోవాలి. చట్టాన్ని ఉల్లంఘిస్తే మొదటిసారి మూడేళ్లు జైలుశిక్ష, రూ.10వేల జరిమానా, రెండోసారి ఐదేళ్ల జైలు, రూ.50వేల జరి మానా చెల్లించాలి. నేరం నిర్ధారణ అయితే వైద్యవృత్తి నిర్వహణ అర్హత కోల్పోతారు.ఆపరేషన్ డెకాయ్ ఎక్కడ? గతంలో ఆస్పత్రుల్లోని స్కానింగ్ కేంద్రాల వద్ద వైద్యాధికారులు డెకాయ్ ఆపరేషన్ల పేరిట తనిఖీలు చేపట్టేవారు. ప్రస్తుతం అవి అమలు కావడం లేదు. డెకాయ్ ఆపరేషన్‌లో మహిళ తహసీల్దార్, మహిళా ఎస్సై, సఖీ సెంటర్ నిర్వాహకులు ఉంటారు. వైద్యాధికారులే ఈ బృందాన్ని స్కానింగ్ సెంటర్లకు గర్భిణుల వలే పంపిస్తారు. లింగనిర్ధారణ చేసేందుకు డబ్బు ఎర వేస్తారు. ఎవరైనా పరీక్షలకు పాల్పడితే వారిపై కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ, ఉమ్మడి జిల్లాలో డెకాయ్ ఆపరేషన్లు ఎక్కడా కన్పించడం లేదు.కోడ్ భాషలోనే.. కొన్ని స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ చట్టవిరుద్ధమని పెద్దపెద్ద బోర్డులు ఏర్పాటు చేస్తారు. కానీ తెరవెనుక వేరే ఉంటుంది. లింగనిర్ధారణ చేసి పుట్టబోయేది ఎవరనేది కోడ్‌భాషలో చెబుతారు. కేషీట్లపై కోడ్ భాషలో మైనస్, ప్లస్ గుర్తులు పెడుతున్నట్లు సమాచారం. -
‘పీఎం సూర్యఘర్’ను సద్వినియోగం చేసుకోండి
పెద్దపల్లిరూరల్: రాష్ట్రంలో రెడ్కో ద్వారా పీఎం సూ ర్యఘర్, ముఫ్త్ బిజిలీ యోజన పథకం అమలవుతోందని, జిల్లా ప్రజలకు దీనిపై అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని క లెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో పథకాల అమలుతీరుపై మంగళవారం సమీక్షించారు. ఇంటి పైభాగంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొస్తే ప్రభుత్వం రాయితీ అందిస్తుందన్నారు. 2 కిలోవాట్స్ ప్లాంట్ ద్వారా 150 యూనిట్ల వరకు(రూ.60వేల సబ్సిడీ), 3కిలో వా ట్స్‌కు 300(రూ.78వేల సబ్సిడీ) యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చన్నారు. రెడ్కో ద్వారా అందించే రాయితీలపై ప్రజలకు అవగాహన కలి గేలా ప్రచారం చేయాలని అన్నారు. అదనపు వి ద్యుత్ ఉత్పత్తి చేస్తే గ్రిడ్‌కు విక్రయించి ఆదాయం కూడా పొందవచ్చని వివరించారు. జెడ్పీ సీఈవో నరేందర్, డీఆర్డీవో కాళిందినీ, లీడ్‌బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. జనవరి వరకు తహసీల్దార్ భవనం పనులు.. జిల్లాలోని ఏడు మండలాల్లో చేపట్టిన తహసీల్దార్ భవన నిర్మాణాలను వచ్చే ఏడాది జనవరి వరకు పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించా రు. వివిధ అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష ని ర్వహించారు. మంథనిలో రూ.4.5కోట్లతో చేపట్టిన సమీకృత కార్యాలయాలను వచ్చే ఉగాది నాటికి పూర్తిచేయాలన్నారు. పాఠశాల, హాస్టల్, సబ్ సెంట ర్ల పనుల పురోగతిపై ఆయన ఆరా తీశారు. పనుల ను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈఈ గిరిశ్బాబు, డీఆర్డీవో కాళిందిని పాల్గొన్నారు. -
తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు
కోల్‌సిటీ(రామగుండం): నగరంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ స్పెషలాఫీసర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బల్దియా కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీతో కలిసి అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలన్నారు. పారిశుధ్య నిర్వహణకు పట్టిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రివేళల్లో విద్యుత్ దీపాలు వెలిగేలా చూడాలని ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు 25 శాతం రాయితీ ఫీజు గడువును ఈనెల 30 వరకు పొడిగించిన విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్టీపీసీ అధికారు లు కలెక్టర్‌ను కలిసి అనుమతి లేకుండా నిర్మించిన భబవనాలపై బల్దియా జారీచేసిన జరిమానాలపై చర్చించారు. ఎస్ఈ శివానంద్, ఈఈ రామన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్ పెంచాలి : ఎంపీ గోదావరిఖని: దేశంలో ని బొగ్గుగని కార్మికులతోపాటు సింగరేణి రిటై ర్డ్ ఉద్యోగుల పింఛన్ పెంచాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. మంగళవారం లోక్‌సభలో ఆయన మాట్లాడారు. చాలీచాలని పింఛన్‌తో మలిజీవితంలో రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రతీ మూడేళ్లకోసారి పింఛన్ పెంచాలనే నిబంధనను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్‌చంద్ర దుబే స్పందిస్తూ బొగ్గుగని కార్మికుల పింఛన్ ప్రతీ మూడేళ్లకోసారి సవరించాలనే నిబంధన ఉన్నా.. ఇప్పటివరకు సవరణ చేయలేదన్నారు. అయితే, సింగరేణి సంస్థ అభివృద్ధికి తమ జీవితాలను అంకితం చేసిన రిటైర్డ్ కార్మికులకు న్యాయం జరిగే వరకూ విశ్రమించబోనని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల నిరసన రామగిరి(మంథని): యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి ప్రభుత్వం వెలువరించిన జీవో 21ని నిరసిస్తూ మంగళవారం సెంటినరికాలనీ మంథని జేఎన్టీయూ ఎదుట కాంట్రాక్టు అధ్యాపకులు న ల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. యూ నివర్సిటీ అనుబంధ కళాశాలల్లో అనేక ఏళ్లుగా విద్యాబోధన చేస్తున్న తమకు జీవో 21తో అ న్యాయం జరుగుతోందన్నారు. కాంట్రాక్టు అ ధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని గతఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిందని, జీవో 21ను ర ద్దు చేసి మాట నిలబెట్టుకోవాలని వారు డి మాండ్ చేశారు. ఈమేరకు విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త మహేందర్, ప్రతినిధులు కుమార్, విద్యాసాగర్, వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన సదానందం, జి.శ్రీధర్, కె.తిరుపతి, జి.శ్రీకాంత్, జి.రాజేశ్‌తోపాటు 35 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పాల్గొన్నారు. 12లోగా దరఖాస్తు చేయండి పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న అభ్యర్థులు ఈనె ల 12లోగా ఏఐటీటీ పరీక్షలు రాసేందుకు రూ. 100 ఫీజు చెల్లించి దరఖాస్తు ఫారం పొందాల ని స్థానిక ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి తెలిపారు. వివిధ ట్రేడ్స్‌లో మూడేళ్లకు పైబ డి పనిచేసిన అనుభవం, నైపుణ్యం ఉన్నట్లు సంస్థ నుంచి ధ్రువీకరణపత్రం, గుర్తింపుకార్డు జతపర్చాలని ఆయన పేర్కొన్నారు. దరఖా స్తు, ఇతర వివరాల కోసం వరంగల్‌లోని ములుగు రోడ్డు ప్రాంతీయ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు పెద్దపల్లిరూరల్: జాతీయ ఆరోగ్యమిషన్ కింద జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పో స్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తు న్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్నప్రసన్నకుమారి తెలిపారు. గైనకాలజిస్ట్, అనెస్తీ షియా, సైక్రియాటిస్ట్తోపాటు 14మంది స్టాఫ్‌నర్స్‌ను ఔట్సోర్సింగ్ పద్ధపతిపై భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గలవారు ఆ న్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ
స్కానింగ్ సెంటర్లు, మెటర్నిటీహోంలలో తనిఖీలు నిర్వహించేందుకు కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వైద్యాధికారి కన్వీనర్‌గా కమిటీ రూపొందించారు. కమిటీలో గైనకాలజిస్టు, మహిళా తహసీల్దార్, మహిళా పోలీస్ అధికారి, సఖి కన్సల్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ను బాధ్యులుగా నియమించారు. వీరంతా జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లలో ఎప్పటికప్పుడు తనిఖీ చేపట్టాలి. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న వారిని గుర్తించి చర్యలు చేపడతారు. ఈ కమిటీ ఇప్పటికే 19 సెంటర్లకు నోటీసులు జారీ చేసింది. – డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్‌వో, కరీంనగర్ -
● రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్
బీసీల అభివృద్ధికి సీఎం కృషి గోదావరిఖని: బీసీల అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన వైఖరితో చారిత్రక నిర్ణయం తీసుకున్నా రని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎదిగేందుకు వేర్వేరు బిల్లులు ప్రవేశ పెట్టారని తెలిపారు. బీసీ నినాదంతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీని మరింత బలోపే తం చేయాలని కోరారు. నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, దీటి బాలరాజు, తిప్పారపు శ్రీనివాస్, పెద్దెల్లి ప్రకాశ్, మారెల్లి రాజిరెడ్డి, ముస్తాఫా, గట్టు రమేశ్, యుగేందర్, గుండేటి రాజేశ్ పెద్దెల్లి తేజస్విని తదితరులు పాల్గొన్నారు. కాగా, రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్‌ను క్యాంపు కార్యాలయంలో టీజీ జెన్కో ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ ఇంజినీర్లు, సిబ్బంది, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. సొంతగూటికి తానిపర్తి గోపాల్‌రావు రామగుండం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తానిపర్తి గోపాల్‌రావు కాంగ్రెస్ గూటికి చేరారు. గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ చేరిన ఆయన.. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సొంతగూటికి చేరడంతో ఎమ్మెల్యే మక్కాన్సిగ్ రాజ్‌ఠాకూర్ ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. వైకుంఠ రథం ఏర్పాటు చేయాలి రామగుండం: అంతర్గాం మండల ప్రజల కోసం వైకుంఠరథం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎండీ గౌస్‌బాబా కోరారు. ఈమేరకు ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. తాగునీటికి తిప్పలు రానీయొద్దు ● ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లిరూరల్: వేసవిలో ప్రజలకు తాగునీటి తిప్ప లు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎ మ్మెల్యే విజయరమణారావు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం పంచాయతీరాజ్, మిషన్‌భగీరథ అ ధికారులతో తాగునీటి సరఫరా సమీక్షించారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున తాగునీటి సమ స్య రానీయొద్దన్నారు. లీకేజీలు, ఇతర సమస్యలు గుర్తించి పరిష్కారం చూపాలని అన్నారు. సీసీ రో డ్లు, డ్రైనేజీలు తదితర పనుల్లో వేగం పెంచాలన్నా రు. త్వరితగతిన పనులు పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని ఆయన కోరారు. పేదల కళ్లలో ఆనందం కోసమే.. సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): పేదల కళ్లలో ఆనందం కోసమే సన్నబియ్యం పంపిణీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించినట్లు ఎమ్మెల్యే విజయరమణారా వు తెలిపారు. నీరుకుల్లలో సన్నబియ్యం పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. తహసీల్దార్ రాంచందర్, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, నాయకు లు ప్రకాశ్‌రావు, శ్రీగిరి శ్రీనివాస్, చిలుక సతీశ్, సా యిరి మహేందర్, విజేందర్‌గౌడ్ పాల్గొన్నారు. -
విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి హన్మకొండ: వాతావరణ శాఖ ఈదురు గాలులు, భారీ వర్షాలు ఉన్నాయని హెచ్చరించిన నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాల విద్యుత్ అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి సూచించారు. సోమవారం హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంనుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో వీడీయో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం పరిధిలో ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరా మానిటర్ చేస్తూ ఏదైనా అంతరాయం జరిగితే వెంటనే పునరుద్ధరించాలని అదేశించారు. చెట్లు విరిగి విద్యుత్ లైన్లపై పడితే, ట్రిపింగ్స్, బ్రేడౌన్లు సంభవిస్తే త్వరితగతిన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు. పంటల కోతలు జరుగుతున్నందున పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ సర్వీస్‌ల మంజూరు వేగవంతం చేయాలన్నారు. అత్యవసర సమయంలో కావాల్సిన మెటీరియల్‌ను సమకూర్చుతామన్నారు. వ్యవసాయానికి అవసరమైన చోట 63 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి సర్కిల్లో ఎల్సీ యాప్‌పై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి డైరెక్టర్ టి.సదర్లాల్, జీఎంలు, ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
తల్లీకొడుకుల మృతితో రుద్రంగిలో ఉద్రిక్తం
రుద్రంగి(వేములవాడ): రుద్రంగికి చెందిన తల్లీకొడుకులు కాదాసు పుష్పలత, నిహాన్ మృతితో మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అత్తమామలే విషమిచ్చి చంపారంటూ మృతురాలి తల్లిగారి కుటుంబ సభ్యులు పుష్పలత అత్తమామల ఇంటిపై సోమవారం దాడి చేశారు. వారి మృతికి కారకులను శిక్షించాలని కోరుతూ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో ధర్నాకు యత్నించారు. బాధితులకు న్యాయం చేస్తామని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షిస్తామని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, రుద్రంగి ఎస్సై అశోక్ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు చేపట్టారు. పుష్పలత భర్త దుబాయ్ నుంచి మంగళవారం వస్తుండడంతో అంత్యక్రియలు సోమవారం జరుపలేదు. పుష్పలత మృతదేహాన్ని వేములవాడ ఏరియా ఆస్పత్రిలో భద్రపరిచారు. అనుమానితుల ఇంటిపై మృతురాలి కుటుంబీకుల దాడి సముదాయించిన పోలీసులు -
పరుగెత్తితే పతకమే..
● క్రీడా పోటీల్లో ‘మోడల్’ విద్యార్థుల సత్తా ● రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్న చిన్నారులు ● అభినందిస్తున్న క్రీడాభిమానులువాలీబాల్లో సత్తా ఇంటర్ సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న సింధూ అండర్–19 వాలీబాల్ పోటీల్లో జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ విజయవాడలో నిర్వహించిన జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో సత్తా చాటింది. – బి.సింధూ పట్టుదలతోనే ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న శరణ్య రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో రాణించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. అండర్–19లో మణిపూర్ రాష్ట్రంలోని ఇంపాలో ఈనెల 15 నుంచి 21 వరకు నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతోంది. – బైకని శరణ్య ఆనందంగా ఉంది తొమ్మిదో తరగతి చదువుతున్న మనోజ్ఞ ఎస్జీఎఫ్ అండర్ –17లో ఇటీవల మెదక్‌లో జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చింది. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. జమ్ముకాశ్మీర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొని సత్తా చాటడం ఆనందంగా ఉంది. – తుమ్మల మనోజ్ఞ ధర్మారం(ధర్మపురి): వాళ్లు పల్లెవాసులు.. క్రీడా నేపథ్యం లేని కుటుంబాల నుంచి వచ్చారు.. ఎక్క డా తర్ఫీదు కూడా తీసుకోలేదు.. కానీ, చదువుతోపాటు ఆటల్లోనూ రాణిస్తూ ఔరా అనిపిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటుతు న్నారు ధర్మారం తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు. పీఈటీ కొమురయ్య, ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్ ప్రోత్సాహంతో మెలకువలు నేర్చుకుంటున్నారు. ఈ విద్యాలయం నుంచి ఏటా 40 నుంచి 50 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి, ఐదుగురు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. 2024–25 సంవత్సరంలో జాతీయస్థాయి పోటీలకు ఆరుగురు విద్యార్థులు హాజరవుతున్నారు. ఈ విద్యార్థులు పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన క్రీడాకారులతో తలపడి ఆద్భుత రికార్డులో నమోదు చేస్తున్నారు. వివిధ పట్టణాలు, నగరాల్లో నిర్వహించే రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు సొంత ఖర్చులతోనే వెళ్తూ పతకాలు సాధిస్తున్నారు. పట్టుదలతోనే సాధ్యం పీఈటీ ప్రోత్సాహంతో సాఫ్ట్‌బాల్‌పై ఆసక్తి పెంచుకున్న. పట్టుదలతో ఆడుతూ రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి పోటీలకు చేరుకున్న. మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో రాణించడం సంతోషంగా ఉంది. – బండి వైష్ణవి జాతీయ స్థాయిలో ప్రతిభ ఎనిమిదో తరగతి చదువుతున్న ఓరం సౌజ్ఞ అథ్లెటిక్స్ అండర్ –14లో జాతీయ స్తాయికి ఎదిగింది. ఆమె పరుగెత్తుతే పతకం ఖాయం. రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయికి ఎదిగి గుజరాత్ హమ్మదాబాద్లో జరిగిన పోటీల్లో సత్తాచాటింది. – ఓరం సౌజ్ఞ -
అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య
ధర్మపురి: ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో ఓ వ్యక్తి రాయపట్నం వద్ద గోదా వరిలో దూకి ఆ త్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఉదయ్‌కుమార్ వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన మహ్మద్ అలీ అహ్మద్(45) కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది, ఆదివారం ఇంటి నుంచి బయటికొచ్చాడు. ధర్మపురి మండలం రాయపట్నం చేరుకుని గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మృతదేహం లభ్యమైంది. మృతుడి కుమారుడు హసామ్ అహ్మద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉరేసుకుని ఒకరు.. జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం గోపాల్రావుపేట గ్రామానికి చెందిన అనుసూ రి శ్యామ్‌సుందర్(46) సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నా డు. శ్యామ్సుందర్కు అతని సోదరునికి మధ్య కొద్దికాలంగా భూ వివాదం కొనసాగుతోంది. భూపత్రాలు ఇవ్వడం లేదనే మనస్తాపంతో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య శ్రీలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. దుబాయ్‌లో అయిలాపూర్ వాసి మృతి కోరుట్ల రూరల్: మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన గాజర్ల శ్రీనివాస్(55) దుబాయ్ లో ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీనివాస్ గత 10ఏళ్లుగా జీవనోపాధి కోసం దుబా య్ వెళ్లి వస్తున్నాడు. రెండేళ్ల క్రితం సెలవుపై వచ్చి వెళ్లాడు. ఆదివారం ఉదయం తను ఉండే గదిలోనే గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీని వాస్కు భార్య జల, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నాడు. పెద్ద కూతురు లాస్యకు వివాహం కాగా చిన్న కూతురు రమ్య డిగ్రీ పూర్తి చేసింది, కుమారుడు రణధీర్ ఎంసీఏ చది వాడు. ఇంటి పెద్ద మృతి చెందటంతో శ్రీనివాస్ మృతదేహం కోసం ఎదురుచూస్తూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి.. మెట్పల్లి: పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఈ నెల 5న స్థానిక పాత నటరాజ్ థియేటర్ సమీపంలో సుమారు 25ఏళ్ల యువకుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. సమాచారమందుకున్న 108 సిబ్బంది అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మరణించాడు. అప్పటి నుంచి మృతదేహాన్ని పోస్టుమార్టం గదిలో ఉంచగా, అతని సంబంధీకులు ఎవరు రాలేదు. దీంతో మృతదేహాన్ని దహన సంస్కారాల నిమిత్తం సోమవారం మున్సిపల్ సిబ్బందికి అప్పగించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. స్తంభంపల్లిలో ఒకరు..వెల్గటూర్: వెల్గటూర్ మండలం స్తంభంపల్లికి చెందిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జక్కుల రమేశ్(41)గత పదేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది ఈ నెల 4న పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు జగిత్యాల ఏరియా ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఆదివా రం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య వనిత ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. రైలు నుంచి పడి వివాహిత.. జమ్మికుంట(హుజూరాబాద్): ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి వివాహిత మృతిచెందింది. రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాలు.. మహా రాష్ట్రలోని రాజురా పట్ట ణానికి చెందిన వివాహిత ప్రతిభ రమేశ్గజ్ (46) వైద్యం కోసం కూతురు, సోదరుడితో కలిసి బల్హార్షా నుంచి సికింద్రాబాద్‌కు దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరింది. ఈ క్రమంలో జమ్మికుంట రైల్వే స్టేషన్లో ప్రమాదవశాత్తు రైలు నుంచి కింద పడి మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భర్త రమేశ్కోండ్గజ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. నిరుద్యోగ మహిళలు, యువతులకు ఈ ఆటో డ్రైవింగ్‌లో శిక్షణచిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని నిరుద్యోగ యువతులు, మహిళలకు ఈ–ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంపీడీవో మధుసూదన్ సోమవారం తెలిపారు. 18 నుంచి 45ఏళ్ల వయస్సున్న వారికి 60 రోజులపాటు ఎల్‌ఎండీకాలనీలోని దుర్గాబాయి మహిళా, శిశువికాస ప్రాంగణంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 50మంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన యువతులకు ఎలక్ట్రిక్ ఆటో నడపడంలో శిక్షణ ఇచ్చి డ్రైవింగ్ లైసెన్సు జారీ చేస్తామన్నారు. ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
రూ.10లక్షలు ఖర్చు చేసినా దక్కని ప్రాణం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు ఎనిమిది రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. యువకుడి ప్రాణాలు కాపాడుకోవడానికి తల్లిదండ్రులు రూ.10లక్షలు ఖర్చు చేసినా ప్రాణాలు దక్కలేదు. ఈ సంఘటన ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లో విషాదం నింపింది. ఎస్సై రమాకాంత్, గ్రామస్తులు తెలిపిన వివరాలు. నారాయణపూర్‌కు చెందిన షేక్ అవేజ్(18) గత నెల 30న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం రాత్రి మృతి చెందాడు. రంజాన్ పండుగకు ముందు రోజు సిరిసిల్లలోని ఓ టైలర్లో కుట్టించిన కొత్త బట్టలు తీసుకురావడానికి తన మిత్రుడు షేక్ అఫ్రోజ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అవేజ్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఏడు రోజులపాటు చికిత్స అందించారు. ఒక్కగానొక్క కొడుకును కాపాడుకోవడానికి తల్లిదండ్రులు అప్పు చేసి వైద్యం అందించారు. అయినా ప్రాణాలు దక్కకపోవడంతో తండ్రి సమద్, తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాయపడ్డ మరో యువకుడు అఫ్రోజ్ చికిత్స పొందుతున్నాడు. మృతుని కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి తదితరులు పరామర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఎనిమిది రోజులు మృత్యువుతో పోరాటం గాయపడ్డ యువకుడి మృతి నారాయణపూర్‌లో విషాదం -
ద్విచక్ర వాహనం దహనం
కోరుట్ల రూరల్: మండలంలోని యూసుఫ్‌నగర్ గ్రామంలో ఓ యువకుడు తన తాతకు చెందిన ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటనలో బైక్ పూర్తిగా దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే మరిపెల్లి లింబయ్య ఆదివారం తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ఎదుట నిలిపి, ఇంట్లో నిద్రించాడు. తన మనవడు మరిపెల్లి లింబాద్రి రాత్రి 10గంటల ప్రాంతంలో మధ్యం సేవించి వచ్చి, ద్విచక్ర వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇంట్లో నిద్రిస్తున్న లింబయ్య బయటకు వచ్చే సరికే బైక్ పూర్తిగా కాలిపోయింది. లింబయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్ర వాహనం చోరీ జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్‌లో నిలిపిన ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామానికి చెందిన గంగిపెల్లి నాగరాజు ఈనెల 1న కొత్తబస్టాండ్‌లో బైక్ నిలిపి కళాశాలకు వెళ్లి వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి వచ్చేసరికి గుర్తుతెలియని దొంగలు ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై మన్మదరావు తెలిపారు. -
శివలింగంపై సూర్యకిరణాలు
రామగుండం: అంత ర్గాం మండలం రా యదండి శ్రీచిలుకలరామేశ్వరాలయంలో సోమవారం శివలింగంపై నేరుగా సూర్య కిరణాలు పడ్డాయి. దీంతో భక్తులు దివ్య దర్శనం చేసుకున్నా రు. శివుడికి ప్రత్యేక దినమైన సోమవా రం కావడంతో శివలింగంపై సూర్య తిల కం దిద్దుతున్నట్లు భావించి పూజలు చేశారు. వ్యాధులను దూరం చేద్దాం పెద్దపల్లిరూరల్: పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా వ్యాధులను దూ రం చేసి ఆరోగ్యంగా ఉండాలని జిల్లా వైద్య, ఆ రోగ్యశాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి అన్నా రు. ప్రపంచ ఆరోగ్యదినోత్సవం సందర్భంగా తన కార్యాలయంలో సోమవారం ఆమె విలేక రులతో మాట్లాడారు. మాతా, శిశువులు ఆరోగ్యంగా ఉండేందుకు అనుసరించాల్సిన పద్ధతు లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. మహిళల్లో వ్యాధులను గుర్తించి నయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రధానంగా రక్తహీనత నియంత్రణకు అనుసరించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. రోజూ వ్యాయామం చేయండి జ్యోతినగర్(రామగుండం): ప్రతీరోజు వ్యా యామం చేస్తే ఆరోగ్యం పదిలంగా ఉంటుంద ని ఎన్టీపీసీ రామగుండం–తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సామంత అన్నారు. ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప ర్మినెంట్ టౌన్షిప్లో సోమవారం చేపట్టిన మా ర్నింగ్వాక్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ధన్వంతరీ ఆస్పత్రిలో జరిగిన కార్యక్ర మంలో మాట్లాడారు. ఉద్యోగులు, వారి కు టుంబాల శ్రేయస్సు లక్ష్యంగా ముందుకు సా గుతున్నామన్నారు. జనరల్ మేనేజర్లు, విభా గాధిపతులు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ లహిరి, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. స్వల్పంగా పెరిగిన పత్తి ధర పెద్దపల్లిరూరల్: జిల్లాలో పత్తి ధర స్వల్పంగా పెరిగింది. స్థానిక వ్యవసాయ మార్కెట్లో సోమవారం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,311 ధర పలికింది. కనిష్టంగా రూ.5,208, సగటు రూ.7,008 ధర నిర్ణయించినట్లు మార్కెట్ కార్యదర్శి మనోహర్ తెలిపారు. పలువురు రైతుల నుంచి 183 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా పెద్దపల్లిరూరల్: వేసవి దృష్ట్యా పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈ మాధవరావు సూచించారు. జిల్లాలోని డీఈ, ఏడీఈ, ఏఈఈలతోపాటు అన్ని విభాగాల అధికారుల తో సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన స మావేశయ్యారు. అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా కార్యాచరణ చేపట్టాలని అన్నారు. లోడ్ పెరిగే ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏ ర్పాటు చేయాలని, సాంకేతిక సమస్యలు తలెత్తితే సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వసూళ్లలో కంపెనీ పరిధిలోని 16 సర్కిళ్లలో జిల్లాను ప్రథమస్థానంలో నిలిపేందుకు సహకరించిన అధికారులందరినీ ఆయన అభినందించారు. ప్రతీ సమస్యను పరిష్కరించుకుందాం గోదావరిఖని: అధికార పార్టీ, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రతీ సమస్యను పరిష్కరించుకుందామని ఐఎన్టీయూసీ ఆర్జీ–2 ఉపాధ్యక్షు డు శంకర్‌నాయక్ అన్నారు. సోమవారం ఓసీపీ–3 ఎస్అండ్డీ సెక్షన్లో ఏర్పాటు చేసిన స మావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తి సాధనకు గుండెకాయ ఎస్అండ్ డీ సెక్షన్ అని అన్నారు. నాయకులు రవీందర్‌రెడ్డి, కొంగర రవీందర్, అక్రమ్, కొత్త సత్య నారాయణరెడ్డి, దశరథంగౌడ్, ఐరెడ్డి సంపత్‌రెడ్డి, సాలిగామ మల్లేశ్, సంపత్‌రెడ్డి తదితరు లు పాల్గొన్నారు. అనంతరం ఎస్అండ్డీ హెచ్ వోడీ జనార్దన్‌కు వినతిపత్రం అందజేశారు. -
ప్రతీ క్యాంటీన్లో ఏర్పాటు చేయాలి
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లలో కూడా గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈక్రమంలో నూనె తక్కువగా ఉపయోగించే అల్పాహారం వైపు కార్మికులు మొగ్గుచూపుతున్నారు. యాజమాన్యం చపాతీల యంత్రాలను ప్రతీక్యాంటీన్లో ఏర్పాటు చేయాలి. కార్మికులకు మిల్లెట్స్ ఉప్మా, మిల్లెట్స్ ఇడ్లీ, రాగి ఇడ్లీ.. ఇలా కొత్తతరహా అల్పాహారం అందించాలి. – వాసిరెడ్డి సీతారామయ్య, అధ్యక్షుడు, ఏఐటీయూసీ వినియోగంలోకి తీసుకొస్తాం చపాతీలు తయారు చేసే యంత్రాలను సింగరేణి యాజమాన్యం గతంలో కొనుగోలు చేసిన మాట వాస్తవమే. యంత్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాటిని వినియోగించడం లేదు. ఇటీవల గుర్తింపు కార్మిక సంఘం నాయకులు ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారు. సాధ్యమైనంత త్వరగా వాటిని వినియోగంలోకి తీసుకొస్తాం. కార్మికులకు చపాతీలతో కూడిన అల్పాహారం అందిస్తాం. – లలిత్‌కుమార్, ఆర్జీ–1 జీఎం -
కులం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు
నేను ఎస్టీ కులానికి చెందిన సునితను ఆదర్శ వివాహం చేసుకున్న. మా పిల్లల చదువులకు కుల ధ్రువీకరణపత్రం కావాలని కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న. కానీ, సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. విచారణ జరిపి మాకు కులం సర్టిఫికెట్ ఇప్పించి న్యాయం చేయాలి. – కల్వల కోమల్, మీర్జంపేట రేషన్‌కార్డులో పేరు చేర్చాలి మాకు రేషన్ కార్డు ఉంది. అందులో నా భార్య అనుప్రియ పేరు చేర్చాలని ఏడాదికిపైగా దరఖాస్తు చేసుకుంటున్న. అయినా, పేరు చేర్చడం లేదు. విచారణ జరిపి రేషన్‌కార్డులో నా భార్య పేరు చేర్చాలి. – రామయ్య, అనుప్రియ, భూపతిపూర్ -
ప్రజాసమస్యలు పరిష్కరించండి
ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ కోయ శ్రీహర్షపెద్దపల్లిరూరల్: గోదావరిఖని బల్దియాలోని 49 వ డివిజన్లో రోడ్డు ఆక్రమించి ప్రహరీ నిర్మిస్తు న్నారు.. దీనిని తొలగించాలని స్థానికుడు ప్రసాద్ కోరారు. అదేవిధంగా తన పేరిట కాగజ్‌నగర్‌లో రేషన్‌కార్డు ఉందని, ఆ రేషన్ కార్డును తాను నివా సం ఉండే పెద్దపల్లి జిల్లాలోని కమాన్‌పూర్ ప్రాంతానికి మార్చాలని కల్వల జయ విన్నవించింది. ఇలా.. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలు, గోడును అర్జీల రూపంలో కలెక్టర్ కోయ శ్రీహర్షకు విన్నవించారు. వారి ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్.. సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశమందిరంలో సోమవారం అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి ప్రజావాణి ద్వారా ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. -
మూలన పడిన రోటీ ‘మేకింగ్’
● రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసి.. వదిలేసిన సింగరేణి యాజమాన్యం ● అల్పాహారంగా చపాతీ ఇవ్వాలని కార్మికుల డిమాండ్ గోదావరిఖని: సింగరేణి క్యాంటీన్లలో కార్మికులకు చపాతీలను అల్పాహారంగా అందించాలని గతంలో యాజమాన్యం నిర్ణయించింది. దీనికోసం గ్యా స్తో నడిచే రోటీమేకింగ్ మిషన్లు కొనుగోలు చేసింది. కొంతకాలంపాటు సజావుగా సాగిన ఈప్రక్రియ.. తర్వాత ఏమైందో ఏమోగానీ.. మిషన్లను మూలనపడేశారు. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రాలు పనిచేయకుండా పోవడంపై సింగరేణి కార్మికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ గనిపై క్యాంటీన్.. సింగరేణిలోని 11ఏరియాల్లో సుమారు 40వేల మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతీగని, ఓసీపీ, డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కార్మికులకు తక్కువ ధరకే అల్పాహారం అందిస్తున్నారు. ప్రస్తు తం ఉప్మా, ఇడ్లీ, వడ, పూరీ, మసాలావడ అందు బాటులో ఉన్నాయి. వీటితోపాటు నూనెతక్కువగా వినియోగించే చపాతీలనూ అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం గ్యాస్‌తో నడిచే చపాతీ యంత్రాలను 2018లో కొనుగోలు చేశారు. కొద్దిరోజులపాటు వాటిని చపాతీల తయారీకి వినియోగించారు. ఆ తర్వాత యంత్రాల్లో లోపాలు తలెత్తాయి. రొట్టెలు సరిగా కాలకపోవడం, చపాతీలు సరిగా తయారు కాకపోవడంతో మరమ్మతులు చేయించాల్సిన అధికారులు.. వాటిని పక్కనపడేశారు. దీంతో క్యాంటీన్లలో చపాతీల తయారీ నిలిచిపోయింది. -
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
సుల్తానాబాద్‌రూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ర చించిన రాజ్యాంగానికి కేంద్ర ప్రభుత్వం ముప్పు తెచ్చేలా పాలిస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు ఆరోపించారు. జైబీమ్.. జై బాపు.. జై సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మే రకు ఐతరాజుపల్లె నుంచి భూపతిపూర్ వరకు పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించారు. బీజేపీ కుట్రలను ప్రజలకు వివరించేందుకే పాదయాత్ర చేపట్టామని తెలిపారు. నాయకులు అన్నయ్యగౌడ్, ఈర్ల స్వరూప, ప్రకాశ్‌రావు, తిరుపతిరెడ్డి, గండు సంజీవ్, సారయ్యగౌడ్, చిలుక సతీశ్ పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే విజయరమణారావు రేగడిమద్దికుంట, అల్లిపూర్ గ్రామాల్లో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసి మాట్లాడారు. క్రికెట్ పోటీల విజేత పోలీస్ జట్టు పెద్దపల్లిరూరల్: ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఎ) ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో చేపట్టిన క్రికెట్ పో టీలు ముగిశాయి. ఫైనల్ పోటీల్లో పోలీసు జ ట్టుతో వెటర్నరీ డాక్టర్స్ జట్టు తలపడగా.. పోలీ సు జట్టు విజయం సాధించి ట్రోఫీని కైవసం చే సుకుంది. విజేతకు ట్రోఫీతో పాటు రూ.50వేల నగదును ఎమ్మెల్యే విజయరమణారావు అందజేశారు. పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు -
ముంచుకొస్తున్న ముప్పు
● జిల్లావ్యాప్తంగా వేగంగా పడిపోతున్న భూగర్భ జలమట్టం ● నీరు అందక ఎండిపోతున్న పంటలు ● పొదుపుగా వినియోగించాలంటున్న అధికార యంత్రాంగంపొదుపుగా వాడాలి సాక్షి, పెద్దపల్లి: వేసవి ఆరంభానికి ముందునుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు సెల్సియస్‌కు చేరుకుంటున్నాయి. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో రైతులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. అంతేకాదు.. ఎండల తీవ్రతతో భూగర్భ జలమట్టం అత్యంత వేగంగా పడిపోతోంది. ఈ ఏడాది ప్రారంభం, ప్రస్తుత పరిస్థితులకు పోల్చితే సుమారు మీటరు నుంచి మీటరున్నర లోతుకు నీటిమట్టం పడిపోయిందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్ట ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పనిచేయడంలేదు. మరోవైపు.. ఎస్సారెస్పీ కాలువ చివరి భూములకు సాగు నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురిస్తోంది. ఫిబ్రవరిలోనే ఎండల తీవ్రత.. సాధారణంగా మార్చి నుంచి జూన్ వరకు వేసవి ఉంటుంది. కానీ, మార్చి కన్నా ముందుగానే.. అంటే.. ఫిబ్రవరి చివరివారం నుంచే ఎండలు భగ్గుమంటున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు భయపడాల్సి వస్తోంది. రాత్రివేళల్లో ఉక్కపోత కూడా ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో భూమిలో నుంచి వేడి వెలువడి మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. భూగర్భ జలమట్టం పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బోర్లు వట్టిపోయాయి. పంట పొలాలు బీళ్లువారుతున్నాయి. బోర్లపైనే ఆధారపడి పంటలు పండిస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పొట్టదశలోని పంటలను కాపాడుకోవడానికి రూ.లక్షల్లో అదనంగా ఖర్చుచేసి బోర్ల తవ్వకం చేపట్టినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటోంది. వ్యవసాయానికే అధికంగా వినియోగం.. జిల్లా వ్యాప్తంగా 2024లో భూగర్భ జలాలపై అంచ నా వేయగా.. 44,754 హెక్టా మీటర్ల పరిధిలో నీళ్లు ఉన్నట్లు తేలింది. ఇందులో 17,608 హెక్టా మీటర్ల భూగర్భ జాలలను సాగుకు వినియోగిస్తుండగా.. పరిశ్రమలు, గృహావసారాలు, తాగునీటి అవసరాల కోసం మరో 2,702 హెక్టా మీటర్ల నీటిని ఉపయోగించుకుంటున్నారని తేల్చారు. మొత్తంగా 45.38 శాతంతో 20,310 హెక్టా మీటర్ల నీటిని జిల్లావ్యాప్తంగా ప్రజలు వినియోగిస్తున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది అడుగంటిన వ్యవసాయ బావి. ధర్మారం మండలం కొత్తపల్లి శివారులోనిది. వ్యవసాయ బావుల ఆధారంగా దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో వరి, తదితర పంటలు పండిస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బావుల్లో నీటి నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయి. పూడిక తీసేందుకు క్రేన్లు, ఇతర యంత్రాలు వినియోగిస్తూ రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. మరికొందరు బోరుబావులు వేస్తూ చివరి ప్రయత్నంగా పంటలు కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్నారు. జిల్లాలో భూగర్భ జలమట్టం(మీటర్లలో) ఏడాది 2024 2025 జనవరి 4.95 4.95 ఫిబ్రవరి 5.09 5.44 మార్చి 5.58 5.70 ప్రస్తుతం వేసవిలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోకూ అత్యధికంగా నమోదవుతున్నాయి. భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. రైతులు నీటిని అవసరాల మేరకే వినియోగించుకోవాలి. వృథా చేయెద్దు, గృహ అవసరాలకు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలి. జిల్లావాసులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటేనే వేసవి గట్టెక్కుతుంది. – లావణ్య, ఏడీ, భూగర్భ జలవనరుల శాఖ -
పాపా.. హాస్టల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా?
రామగుండం: ‘పాపా.. హాస్టల్లో ఏమైనా సమస్యలు న్నా.. ఉంటే నా ఫో న్నంబరుకు సమా చారం ఇవ్వండి.. నేనే హాస్టల్‌కు వ చ్చి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తా.. మీరు బు ద్ధిగా చదువుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలి’ అని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ సూచించారు. స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహాన్ని ఆయన సోమవారం సందర్శించారు. పరిసరాలు, విద్యాబోధన తదితర వాటిపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. తానున్నానని భరోసా కల్పించారు. గ్రామాల్లో సన్నబియ్యం పంపిణీ అంతర్గాం మండలం ముర్మూర్, మొగల్పహాడ్ గ్రా మాల్లో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ సన్నబి య్యం పంపిణీ చేశారు. ప్రత్యేకాధికారి రవీందర్ప టేల్, ఆర్ఐ శ్రీమాన్, కాంగ్రెస్ ప్రతినిధులు సంగణవేణ శేఖర్, సుంకరి రవి, మేకల స్వామి, నాజి యా సుల్తానా, చిలుక రామ్మూర్తి పాల్గొన్నారు. కార్పొరేషన్లో విలీనం చేయొద్దు గోదావరిఖని: లింగాపూర్ గ్రామాన్ని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయవద్దని ఆ గ్రామస్తులు కోరారు. ఈమేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్‌కు వినతిపత్రం అందజేశారు. -
పోటాపోటీగా ఆవిర్భావ వేడుకలు
పెద్దపల్లిరూరల్: బీజేపీ ఆవిర్భావ వేడుకలను ఆదివారం మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారె డ్డి, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్ ఆధ్వర్యంలో వేర్వేరుగానే నిర్వహించా రు. గుజ్జుల.. పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డితో కలిసి స్థానిక బస్టాండ్ వద్ద పతాకం ఆవిష్కరించారు. దుగ్యాల ప్రదీప్‌కుమార్ ఆధ్వర్యంలోనూ పార్టీ మండల అధ్యక్షుడు వేల్పుల రమేశ్ (నిమ్మనపల్లి), పట్టణ అధ్యక్షుడు రాకేశ్ (చందపల్లి) ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ జిల్లా అ ధ్యక్షుడు సంజీవరెడ్డి ఈ కార్యక్రమాల్లోనూ ప్రదీప్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఆధిపత్య పోరు తప్పేదెన్నడు? బీజేపీలో ఆధిపత్యపోరు ఇంకా సాగుతూనే ఉంది. పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఇది మరోసారి బహిర్గతమైంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, అటు గుజ్జుల రామకృష్ణారెడ్డి, ఇటు దుగ్యా ల ప్రదీప్‌కుమార్‌తో కలిసి వేడుకల్లో పాల్గొనడం గమనార్హం. గుజ్జుల, దుగ్యాల వర్గీయుల ఆధిప త్య పోరును ఆపేందుకు అధిష్టానం చొరవ చూప కపోవడంతో భవిష్యత్‌లో పార్టీపై ప్రభావం చూ పే అవకాశం ఉందని నేతలు చర్చించుకుంటున్నా రు. కేంద్రమంత్రి సంజయ్ చొరవతో అధ్యక్ష పదవిని దక్కించుకున్న సంజీవరెడ్డి.. ఇటీవల జిల్లా కమిటీని ప్రకటించిన కొద్దిగంటల్లోనే రద్దు చేసే పరిస్థితులు తలెత్తిన విషయం విదితమే. బీజేపీలో చల్లారని అసంతృప్తి జ్వాలలు -
కమిషనరేట్‌లో ప్రక్షాళన
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పాలనాపరమైన వ్యవస్థలపై ప్ర త్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే సుదీర్ఘకాలంగా ఒకేచోట.. పోలీస్ కమిషరేట్‌లో పనిచేస్తున్న పోలీసు ఉద్యోగులు, సిబ్బందికి స్థానచలనం కల్పించడం ప్రారంభించారు. కిందిస్థాయి సిబ్బంది మొదలుకుని ఉన్నతస్థాయి వరకు తన మార్కు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా వివా దాల్లో తలదూర్చడం, విధుల్లో నిర్లక్ష్యం చేయడం తదితర కారణాలతో మరికొందరిపై కూడా బదిలీవేటు వేయొచ్చనే ప్రచారం జరుగుతోంది. కమిషనరేట్ నుంచి.. పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయం మొద లు.. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని ఠాణాల్లో ప నిచేస్తున్న పోలీసు ఉద్యోగులను బదిలీ సీపీ చేశారు. తొలుత టాస్క్‌ఫోర్స్ టీంలను రద్దు చేశారు. ఆ తర్వాత కీలకమైన మోటారు ట్రాన్స్‌ఫోర్స్ అధికారులకూ స్థానచలనం కలిగించారు. ఎంటీవో విభాగంలో తప్పని బదిలీలు కమిషరేట్ పరిధిలోని అతికీలకమైన మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగం ప్రక్షాళనపై పోలీస్ కమిషనర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలో రెండు జిల్లాలకు ఒకేఅధికారి ఉండగా, ప్రస్తుతం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు ఇద్దరు ఎంటీవోలను నియమించారు. ఈ నేపథ్యంలోనే కమిషరేట్‌లో మరికొన్ని బదిలీలు కూడా ఉండవచ్చని అంటున్నారు. వివాదస్పదంగా ఉన్న అధికారులపైనా అంబర్ కిశోర్‌ఝా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 27మంది సిబ్బందికి స్థానచలనం.. రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో 27 మంది పోలీసు సిబ్బందికి సీపీ స్థానచలనం కలిగించారు. మరికొందరిని కూడా బదిలీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకేచోట ఎక్కువకాలం పనిచేస్తున్న సిబ్బంది ఇందులో ఉన్నారు. అలాగే కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలో కూడా ఒకేచోట ఎక్కువకాలంగా పనిచేస్తున్న వారినీ ఇతర ప్రాంతాలకు ఇటీవలే బదిలీ చేశారు. మరో కీలకవిభాగంపై దృష్టి రామగుండం పోలీస్ కమిషనరేట్‌లోని మరో కీలకవిభాగంపై పోలీస్‌బాస్ దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా ఈవిభాగంలో ఇష్టారాజ్యంగా వ్యవహారాలు నిర్వహించినట్లుగా పోలీసు సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఈక్రమంలో ఈవిభాగంలో కూడా త్వరలో ప్రక్షాళన తప్పకపోవచ్చనే చర్చ జోరుగా సాగుతోంది. లాంగ్‌స్టాండింగ్ పోలీసులకు స్థానచలనం ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకూ బదిలీలు టాస్క్‌ఫోర్స్ బృందాల రద్దు.. ఎంటీవోపై ప్రత్యేక దృష్టి పాలనపై పట్టుబిగిస్తున్న పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా -
కంప్యూటర్ సెంటర్ కోసం..
కంప్యూటర్ కోచింగ్ సెంటర్‌తో పాటు ఆన్లైన్, జిరాక్స్ షాపు కోసం దరఖాస్తు చేసుకున్న. విద్యార్థులు, ఇతరులకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వడంతోపాటు ఆన్లైన్ సేవలను అందించి ఉపాధి పొందుతా. – మహేందర్, పెద్దపల్లి వీడియో, ఫొటోగ్రఫీ వీడియో, ఫొటోగ్రఫీలో అనుభవం ఉంది. ప్రభుత్వం ఇచ్చే రాయితీ రుణాలతో అందుకు అవసరమైన కెమెరా కొనుగోలు చేసుకుంటా. వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదుగుతా. – కల్వల సందీప్, పెద్దకల్వల డెయిరీ స్థాపించుకుంటా మాది పెద్దపల్లి శివారు చందపల్లి. డెయియిరీ ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందాలనే ఆలోచనతో దరఖాస్తు చేశా. యూనిట్ మంజూరైతే మంచి ఆదాయం పొందుతా. ఇందుకోసమే నేను దరఖాస్తు చేసుకున్న. – గొడుగు మహేశ్, చందపల్లి లేడీస్ ఎంపోరియం ఏర్పాటు చేస్తా నేను ఎంబీఎ చదువుకున్నా. ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం కింద రాయితీ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా. రుణం మంజూరైతే బ్యూటీపార్లర్, లేడీస్ ఎంపోరి యం ఏర్పాటు చేసుకుంటా. – జూపాక స్నేహ, మూలసాల దరఖాస్తులు స్వీకరిస్తున్నాం ఆన్లైన్లో ఇబ్బందులు తలెత్తి రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తు చేయ లేని వారు, చేసినవారు అందిస్తున్న దరఖాస్తులను స్వీకరిస్తున్నాం. ఇందుకోసం హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశాం. అభ్యర్థులకు దరఖాస్తు ఫారాలు కూడా అందిస్తున్నాం. – శ్రీనివాస్, ఎంపీడీవో, పెద్దపల్లి -
వైభవం.. రాములోరి కల్యాణం
● సీతాదేవిని వివాహమాడిన శ్రీరాముడు ● ఊరూరా అంగరంగ వైభవంగా ఉత్సవాలు ● పులకించిన భక్తజనులుపెద్దపల్లిరూరల్/గోదావరిఖని: ఆకాశమంతా పందిరి వేశారు.. రకరకాల పూలు అలంకరించారు.. ఊరంతా మామిడితోరణాలు కట్టారు.. శ్రీసీతారాముల విగ్రహాలను అందంగా ముస్తాబు చేశారు.. అద్భుతంగా నిర్మించిన కల్యాణ వేదికపైకి తీసుకొచ్చారు.. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో రాములోరి కల్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిపించారు. జిల్లాలోని గోదావరిఖని, పెద్దపల్లి శ్రీకోదండ రామాలయాలు, ఎన్టీపీసీ, రామగుండం, యైటింక్లయిన్‌కాలనీ, మంథని, సుల్తానాబాద్‌తోపాటు ఓదెల శ్రీమల్లికార్జునస్వామి ఆలయాల్లో సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిపించారు. ఆయా ప్రాంతాల్లో ప్రములుఖులు హాజరయ్యారు. భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చి స్వామివారల కల్యాణాన్ని కనులారా వీక్షించారు. -
విగ్రహావిష్కరణకు ఆహ్వానం
గోదావరిఖని: నగరంలో ఈనెల 11న ని ర్వహించే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహావిష్కణ కార్యక్రమానికి రావాలని కోరుతూ బీసీ జాతీయ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యకు విన్నవించారు. ఈమేరకు బీసీ లైజన్ అధికారి పెరుమాళ్ల శ్రీనివాస్, కై లాసకోటి శ్రీనివాస్, గజేందర్ ఆదివారం హైదరాబాద్‌లో కృష్ణయ్యను కలిశారు. కార్యక్రమానికి హాజరు కా వాలని ఆహ్వానపత్రిక అందజేశారు. ఇందుకు ఆయన అంగీకరించినట్లు వారు పేర్కొన్నారు. హామీల అమలుకు పోరాటం చేస్తాంసుల్తానాబాద్(పెద్దపల్లి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్ తో పోరాటం చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ని పలు ప్రాంతాల్లో ఆదివారం బీజేపీ ఆవి ర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. హెచ్‌సీ యూ భూములను అమ్ముకోవాలని చూసిన రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం చెంప పెట్టులాంటిదన్నారు. యాసంగి పంట లు ఎండిపోకుండా ఎస్సారెస్పీ ద్వారా మరో తడి అందివ్వాలని కోరారు. నాయకులు కడారి అశోక్‌రావు, సౌదరి మహేందర్ యాదవ్, కొ మ్ము తిరుపతి యాదవ్, మిట్టపల్లి ప్రవీణ్, లంక శంకర్, కోట నాగేశ్వర్, వనజ, భాగ్యలక్ష్మి, నాగుల మల్యాల తిరుపతి, ఉషణ అన్వేశ్, కా మని రాజేంద్రప్రసాద్, బుర్ర సతీశ్, గుంటి కు మార్, చిట్టవేని సదయ్య, గజభింకర్ పవన్, పల్లె తిరుపతి, కందునూరి కుమార్, ఎనగందుల సతీశ్, వెంకటేశ్, సాయికిరణ్ ఉన్నారు.అతిపెద్ద రాజకీయశక్తి బీజేపీ గోదావరిఖని: బీజేపీ ప్రస్తుతం అతిపెద్ద రాజకీ య శక్తిగా ఎదిగిందని ఆ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి అన్నారు. స్థానిక ప్రధాన చౌరస్తాలో ఆదివారం సంధ్యారాణి పార్టీ జెండా ఎగురవేసి మాట్లాడారు. దేశ హితం కోసం పనిచేస్తూ భరత్‌ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందన్నారు. నాయకులు మేర్గు హన్మంత్‌గౌడ్, బల్మూరి అమరేందర్‌రావు, కోడూరి రమేశ్, కోమళ్ల మహేశ్, గుండబోయిన భూమయ్య, పిడుగు కృష్ణ, గోగుల రవీందర్‌రెడ్డి, జక్కుల నరహరి, పెండం సత్యనారాయణ, తడగొండ నర్సన్న, కుర్ర రాజేందర్, మచ్చ విశ్వాస్ తదితరులు పాల్గొన్నారు. -
వెల్లువెత్తుతున్న దరఖాస్తులు
● ఆన్లైన్లో 16,500కుపైగా నమోదు ● సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ● ప్రత్యామ్నాయంగా ఆఫ్లైన్లోనూ స్వీకరణ ● బల్దియాలు, ఎంపీడీవో ఆఫీసుల్లో హెల్ప్‌డెస్క్‌లు ● ఆఫ్లైన్లోనూ మరో వెయ్యి వరకు దరఖాస్తులు పెద్దపల్లిరూరల్: స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా డెయిరీ, వ్యాపారం, పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం అమలులోకి తీసుకొస్తోంది. దీనిద్వారా 21 నుంచి 55ఏళ్ల మధ్య వయసుగల వారినుంచి ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ఈనెల 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఆన్లైన్లో ఇప్పటివరకు జిల్లాలో 16,500 మంది దరఖాస్తు చేశారు. ఆన్లైన్లో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయనే ఫిర్యాదులతో ఆఫ్లైన్లోనూ దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు పట్టణాల్లో మున్సిపల్, గ్రామాల్లో మండల పరిషత్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. వీటిద్వారా ఇప్పటివరకు దాదాపు 1,000 వరకు దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు.. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటుకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలిచ్చారు. వీటిద్వారా దాదాపు వెయ్యి వరకు దరఖాస్తులు అందగా, ఆన్లైన్లో నమోదు చేసిన వారే అత్యధికంగా ఉన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు ఇబ్బందులు పడుతున్న వారినుంచి ఆధార్ కార్డు, కులం, దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్, ఆహారభద్రత కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణపత్రాలతోపాటు 27 కాలమ్స్‌లో అభ్యర్థి పూర్తివివరాలు నమోదు చేయాల్సి ఉంది. వితంతు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం.. రాజీవ్ యువ వికాసం కింద సాయం పొందేందుకు మహిళలకు (అందులో ఒంటరి మహిళ, వితంతువులకు ప్రాధాన్యం) 25శాతం కేటాయించనున్నారు. దివ్యాంగులకు ఐదుశాతం వర్తింపజేస్తారు. కుటుంబంలో ఒక్కరికే ఈ పథకం వర్తిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో నివసించేవారి వార్షికాదాయం రూ.2లక్షల లోపు, పల్లెప్రాంతాలకు చెందిన వారైతే రూ.1.50లక్షల లోపు ఉండాలనే నిబంధన ఉంది. యూనిట్ ఒకటే.. నిధుల కేటాయింపుల్లోనే తేడా.. రాజీవ్ యువ వికాసం పథకం కింద లాండ్రీ, డ్రైక్లీనింగ్ షాపు యూనిట్ నిధులను బీసీ, ఎస్సీల అభ్యర్థుల కేటాయింపులో తేడా కనిపిస్తోంది. యూనిట్ ఒకటే తీరుగా ఉన్నప్పుడు కులాన్ని బట్టి యూనిట్ విలువ ఎలా మారుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ యూనిట్ స్థాపనకు ముందుకొచ్చే ఎస్సీ అభ్యర్థులకు రూ.3లక్షలు, బీసీలకు రూ.4లక్షలను కేటాయిస్తున్నారు.0.50 వరకు 100 1 వరకు 90 2 వరకు 80 4 వరకు 70జిల్లా సమాచారం ఎంప్లాయిమెంట్ ఆఫీసులో నమోదైనవారు 20,762 పదో తరగతిలోపు చదివినవారు 870 రాజీవ్ యువ వికాసానికి అందిన దరఖాస్తులు 16,500 లబ్ధిదారులకు యూనిట్ల కేటాయింపు జూన్ 2నయూనిట్ విలువ (రూ.లక్షల్లో)రాయితీ (శాతంలో) రాజీవ్ యువ వికాస పథకానికి అవసరమైన కులం, ఆదాయం సర్టిఫికెట్ల కోసం రాష్ట్రంలోని మీ సేవ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సుమారు 15 లక్షల వరకు దరఖాస్తు చేశారు. ఈనెల 2వ తేదీన ఒక్కరోజే రికార్డుస్థాయిలో దాదాపు 1.50 లక్షల దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయాలకు చేరాయి. అందులో పెద్దపల్లి జిల్లాలోని మీసేవ కేంద్రాల ద్వారా దాదాపు 12వేల మంది (కుల, ఆదాయ) దరఖాస్తు చేశారని అధికారులు చెబుతున్నారు. ఇందులో 70శాతం వరకు సర్టిఫికెట్లు జారీ చేశామని వారు అంటున్నారు. మిగతా 30శాతం సర్టిఫికెట్ల కోసం అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. -
అధికారులకు రుణపడి ఉంటాం
ఎన్టీపీసీ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సామంత, హెచ్ఆర్ ఏజీఎం బిజయ్‌కుమార్ సిగ్దర్, హెచ్ఆర్ అధికారులకు రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తక్కువ పింఛన్ పొందుతున్న క్రమంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బేసిక్ పే, సర్వీసుతో కొత్త పింఛన్ మంజూరు చేయడం చాలాసంతోషంగా ఉంది. ఉద్యోగ విరమణ పొందిన ప్రతీఉద్యోగి సంతోష పడేరోజు. రామగుండం ఎన్టీపీసీ, రీజినల్ పీఎఫ్ అధికారులకు కృతజ్ఞతలు. – సురేందర్, ఉపాధ్యక్షుడు, ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం -
నైపుణ్యాలు పెంచేందుకే
నేటి పోటీ యుగానికి అనుగుణంగా విద్యార్థుల నైపుణ్యాలు పెంచాలన్న ఉద్దేశంతో సమీకృత గురుకులాలు ప్రారంభిస్తున్నాం. మార్కెట్లో నిలదొక్కుకునేలా నిపుణులైన మానవ వనరులను విద్యార్థి దశ నుంచే తీర్చిదిద్దుతాం. అందుకే, అత్యాధునిక సదుపాయాలతో 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ఉంటాయి. త్వరలో రామగుండం, పెద్దపల్లి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ పనులు కూడా మొదలవుతాయి. – మంత్రి శ్రీధర్‌బాబు -
పాలపొరకతో ఊరేగింపు
పాలకుర్తి(రామగుండం): వివిధ గ్రామాల్లో ఆ దివారం నిర్వహించనున్న శ్రీసీతారాముల క ల్యాణ మహోత్సవానికి ఉత్సవ కమిటీలు ఏ ర్పాట్లు చేశాయి. బసంత్‌నగర్, పాలకుర్తి, కొత్తపల్లి, రామారావుపల్లి, పుట్నూర్, కుక్కలగూడూర్, జీడీనగర్, బామ్లానాయక్‌తండా, కన్నా ల, రాణాపూర్ గ్రామాల్లోని రామాలయాలతో పాటు ఆంజనేయస్వామి ఆలయాలను పచ్చనితోరణాలు, విద్యుత్ దీపాలతో అలంకరించా రు. కల్యాణంలో తొలిఘట్టం పాలపొరక కార్యక్రమం నిర్వహించారు. ఎడ్లబండ్లు, బైక్‌లపై పాలపొరకను ఊరేగింపుగా తీసుకు వచ్చి గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ‘రైల్వే’ ఎన్నికలు ప్రశాంతంరామగుండం: ఆలిండియా ఎస్సీ, ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్, రామగుండం బ్రాంచి అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నికలు శనివా రం ప్రశాంతంగా జరిగాయి. రామగుండం బ్రాంచి పరిధిలోని ఆర్మూర్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాఘవపురం, రామగుండం, పెద్దంపేట, మంచిర్యాల రైల్వేస్టేషన్లలో పని చేసే రైల్వే ఉద్యోగులు సుమారు 101 ఓటర్లుగా నమోదయ్యారు. ఇందులో 85 మంది ఓటుహ క్కు వినియోగించుకున్నారు. రామగుండం బ్రాంచి అధ్యక్షుడిగా బి.కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా మాతంగి దినేశ్, కోశాధికారిగా పుల్లూరి లక్ష్మణ్ ఎన్నికయ్యారు. ఈ ప్యానల్ కాలపరిమితి మూడేళ్లు ఉంటుంది.‘సన్నబియ్యం ఇస్తున్నారహో’జ్యోతినగర్(రామగుండం) : ప్రజలకు ఏ దైనా సమాచా రం తెలియజేయాలంటే డ ప్పు చాటింపు వేసేవారు. ప్ర స్తుతం ఆధుని క సాంకేతిక ప రిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. మొబైల్ఫోన్లు మరింత వేగంగా సమాచారం చేరవేస్తున్నాయి. అయి నా, నగరంలోని ఐదో డివిజన్ నర్రాశాలపల్లె లో గతకాలం నాటి పద్ధతిని గుర్తుచేసేలా శనివారం ‘రేషన్ దుకాణంలో సన్నబియ్యం పోస్తున్నారహో’ అని చిలుముల లింగయ్య డప్పు చాటింపు వేయడం ఆసక్తి కలిగించింది. పాలిసెట్‌కు ఉచిత శిక్షణ గోదావరిఖని: సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆ సంస్థ పాఠశాలల్లో టెన్త్ పాసైన విద్యార్థులకు ఉచితంగా పాలిసెట్ శిక్షణ ఇవ్వనున్నట్లు సొసైటీ సెక్రటరీ శ్రీనివాస్, ఆర్జీ–2 డీజీఎం అనిల్‌కుమార్ తెలిపారు. ఆసక్తిగలవారి కోసం ఈనెల 10 నుంచి యైటింక్లయిన్ కాలనీ సెక్టార్–3 సింగరేణి ఉన్నత పాఠశాలలో శిక్షణ తరగతులు ప్రారంభిస్తామన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు ధర్మారం(ధర్మపురి): అర్హులందరికీ సంక్షేమ ఫ లాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని విప్ లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంతోపాటు నర్సింగపూర్, పత్తిపాకలో శనివారం ఆయన సన్నబియ్యం పంపిణీ ప్రారంభించి మాట్లాడారు. సంపన్నులతో సమానంగా పే దలు కూడా సన్నబియ్యంతో కూడిన భోజనం చేయాలనే ధ్యేయంతో ప్రభుత్వం తెల్లరేషన్‌కార్డుదారులకు ఒక్కొక్కరికి నెలకు 6 కేజీల సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్నారు. మండలంలో 16,308 రేషన్‌కార్డులు ఉండగా 47,788 మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. వారందరికీ సన్నబియ్యం అందిస్తున్నట్లు వివరించారు. బీ ఆర్ఎస్ సర్కార్ పదేళ్లలో ఒక్కరేషన్కార్డు కూ డా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మాట ప్ర కారంగా దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ ఈనెలాఖరులోగా రేషన్‌కార్డులు అందిస్తుందని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూ ప్లానాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం చైర్మన్ సంతోష్, మాజీ ఎంపీపీ కొడారి హన్మయ్య, తహసీల్దార్ వకీల్, ఆర్ఐ వరలక్ష్మి పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం
● ప్రభుత్వం రైతులకు వెంటనే పంట నష్టం పరిహారం చెల్లించాలి ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి జూలపల్లి(పెద్దపల్లి): అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం పరిహా రం చెల్లించకుంటే రైతులతో కలిసి పెద్దపల్లి ఎ మ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి హెచ్చరించారు. మండ ల కేంద్రంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఎమ్మెల్యే కంటితుడుపుగా పరామర్శించి వెళ్లిపోయారని, పరిహరంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదన్నారు. ఎకరాకు రూ.50వేల ప రిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగనివ్వబోమని హెచ్చరించారు. నాయకులు ప్రదీప్‌కుమార్, జ్యోతిబసు, పెద్దోల్ల ఐలయ్య, తీగెల లశోక్గౌడ్, దోడ్ల రాజిరెడ్డి, వెల్పుల ఓదెలు, గుమ్మడి శ్రీనివాస్ పాల్గొన్నారు. బీజేపీని విస్తరించాలి సుల్తానాబాద్: బీజేపీ అన్ని రంగాల్లో విస్తరించినప్పుడే ముందు వరుసలో ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ గ్రంథాలయం కార్యదర్శిగా గుడ్ల వెంకటేశ్ ఎన్నిక సందర్భంగా స్థాని క పార్టీ కార్యాలయంలో ఆయనను సన్మానించా రు. ఈసందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడారు. నా యకులు కడారి అశోక్‌రావు, సౌదరి మహేందర్‌యాదవ్, కూకట్ల నాగరాజు, నాగులమల్యాల తిరుపతి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
ఫలించిన పదేళ్ల పోరాటం
● ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగులకు కొత్త పింఛన్ అమలుజ్యోతినగర్(రామగుండం): దేశానికి వెలుగులు పంచుతున్న ఎన్టీపీసీలో నిర్విరామంగా విధులు నిర్వహించడంలో ముఖ్యపాత్ర పోషించిన ఉద్యోగులకు ఉద్యోగ విరమణ తర్వాత అరకొర పింఛన్ వచ్చేది. ఈపీఎస్–95 పద్ధతి ద్వారా ఇలా తక్కువ మొత్తంలో డబ్బులు చేతికి అందడంతో వారి కుటుంబాలకు ఆర్థికంగా అనేక ఇబ్బందు లు ఎదుర్కొనేవి. ఈ పద్ధతి మార్చాలని సుమా రు పదేళ్లుగా రిటైర్డ్ ఉద్యోగులు అనేక పోరాటలు చేస్తూ వస్తున్నాయి. వీటి ఫలితంగా బేసిక్‌పై పింఛన్ మంజూరు కావడంతో వారిశేష జీవితంలో ఎన్టీపీసీ మళ్లీ వెలుగులు ప్రసరింపజేస్తోంది. రిటైర్డ్ ఉద్యోగులు 368 మంది.. రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టులో ఇప్పటివరకు సుమారు 368 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేశారు. రిటైర్మెంట్ తర్వాత కేటగిరీల ఆధారంగా రూ.2వేల – రూ.4వేల వరకే పింఛన్ వచ్చేది. ప్రభుత్వరంగ సంస్థలో పనిచేసినా ఇంత తక్కువ మొత్తంలో పింఛన్ రావడంతో అవసరా లు తీరక తీవ్ర ఆవేదన చెందేవారు. 01–09– 2014లో సుప్రీంకోర్టు తీర్పు వీరి పింఛన్ పెంపుదలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగ విరమణ పొందిన వారికి నిజవేతనంపై పింఛన్ మంజూరు చేయాలని ఉత్తర్వులు విడుద ల చేసింది. దీంతో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు అధిక పింఛన్ పొందేందుకు అర్హులుగా తేలామని ఊరట చెందారు. 2022లో సుప్రీంకోర్టుకు.. పింఛన్ వ్యవహారంలో తమకు న్యాయం చేయాలంటూ ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగులు 2022లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు వాయిదాల అనంతరం ఈపీఎస్–95ని మార్పుచేయడంతోపాటు నిజవేతనం, సర్వీసు ఆధారంగా పింఛన్ మంజూరు చేయాలని తీర్పునిచ్చింది. ఈమేరకు రీజినల్ పీఎఫ్ కమిషన్ తానయ్య రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్ మంజూరు పత్రాలను అందించారు. ఈనెల ఐదుగురు ఉద్యోగ విరమణ పొందేవారు తొలిసారి పెరిగిన పింఛన్ అందుకోనున్నారు. మిగతావారు విడతల వారీ గా పీఎఫ్ బకాయిలను చెల్లించిన అనంతరం వారి సర్వీసు, నిజవేతనాలను లెక్కించి పింఛన్ మంజూరు చేయనున్నారు. కొత్త పింఛన్ పత్రాలు అందజేత ఎన్టీపీసీలో ఉద్యోగ విరమణ చేసిన వారికి బేసిక్–పే, సర్వీసును బట్టి కొత్త పింఛన్ విధానం అమలవుతోందని ఏజీఎం(హెచ్ఆ ర్) బిజయ్‌కుమార్ సిగ్దర్ అన్నారు. ఈపీఎస్–95 పింఛన్ విధానంలో భాగంగా రిటైర్డ్ ఉద్యోగులకు శనివారం ఆయన కొత్త పింఛ న్ మంజూరు పత్రాలను అందించి మాట్లాడారు. అధిక వేతనాలపై ఈపీఎస్–95 పింఛన్ సులభతరం చేయడంలో రామగుండం ఎన్టీపీసీ ముఖ్యమైన మైలురాయిని చేరుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. -
న్యాయవాదవృత్తి మహోన్నతమైనది
● హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రయ్య సుల్తానాబాద్(పెద్దపల్లి): సమాజంలో ఉత్పన్నమయ్యే సమస్యలకు పరిష్కారం చూపించే న్యాయవాద వృత్తి మహోన్నతమైనదని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గుండా చంద్రయ్య అన్నారు. సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. న్యాయవాదులతో మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను సమాజంలో అమలు చేసేలా అవగాహన కల్పించాలన్నా రు. ఇందుకోసం న్యాయవాదులు నిస్వార్థంగా సేవలు అందించాలని ఆయన సూచించారు. మానవ హక్కుల ఉల్లంఘనలను అడ్డుకుని, వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడాలని జడ్జి కోరారు. సుల్తానాబాద్ జడ్జి గణేశ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో జస్టిస్ చంద్రయ్యను ఈ సందర్భంగా సన్మానించారు. సు ల్తానాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యద ర్శి బోయిని భూమయ్య, న్యాయవాదులు ఆవుల లక్ష్మీరాజం, పబ్బతి లక్ష్మీకాంతరెడ్డి, భూసారపు బాలకిషన్ప్రసాద్, మాడూరి ఆంజనేయులు, జోగుల రమేశ్, సామల రాజేంద్రప్రసాద్, ఆవుల శివకృష్ణ, గుడ్ల వెంకటేశ్, బొబ్బిలి శ్యాం, మ ల్యాల కరుణాకర్, లెక్కల గంగాధర్, తిరుపతి, సారయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
యంగ్ ఇండియా ‘గ్రీన్’ గురుకులాలు
● మంథని, హుస్నాబాద్‌లో నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు ● సొంతంగా విద్యుత్తు ఉత్పత్తి చేసుకునేలా చర్యలు ● తొలుత ఒక్కో స్కూల్‌కు రూ.145 కోట్లు వెచ్చించనున్న సర్కారు ● త్వరలో పెద్దపల్లి, రామగుండంలోనూ అందుబాటులోకి ● మంథని మండలం సోమనపల్లిలో 25 ఎకరాలు కేటాయింపు ● డిజిటల్ బోధన, క్రీడా, ఇతర ఆధునిక సదుపాయాలు ● వచ్చే ఏడాది దసరాకు విద్యార్థులకు అందుబాటులోకిసాక్షి ప్రతినిధి, కరీంనగర్: నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా బోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ (సమీకృత గురుకులాలు) నిర్మాణానికి అడుగులు వేస్తోంది. 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.1,100 కోట్లకుపైగా నిధులు విడుదల చేసింది. అందులో తొలిదశలో ఒక్కో పాఠశాలకు రూ.145 కోట్ల చొప్పున వెచ్చించి అత్యాధునిక సదుపాయాలు కల్పించనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం శనివారం తొలిఅడుగు వేసింది. తొలిదశలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో ఈ సమీకృత గరుకులాలను నిర్మించేందుకు టెండర్లు పిలిచింది. త్వరలోనే టెండర్లు ఖరారు చేసి నిర్మాణం వేగవంతం చేయనున్నారు. ఈ విద్యాలయాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లను సైతం ఏర్పాటు చేయబోతుండటం విశేషం. సోలార్ ఫలకల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపడతారు. వచ్చే ఏడాది దసరాకు ప్రారంభం ఈ రెండు స్కూళ్లను రూ.145 కోట్ల వ్యయంతో నిర్మించాలని ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. టెండర్లు పూర్తి కాగానే మంథని, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో స్కూళ్ల నిర్మాణ ప్రక్రియ మొదలవనుంది. ఇప్పటికే మంథని నియోజకవర్గంలోని సోమనపల్లి వద్ద ప్రభుత్వం 25 ఎకరాల చొప్పున కేటాయించగా.. మంత్రి శ్రీధర్‌బాబు ఈ సమీకృత గురుకులాలకు ఇటీవల శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. త్వరలో నిర్మాణాలు ప్రారంభించి.. వచ్చే ఏడాది దసరాకు భవనాల నిర్మాణం పూర్తి చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో మంత్రి శ్రీధర్‌బాబు ఉన్నారు. ప్రతీ స్కూల్ కోసం ప్రభుత్వం రూ.200 కోట్లకుపైగా నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించనుండటం గమనార్హం.ప్రత్యేకతలు ఇవే.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలను 25 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మిస్తారు. 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన చేస్తారు. తరగతి గదులలో డిజిటల్ స్మార్ట్ బోర్డ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ ఉంటాయి. క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ క్రీడల కోసం మైదానం, సౌకర్యాలు కల్పిస్తారు. ప్రతీ స్కూల్లో 2500 పైగా విద్యార్థులు, వీరికి 120 మంది టీచర్లతో బోధన సొంత సోలార్ విద్యుత్‌తో లిప్టులు, వీధిదీపాలు, క్లాస్రూమ్ ఉపకరాణల నిర్వహణ ఉంటుంది. -
ఆరోగ్య రక్షణ అవసరం
పెద్దపల్లిరూరల్: ప్రజలు తమ ఆరోగ్య రక్షణకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వప్నరాణి సూచించారు. పెద్దకల్వలలో శుక్రవారం ఆరోగ్య పరిరక్షణపై నిర్వహించిన సదస్సులో జడ్జి మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం, పోషకవిలువలున్న ఆహా పదార్థాలు తీసుకోవడంతో ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. పల్లె దవాఖానా డాక్టర్ రాజేశ్‌కుమార్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ‘పద్య వైభవం’ పుస్తకంలో రాకుమార పద్యాలకు చోటు కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని చెందిన ప్ర ముఖ కవి, రచయిత రాసి న ఐదు కందపద్యాలు, ప ద్యాశారస్వత పీఠం ఆధ్వర్యంలో ప్రచురితమైన ప్ర ముఖ ‘పద్య వైభవం’ పుస్తకంలో ప్రచురితమయ్యాయి. రాష్ట్రంలోని పలువురు అవధానులతో సహా 180 మంది పద్యకవులు 900 పద్యాలు ఇందులో రాశారు. గోదావరిఖనికి చెందిన కవి రాకుమార పద్యాలకూ ఇందులో చోటు లభించింది. ఈనెల 5న హైదరాబాద్‌లో పుస్తకావిష్కరణ చేస్తారు. ఈ సందర్భంగా కవి రాకుమారను సన్మానించనున్నట్లు పద్య సారస్వత పీఠం అధ్యక్షుడు ఆవుసుల భానుప్రకాశ్ తెలిపారు. -
ప్రభుత్వ వైద్యుల ఘనత
● అభినందించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి పండంటి కవలలకు పురుడు పోశారు. వీరి ప్రతిభ, అంకితభావం, తీసుకున్న చొరవ, నైపుణ్యాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో వరుసగా అరుదైన శస్త్ర చికిత్సలు కొనసాగుతున్నాయని, రెండు రోజుల క్రితం క్రిటికల్ కేర్ ఆపరేషన్ చేయగా, తాజాగా గురువారం రాత్రి మరో ట్విన్స్ డెలివరీ ఆపరేషన్‌ను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. బొంపల్లి గ్రామానికి చెందిన అరికిళ్ల మేఘన నిండు గర్భిణి. ఎంసీహెచ్‌లో ఆరోగ్య పరీక్షలు పూర్తిచేసుకుని తొలికాన్పు కోసం బుధవారం ఎంసీహెచ్‌లో చేరింది. గర్భంలో కవలలు ఉండటంతో వైద్యులు పాపల ఊపిరితిత్తుల పరిణతి కోసం చికిత్స అందించారు. గురువారం సాయంత్రం మేఘనకు నొప్పులు రావడంతో అప్రమత్తమైన వైద్య బృందం డెలివరీ కోసం ఏర్పాట్లు చేశారు. అయితే, రక్తస్రావం ఎక్కువ జరిగే అవకాశం ఉండడంతో ప్ర త్యేక జాగ్రత్తలు తీసుకుని మేఘనకు సుఖప్రస వం చేయగా.. ఒక మగ, ఆడ శిశువులకు జన్మనిచ్చింది. చిన్నారులను పిల్లల వైద్యులు పరీక్షించి తల్లి ఒడిలోకి చేర్చారు. తల్లీబిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, క్రిటికల్ కేర్ వైద్య సేవలు అందించిన వైద్యులు ప్రియాంక, కృష్ణవేణి, సంధ్య ను కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీహెచ్ఎస్ శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ప్రజలు హైరిస్క్ క్రిటికల్ సేవలను సద్వినియోగం చేసు కోవాలని శ్రీధర్ కోరారు. ప్రతీ గర్భిణికి 2–డీ ఇకోతో పాటు ప్రతీఆర్గాన్ని పరీక్షించే టిఫా స్కా న్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. -
కాలం చెల్లినా.. రయ్రయ్!
● ఫిట్నెస్ లేదు.. బీమా చేయరు ● రోడ్డుపై 15ఏళ్లు దాటిన వాహనాలు ● జిల్లాలో పెరుగుతున్న కాలుష్యం ● అనేక ప్రమాదాలకూ ఇవే కారణాలు జిల్లాలో వాహనాల సమాచారం ద్విచక్ర 84,739 సరుకు తరలించేవి 7,694 కార్లు 11,876 ఆటోలు 1,844 మోటర్ సైకిళ్లు 2,459 ఇతరత్రా 28,479 మొత్తం 1,37,091 15ఏళ్లు పైబడినవి ద్విచక్ర 16,747 కార్లు 3,717 జీప్‌లు 32 మోటర్ సైకిళ్లు 15 ఇతరత్రా 1,869 మొత్తం 22,380 సాక్షి, పెద్దపల్లి: ‘కాలం చెల్లిన వాహనాలను వదిలించుకోండి.. రాయితీతో కొత్త వాహనాలు కొనుగోలు చేయండి’ అని ప్రభుత్వం చెబుతున్నా అమలుకు నోచుకోవడం లేదు. అధికారుల తనిఖీలు లేక 15 ఏళ్లకు పైబడిన, కాలంచెల్లిన వాహనాలు రోడ్డెక్కుతూనే ఉన్నాయి. ఫలితంగా వాయు కాలుష్యం పెరుగుతోంది. ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫిట్నెస్.. బీమా ఉంటేనే రోడ్డెక్కాలి.. లారీలు, కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు ఫిట్నెస్, బీమా, కాలుష్య నియంత్రణ ధ్రువీకరణపత్రాలు ఉంటేనే రోడ్లపైకి రావాలి. చాలామంది ఇలాంటి ధ్రువీకరణపత్రాలు లేకపోయినా, కాలం చెల్లిన వాహనాలను వినియోగిస్తున్నారు. అధికశాతం ఇలాంటి వాహనాలతోనే రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, తద్వారా నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటోందని పలువురు నిపుణులు చెబున్నారు. బీమా లేక, సాయం అందక బాధిత కుటుంబాలు కూడా వీధినపడుతున్నాయంటున్నారు. ద్విచక్రవాహనాలే అధికం.. జిల్లాలో అన్నిరకాల వాహనాలు కలిపి 1,37,091 ఉండగా, అందులో 15ఏళ్ల పైబడిన వాహనాలు 22,380 ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. ప్రధానంగా సెకండ్ హ్యాండ్ కార్లు, ద్విచక్ర వాహనాల ద్వారా అధికంగా కాలు ష్యం వెలువడుతోంది. కాలుష్యంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో జిల్లావాసులు ఇబ్బంది పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. కాలు ష్యాన్ని నియంత్రించడంతోపాటు భవిష్యత్ ముప్పుపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండానే.. వాహన తయారీ కంపెనీలు 15ఏళ్లపాటు మాత్రమే వినియోగించాలని ధ్రువీకరిస్తున్నాయి. ప్రతీ ఆర్నెల్లకోసారి కాలుష్యం తనిఖీ చేసి సర్టిఫికెట్ తీసుకోవాలి. ఇవి ఎక్కడా అమలు కావడంలేదు. ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ అవసరం లేదని అధికారులు అంటున్నారు. అయితే పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఇది తప్పనిసరి. స్క్రాప్ పాలసీపై అవగహన లేక.. పాత వాహనాలను స్క్రాప్‌గా పరిణించేలా ప్రోత్సహించేందుకు ‘వలంటరీ వెహికలల్ ప్లీట్ మోడర్నైజేషన్ పాలసీ(వీవీఎంపీ)’ని 2024 అక్టోబర్ 8న ప్రకటించారు. దీనిద్వారా 15 ఏళ్లు పైబడిన నాన్ ట్రాన్స్పోర్ట్, 8 ఏళ్లు పైబడిన ట్రాన్స్పోర్ట్ వాహనాలను స్క్రాప్‌గా చేయడం ద్వారా కాలుష్యన్ని తగ్గించడం, రోడ్డు భద్రతను మెరుగుపరచడం ఈ పాల సీ లక్ష్యం. 15 ఏళ్లు పూర్తికావడంతో పాటు ఫి ట్నెస్లేని వాటిని తుక్కుకు తరలిస్తే కొత్త వాహనం కొనుగోలు చేసే సమయంలో ట్యాక్స్‌లో రాయితీ పొందే అవకాశం ఉంది. పాలసీ ప్రకటించిన నుంచి రెండేళ్లలోపు స్క్రాప్ చేసే వాహనాలకు గ్రీన్‌ట్యాక్స్, క్వార్టర్లీ ట్యాక్స్‌పై జరిమానా మాఫీ చేస్తారు. పాత వాహనాలను తుక్కుగా చేయకుండా వాహనదారు మరోవాహనం కొనుగోలు చేస్తే అదనంగా 2 శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ తుక్కుగా మార్చితే పన్నుభారం ఉండదు. కొత్త వాహనంపై రాయితీ పొందే అవకాశం ఉంటుంది.వాహనాలు తుక్కుగా మార్చితే వర్తించే రాయితీ ద్విచక్రవాహనం ధర(రూ.లక్షల్లో) పన్నురాయితీ(రూ.లక్షల్లో) 1 లోపు 1,000 1–2 లోపు 2,000 2–3 లోపు 3,000 3–4 లోపు 4,000 4–5 లోపు 5,000 నాలుగు చక్రాలు 5 లోపు 10,000 5 –10 లోపు 20,000 10 –15 లోపు 30,000 15 – 20 లోపు 40,000 20కి పైగా 50,000 పొల్యూషన్ సర్టిఫికెట్ పొందాలి వాహనదారులు బాధ్యతగా పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఏళ్లుగా ఫిట్నెస్ పరీక్ష చేయించుకోకుండా, ట్యాక్స్ చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న వారి వాహనాల్ని సీజ్ చేస్తున్నాం. ఫిట్నెస్తోపాటు ఇతర సర్టిఫికెట్లు లేకున్నా చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులు, డ్రైవర్లకు రోడ్డు నియమాలపై అవగాహన కల్పిస్తున్నాం. – రంగరావు, ఆర్టీవో -
● అడ్డంకులు అధిగమించి పేదలకు మేలు ● సన్నబియ్యం పంపిణీలో పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దు ● ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
అభివృద్ధిని అడ్డుకునే కుట్ర మంథని: రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని విన్నివిస్తే.. కొన్ని రాజకీయ పార్టీలు అభివృద్ధికి అ డ్డుపడుతున్నాయని, ఇలాంటి అడ్డంకులు అధిగమించి పేదలకు మేలుచేసే దిశగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దు ద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. స్థానిక నృసింహ శివకిరణ్ గార్డెన్లో మంథని, ముత్తారం, రామగిరి, క మాన్పూర్ మండలాలకు చెందిన తెల్లరేషన్ కార్డుదారులకు శుక్రవారం రాత్రి సన్నబియ్యం పంపిణీని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. దొడ్డుబియ్యంతో పేదలు అసౌకర్యానికి గురయ్యారని, మాటకు క ట్టుబడి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. అడవిసోమన్‌పల్లి లో రూ.200 కోట్లతో కార్పొరేట్ పాఠశాల, కళాశాల కు ధీటుగా యంగ్ ఇండియా స్కూల్ చేపట్టామన్నా రు. గతంలో బస్తాకు రెండు నుంచి నాలుగు కిలోల ధాన్యం కోత ఉండేదని, తాము అధికారంలోకి వ చ్చిన వెంటనే ఆ సమస్యకు చెక్ పెట్టామని చెప్పా రు. ఆధునిక వ్యవసాయంపై దృష్టి పెట్టామని, త్వ రలోనే డ్రోన్లు ఉపయోగించే పద్ధతి అమలు చేస్తామన్నారు. సన్నబియ్యం పంపిణీలో డీలర్లు పొరపాట్లు చేయవద్దని సూచించారు. రేషన్ డీలర్ల సమస్యల ప రిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతామని అన్నారు. అడిషనల్ కలెక్టర్ వేణు, మంథని సింగిల్‌విండో చై ర్మన్ కొత్త శ్రీనివాస్, టీజీ ఈఆర్సీ సలహా కమిటీ సభ్యుడు శశిభూషణ్ కాచే, ఆర్టీఏ సభ్యుడు మంథని సురేశ్, తహసీల్దార్ గిరి పాల్గొన్నారు. -
ఏటీసీని పూర్తిచేయండి
పెద్దపల్లిరూరల్: ఐటీఐ సెంటర్లోని ఏటీసీ భవన నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఐటీఐ ప్రాంగణంలో చేపట్టిన ఏటీసీ భవనం పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ 6 ట్రేడ్లతో యువతకు ఉపాధి శిక్షణ అందించేందుకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ భవన నిర్మాణం, పరికరాల అమరిక పనులు వేగవంతం చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సన్నబియ్యం పంపిణీ ప్రారంభంపాలకుర్తి(రామగుండం): బసంత్నగర్తోపా టు రామగుండం ఎస్టీకాలనీలో ఎమ్మెల్యే మ క్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ శుక్రవారం సన్నబి య్యం పంపిణీ ప్రారంభించారు. రాజ్‌ఠాకూర్ మాట్లాడుతూ, పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వివిధ గ్రామాల కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. హైటెన్షన్ లైన్ తొలగిస్తాం జ్యోతినగర్(రామగుండం): రామగుండం–బీ పవర్‌హౌస్ నుంచి ఎఫ్‌సీఐ వరకు విద్యుత్ సరఫరా లేని 132 కేవీ లైన్ తొలగింపునకు ట్రాన్స్‌కో ఉత్తర్వు లు విడుదల చేసిందని ఎ ఫ్సీఐ వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ పి.భగవాన్రా వు శుక్రవారం తెలిపారు. ఆరు నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని సూచించిందన్నారు. ఇందుకోసం 18 శాతం జీఎస్టీతో కలిపి రూ. 68,94,790.85 ఫీజును వివిధ దశల్లో చెల్లించాలని ఉత్తర్వులో ఆదేశించిందని పేర్కొన్నా రు. రామగుండం– బీ పవర్ హౌస్ నుంచి ఎఫ్‌సీఐ వరకు 31 పెద్ద, 20 చిన్నటవర్లు కలిపి సుమారు 7 కి.మీ. పరిధిలో ఉన్నాయన్నారు. 14 వరకు గడువు పొడిగింపు పెద్దపల్లిరూరల్: రాజీవ్ యువ వికాసం పథ కం కోసం లబ్ధి పొందేందుకు ఈనెల 14వ తే దీ వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఆఫ్‌లైన్ కోసం మండల పరిషత్ కార్యాలయం/ మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజా పాలన కౌంటర్లో దరఖాస్తులు అందుబాటు లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆక్రమణదారుపై ఎఫ్ఐఆర్ మంథని మండలం దుబ్బపల్లి శివారు సర్వే నంబర్ 173లోని 10 ఎకరాల ప్రభుత్వ భూ మిలో పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేశామని, ఈనెల 3న ఆవునూరు భానుచందర్ అందు లోని 4 ఎకరాల్లో చెట్లు కొట్టివేసి చదును చే శారని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఆర్ఐ ఫిర్యా దు మేరకు పోలీసులు భానుచందర్‌పై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. పేదలకు నాణ్యమైన భోజనం ధర్మారం(ధర్మపురి): పేదలకు నాణ్యమైన ఆ హారం అందించాలనే సంకల్పంతో తమ ప్ర భుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కటికెనపల్లి, నందిమేడారంలో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలి సి శుక్రవారం విప్ సన్నబియ్యం పంపణీ చేశా రు. లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వంపై ఆర్థికభారం పడినా పేదలకు నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యమన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, తహసీల్దార్ వకీల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానా యక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, యువ జన కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి పాల్గొన్నారు. ‘జమిలి’పై అవగాహన కల్పించాలిగోదావరిఖని: జమిలి ఎన్నికలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రవెల్లి రఘునాథ్, అల్జపూర్ శ్రీనివాస్ సూ చించారు. బీజేపీ జిల్లాస్థాయి సమావేశం శుక్రవారం స్థానిక శారదానగర్‌లో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఈనెల 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతీబూత్ స్థాయిలో జెండా ఎగురావేయాలన్నారు. పలువురు నాయకులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టర్లకు పని.. అధికారులకు కమీషన్
● ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న రైల్వేశాఖ ● మౌలిక సదుపాయాల కల్పనలో అధికారుల నిర్లక్ష్యం ● రామగుండం రైల్వేస్టేషన్ ఆధునికీకరణ తీరు రామగుండం: కాంట్రాక్టర్లకు నిత్యం పనికల్పించడం.. అధికారులకు కమీషన్లు ముట్టజెప్పడం.. కట్టడాలను నిత్యం కూల్చడం.. మళ్లీ కట్టడమే రైల్వేస్టేషన్లలో కొనసాగుతున్న తంతు.. అమృత్ భా రత్ పథకంలో రూ.కోట్లు వెచ్చించి స్థానిక రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతోంది. రెండేళ్ల క్రితం నాటికి ప్రస్తుతానికి ఎంతో ఆధునికత సంతరించుకుంది. ఇది నాణేనికి ఒకవైపే.. ఉద్యోగుల సంక్షేమంపై నిర్లక్ష్యం ప్రదర్శించడం, కనీస సౌకర్యాలు విస్మరించడం నాణేనికి మరోవైపు.. ఇది రైల్వేశాఖ ద్వంద్వ నీతికి అద్దంపడుతోందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తాగునీటి సరఫరా లేదు.. రైల్వే కార్మిక కుటుంబాలకు మిషన్ భగీరథ లేదా మినరల్ వాటర్ అందించడంలేదు. మూడేళ్ల క్రితం రెండుచోట్ల ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు నిర్వహ ణ లోపంతో మూలన పడ్డాయి. వాటి మరమ్మతును పట్టించుకునే వారు కరువయ్యారు. ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన కార్మికుల క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయి. ఎప్పుడు కూలుతాయో తెలియకుండా ఉంది. ప్రమాదపు అంచన ఉన్న కొన్నింటిని కూల్చివేసిన అధికారులు.. శిథిలాలను అలాగే వదిలేశారు. దీంతో అందులో పాములు, తేళ్లు, విషపురుగులు దూరి స్థానికులను భయపెడుతున్నాయి. పిచ్చిమొక్కలు.. కోతులకు ఆవాసాలు.. రైల్వేస్టేషన్ సుందరీకరణపైనే అధికారులు దృష్టి సారిస్తున్నారు. కానీ, కార్మిక కుటుంబాల క్వార్టర్ల మధ్య పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగినా, అపరిశుభ్రత తాండవిస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఎస్సీ, బీసీ కార్మిక సంఘాల కార్యాలయాల వెనకాల ఇలాంటి మొక్కలు అడవిని తలపిస్తున్నాయి. వందలాది కోతులు దానిని ఆవాసంగా ఏర్పాటు చేసుకుని కార్మిక కుటుంబాలపై దాడులు చేస్తున్నాయి. తరచూ రేకుల షెడ్డుపై కోతులు విన్యాసాలు చేయడంతో సమీపంలోని లోకో పైలెట్లు, గార్డులు విశ్రాంతి తీసుకోలేక అసౌకర్యానికి గురవుతున్నారు. నిద్ర భంగం కావడంతో విధులు సరిగా నిర్వర్తించే పరిస్థితి లేకుండా తయారవుతోందని ఆవేదన చెందుతున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదని మండిపడుతున్నారు. అంతేకాదు.. విద్యుత్ తీగలు పట్టుకుని వేలాడడం, సోలార్ ప్యానెళ్లపై గంతులు వేయడంతో తరచూ షార్ట్‌సర్క్యూట్ జరుగుతూ రైల్వే ఆస్తులకూ నష్టం వాటిల్లుతోంది. తెరచుకోని మరుగుదొడ్లు.. రెండో ప్లాట్‌ఫారంపై ప్రయాణికుల కోసం నిర్మించిన మరుగుదొడ్ల కాంప్లెక్స్ ఇంకా తెరచుకోవడం లేదు. ఫలితంగా వరంగల్, విజయవాడ, హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు ఒకటి, రెంటికి ఇబ్బంది పడుతున్నారు. కొందరు ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపై ఉన్న టాయిలెట్స్‌కు పరుగులు పెడుతున్నారు. ప్రమాదాల బారినపడుతున్నారు. రూ.26.5 కోట్లతో ఆధునికీకరణ.. రైల్వేస్టేషన్లో ఏటా ఏదోఒక నిర్మాణం చేపడుతు న్నారు. దీంతో కాంట్రాక్టర్లకు చేతినిండా పని లభి స్తుండగా.. అధికారులకు కమీషన్ల రూపంలో వద్ద న్నా ఆదాయం వచ్చిపడుతోంది. ప్రస్తుతం అమృత్ భారత్ పథకంలో రూ.26.5 కోట్లు వెచ్చించి రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు నిర్వహిస్తున్నారు. దీనిద్వారా సిమెంట్ పనులు చేసిన మరుసటి రోజే పెయింటింగ్స్ వేస్తున్నారు. ఐదు రోజులైనా నీటితో క్యూరింగ్ చేయాల్సి ఉన్నా.. ఆ పనిచేయడంలేదు. తద్వారా నాణ్యతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవారంలోగా ప్రధాని, రైల్వేశాఖ మంత్రి వర్చువల్ విధానంలో రైల్వేస్టేషన్‌ను ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. -
ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లిరూరల్: ప్రజాసేవ చేయాలనే తపనతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, రెండుసార్లు ఓడినా ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. రంగాపూర్ గ్రామంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తనకు ఎలాంటి విద్యాసంస్థలు, ఇతర వ్యాపారాలు లేవన్నారు. పంటలకు సాగునీరందించేందుకు పాటుపడ్డానన్నారు. బీఆర్ఎస్ పాలనలో క్వింటాల్‌కు 8 కేజీల నుంచి 10 కేజీల వరకు ధాన్యం కొనుగోళ్లలో కోతలకు పాల్పడ్డారని ఆరోపించారు. కానీ తాను ఎన్నికయ్యాక గింజకూడ కోత లేకుండా కొనుగోళ్లు చేస్తున్నామని అన్నారు. పంటలకు నీరు కావాలె.. పంటలు చేతికందే దశకు వచ్చాయని, సాగునీటిని సరఫరా చేసేలా చూడాలని రంగాపూర్ గ్రామానికి చెందిన రాజయ్య అనే రైతు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. నీటి సరఫరా చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇస్తూనే పంటలను సకాలంలో సాగు చేసుకుంటే ఈ సమస్యలుండవు కదా? అని రైతులకు సూచించారు. ప్రియాంక అనే గ్రామస్తురాలు రంగాపూర్ స్టేజీ వద్ద బస్‌షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరగా.. స్పందించిన ఎమ్మెల్యే ఏర్పాటు చేయిస్తానన్నారు. చలివేంద్రం ప్రారంభం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ఐటీఐ వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. వేసవిలో ప్రయాణికుల దాహం తీర్చేందుకు వాకర్స్ అసోసియేషన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. సభ్యులు తిరుపతి, కొమ్ము సుధాకర్, కొమురయ్య, కనకయ్యతోపాటు ఆర్టీసీ బస్‌స్టేషన్ మేనేజర్ రాంగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పేదల ఆకలి తీర్చేందుకే సన్నబియ్యం
పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్/సుల్తానాబాద్‌రూరల్/ఓదెల: పేదల ఆకలి తీర్చాలనే సదాశయంతోనే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. గురువారం పెద్దపల్లి మండలం చీకురాయి, సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్, పూసాల, శివాలయం వీధి, గర్రెపల్లి, ఓదెల మండలం కేంద్రంతోపాటు కొలనూర్‌లో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేసి మాట్లాడారు. ఇప్పటివరకు రేషన్‌కార్డుదారులకు దొడ్డుబియ్యం పంపిణీ చేస్తే వాటిని అమ్ముకుంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతోనే ఇంకా కొంత ఆర్థికభారం పెరిగినా ధైర్యంగా సీఎం సన్నబియ్యం పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని వివరించారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఈర్ల స్వరూప, మినుపాల ప్రకాష్‌రావు, తహసీల్దార్లు రాంచందర్‌రావు, సునీత, రాజయ్య, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, విండో చైర్మన్లు శ్రీగిరి శ్రీనివాస్, ఆళ్ల సుమన్‌రెడ్డి, పార్టీ మండలాల అధ్యక్షులు చిలుక సతీశ్, మూల ప్రేంసాగర్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు -
నవజాత శిశు కేంద్రం ప్రారంభానికి చర్యలు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని గురువారం కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. ఆస్పత్రిలో నవజాతశిశు కేంద్రం ఏర్పాటుకు వచ్చిన పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, త్వరలోనే మాతాశిశు ఆస్పత్రిలో నవజాత శిశు కేంద్రం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఐఓిసీఎల్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) కింద పరికరాలు అందించారని తెలిపారు. కేంద్రం ఏర్పాటుకు అవసరమైన రూ.35 లక్షల విలువ చేసే వివిధ వైద్య పరికరాలు ఆసుపత్రికి చేరుకున్నాయని, వీటిని త్వరగా అమర్చి కేంద్రం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్నప్రసన్న కుమారి తదితరులు పాల్గొన్నారు. -
వాళ్లు అనర్హులే!
● కోర్టు సబార్డినేట్ పోస్టుల్లో ఓవర్ క్వాలిఫై అభ్యర్థులు ● మొత్తం 25 మంది అనర్హులుగా గుర్తింపు ● వెలువరించిన కోర్టు.. స్వాగతిస్తున్న నిరుద్యోగులు ● ఫలించిన ‘సాక్షి’ వరుస కథనాల పోరాటంసాక్షిప్రతినిధి,కరీంనగర్: గతంలో జరిగిన కోర్టు సబార్డినేట్ పోస్టుల విషయంలో ‘సాక్షి’ వరుస కథనాలు నిజమయ్యాయి. అటెండర్ స్థాయి పోస్టులకు అధిక విద్యార్హత (ఓవర్‌క్వాలిఫైడ్) ఉన్న వ్యక్తులు అక్రమంగా పరీక్షలు రాసి ఎంపికయ్యారంటూ రెండేళ్ల క్రితం ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన మాట విధితమే. తమకు అన్యాయం జరిగిందని, అనర్హులు ఉద్యోగాలకు ఎంపికవడాన్ని సవాలు చేస్తూ పలువురు ఈ కథనాల ఆధారంగా న్యాయస్థానాలను ఆశ్రయించారు. పోలీసు యంత్రాంగం విచారణ జరిపింది. పలువురు తాము అధిక విద్యార్హతలు కలిగి ఉన్నామని అంగీకరించి, స్వచ్ఛందంగా తప్పుకుని, ఉద్యోగానికి రాబోమని రాసి ఇచ్చారు. మరికొందరు తమకు ఏమవుతుందిలే అన్న ధీమాతో కొలువుల్లో చేరారన్న ఆరోపణలు ఉన్నాయి. తరువాత కాలంలోనూ అవి వెలుగుచూడటంతో వారిని కూడా తొలగించారు. ‘సాక్షి’ కథనాలతో.. 2019లో నిర్వహించిన కోర్టు సబార్డినేట్ పరీక్షకు అర్హత పదో తరగతి ఫెయిల్ ఉండాలని నిబంధన ఉంచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 96 పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించారు. తొలుత 1:3 రేషియోలో మొత్తం 318 మందిని పిలిచిన అధికారులు.. 93 మందితో తుదిజాబితా ప్రకటించారు. ఈ అభ్యర్థుల్లో పలువురు ఓవర్ క్వాలిఫైడ్ అని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో చాలామంది తమ అర్హతలను తగ్గించి చూపించారు. తాము 10వ తరగతి ఫెయిల్ అని కొందరు, అసలు తాము 9వ తరగతితోనే చదువు ఆపేశామని చెప్పుకుని మరికొందరు పరీక్ష రాశారు. అధికారులను నమ్మించేందుకు అప్పటికే మూతబడి ఉన్న చాలా స్కూళ్ల నుంచి బోనఫైడ్ సర్టిపికెట్లను దొడ్డిదారిలో తెచ్చుకుని మరీ సమర్పించారు. దీంతో అవే స్కూళ్లలో చదివి.. ఉద్యోగం రాని వారు.. తమతోపాటు వారు చదవలేదని ఆందోళనలకు దిగారు. ఈ విషయాన్ని పలుమార్లు ‘సాక్షి’ వరుస కథనాల ద్వారా ఎత్తిచూపింది. అనంతర కాలంలో ఓ మహిళా ఉద్యోగి గ్రాడ్యుయేట్ అన్న విషయాన్ని గుర్తించిన అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకుని, ఉద్యోగం నుంచి తప్పించడం గమనార్హం. రెండేళ్ల తరువాత విడుదలైన జాబితా.. వీరందరి రిక్రూట్మెంట్ ప్రక్రియ 2022లో మొదలైన దరిమిలా.. ఈ దుమారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అనర్హులు (ఓవర్ క్వాలీఫైడ్) తమ పొట్ట కొడుతున్నారని ఉద్యోగాలు రాని, పది ఫెయిలై పరీక్ష రాసిన వారంతా ఆందోళనలకు దిగారు. తాము ఆందోళనలు చేసిన ఇన్నేళ్ల తరువాత 25 మందితో కరీంనగర్ కోర్టు నుంచి అనర్హుల జాబితా విడుదల కావడంపై 2019లో పరీక్ష రాసిన అభ్యర్థులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ 25 మందిలోనూ ముగ్గురు రిక్రూట్మెంట్కు గైర్హాజరయ్యారని, ఒకరు ఫామ్నింపలేదని, ఒకరు ఉద్యోగంలో చేరి రాజీనామా చేశారని, మరో ముగ్గురు పోస్టులో చేరడానికి ఆసక్తి చూపలేదని పేర్కొన్నారు. మి గిలిన 17 మంది మాత్రం అధిక విద్యార్హతలు కలి గి ఉన్నారని విడుదల చేసిన జాబితాలో స్పష్టంచేశారు. దీంతో ఎట్టకేలకు తమ పోరాటం ఫలించిందని న్యాయాధికారుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ జాబితాకు సంబంధించిన కాపీ ప్రస్తుతం కరీంనగర్ కోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంది. మాకు అవకాశం కల్పించాలి కరీంనగర్ కోర్టు ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మేం తొలి నుంచి చెప్తున్న విషయం రెండేళ్ల తరువాత నిజమవడం సంతోషం. ఉద్యోగాల్లో చేరని, ఓవర్ క్వాలిఫైడ్ అభ్యర్థుల స్థానంలో తరువాత మెరిట్లో నిలిచిన నిజమైన అభ్యర్థులకు స్థానం కల్పించాలని ప్రార్థిస్తున్నాం. – రమేశ్, నిరుద్యోగి, హుజూరాబాద్ -
టార్గెట్.. ట్యాక్స్
బల్దియాల్లో ఎర్లీబర్డ్ ఆఫర్ కోల్‌సిటీ(రామగుండం): జిల్లాలోని మున్సిపాలిటీలు ఆస్తి పన్ను వసూళ్లే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లలో రామగుండం నగరపాలక సంస్థతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాల్టీలు పురోగతి సాధించాయి. అలాగే, ఈనెల 30 వరకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను ముందుస్తుగా చెల్లించేవారికి, రాష్ట్ర పురపాలక శాఖ ఎర్లీబర్డ్ ఆఫర్ పేరుతో 5 శాతం రాయితీ కల్పించింది. ఈ ఆఫర్లో ముందస్తు ఆస్తి పన్ను కూడా భారీగా వసూళ్లు చెయ్యాలని మున్సిపల్ కమిషనర్లకు టార్గెట్లు విధించినట్లు తెలిసింది. పన్ను వసూళ్లు చేయడంలో ప్రతిభ కనబర్చిన ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందించాలని రాష్ట్ర పురపాలక శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయని సమాచారం. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో శుక్రవారం అధికారులు, ఉద్యోగులను అభినందించి, వారిలో నూతన ఉత్సాహాన్ని నింపి ఎర్లీబర్డ్ ద్వారా భారీగా పన్ను వసూళ్లు చెయ్యాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది. 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్‌కు.. 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ పొందడానికి రామగుండం బల్దియాతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు అర్హత సాధించాయి. మూడు బల్దియాల్లో ఆశించినస్థాయిలో ఆస్తి పన్ను వసూళ్ల కాగా, మంథని మున్సిపాలిటీ కాస్త వెనకబడింది. మంథనిలో డిమాండ్ తక్కువగా ఉండడమే కారణంగా భావిస్తున్నారు. ఎర్లీబర్డ్‌కు రూ.4కోట్ల టార్గెట్ రామగుండం బల్దియా అధికారులు ఎర్లీబర్డ్ స్కీం ద్వారా 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.4కోట్ల వరకు ఆస్తి పన్ను వసూళ్లు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఎర్లీబర్డ్ ఆఫర్‌పై విస్తృతంగా ప్రచారం చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఎర్లీబర్డ్ ఆఫర్లో రామగుండం బల్దియా వసూళ్ల తీరు..ఆర్థిక సంవత్సరం ముందుస్తు వసూళ్లు 2019-20 రూ.82.92 లక్షలు 2020-21 రూ.1.13 కోట్లు 2021-22 రూ.1.14 కోట్లు 2022-23 రూ.1.55 కోట్లు 2023-24 రూ.1.54 కోట్లు 2024-25 రూ.1.60 కోట్లు ఆస్తిపన్ను వసూళ్లలో బల్దియాల పురోగతి బల్దియాలు డిమాండ్ వసూళ్లు రామగుండం రూ.14.76 కోట్లు రూ.10.70 కోట్లు పెద్దపల్లి రూ.5.45 కోట్లు రూ.4.48 కోట్లు సుల్తానాబాద్ రూ.2.54 కోట్లు రూ.1.85 కోట్లు మంథని రూ.1.74 కోట్లు రూ.1.40 కోట్లు ముందస్తు ఆస్తిపన్ను చెల్లించేవారికి చాన్స్ 30లోపు చెల్లిస్తే 5శాతం రాయితీ వసూళ్లపై దృష్టి పెట్టిన మున్సిపల్ కమిషనర్లుపరిశ్రమల నుంచి రాబట్టేందుకు.. రామగుండం బల్దియాలోని ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, సింగరేణి ప్రభుత్వరంగ సంస్థల నుంచి ఎర్లీబర్డ్ ఆఫర్ ద్వారా ముందస్తు ఆస్తి పన్ను వసూళ్లు చెయ్యాలని లక్ష్యం పెట్టుకున్నారు. గతేడాది ఎన్టీపీసీ రూ.2.21కోట్లు, ఆర్ఎఫ్సీఎల్ రూ.1.27 కోట్ల వరకు ముందస్తు ఆస్తి పన్ను చెల్లించాయి. ఈసారి కూడా ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌తోపాటు సింగరేణి నుంచి ముందుస్తు ఆస్తి పన్ను చెల్లించేలా ఆయా సంస్థలకు లేఖలు పంపించడానికి సిద్ధం చేస్తున్నారు. అలాగే పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని బల్దియాల పరిధిలోని రైస్‌మిల్లులు, బడా వ్యాపారస్తులకు అవగాహన కల్పించి ముందస్తు పన్ను వసూలు చెయ్యాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించినట్లు తెలిసింది.విస్తృత ప్రచారం చేస్తాం ఎర్లీబర్డ్ ఆఫర్‌పై జిల్లాలోని నాలుగు బల్దియాల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేపడుతున్నాం. పెద్దపల్లి మున్సిపాలిటీలో ఆస్తిపన్నుతోపాటు టౌన్‌ప్లానింగ్ నుంచి ఆదాయం సమకూరుతోంది. కానీ రామగుండం బల్దియాలో ఆశించినస్థాయిలో ఆదాయం రావడం లేదు. ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా కష్టతరంగా మారింది. అందుకే ఆస్తి పన్ను వసూళ్లపైనే ఎక్కువ దృష్టిపెట్టాం. మంథనిలో కూడా ఆదాయం పెంపునకు చర్యలు తీసుకుంటాం. – జె.అరుణశ్రీ, అదనపు కలెక్టర్ -
దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో ముందుకెళ్లాలి
● అడిషనల్ కలెక్టర్ డి.వేణు పెద్దపల్లిరూరల్: దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూ ర్తి అందరికీ ఆదర్శమని అడిషనల్ కలెక్టర్ డి. వేణు అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన కొమురయ్య 98వ జయంతి కార్యక్రమంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చేందుకు ప్రా ణాలు పణంగా పెట్టిన గొప్ప యోధుడు కొమురయ్య అని, ఆయన చూపిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. మహనీయులను ఒక కులానికో, వర్గానికో పరిమితం చేయకుండా వారి ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. బీసీ సంక్షే మ అధికారి రంగారెడ్డి, సంఘం అధ్యక్షుడు మల్లే శం, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. విగ్రహం ఏర్పాటు చేయాలని వినతి సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని జిల్లా కేంద్రంలోని ట్యాంక్‌బండ్‌పై ఏ ర్పాటు చేయాలని, జనగామ జిల్లాకు దొడ్డి కొ మురయ్య పేరు పెట్టాలని అడిషనల్ కలెక్టర్ వేణుకు బీసీ సంఘం నాయకులు గురువారం వినతి పత్రం అందించారు. ఆకుల స్వామి, పొ ట్యాల మల్లేశం, కర్ర కుమారస్వామి పాల్గొన్నారు. -
డేంజర్ టర్నింగ్!
గోదావరిఖని(రామగుండం): మొన్న యాష్ ట్యాంకర్ లారీ.. నిన్న లోడ్ లారీ జీఎం ఆఫీస్మూలమలుపు వద్ద బోల్తాపడ్డాయి. కారణాలేమైనా మూలమలుపు ప్రమాదకరంగా మారింది. రాజీవ్‌రహదారి వెంట రామగుండం తహసీల్ కార్యాలయం నుంచి గంగానగర్ ఫ్లైఓవర్‌వరకు రోడ్డు ప్రమాదకరంగా మారింది. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ పరిశ్రమలు ఉన్న ప్రాంతం కావడంతో రోడ్లు నిత్యం బిజీగా ఉంటున్నాయి. జనసామర్థ్యానికి తగినట్లు రోడ్డు లేకపోవడంతో ఈప్రాంతాల్లో రోజూ ఎదోచోట ప్రమాదాలు జరుగుతున్నాయి. మూలమలుపు వద్ద ప్రమాదాలు అరికట్టేందుకు స్టాపర్లు, హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసినా ప్రమాదాలు తప్పడం లేదు. గతంలో కర్రల లోడ్ లారీ బోల్తాపడడంతో కర్రలన్నీ చెల్లాచెదురుగా పడి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. హెచ్‌కేఆర్ ఆధ్వర్యంలో నిర్మించిన రహదారి వెంట తహసీల్దార్ కార్యాలయం నుంచి గోదావరిబ్రిడ్జివరకు బ్లాక్స్పాట్లు ఎక్కువగా ఉన్నాయి. స్థానికఎమ్మెల్యే దృష్టిసారించి హైవేకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని ఆదేశించగా, కొంత మేర సఫలీకృతం అయినా చాలా చోట్ల సర్వీస్ రోడ్లు పూర్తికాలేదు. ప్రమాద స్థలాలు ● ఎన్టీపీసీ లేబర్‌గేట్ వద్ద కార్మికులు రోడ్డు దాటుతున్న క్రమంలో రాజీవ్‌రహదారిపై వేగంగా వెళ్తున్న వాహనాలు ఢీకొని పలువురు మృతిచెందగా చాలామంది గాయాలపాలయ్యారు. ఇక్కడఫుట్బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. బ్లాక్‌స్పాట్‌గా ఆర్ఎఫ్సీఎల్ క్రాస్‌రోడ్డు ● ఆర్ఎఫ్సీఎల్ క్రాస్‌రోడ్డు రాజీవ్‌రహదారిపై రోడ్డు క్రాస్‌చేస్తున్న క్రమంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ● రాజీవ్‌రహదారి మున్సిపల్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. చౌరస్తా సమీపంలో మెడికల్, డిగ్రీ, పీజీ కాలేజీలు ఉండటంతో జనసంచారం పెరిగింది. ఇక్కడ పాదచారులు రోడ్డు దాటేందుకు ఫుట్‌బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలంటున్నారు. ● బస్టాండ్‌కు కొద్ది దూరంలోనే జీఎం ఆఫీస్ మూలమలుపు ఉంది. మూలమలుపు గతంతో ఇరుకుగా ఉండటంతో రాఖీ కట్టేందుకు వెళ్తున్న అన్నాచెల్లెళ్లలను లారీ ఢీకొనగా, చెల్లెలు అక్కడికక్కడే మృతిచెందింది. జీఎం ఆఫీస్ మూలమలుపు వద్ద తరచూ ప్రమాదాలు ప్రైవేట్ బస్సును ఢీకొని బోల్తాపడిన లారీ ‘ఈనెల 1న వేకువజామున జీఎం ఆఫీస్ క్రాసింగ్ వద్ద యాష్ట్యాంకర్ లారీ వేగంగా వచ్చి అదుపు తప్పి బోల్తాపడింది. ఆసమయంలో అక్కడ ఏలాంటి వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది’. ‘ఈనెల 3న గురువారం సాయంత్రం ఇదే మూలమలుపు వద్ద బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సును లారీ వెనక నుంచి రాసుకుంటూ వెళ్లి బోల్తాపడింది. ఈఘటలో బస్సు స్వల్పంగా దెబ్బతినగా డ్రైవర్‌కు గాయాలయ్యాయి’.ప్రమాదాల నివారణకు చర్యలు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఇటీవలే పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించాం. హైవే రోడ్డు కాంట్రాక్టర్ తప్పిదం ఉంటే నోటీసు ఇచ్చి సరిచేసేలా చూస్తాం. – అంబర్‌కిషోర్‌ఝా, సీపీ, రామగుండం -
ఎన్టీపీసీపై చర్యలు తీసుకోండి
గోదావరిఖని(రామగుండం): రామగుండం కార్పొరేషన్ నుంచి అనుమతులు తీసుకోకుండా పలు నిర్మాణాలు చేపట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎన్టీపీసీపై చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. అనుమతి లేకుండా ఎన్టీపీసీటౌన్షిప్లోని ఆరు ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణాలపై రామగుండం కార్పొరేషన్ రూ.99.28 కోట్ల భారీ ఫెనాల్టీ విధించిన విషయాన్ని లేఖ ద్వారా గురువారం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ నిబంధనలను ఎన్టీపీసీ ఉల్లంఘించడం ఆక్షేపనీయమని, వాటిని గౌరవించకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా చర్యలు తప్పవని ఎంపీ పేర్కొన్నారు. భవిష్యత్‌లో మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలకు భారీ ఫెనాల్టీ అంశాన్ని అత్యంత బాధ్యతాయుతంగా తీసుకుని తగిన పరిష్కార చర్యలను చేపట్టాలని, రామగుండం ప్రాంత అభివృద్ధికి సహకారాన్ని అందించాలని ఎంపీ సూచించారు. కోనోకార్పస్ చెట్ల తొలగింపుపెద్దపల్లిరూరల్: పర్యావరణం, ప్రజల ఆరోగ్యానికి కోనోకార్పస్ చెట్లు హాని కలిగిస్తాయంటూ ‘సాక్షి’లో ఈనెల 2న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లాకేంద్రంలో రాజీవ్‌రహదారి డివైడర్ల మధ్య ఉన్న కోనోకార్పస్ చెట్లను నరికివేయిస్తున్నారు. ఈ చెట్లకు నీళ్లు అవసరం లేదని, వీటిపై పిట్టకూడ వాలదు..ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్‌డయాకై ్సడ్ విడుదల చేసే మొక్కలను తొలగించాలంటూ పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే అధికారులు ఈ చెట్లను నరికివేస్తుండడంతో మళ్లీ అవి తిరిగి పెరుగుతాయని, వాటిని సమూలంగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలిగోదావరిఖని/ కమాన్‌పూర్/యైటింక్లయిన్‌కాలనీ: కమాన్‌పూర్ పోలీసుస్టేషన్‌ను గురువారం పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ తనిఖీ చేశారు. డీసీపీకి ఎస్సై కొట్టె ప్రసాద్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి రిసెప్షన్, కోర్టు డ్యూటీ ఆఫీసర్, స్టేషన్ రైటర్, రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్టేషన్‌కు వచ్చేవారితో మర్యాదగా వ్యవహరించాలని, డయల్ 100 ఫిర్యాదుకు వేగంగా స్పందించాలన్నారు. సీసీ కెమెరాల ఆవశ్యకత గురించి ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలని సూచించారు. డీసీపీ వెంట గోదావరిఖని ఏసీపీ రమేశ్‌గౌడ్ ఉన్నారు. బాధితులకు భరోసా కల్పించాలిపోలీస్స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యలు తెలుసుకొని వారికి నమ్మకం కల్పించాలని డీసీపీ కరుణాకర్ అన్నారు. గురువారం గో దావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. టూటౌన్ పరిధిలోని రౌ డీషీటర్లు, తదితర వివరాలు తెలుసుకున్నారు. మార్పు రాకుంటే కఠినంగా వ్యవహరిస్తాం రౌడీషీటర్లపై నిరంతరం నిఘా ఉంటుందని, మార్పురాకపోతే కఠినంగా వ్యవహరిస్తామని డీసీపీ హెచ్చరించారు. గోదావరిఖని వన్‌టౌన్‌లో కౌన్సెలింగ్ ఇచ్చారు. హత్య నేరాలకు పాల్పడిన కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. -
ఆధునిక యంత్రాల వైపు రైతుల చూపు
జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయ రంగం రోజురోజుకూ శాస్త్ర, సాంకేతికతను సంతరించుకుంటూ ముందుకెళ్తోంది. ఒకప్పటి నాగళ్లు, కొడవళ్లు మూలకు పడ్డాయి. వాటి స్థానంలో ట్రాక్టర్లు, డ్రోన్లు వంటి ఆధునిక యంత్రాలు వచ్చాయి. ట్రాక్టర్లతోపాటు వాటికి ఉపయోగించే పరికరాల ధరలు ఆకాశానికి ఎగబాకాయి. దీంతో సామాన్య రైతులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఆధునిక యంత్రాలపై ఆధారం మనిషి శ్రమ లేకుండా.. తేలికగా యంత్రాలతో వ్యవసాయ పనులు చేయాలని రైతులు ఆలోచిస్తున్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా ఆధునాతన యంత్రాలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. ఒకప్పుడు గ్రామానికి రెండుమూడు ట్రాక్టర్లు ఉంటే గొప్ప. అలాంటిది ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో ట్రాక్టర్లు వచ్చాయి. రైతులకు బ్యాంకులు ఈఎంఐ పద్ధతిలో రుణ సహాయం చేస్తుండటంతో ట్రాక్టర్లు కొనుగోలు చేస్తున్నా వాటికి బిగించే పరికరాలకు మాత్రం రుణ సహాయం అందించడం లేదు. ఫలితంగా చిన్న, సన్నకారు రైతులు యంత్ర పరికరాల కోసం ప్రభుత్వ సబ్సిడీ కోసం ఎదురు చూస్తున్నారు. వ్యవసాయానికి వినియోగించే ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, సీడ్ ప్లాంటేషన్, రోటోవేటర్, గడ్డిని కట్టలుకట్టే మిషన్లు, కేజీవీల్స్ వంటి పరికరాలను సబ్సిడిపై అందించాలని రైతులు కోరుతున్నారు. స్మామ్ పథకం రైతులకు వరం ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద వ్యవసాయ యాంత్రీకరణ పథకం(స్మామ్) ద్వారా ఉమ్మడి జిల్లాకు రూ 2.61కోట్లు కేటాయించింది. వీటి ద్వారా సన్న, చిన్న కారు రైతులతోపాటు మహిళా రైతులకు బ్యాటరీ స్ప్రేయర్స్, పవర్ స్ప్రేయర్స్, రసాయన మందులు పిచికారీ చేసే డ్రోన్లు, రోటోవేటర్లు, ఎరువులు, విత్తనాలు ఒకేసారి వేసే సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్, కల్టివేటర్లు, బండ్ ఫార్మర్ (పొలం మధ్య గట్లను పోసే యంత్రం), పవర్ వీడర్, బ్రష్ కట్టర్, పవర్ టిల్లర్లు, స్ట్రాబాలర్స్ను అందించాలని నిర్ణయించారు. సన్న, చిన్నకారు రైతులకు 40శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇందుకోసం మండల వ్యవసాయాధికారి కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తులను మండల పరిధిలోని తహసీల్దార్, ఎంపీడీఓ, వ్యవసాయాధికారి పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. రాయితీపై ఇచ్చే పరికరాలు రాయితీపై ఇచ్చే పరికరాలు తక్కువగా ఉండటం, దరఖాస్తులు ఎక్కువగా వ స్తుండటంతో అధికారులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. బ్యాటరీ స్ప్రేయర్స్ కరీంనగర్‌కు 94, జగిత్యాలకు 101, రాజన్న సిరిసిల్లకు 64, పెద్దపల్లికి 75, పవర్ స్ప్రేయర్స్ కరీంనగర్‌కు 94, జగిత్యాలకు 102, రాజన్న సిరిసిల్లకు 64, పెద్దపల్లికి 76, రోటోవేటర్లు కరీంనగర్‌కు 55, జగిత్యాలకు 51, రాజన్న సిరిసిల్లకు 24, పెద్దపల్లికి 35, కల్టివేటర్లు కరీంనగర్‌కు 63, జగిత్యాలకు 67, రాజన్న సిరిసిల్లకు 29, పెద్దపల్లికి 34 మంజూరయ్యాయి. ప్రతి జిల్లాకు ఒక్కటి చొప్పున డ్రోన్, మూడు చొప్పున ట్రాక్టర్లు మంజూరయ్యాయి. ఇంకా సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ కరీంనగర్‌కు 9, జగిత్యాలకు 12, సిరిసిల్లకు 4, పెద్దపల్లికి 6 మంజూరయ్యాయి. ఉమ్మడి జిల్లాకు బండ్ ఫార్మర్ 10, పవర్ వీడర్ 7, బ్రష్ కట్టర్ 17, పవర్ టిల్లర్ 10, స్ట్రాబాలర్స్ 9 మంజూరు కాగా ఆయా జిల్లాలకు 2,3 చొప్పున ఇవ్వనున్నారు. పరికరాలకు అందని సబ్సిడీ రాయితీ ఉంటే మరింత మందికి చేరువ ఇటీవల కేంద్రం నుంచి ఉమ్మడి జిల్లాకు రూ.2.61 కోట్లు 50 శాతం సబ్సిడీ ఇచ్చే పరికరాలు యంత్రం ధర ట్రాక్టర్ రూ.4లక్షల నుంచి రూ.13లక్షలు డ్రోన్ రూ.10లక్షలు రోటోవేటర్ రూ.90వేల నుంచి రూ.1.90లక్షలు ఎంబీ ఫ్లవ్ రూ.50వేల నుంచి రూ.1.40లక్షలు కల్టీవేటర్ రూ.36వేల నుంచి రూ.50 వేలు డిస్క్ కల్టీవేటర్ రూ.40వేల నుంచి రూ.50 వేలు బండ్ ఫార్మర్ రూ.40వేల నుంచి రూ.3.50లక్షలు రోటో ఫడ్లర్ రూ.26వేల నుంచి రూ.1.60లక్షలు పవర్ టిల్లర్ రూ.2లక్షల నుంచి రూ.2.40లక్షలు సీడ్కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ రూ.46వేల నుంచి రూ.60లక్షలు పవర్ స్ప్రేయర్ రూ.20వేలు పవర్ వీడర్ రూ.60లక్షల నుంచి రూ.80లక్షలు బ్రష్కట్టర్ రూ.40వేల నుంచి రూ.88వేలు స్ట్రాబేలర్స్ రూ.4లక్షల నుంచి రూ.4.40 లక్షలు మేజ్ షెల్లర్స్ రూ.66లక్షల నుంచి రూ.2.20లక్షలు (ట్రాక్టర్లు, డ్రోన్లు పొందాలంటే తప్పనిసరిగా 2.5 ఎకరాల భూమి ఉండాలి)ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం కొన్నేళ్లుగా సబ్సిడీపై యంత్ర పరికరాలు సరఫరా చేయలేదు. ఇప్పుడు దరఖాస్తు చేసుకుందామంటే జిల్లాకు ఒక్కటి రెండు పరికరాలు మాత్రమే ఉన్నాయి. మండలానికి ఒక్క పరికరం కూడా వచ్చేలా లేదు. రైతులకు అవసరమైన పరికరాలకు సబ్సిడీ వర్తింజేయాలి. – చీటేటి జీవన్‌రెడ్డి, తొంబర్రావుపేట, మేడిపల్లి మండలం దరఖాస్తులు స్వీకరిస్తున్నాం యంత్ర పరికరాల స్కీం కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ప్రతి మండలానికి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. జిల్లా, మండల లెవల్ కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యంత్రం ధరలో 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. – భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి, జగిత్యాల -
బియ్యం పథకంపై పీఎం ఫొటో పెట్టాలి
● బీజేపీ శ్రేణుల డిమాండ్ పెద్దపల్లిరూరల్: పేదలకు పంపిణీ చేసే బియ్యం పథకంపై ప్రధానమంత్రి ఫొటో ముద్రించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో బుధవారం చేపట్టిన సన్నబియ్యం పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో వారు నిరసన తెలిపారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాకేశ్‌తోపాటు నాయకులు రాజ్‌గోపాల్, పిట్టల వినయ్ తదితరులు.. పీఎం ఫొటో కూడా ముద్రించాలని డిమాండ్‌చేశారు. అ యితే, వారు లోనికి చొచ్చుకు వెళ్లకుండా సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై లక్ష్మణ్‌రావు, మల్లేశ్ అడ్డుకున్నా రు. ‘ఈ విషయమై మీ విన్నపాన్ని కలెక్టర్ ఇవ్వండి.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు’ అని ఎమ్మెల్యే విజయరమణారావు వారికి నచ్చజెప్పారు. అంతేకాదు.. ‘రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, అందులో ఇద్దరు మంత్రులుగా ఉండీ ఏం లాభం.. రాష్ట్రాభివృధ్దికి నిధులు సాధించలేక పోయారు.. అదే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం నలుగురే ఉన్నా నిధుల వరద పారించార’ని ఎమ్మెల్యే విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిధులు తెచ్చేందుకు పోరాడాలే.. తప్ప గీ బియ్యం పథకం కాడ ఫొటో కోసం కాదని హితవు పలికారు. అయి నా, మన ప్రధానే.. ఆయనను గౌరవించుకుందామని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే నచ్చజెప్పి వెళ్లిపోయారు. -
టార్గెట్ 76 మిలియన్ టన్నులు
● 2025–26లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ● అత్యధికం కొత్తగూడెం ఏరియాకు.. ● నైనీబ్లాక్ నుంచి 4 మిలియన్ టన్నులు ● వార్షిక నివేదిక విడుదల చేసిన సింగరేణి యాజమాన్యంగోదావరిఖని: సింగరేణి సంస్థ 2025–25 ఆర్థిక సంవత్సరం వార్షిక లక్ష్యం నివేదికను విడుదల చేసింది. ఈసారి 76 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని నిర్దేశించింది. ఇందులో సింహభాగం.. 15.7 మిలియన్ టన్నులు కొత్తగూడెం ఏరియాకు కేటాయించింది. ఆ తర్వాతి స్థానంలో మణుగూరు ఏరియా ఉంది. అత్యల్పంగా అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టుకు 1.5 మిలియన్ టన్నులు కేటాంచారు. నైనీబ్లాక్ ద్వారా 4 మిలియన్ టన్నులు సింగరేణి సంస్థకు చెందిన ఒడిశాలోని నైనీబ్లాక్‌లో ఈ ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి లక్ష్యాన్ని భారీగా నిర్దేశించింది. బ్లాక్ ద్వారా 4 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీయాలని నిర్ణయించింది. వాస్తవానికి గత ఆర్థిక సంవత్సరంలోనే బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రకటించినా.. సాంకేతిక కారణాలతో అది సాధ్యం కాలేదు. -
పంచ్ కొడితే పతకమే
● అంతర్జాతీయ కరాటే పోటీల్లో గ్రామీణ విద్యార్థిని ప్రతిభ ● మలేషియా ఇంటర్నేషియల్ పోటీలకు హాసిని ఎంపిక ● వరల్డ్ చాంపియన్‌లో దేశానికి మెడల్ తేవడమే లక్ష్యం ముత్తారం(మంథని): ఆమె గ్రామీణ విద్యార్థిని.. ఆర్థిక సమస్యలున్నా కరాటే పోటీల్లో పంచ్ కొడితే పతకం సాధించాలనే తపనతో ప్రతిభకు పదును పెడుతోంది. ఇటీవల జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి మే నెలలో మలేషియాలో దేశంలో జరిగే ఇంటర్నేషనల్ కరాటే పోటీలకు ఎంపికై ంది మెట్టు హాసిని. పోటీ పడితే పతకం సాధించడమే.. మంథనికి చెందిన మెట్టు దేవి – నర్సింగం దంపతులకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కుతూరు మానసకు వివాహం అయ్యింది. చిన్నకుతూరు హాసిని మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు మంథని బాలికల హైస్కూల్లో చదివింది. ముత్తా రం మండలం ధర్య పూర్ మోడల్ స్కూల్లో ఇంటటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రా సింది. నాలుగో తరగతిలోనే సీనియర్ల ను చూసి కరాటే నే ర్చుకోవడమే కాదు.. అందులో రాణించాలని కంకణం కట్టుకుంది. ఇలా ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతూనే కరాటేలో శిక్షణ తీసుకుంది. అదేసమయంలో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించింది. పోటీపడితే వెండి పతకాలతోపాటు ఇప్పటివరకు 15 బంగారు పతకాలు సాధించింది. 2024లో హరియాణాలోని పంచకుల, మధ్యప్రదేశ్‌లోని గాలియానాలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో బ్లాక్‌బెల్ట్‌లో గోల్డ్‌మెడల్ సాధించి ఔరా అనిపించింది. గతేడాది 2024 నవంబరులో కరీంనగర్లో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే పోటీల్లో బ్లాక్‌బెల్ట్‌లో ఫస్ట్డాన్గా గోల్డ్ మెడల్ కై వసం చేసుకుంది. ఈఏడాది మే 7 నుంచి 12వతేదీ వరకు మలేషియాలో జరిగే అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభ చూపే అవకాశం దక్కించుకుంది. అమ్మ ప్రోత్సాహం.. మాస్టర్ కృషి మా నాన్న మా కుటుంబానికి దూరంగా ఉంటున్నా.. మా అమ్మ కూలీ పనిచేస్తూ అక్క పెళ్లి చేసి, నన్ను చదివిస్తోంది. ఆడపిల్లకు కరాటే పోటీలు అవసరమా అని బంధువులు, ఇరుగుపొరుగువారు సూటిపోటీ మాటలతో ప్రశ్నించేవారు. ఇది మనోవేదనకు దారితీసినా.. కరాటే మాస్టర్ సమ్మయ్య నచ్చజెప్పి మళ్లీ శిక్షణ ఇచ్చారు. ఆడవాళ్లు అంటే కుటుంబానికే పరిమితం కాదనే పట్టుదలతో కరాటేలో రాణిస్తున్నా. మలేషియాలో జరిగే పోటీల్లో మెడల్ సాధించడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నా. నా ప్రతిభ నాలాంటి ఆడపిల్లల కుటుంబాలకు ఆదర్శంగా నిలవాలి. -
గ్రూప్–1 ర్యాంకర్‌కు కలెక్టర్ అభినందన
పెద్దపల్లిరూరల్/మంథని: మంథని మండలం ఖాన్‌సాయిపేటకు చెందిన గ్రూప్ – 1 ర్యాంకర్ జక్కుల అరుణ్‌కుమార్‌ను కలెక్టర్ కోయ శ్రీహ ర్ష బుధవారం అభినందించారు. అరుణ కుమా ర్ రాష్ట్రస్థాయిలో 114వ ర్యాంక్, మల్టీజోనల్– 1 స్థాయిలో 64వ ర్యాంక్ సాధించడంపై కలె క్టర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్, తల్లిదండ్రులు మల్లేశ్వరి – లక్ష్మీనారాయణతో పాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు. కోతలు లేకుండా విద్యుత్ సరఫరా సుల్తానాబాద్(పెద్దపల్లి): వేసవిలో వినియోగదారులకు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని ట్రాన్స్‌కో ఎస్ఈ మాధవరావు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ వినియోగిస్తున్న లబ్ధిదారులు కరెంట్‌ను వృథా చేయొద్దన్నారు. అనంతరం ఎస్ఈని సన్మానించారు. అధికారులు రవికుమార్, ప్రభాకర్, ఏడీఈ శ్రీనివాస్, సుగుణయ్య, ఏఈలు కిశోర్, బొంకూరి రవీందర్, సంపత్, శంకరయ్య, సైఫొద్దీన్, మాధవరావు, శంకరయ్య, సుధాకర్, కొమురయ్య, లక్ష్మయ్య, శ్రీనివాస్, వీరయ్య, శ్రీనివాస్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు. పాపన్నగౌడ్‌కు నివాళి పెద్దపల్లిరూరల్: జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సర్వాయి పాపన్న ఆశయ సాధనకు పాటుపడాలని ఆయన కోరారు. సహాయ బీసీ అభివృద్ధి అధికారి, జిల్లా గౌడ సంఘం అధ్యక్షు డు ఎం.అంజయ్యగౌడ్, ప్రతినిధులు బాలసాని వెంకటేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. 232 క్వింటాళ్ల పత్తి కొనుగోలు పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో బుధవారం పత్తి క్వింటాలుకు గరిష్టంగా రూ.7,241 ధర పలికింది. కనిష్టంగా రూ.5,111, సగటు రూ.7,044గా ధర నమోదైందని మార్కెట్ కార్యదర్శి మనోహర్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన పలువురు రైతుల నుంచి 232 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్టీపీసీ కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలు జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని కేంద్రీయ విద్యాలంయలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శోభన్‌బాబు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. రెండో తరగతిలో 13, నాలుగో తరగతిలో–07, ఐదో తరగతిలో–19, ఆరో తరగతిలో–15, ఏడో తరగతిలో–18, ఎనిమిదో తరగతిలో –22, తొ మ్మిదో తరగతిలో –09 సీట్లు ఖాళీగా ఉన్నా యని ఆయన పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు విద్యాలయంలో రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు దరఖాస్తు చేయాలని, ఈనెల 11వ తేదీ వరకు గడువు ఉందన్నారు. అర్హుల జాబితాను ఈనెల 17న విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. గడువు పొడిగింపు పెద్దపల్లిరూరల్: ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ సామాజిక వర్గాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల దాఖలుకు ఈనెల 14వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రంగారెడ్డి తెలిపారు. అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థులు గడువులోగా https:// tgobmms. cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేయాలన్నారు. వివరాలకు 08728–222266, 79933 57097 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. -
భరోసా ఏది?
జిల్లా సమాచారంసాక్షి, పెద్దపల్లి: సాగు పెట్టుబడి కోసం ప్రవేశపెట్టిన రైతుభరోసా అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు, నాట్లువేసే సమయంలో ఇవ్వాల్సిన రైతుభరోసాను పంటలు కోతకు వచ్చినా విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగు మొదట్లోనే బ్యాంకు ఖాతాల్లో జమచేస్తే ఎరువులు, కూలీలు తదితర ఖర్చులకు ప్రభు త్వం ఇచ్చే పైసలు ఉపయోగపడేవి. విడుదలతో ఆలస్యంతో రైతులపై అప్పులు, వడ్డీభారం పడుతోంది. సాగుకు యోగ్యమైన భూములకే రైతుభరోసా ఇస్తామని జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. విడతల వారీగా మార్చి 31వ తేదీ వరకు పలువురు రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని చెప్పింది. అయినా, ఇప్పటివరకు వారి ఖాతాల్లో డబ్బులు పడలేదని, పడుతాయో లేదోనని రైతులు వ్యవసాయశాఖ అధికారులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. 2,665 ఎకరాలకు రైతుభరోసా కట్ రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇటుకబట్టీలు తదితర సా గులో లేనిభూములకు గత ప్రభుత్వం పెట్టుబడి సా యం అందించింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ధర ణి పోర్టల్ ద్వారా అనుసంధానించిన పట్టా కలిగిన భూములను వ్యవసాయశాఖ అధికారులతో సర్వే చేయించింది. ఇందులో జిల్లాలో 2,78,555 ఎకరాలకు పట్టా ఉండగా, అందులో 2,655.32 ఎకరాలు సాగులో లేవని గుర్తించారు. కేవలం 2,75,899 ఎకరాలు సాగులో ఉన్నాయని, వాటికి 1,61,032 మంది రైతులకు రైతు భరోసా కింద రూ.165.53కోట్లు జమచేయాల్సి ఉందని తేల్చారు. మూడెకరాలు.. ఐదు విడతలు గత యాసంగి నుంచి ఎకరాకు రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. ఇందులో భాగంగా తొలుత జనవరి 27న పైలెట్ గ్రామాల్లోని రైతు ల ఖాతాల్లో నిధులు జమచేశారు. ఫిబ్రవరి 5న ఎక రం ఉన్న రైతులకు, 10న రెండెకరాలు, 12న మూడెకరాల్లోపు భూములు ఉన్న రైతులకు నిధులను విడుదల చేసింది. ఆపై భూమి కలిగిన వారి ఖాతాల్లో ఇప్పటివరకు పైసలు పడేలేదు. ఇప్పటివరకు 1,14,313 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.82.57కోట్లు జమచేశారు. ఇంకా సుమారు 45వేల మందికిపైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.51కోట్ల వరకు జమచేయాల్సి ఉంది. ఇదే విషయమై డీఏవో ఆదిరెడ్డిని సంప్రదించగా.. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే రైతుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా జమ అవుతాయన్నారు. పంటలు కోతకు వచ్చినా స్పష్టత కరువు పెట్టుబడి కోసం నిరీక్షిస్తున్న అన్నదాతలు పట్టా భూమి(ఎకరాల్లో): 2,78,555 సాగుయోగ్యమైనది(ఎకరాలో్ల) 2,75,899 రైతుల సంఖ్య: 1,61,032 మొత్తం పెట్టుబడి సాయం 165.53 (రూ.కోట్లలో) ఇప్పటివరకు ఖాతాల్లో జమైంది 82.57 (రూ.కోట్లలో) సాయం పొందిన రైతుల సంఖ్య 1,14,313 -
ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు
పెద్దపల్లిరూరల్: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. హమాలీల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన స్థలం గుర్తించాలని, కేటాయించిన రైస్ మిల్లులకే ధాన్యం తరలించాలని ఆయన సూచించారు. కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేయాలని అన్నారు. నాణ్యతా ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. గ్రేడ్– ఏ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధర చెల్లిస్తామని ఆయన తెలిపారు. ఈసారి 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనేది తమ లక్ష్యమని కలెక్టర్ వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని 24 గంటల్లో మిల్లులకు తరలించేలా వాహనాలు సిద్ధం చేయాలని తెలిపారు. ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, అకాల వర్షాల నుంచి పంటను కాపాడేందుకు టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. చివరి ఆయకట్టుకు సాగునీరు కమాన్‌పూర్(మంథని): మంథని నియోజకర్గంలోని పంటలు ఎండిపోకుండా చివరి ఆయకట్టుకు వరకు సాగునీరు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎస్సారెస్పీ అధికారులను ఆదేశించారు. రంగాపూర్ ఎస్సారెస్పీ డీ–83 కాలువతోపాటు గుండారం రిజర్వాయర్ నుంచి రామగిరి, ముత్తారం, మంథని పరిఽధిలోని పంటలకు సాగునీరు అందించే ఆర్ఎస్బీ కెనాల్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఎస్సారెస్పీ నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సారెస్పీ ఎస్ఈ సత్యరాజ్‌చంద్ర, అధికారులు శ్రీనివాస్, బలరామయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.డీఆర్‌యూసీసీ ప్రతినిధి నియామకం రామగుండం: స్థానిక రైల్వేస్టేషన్ ఏరియాకు చెందిన అనుమాస శ్రీనివాస్‌ను దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ(డీఆర్‌యూసీసీ) ప్రతినిధిగా నియమించారు. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరవింద్‌కుమార్ జైన్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ 2026 ఆగస్టు వరకు ఈ పదవిలో ఉంటారని పేర్కొన్నారు. కలెక్టర్ కోయ శ్రీ హర్ష -
పేదలకు సరిపడా సన్నబియ్యం
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సరిపడా సన్నబియ్యం సరఫరా చేస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్ రేషన్ దుకాణంలో బుధవారం తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీని ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 413 రేషన్‌దుకాణాల ద్వారా ప్రతీనెల సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. ఇందుకోసం 4 లక్షల క్వింటాళ్ల బియ్యం అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లా అవసరాలు తీర్చడంతోపాటు ఆసిఫాబాద్ జిల్లాకు కూడా ఎగుమతి చేశామని వెల్లడించారు. ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, పెద్దపల్లి నియోజకవర్గంలోని 55 రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఆర్డీవో గంగయ్య, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, డీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. నిట్టూరులో రూ.20లక్షల వ్యయంతో చేపట్టిన కల్వర్టు పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పేదల సంక్షేమమే ధ్యేయం జూలపల్లి(పెద్దపల్లి): ప్రజాసంక్షేమమే ధ్యేయంగా, పేదల కడుపునింపేందుకే సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. జూలపల్లి మండలం కాచాపూర్, కుమ్మరికుంటలో అదనపు కలెక్టర్ వేణు, డీఎస్వో రాజేందర్, ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ స్వర్ణతో కలిసి ఆయన సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. నాయకులు గండు సంజీవ్, వేణుగోపాలరావు, రమాదేవి, నర్సింహాయాదవ్ తదితరులు ఉన్నారు. తెల్లరేషన్‌కార్డుదారులకు.. ఎలిగేడు(పెద్దపల్లి): పేదల కడుపునింపేందుకే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఎలిగేడు మండలం ధూళికట్ట, ఎలిగేడులో తెల్లరేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించి మాట్లాడారు. అధికారులు రాజేందర్, గంగయ్య, బషీరొద్దీన్, భాస్కర్‌రావు, జయలక్ష్మి, పున్నమయ్య, అంజలి, నాయకులు దుగ్యాల సంతోష్‌రావు, సామ రాజేశ్వర్‌రెడ్డి, బాలుసాని పరుశరాములుగౌడ్, అర్షనపల్లి వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం సుల్తానాబాద్(పెద్దపల్లి): పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పట్టణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.● కలెక్టర్ కోయ శ్రీహర్ష -
పరిశోధనలు రైతుకు చేరితేనే సార్థకత!
జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయ శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడి పరిశోధనలు చేసి.. అత్యుత్తమ విత్తనాలు తయారు చేసినప్పటికీ వాటి ఫలాలు వివిధ కారణాలతో రైతుల చెంతకు చేరడం లేదు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సమన్వయంతో సాగులో సమస్యలను ఎప్పటికప్పుడు తీర్చాల్సి ఉన్నా.. ముందుకు కదలడం లేదు. ఈ నేపథ్యంలో సాగులో సమస్యలపై చర్చించేందుకు ఉత్తర తెలంగాణ జోనల్ స్థాయి శాస్త్రవేత్తల సదస్సు పొలాస పరిశోధన స్థానంలో గురువారం ప్రారంభం కానుంది. ఈ సదస్సు రెండురోజుల పాటు నిర్వహించనున్నారు. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, 10 జిల్లాల వ్యవసాయాధికారులు పాల్గొననున్నారు. మూడు ఉమ్మడి జిల్లాలకు కేంద్రం పొలాస జగిత్యాలలోని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం మూడు ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు కేంద్రం. ఈ కేంద్రం పరిధిలోనే ఆయా జిల్లాలోని వ్యవసాయ పరిశోధన స్థానాలు, డాట్ సెంటర్లు, కృషి విజ్ఞాన కేంద్రాలు పనిచేస్తాయి. వీటిల్లో దాదాపు 60 నుంచి 70 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు పనిచేస్తుంటారు. పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో వరి, వేరుశనగ, నువ్వు పంటల సాగు విధానాలు, సాగు నీటి యాజమాన్యంపై పరిశోధనలు చేస్తుంటారు. కరీంనగర్ పరిశోధన స్థానంలో మొక్కజొన్న, పెద్దపల్లిలోని కూనారం పరిశోధన స్థానంలో వరి, మొక్కజొన్న పంటలు, ఆదిలాబాద్ పరిశోధన స్థానంలో పత్తి, జొన్న, వరి, సోయాచిక్కుడు, ముథోల్ పరిశోధన స్థానంలో వర్షాధార పత్తి, రుద్రూర్ పరిశోధన స్థానంలో చెరుకు, వరి పంటల సాగు విధానంపై పరిశోధనలు సాగుతుంటాయి. అయితే పరిశోధన ఫలాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేసేందుకు శాస్త్రవేత్తలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రతి సీజన్లో తమ పరిశోధన స్థానాల్లో సాగు చేసిన పంటలను తిలకించేలా ప్రదర్శన క్షేత్రాలు, సాగు సమస్యలు తెలుసుకునేలా కిసాన్ మేళాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ నిధుల కొరతతో ఎప్పుడో ఒకసారి మమ అన్పించేలా జరుగుతుంటాయి. సమన్వయం అంతంతే.. జిల్లాలోని ఆయా మండలాల్లో పనిచేసే వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తల మధ్య సమన్వయం లోపిస్తోంది. కనీసం ప్రతి పంటల సీజన్లో నెలకోమారు ఉండేలా సమావేశాలు కనిపించడం లేదు. రైతులకు సాగులో సమస్యలు, సందేహాలు వచ్చినప్పుడు ఎక్కడకు వెళ్లాలో తెలియడం లేదు. రైతులు కొత్త పంటలు సాగు చేద్దామనుకున్నా.. ఏ పంట విత్తనం ఎక్కడ దొరుకుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. క్షేత్రస్థాయిలో రైతులు పొలాలను సందర్శించేందుకు వెళ్లినప్పుడు వ్యవసాయాధికారులు అందుబాటులో ఉండటం లేదు. వ్యవసాయాధికారులు ఏదైనా సమస్యపై శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సకాలంలో క్షేత్ర సందర్శనకు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రైతులు శాస్త్రవేత్తలు, అధికారుల చుట్టూ తిరగలేక ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫర్టిలైజర్ దుకాణాలను ఆశ్రయించి వారు ఇచ్చిన మందులు పిచికారీ చేస్తున్నారు. పొలాలకు చేరని పరిశోధనలు శాస్త్రవేత్తల పరిశోధనలు రైతుల చెంతకు చేరడం లేదు. శాస్త్రవేత్తలు శ్రమటోడ్చి రూపొందించిన విత్తనాలను రైతులు ఆదరిస్తుంటే.. కొన్ని రకాల విత్తనాల విషయమే రైతులకు తెలియని పరిస్థితి ఉంది. రైతులు ఏం కావాలనుకుంటున్నారు..? ఎలాంటి పరిశోధనలు చేస్తే రైతులకు ఉపయోగం ఉంటుందనే విషయాలపై ఆలోచించకుండా.. మూస ధోరణిలో ఉన్నతాధికారులు అదేశాల మేరకు పరిశోధనలు చేస్తున్నారు. రైతులు ప్రధానంగా కూలీలు, మార్కెటింగ్ సమస్యను ఎదుర్కొంటున్నారు, వాతావరణ మార్పులతో పంటల్లో తెగుళ్లు, పురుగుల విజృంభన ఎక్కువవుతుంది. ప్రతి సీజన్లో అధిక దిగుబడినిచ్చే విత్తనాల కోసం రైతులు వెతుకులాడుతున్నారు. ప్రైవేట్ విత్తన కంపెనీలు రక రకాల పేర్లతో విత్తనాలు తయారు చేసి రైతులకు విక్రయిస్తుంటే.. నిధుల కొరతతో అనుకున్న స్థాయిలో పరిశోధన స్థానాల్లో విత్తనోత్పత్తి జరగడం లేదు. రెండు రోజుల పాటు సాగు సమస్యలపై సదస్సు హాజరుకానున్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల శాస్త్రవేత్తలు రైతల కోసం పరిశోధనలు చేయాలి శాస్త్రవేత్తలు మూస ధోరణిలో కాకుండా రైతులకు అవసరమైన పరిశోధనలు చేసి అభిమానాన్ని చూరగొనాలి. వరి పంటకు ప్రత్యామ్నాయ పంటలు, కోతుల సమస్యపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. వాతావరణ మార్పులు రైతులకు పెద్ద సమస్యగా మారింది. వాటిపై పరిశోధనలు చేయాలి. – సత్యనారాయణరెడ్డి, జిల్లా ఉత్తమ రైతు, నాగారం, ధర్మపురి మండలం రైతుల ఆదాయం పెరిగేలా.. రైతుల ఆదాయం పెరిగేలా శాస్త్రవేత్తల పరిశోధనలు సాగాలి. సాగులోని సమస్యలను ఎప్పటికప్పుడు రైతులతో చర్చించాలి. సాగులో వస్తున్న సమస్యలు రైతులకు సవాల్ విసురుతున్నాయి. నామమాత్రంగా సమావేశాలు నిర్వహించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. – వెల్ముల రాంరెడ్డి, వ్యవసాయ వర్సిటీ సలహా మండలి మాజీ సభ్యుడు, పూడూరు -
హంస వాహనంపై ఊరేగింపు
వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయంలో జరుగుతున్న శ్రీరామ నవరాత్రోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సీతారామచంద్ర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అందంగా అలంకరించిన పెద్ద సేవపై హంస వాహనంపై ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, పురప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. జాతీయ ఖోఖో పోటీలకు కోచ్‌లుగా ఉమ్మడి జిల్లావాసులుకరీంనగర్స్పోర్ట్స్: ఒడిశా రాష్ట్రంలోని పూరిలో ఈనెల 4వ తేదీ వరకు జరుగనున్న 57వ సీనియర్స్ జాతీయ ఖోఖో పోటీల్లో పాల్గొనే తెలంగాణ జట్లకు ఉమ్మడి జిల్లాకు చెందిన పండుగ ఆనంద్ కుమార్, ఇస్లావత్ నరేష్ కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర పురుషుల జట్టుకు ఇల్లంతకుంటకు చెందిన రైల్వే క్రీడాకారుడు పూర్వ భారత జట్టు కెప్టెన్ పండుగ ఆనంద్, జాతీయ పోటీల్లో పాల్గొంటున్న భారత పురుషుల రైల్వే జట్టుకు ధర్మారం మండలం బంజరుపల్లి తండాకు చెందిన దక్షిణ మధ్య రైల్వే క్రీడాకారుడు ఇస్లావత్ నరేశ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.మహేందర్ రావు తెలిపారు. వీరిని సంఘ బాధ్యులు చిట్టి తిరుపతిరెడ్డి, కుమారస్వామి, ఏ.రవీందర్, లక్ష్మణ్, ఎస్కే మోహినుద్దీన్, సీఐ కుమారస్వామి, ఎస్సై రమేశ్, బి.శేఖర్, నవీన్, ఆర్.తిరుపతిరెడ్డి అభినందించారు. కారు ఢీకొని విద్యార్థులకు గాయాలుధర్మపురి: కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ధర్మపురికి చెందిన సంతోష్ బుధవారం సాయంత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. అదే సమయంలో మైదానంలో మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కళావాల విద్యార్థులు కూర్మాదాస్, వినయ్ వాకింగ్ చేస్తున్నారు. కారు అదుపు తప్పి వీరిని ఢీకొట్టింది. ప్రహరీ, కారు మధ్యలో విద్యార్థులు ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 అంబులెన్సులో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
నేరాల నియంత్రణకు నిరంతర పెట్రోలింగ్
ఓదెల(పెద్దపల్లి): నేరాల నియంత్రణ కోసం పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశించారు. పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌ను బుధవారం రాత్రి సీపీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఠాణా పరిసరాలు, కేసులు, సీజ్ చేసిన వాహనాలు తదితర వాటిపై ఆరా తీశారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి సమస్యలను పరిష్కరించాల ని అన్నారు. సమస్యాత్మక గ్రామాలు, అజ్ఞాతంలోని మావోయిస్టుల వివరాల గురించి ఎస్సైని అడిగి తెలుసుకున్నారు. రౌడీషీటర్లు, అనుమానితుల స్థితిగతులు, కదలికలపైనా ఆరా తీశారు. మత్తు పదార్థాలను తయారు చేస్తున్న, నిల్వచేస్తున్న, రవాణా చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎస్సై రమేశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నస్పూర్ పాలిటెక్నిక్‌లో 50 శాతం సీట్లు గోదావరిఖని: పదోతరగతి పూర్తిచేసిన సింగరేణి ఉద్యోగుల పిల్లలకు నస్పూర్ పాలిటెక్నిక్‌లో 50 సీట్లు కేటాయించనున్నట్లు ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్ తెలిపారు. మెరిట్ ప్రాతిపాదికన ఇతరులకూ సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. డిప్లొమా ఇన్ సివిల్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, డిప్లొమా ఇన్ మెకానికల్, డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు జీఎం లలిత్‌కుమార్ వెల్లడించారు. బాల, బాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆర్జీ–1 సింగరేణి పాఠశాలలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకించి కొత్తగూడెంలోని మహిళా జూనియర్, మహిళా డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ కోర్సులు ఇంగ్లిష్, తెలుగు మీడియంలో అందుబా టులో ఉన్నట్లు వివరించారు. ఆసక్తి గలవారు స్థాని క సింగరేణి హైస్కూల్ సెక్టార్–2 ప్రధానోపాద్యాయుడు శ్రీనివాస్ 94908 82498, లేదా స్వర్ణలత టీచర్ 98497 72512 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు పెద్దపల్లిరూరల్: ఎల్ఆర్ఎస్ గడువును ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు పొడిగించిందని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ బుధవారం తెలిపారు. లే అవుట్ లేని ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తమ ప్లాట్లను 25శాతం రాయితీ ఫీజుతో క్రమబద్ధీకరించుకోవాలన్నారు. ఇందుకోసం ము న్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని వివరించారు. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను చెల్లించేవారికి ఐదుశాతం రాయితీ వర్తింపజేస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
కోతలు దగ్గర పడ్డాయి
నాకు 4.10 ఎకరాలు ఉంది. పెట్టుబడి కోసం ప్రవేశపెట్టి న రైతుభరోసా పైసలు ఇంకా పడలేదు. పంట కోతలు దగ్గరపడ్డా పైసల కోసం ఎదురుచూపులే మిగిలాయి. ప్రభుత్వం పైసలు జమచేస్తే కోతలు, కూలీల అవసరాలకు ఉపయోగపడతాయి. – ముత్యాల తిరుమలరెడ్డి, బొమ్మరెడ్డిపల్లి డబ్బులు పడలేదు ప్రభుత్వం ప్రకటించిన రైతుభరోసా డబ్బులు ఇప్పటివరకు పడలేదు. మూడు ఎకరాల్లో పంటలు వేసిన. ఇంతవరకు పైసలు పడలేదు. రైతుభరోసా ఎప్పుడు పడుతుందో నని బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుడు అవుతుంది. – టి.రాజారాం, రైతు, ఓదెల పైసలు రాలేదు ఇప్పటి వరకు రైతు భరోసా అందలేదు. మరోవారం, ప దిరోజులైతే పంటలు కోతకు వస్తాయి. గత సీజన్లో రైతుభరోసా వేయలేదు. ఈ సీజన్లో భరోసా వేసినా.. కొంతమంది రైతులకే వచ్చాయి. నాలాంటి రైతులకు సైతం ఖాతాల్లో డబ్బులు జమ చేస్తే కోతలకు పనికి వస్తాయి. – అప్పల రాజయ్య, రైతు, కదంబపూర్ -
ఆర్థిక సంఘం గ్రాంట్స్‌కు అర్హత
● 72.50 శాతం ఆస్తిపన్ను వసూలుతో ఘనత ● గతేడాది కన్నా మెరుగైన ఆర్థిక పరిస్థితికోల్సిటీ(రామగుండం): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్‌కు అర్హత సాధించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 72.50శాతం ఆస్తిపన్ను వసూలు చేసి ఈఘనత సొంతం చేసుకుంది. నిర్దేశిత 100 శాతం ఆస్తిపన్ను వసూలు చేయకపోయినా.. గతేడాదితో పోల్చితే ఈసారి పనితీరు మెరుగుపర్చుకుంది. గతేడాది మార్చి 31 నాటికి 55.58 శాతం ఆస్తిపన్ను వసూలు కాగా, ఈఏడాది 72.50 శాతం వరకు నమోదు చేయడం గమనార్హం. నగరపాలక సంస్థ స్పెషలాఫీసర్‌గా వ్యవహరిస్తున్న కలెక్టర్ కోయ శ్రీహర్ష.. కమిషనర్(ఎఫ్ఏసీ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అదనపు కలెక్టర్ అరుణశ్రీ ప్రత్యేక దృష్టి సారించడంతో ఫలితం దక్కిందని అధికారులు అంటున్నారు. డిమాండ్ రూ.14.76 లక్షలు బల్దియాలో ఆస్తిపన్ను రూ.14.76 లక్షల డిమాండ్ ఉండగా, ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు రూ.10.70లక్షల వరకు వసూలుచేసి 72.50 శాతం నమోదు చేయగలిగింది. గతేడాది 55.58శాతమే ఆస్తిపన్ను వసూలు చేసింది. గత ఐదేళ్ల స్థూల ఉత్పత్తి సగటు 12.09 శాతానికి మించి ఈసారి ఆస్తిపన్ను వసూలు కావడంతో రామగుండం బల్దియా 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్ పొందడానికి అర్హత సాధించినట్లయ్యింది. వసూళ్లలో వార్డు ఆఫీసర్లు.. గ్రూప్–4 నియామకాలు పూర్తికావడంతో కొంద రు ఉద్యోగులు వార్డు అధికారులుగా ఇటీవల విధుల్లో చేరారు. రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన మరికొందరు సిబ్బంది అందుబాటులో ఉన్నారు. దీంతో బల్దియా కమిషనర్ అరుణశ్రీ.. రెండు నెలల క్రితం ఓ మంచినిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు నగరంలోని నివాసాలన్నీ 22 రెవెన్యూ బ్లాకుల్లో భాగమై ఉండేవి. ఒక్కో బ్లాక్‌కు ఒక బిల్ కలెక్టరే ఆస్తిపన్ను వసూలు చేసేవారు. కమిషనర్ నిర్ణయంతో ఎలక్షన్ డివిజన్ల ప్రాతిపదికన 50 డివిజన్లుగా విభజించారు. అందుబాటులో ఉన్న సిబ్బందికి తోడు కొత్తగా నియామకమైన వారికి ఆస్తిపన్ను వసూలు విధు లు కేటాయించారు. ఇలా ఒక్కో డివిజన్‌కు ఒకరు చొప్పున 50 డివిజన్లకు మొత్తం 50 మందిని వార్డు ఆఫీసర్లుగా నియమించారు. వారికి సహాయకులుగా కార్యాలయంలో అదనంగా ఉన్న సిబ్బందిని నియమించారు. ఉదయం 8 గంటల నుంచే ఆస్తిపన్ను వసూళ్ల పురోగతిపై కమిషనర్ సమీక్షిస్తుండడంతో సత్ఫాలితాలు వచ్చాయి. -
ఉపరితల గనులే కీలకం
● 10 ఓసీపీల్లో వందశాతం బొగ్గు ఉత్పత్తి ● నిర్దేశిత లక్ష్యం సాధించిన ఐదు భూగర్భ గనులు గోదావరిఖని: సింగరేణి సంస్థ వార్షిక బొగ్గు ఉ త్పత్తి లక్ష్య సాధనలో ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు(ఓసీపీ)లు ఈ సారి కూడా కీలకపాత్ర పోషించాయి. సంస్థలోని పది ఓసీపీలు వందశాతం ఉత్పత్తి నమోదు చేయగా.. మరికొన్ని లక్ష్యానికి చేరువ లో నిలిచాయి. నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో ఓసీపీలు సింహ భాగంలో నిలవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నాయి. భూగర్భ గనుల్లోనూ వందశాతం.. ఈసారి వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో ఐదు భూగర్భగనులు కూడా వందశాతం బొగ్గు ఉత్పత్తి సాధించి కార్మికులు, సంస్థలో ఆశలు రేకెత్తించాయి. ఓసీపీల ద్వారా 65.90 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తీయాలని లక్ష్యంగా నిర్ణయించగా, 64.19 మిలియన్ టన్నులు సాధించాయి. భూగర్భగనుల ద్వారా 6.10 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా 4.80 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాయి. వందశాతం ఉత్పత్తి లక్ష్య సాధనలో ఓసీపీలు అగ్రభాగాన నిలవగా, భూగర్భగనులు వెనుకపడ్డాయి. వార్షిక నిర్దేశిత లక్ష్యం 72 మిలియన్ టన్నులు కాగా అందులో 64మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి ఓసీపీల ద్వారానే సాధించడం గమనార్హం. వందశాతం లక్ష్యం సాధించిన ఓసీపీలు సంస్థ వ్యాప్తంగా 11 ఓసీపీలు వార్షిక లక్ష్యం సాధించాయి. ఇందులో జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీ, ఖైరిగూడ ఓసీ, కోయగూడెం ఓసీ–2, జేకే–5ఓసీ, పీకే ఓసీ–4, మణుగూరు ఓసీ, ఓసీపీ–3, జీడీకే–5 ఓసీపీ, ఓసీపీ–1, ఓసీపీ–2 గనులు ఉన్నాయి. భూగర్భగనులు ఇవే.. వందశాతం బొగ్గు ఉత్పత్తి క్ష్యం సాధించిన భూగర్భగనులు ఐదు ఉన్నాయి. వాటిలో జీడీకే–11, ఆర్కే–6, ఆర్కే న్యూటెక్, ఎస్ఆర్పీ–1గని, ఎస్ఆర్పీ–3, 3ఏగనులు ఉన్నాయి. భూగర్భగనులు లక్ష్య సాధనలో అగ్రభాగాన నిలవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బొగ్గు ఉత్పత్తి (మిలియన్ టన్నులో్ల) గని లక్ష్యం సాధించింది ఓసీపీలు 65.90 64.19 భూగర్భగనులు 6.10 4.81 మొత్తం 72.00 69.00 -
ఆకట్టుకున్న కవి సమ్మేళనం
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ట్రినిటి డిగ్రీ కాలేజీలో మంగళవారం ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. ఉదయ సాహితీ, జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సమ్మేళనం నిర్వహించారు. ఉదయ సాహితీ రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం లక్ష్మయ్య మాట్లాడారు. మానవ విలువలను ప్రతిబింబింప జేసే సాహితీవేత్తలు జిల్లాలో అనేక మంది ఉన్నారన్నారు. మనిషి నడవడి, సంస్కృతి, సంప్రదాయాల ను వివరించే ఆలోచన, అభ్యుదయ విలువలను పంచే సత్తా సాహిత్యానికే ఉందని అన్నారు. జిల్లా లోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన కవులు, రచయితలు కవితాగానంతో అలరింపజేశారు. జిల్లా రచయితల సంఘం కన్వీనర్ ఏలేశ్వరం వెంకటేశం, కో కన్వీనర్ బుర్ర తిరుపతితోపాటు అనాసి జ్యోతి, బొమ్మిదేని రాజేశ్వరి, కొమురయ్య, కుమారస్వామి, రాజేశం, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జైబోలో హనుమాన్‌కీ..
పెద్దపల్లిరూరల్: ‘జై శ్రీరాం.. జైబోలో హనుమాన్‌కీ..’ నినాదాలతో జిల్లా కేంద్రం మార్మోగింది. పట్టణమంతా కాషాయమయమైంది. పట్టణంలోని అయ్యప్ప ఆలయం వద్ద మంగళవారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో వీరహనుమాన్ విజయయాత్ర ప్రారంభించారు. పురవీధుల గుండా యాత్ర కొనసాగింది. మినీట్యాంక్‌బండ్ వరకు కొనసాగిన యాత్రలో వీహెచ్‌పీ, బజరంగ్దళ్ నాయకులు, కార్యకర్తలతోపాటు బీజేపీ, బీజేవైఎం తదితర అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కమల్ కిశోర్ శారడ, డీఆర్‌యూసీసీ సభ్యుడు ఎన్డీ తివారీ, బీకే జాకోటియా, జంగ చక్రధర్‌రెడ్డి, సతీశ్, భారీసంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
దేశీయ మొక్కలు నాటాలి
మానవాళికి, పక్షులకు ప్రమా దకరంగా మారిన కోనోకార్పస్ మొక్కలను తొలగించి, వాటి స్థానంలో ఆక్సిజన్ విడుదల చేసే దేశీయ మొక్కలను నాటాలి. తద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, ఆరోగ్యకరమైన జీవవైవిధ్యాన్ని పెంపొందించవచ్చు. గోదావరిఖనిని పొల్యూషన్ బారినుంచి కాపాడుకోవడమే కాకుండా సుందరీకరణకు అవకాశం ఉంటుంది. – పిట్టల రాజ్‌కుమార్, మదర్ హ్యూమన్ యూత్ సొసైటీ అధ్యక్షుడుఉపయోగం లేదు అందం, ఆకర్షణ తప్ప కోనోకార్పస్ మొక్కలతో ఎలాంటి ఉపయోగం లేదు. మానవాళికి విషంగా తయారైన కోనోకార్పస్ మొక్కలను అధికారులు తొలగించాలి. వీటి ఆకులను పశువులు సైతం తినవు. డివైడర్లపై ఎక్కడ చూసినా ఇవే దర్శనమిస్తున్నాయి. నిత్యం ప్రజలు సంచరించే ప్రాంతా ల్లో ఉన్న మెక్కలను తొలగించి దేశీయ మొక్కలను పెంచాలి. – సూర్య శ్యాం, సుల్తానాబాద్ ప్రజారోగ్యంపై ప్రభావం కోనోకార్పస్ మొక్కలు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆకుల నుంచి వెలువడే పరాగ రేణువులతో ప్రమాదకర అలర్జీ వస్తుంది. ఆస్తమా అధికం అవుతుంది. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులకు గురవుతాం. టీబీ పేషెంట్లకు ఇవి అత్యంత ప్రమాదకరం. ప్రపంచ దేశాలు తొలుత ప్రోత్సహించినా.. అనర్థాలు వెలుగులోకి రావడంతో ఈ మొక్కలను నిషేధించాయి. – డాక్టర్ పిల్లి కిరణ్, సాయిల్ సైంటిస్ట్, కృషి విజ్ఞాన కేంద్రం -
● ఇప్పటికే అనేకసార్లు మరమ్మతు ● అయినా, తరచూ పైప్‌లైన్ ధ్వంసం ● రహదారిపై వృథాగా పోతున్న తాగునీరు ● పట్టని బల్దియా అధికార యంత్రాంగం
కోల్‌సిటీ(రామగుండం): అభివృద్ధి పనుల విషయంలో పారదర్శకత లోపిస్తుందడానికి ఈ చిత్రమే సాక్ష్యంగా నిలుస్తోంది. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని దుర్గానగర్ కాలనీ బోర్డు ఎదుట.. ప్రధాన రహదారిపై మంగళవారం వాటర్ పైప్‌లైన్ లీక్ అయ్యింది. తాగునీరు పెద్ద ఎత్తున రోడ్డపైకి వచ్చి చేరింది. తాగునీరంతా వృథాగా పోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి కాదు.. ఈ ప్రాంతంలో పైపులైన్ మంగళవారం ఒక్కరోజే లీక్కాలేదు. ఇదేచోట ఇప్పటికే అనేకసార్లు పైప్‌లైన్ లీకై ంది. ప్రైవేట్ వ్యక్తులతో అనేకసార్లు మరమ్మతు చేశారు. ఇందుకోసం నిధులు ఖర్చు చేస్తున్నా.. లీకేజీ ఆగడం లేదు. నెల క్రితం ఇదేప్రాంతంలో అధికారులు మరమ్మతు చేయించారు. మంగళవా రం మరోసారి లీకేజీ ఏర్పడింది. 250 డయా సామర్థ్యం కలిగిన వాటర్ పైప్‌లైన్‌కు అమర్చిన జాయింట్ వద్దే తరచూ లీకేజీ సమస్యలు ఏర్పడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపమా? లేక సాంకేతిక పద్ధతిలో మరమ్మతు చేపట్టడం లేదా? లేదా మరమ్మతుల్లో నాసిరకం సామగ్రి వినియోగిస్తున్నారా? అనే సందేహాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో అనేక కాలనీల్లో మరమ్మతులు చేసిన ప్రాంతంలోనే వాటర్ పైప్లైన్లకు లీకేజీలు ఏర్పడుతున్నాయి. లీకేజీలతో రోడ్లు డ్యా మేజీ కావడంతోపాటు సమీప నివాసాలకు కలుషితమైన తాగునీరు సరఫరా అవుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికై నా స్పందించాలని నగరవాసులు కోరుతున్నారు. -
‘ఆపరేషన్ కగార్’ను ఆపేయండి : ప్రజాసంఘాలు
పెద్దపల్లిరూరల్: ఆపరేషన్ కగార్ పేరిట దండకారణ్యంలోని ఆదివాసీలపై సాగిస్తున్న దమనకాండను వెంటనే ఆపేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట మంగళవారం సంఘీభావ పోరాట వేదిక కన్వీనర్ ముడిమడుగుల మల్లన్న, జిన్నం ప్రసాద్, గుమ్మడి కొమురయ్య తదితరుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రూ.కోట్ల విలువైన సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్రప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈక్రమంలోనే ఆదివాసీలపై దాడులు చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ ఈనెల 20న కరీంనగర్లో చేపట్టిన ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ సభను విజయవంతం చేయాలని వారు కోరారు. నాయకులు తాళ్లపల్లి లక్ష్మణ్, రామిళ్ల బాపు, శ్రీపతి రాజగోపాల్, శ్రీనివాస్, వెంకన్న, బాపన్న, సదానందం, గాండ్ల మల్లేశం, రాజు, ఎరుకల రాజన్న తదితరులు పాల్గొన్నారు. పనులు నాణ్యతగా ఉండాలి సుల్తానాబాద్(పెద్దపల్లి): విద్యార్థుల యూనిఫామ్స్‌ను నాణ్యంగా కుట్టాలని డీఆర్డీవో కాళిందిని సూచించారు. స్థానిక ఐకేపీ కార్యాలయంలో కొనసాగుతున్న కుట్టు శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో విద్యార్థుల యూనిఫామ్ స్టిచ్చింగ్ పనులు అప్పగిస్తున్నామని, ఇందుకోసం ఆసక్తిగలవారికి శిక్షణ ఇప్పిస్తున్నామని వివరించారు. ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్, ట్రెయినర్ వసుంధర పాల్గొన్నారు. ఇందిరమ్మ మోడల్ ఇల్లు సిద్ధం సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక ఎంపీడీవో కార్యాలయం వెనకాల చేపట్టిన మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ఇటీవల పూర్తయ్యింది. దీంతో మంగళవారం రంగులు వేసి ప్రారంభానికి సిద్ధం చేశారు. లబ్ధిదారులు ఈ ఇంటిని చూసి తమ ఇళ్లను ఇలాగే నిర్మించుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 8వ డాన్‌గా కరాటే మొండయ్య గోదావరిఖనిటౌన్: సికింద్రాబాద్‌లో ఇటీవల జరిగిన ఆల్ ఇండియా కరాటే సీనియర్ గ్రేడింగ్ టెస్ట్‌లో గోదావరిఖనికి చెందిన కరాటే మొండయ్య 7వ డాన్ నుంచి ఎనిమిదో డాన్‌కు ప్ర మోట్ అయ్యారు. దేశవ్యాప్తంగా పేరొందిన 10మంది డాన్లు ఈ టెస్ట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఏడుగురికి ప్రమోట్ అవకాశం దక్కింద ని ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమానికి ము ఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ విజేతలను అభినందించారు. అనంతరం 10వ డాన్ శ్రీనివాసన్ బెల్ట్‌లు, సర్టిఫికెట్లు అందజేశారు. సత్ప్రవర్తనతో మెలగాలి పెద్దపల్లిరూరల్: రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని డీసీపీ కరుణాకర్ సూచించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ గజ్జి కృష్ణతో కలిసి మంగళవారం రౌడీషీటర్లతో సమావేశమై పలు సూచనలిచ్చారు. క్రిమినల్ కేసులు, భూదందాల్లో తలదూరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇతరుల హక్కులకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలకు గురికావాల్సి ఉంటుందని ఆయన అన్నారు. సమావేశంలో సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు లక్ష్మణ్‌రావు, మల్లేశం, లక్ష్మణ్, స్వామి పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో గైనిక్ సేవలు
మంథని: స్థానిక మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మంగళవారం సీ్త్ర వైద్య నిపుణురాలు ఆధ్వర్యంలో గైనిక్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గత డి సెంబర్‌లో ఇక్కడి సీ్త్ర వైద్య నిపుణురాలు రెగ్యులర్ జాబ్‌కు వెళ్లడంతో ఎంసీహెచ్‌లో ఆ సేవలు నిలిచిపోయాయి. సీ్త్రవైద్య నిఫుణులు లేక సుమారు మూ డు నెలలుగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో సీ్త్రవైద్య నిపుణురాలుగా సోనిని నియమిస్తూ కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఆస్పత్రిలో గైనిక్ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. మహిళా పేషెంట్లకు మెరుగైన సేవలు అందిస్తారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కొందరి కోసమే వంతెన నిర్మాణం మంథని: బంధువర్గ ప్రయోజనాల కోసమే గోదావ రి నదిపై వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శించారు. పట్టణ సమీపంలోని గోదావరి నదీతీరంలో బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదిత ప్రదేశంలో మంగళవారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల జిల్లా శివ్వారం నుంచి మంథని మధ్య గల గోదావరి నదిపై నిర్మించే వంతెనతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. కూచిరాజ్‌పల్లి స మీపంలో 50 ఎకరాలు ఉన్నాయని, రియల్ ఎస్టేట్ లో వాటి ధరలు పెంచేందుకే బ్రిడ్జి నిర్మాణం చేపట్టారని ఆయన ఆరోపించారు. నాయకులు ఏగోళపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, ఆరెపల్లికు మార్, కనవేన శ్రీనివాస్, రవీందర్, శేఖర్ ఉన్నారు. -
కళాకారులకు అందని పింఛన్లు
● స్వరాష్ట్రంలోనూ అన్యాయమేనని ఆవేదన ● పట్నాలు, బోనాల సందర్భాల్లోనే కొంత ఉపాధిపెద్దపల్లిరూరల్: ప్రభుత్వ పథకాల అమలు, ప్రజారోగ్యం కోసం పాటించాల్సిన పద్ధతులపై ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ఆట, పాటలతో ప్రదర్శనలిచ్చే తమను సర్కారు పట్టించుకోవడం లేదని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవిస్తే తమకు మేలు కలుగుతుందని ఆశించి స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో పాలుపంచుకున్నా తమ కుటుంబాలను పోషించుకోవడమే భారంగా మారిందని వాపోతున్నారు. పట్నాలు.. బోనాలప్పుడే పని.. పల్లెల్లో ఏటా బోనాలు, పట్నాలతో దేవతలకు మొక్కులు సమర్పించుకునే సమయంలోనే తమకు కొంతపని లభిస్తోందని ఒగ్గు కళాకారులు పేర్కొంటున్నారు. గతంలో ఎవరైనా చనిపోయినప్పుడు కూడా తమతో కథలు చెప్పించేవారని, ఇపుడు ఆ పరిస్థితులు కూడా చాలావరకు తగ్గిపోయాయని పేర్కొంటున్నారు. పనిలేకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని, అందుకే వ్యవసాయ కూలీ పనులు చేసేందుకు వెళ్లాల్సి వస్తోందని పలువురు కళాకారులు ఆవేదనతో చెబుతున్నారు. పింఛన్ కోసం నిరీక్షణ.. ప్రభుత్వం కనీసం తమకు పింఛన్లు కూడా అందించడం లేదని కళాకారులు వాపోతున్నారు. ప్రభు త్వం అందిస్తున్న ఆసరా పథకం ద్వారా అర్హత ఉన్న కళాకారులకు పింఛన్లు మంజూరు కావడం లేదంటున్నారు. ఇప్పటికై నా పింఛన్లు అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. కళాకారులకు ప్రోత్సాహాన్ని అందించి మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందేలా చూడాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. -
రాయితీ విడుదల కాలేదు
పెద్దపల్లిరూరల్: ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ కింద 2018లో దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరికి యూనిట్ మంజూరైనా రాయితీ వి డుదల కాలేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం పలు జిల్లాల కలెక్టర్లతో రాజీవ్ యువ వికాసంపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ, గతంలో దరఖాస్తు చేసుకుని స బ్సిడీ మంజూరు కాని దరఖాస్తులను తిరస్కరించి, మరోసారి దరఖాస్తు చేసుకునేలా అ వకాశం కల్పించామన్నారు. దీంతో డిప్యూటీ సీఎం కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 4న భక్తాంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం రామగుండం: పట్టణంలోని శ్రీభక్తాంజనేయస్వామి ఆలయ వార్షికోసత్సవం ఈనెల 4వ తేదీన నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆ లయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 6 నుంచి 14వ తేదీ వరకు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తామని పూజారి కమ్మల చంద్రశేఖరశర్మ తెలిపారు. సేవలతోనే గుర్తింపు పెద్దపల్లిరూరల్: అంకితభావంతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలు ఎప్పటికీ మ ర్చిపోరని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి అన్నారు. రాఘవాపూ ర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెచ్‌ఈవో సాంబయ్య సోమవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా వైద్యురాలు మమ త అధ్యక్షతన ఏర్పాటైన కార్యక్రమంలో సాంబయ్యను సత్కరించారు. ప్రతీ ఉద్యోగి విధులను సక్రమంగా నిర్వర్తించాలని, సేవలతో నే గుర్తింపు లభిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకుని ముందుకు సాగాలని డీఎంహెవో సూచించారు. జిల్లా మలేరియా అధికారి శ్రీరాములు, డాక్టర్ శ్రీవాణి, కిరణ్‌కుమార్, రాజమొగిలి తదితరులు పాల్గొన్నారు. నేడు కవి సమ్మేళనం పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో మంగళవా రం ఉగాది కవిసమ్మేళనం నిర్వహిస్తామని ఉ దయ సాహితీ గౌరవ అధ్యక్షుడు దాస్యం సే నాధిపతి, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మయ్య, జిల్లా క న్వీనర్ ఏలేశ్వరం వెంకటేశ్వర్లు, కో కన్వీనర్ బుర్ర తిరుపతి తెలిపారు. జిల్లా రచయితల సంఘం, ఉదయ సాహితీ సంయుక్తంగా ని ర్వహించే ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు మొదలవుతుందని, కవులు, రచయితలు హాజరు కావాలని వారు కోరారు. -
గ్రూప్–1లో యువకుడి సత్తా
మంథని: ఖాన్సాయిపేట గ్రామానికి చెందిన జక్కుల అరుణ్‌కుమార్ గ్రూప్–1లో రాష్ట్ర స్థాయి లో 114, మల్టీజోన్‌లో–1లో 64వ ర్యాంకు సాధించాడు. గ్రూపు –2లోనూ ఆయన రాష్ట్రస్థాయిలో 35, గ్రూపు–3లో 81వ ర్యాంకు సాధించాడు. అరుణ్‌కుమార్ తల్లి అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నా రు. అదేవిధంగా తండ్రి లక్ష్మీనారాయణ కమాన్‌పూర్ ఎంపీపీఎస్‌లో ప్రధానోపాధ్యాయుడు, సోదరి సాయిప్రసన్న బెంగళూర్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అరుణ్‌కుమార్‌ను తల్లిదండ్రులు, సోదరితోపాటు గ్రామస్తులు అభినందించారు. -
భూగర్భ డ్రైనేజీకి డీపీఆర్
● రోడ్ల నిర్మాణానికీ ప్రతిపాదనలు తయారు చేయండి ● రామగుండం సుందరీకరణకు అందరూ సహకరించండి ● ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ సూచన కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగర సుందరీకరణకు సహకరించాలని ఎమ్మెల్యే మ క్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, మున్సిపల్ అధికారులను కోరారు. నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై కార్పొరేషన్ కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ తో కలిసి సోమవారం బల్దియా కార్యాలయంలో సమీక్షించారు. వేసవి దృష్ట్యా నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల నిర్మాణానికి డీపీఆర్ తయారు చే యాలని సూచించారు. రూ.200 కోట్ల అంచనా తో 27 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు త్వ రలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. రాజీ వ్ రహదారికి ఇరువైపులా ల్యాడ్ స్కేపింగ్ చేయాలని, తద్వారా సర్వీస్ రోడ్లు నిర్మిస్తారని తెలిపా రు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. 2ఏ మోరీ, ఫైవింక్లయిన్ మోరీలను కలుపుతూ రోడ్డు నిర్మించి వర్షాకాలంలో వరద నిల్వకాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. అవసరమైనచోట్ల వీధిదీపాలు ఏర్పాటు చేయాలని, శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించే శ్రీరామ నవమి వేడుకలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, సింగరేణి ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, ఆర్ఎఫ్సీఎల్ డీజీఎం రమేశ్ ఠాకూర్, సీనియర్ మేనేజర్ వెంకటరెడ్డి, సింగరేణి ఎస్ఈ (సివిల్) వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హనుమమాన్ విగ్రహ నిర్మాణం పరిశీలన రామగుండం: శ్రీరామునిగుండాల కొండపై చేపట్టిన 108 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణాన్ని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ ఆదివారం రాత్రి పరిశీలించారు. -
ఎండాకాలం.. జరపదిలం
● అప్రమత్తమైన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ● గ్రామీణులకు విస్తృతంగా అవగాహన ● ఎంఎల్‌హెచ్‌పీలకు ఇప్పటికే శిక్షణ ● వడదెబ్బ నియంత్రణకూ పకడ్బందీ చర్యలుపెద్దపల్లిరూరల్: జిల్లాలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి. వివిధ పనులు, అవసరాల కోసం ఇళ్లనుంచి బయటకు వెళ్లే జిల్లావాసులు అత్యంత జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈమేరకు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలోని ఎంఎల్‌హెచ్‌పీలు ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో అన్నప్రసన్న కుమారి ఆదేశాలు జారీచేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎండలో వెళ్తే.. వేసవిలో అనారోగ్య సమస్యలు, వడదెబ్బ నివారణ గురించి ఇటీవల జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా సమీక్షించారు. ఎండలో పనిచేయాల్సి వస్తే కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. ప్రధానంగా గ్రామీణులకు ఈ విషయంలో అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అధిక ఎండలో బయటకు వెళ్తే శరీరం వేడెక్కి జ్వరం వస్తుంది. మగతగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు తలెత్తితే.. హీట్ పైరాక్సియా అంటారు. శరీర ఉష్ణోగ్రత 102 ఫారాన్ డిగ్రీల వరకు ఉంటుంది. ఎండలో సాధారణ పనులకు వెళ్లే వారికి ఇలా వేడి ఉంటుంది. లవణాలు పోతాయి.. కండరాలు పట్టేస్తాయి చెమట ద్వారా శరీరంలోని నీరు, లవణాలు బయటకు వెళ్తాయి. ఇలాంటి సమయంలో అలసటకు గురైతే హీట్ ఎక్సాస్టెన్ అంటారు. అధిక ఎండ ఉండగా.. పొలం పనులు చేసినా, వేడిగా ఉండే ఇంట్లో పనిచేసినా దీనిబారినపడతారు. ● బొగ్గు, ఇతర గనులు, వేడి తీవ్రతలో పనిచేస్తే కండరాలు పట్టేస్తాయి. దీనిని హీట్క్రాంప్ అంటారు. ● ఎండ తీవ్రత, వడగాలితో శరీర ఉష్ణోగ్రత 110 ఫారన్ డిగ్రీల వరకు పెరిగితే హీట్‌స్ట్రోక్(వడదెబ్బ)కు గురవుతారు. తీవ్రమైన తలనొప్పి, నాలుక తడి ఆరడం, అధిక దాహం వేయడం, కళ్లు గుంజడం, తలతిరగడం లాంటి లక్షణాలు ఏర్పడతాయి. వాంతులు, విరోచనాలకు గురవుతారు. ఈ పరిస్థితులు గుర్తించి వెంటనే చికిత్స అందిస్తే బాధితులకు ప్రాణాపాయం తప్పుతుందని వైద్యులు వివరిస్తున్నారు. ఇలా చేయండి : వైద్యులు ● వడదెబ్బకు గురైన వ్యక్తికి అవసరమైనంత నీరు తాగించాలి. అప్పుడు కూడా లేవలేని పరిస్థితిలో ఉంటే ఓఆర్ఎస్ ద్రావణం తాగించాలి. ఆ తర్వాత బాధితులను వెంటనే సమీప ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ● చల్లని నీటిలో ముంచిన గుడ్డను తలపై వేయాలి. శరీరాన్ని తరచూ తుడవాలి. మజ్జిగా, గంజి, నిమ్మరసం లాంటి ద్రవ పదార్థాలు తాగించాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ● ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకూడదు. ప్రయాణాలు మానుకోవాలి. తప్పనిసరి అయితే ఉదయం, రాత్రి వేళల్లో మాత్రమే ప్రయాణం, పనులు చేయాలి. ● బయటకు వెళ్లినప్పుడుడు కచ్చితంగా తాగునీరు వెంట తీసుకెళ్లాలి. ● పిల్లలు, పెద్దలు ఎవరైనా బయటకు వెళ్తే కాటన్‌గుడ్డ తలకు చుట్టుకోవాలి. లేదా గొడుగు, టోపీ ధరించాలి. ● కాళ్లకు చెప్పులు వేసి కోవాలి. వదులుగా వుండే నూలు దుస్తులను వేసుకోవాలి. ● అధికంగా ఎండ ఉంటే ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేయరాదు. ● మసాలా, ఆయిల్, వేపుడు ఆహార పదార్థాలు తినకూడదు. కీరదోస, తర్బూజ, పుచ్ఛపండు లాంటివి తీసుకోవడం ఉత్తమం. పిల్లలు, వృద్ధులకు వడదెబ్బ వడదెబ్బ ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల్లో అధికంగా వచ్చేఅవకాశం ఉంది. వారిని ఎండలోకి వెళ్లనివ్వవద్దు. పిల్లలు ఇంట్లోనే ఆడుకునే ఏర్పాట్లు చేయాలి. ఇలా చేయడం ద్వారా వడదెబ్బ నుంచి బయటపడొచ్చు. – అన్న ప్రసన్నకుమారి, డీఎంహెచ్‌వో -
అగ్రిమెంట్లో ఆలస్యం
● పీపీఏ కోసం పలు రాష్ట్రాల ఆసక్తి ● ముందుకు రాని రాష్ట్రప్రభుత్వం ● నిర్లక్ష్యం చేస్తే 85 శాతం యాక్సెస్ లాస్ అయ్యే అవకాశం ● తెలంగాణ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్–2లో కొనసాగుతున్న అనిశ్చితి జ్యోతినగర్(రామగుండం): రామగుండం ఎన్టీపీ సీలో చేపట్టిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టేజ్–2పై అనిశ్చితి నెలకొంది. రాష్ట్ర వి భజన చట్టం ప్రకారం తెలంగాణలో 4వేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం నిర్మించేందుకు నిర్ణయించింది. ఒక్కోటి 800 మె గావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టిన రెండు యూనిట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇందులో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో రాష్ట్రప్రభు త్వం 80శాతం వినియోగిస్తోంది. స్టేజ్–2 కింద చేపట్టే మిగిలిన 2,400 మెగావాట్ల మూడు యూ నిట్ల ప్రాజెక్టులో తయారయ్యే విద్యుత్ ఉత్పత్తిలో కొనుగోలు ఒప్పందం (పీపీఏ)పై రాష్ట్రప్రభుత్వం ఇంకా సంతకం చేయడం లేదు. దీంతో ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు పొరుగు రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. ఆ రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తి కొనుగోలు చేసుకుంటే.. మన రాష్ట్రం అందులోని 85శాతం విద్యుత్‌ను కోల్పోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముందుకొస్తున్న రాష్ట్రాలు.. దేశంలోని కొన్ని రాష్ట్రాలు పవర్ ప్రాజెక్టును దక్కించుకునేందుకు ముందుకొస్తున్నాయి. వాటి తో పీపీఏ ఒప్పందం చేసుకునేందుకు కరెంట్ కా ర్పొరేషన్ సిద్ధమవుతోంది. ఇలా అయితే.. తెలంగాణ స్టేజ్–2లో ఉత్పత్తి చేసే విద్యుత్‌లో 85 శా తం యాక్సెస్‌ను మనరాష్ట్రం కోల్పోయే ప్రమా దం ఉంది. ఇదే విషయంపై ఎన్టీపీసీ గతేడాది రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసింది. తెలంగాణ ప్రా జెక్టు స్టేజ్–2 కోసం పవర్ పర్చేజ్(పీపీఏ)పై సంతకం చేయాలని విన్నవించింది. సంతకం చేయడంలో ఆలస్యమైతే తెలంగాణ ప్రాజెక్టు నుంచి విద్యుత్ కోల్పోయే ప్రమాదం ఉందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి గతేడాది రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు కూడా. అయినా పరిస్థితిలో మార్పు రావడంలేదు. -
మాది దయనీయ స్థితి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది కళాకారులకు పింఛన్లు అందేవి. స్వరాష్ట్రంలో మా పరిస్థితి దయనీయంగా మారింది. తెలంగాణ సాంస్కృతిక శాఖ ద్వారా ఎప్పుడోఓసారి డోలుదెబ్బ కళాకారులకు ప్రదర్శలిచ్చే అవకాశం లభిస్తోంది. అయినా, బతుకు కష్టంగానే ఉంది. అర్హులైన కళాకారులకు పింఛన్లు మంజూరుచేసి ఆదుకోవాలి.– కుంట సదయ్య, కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రోత్సహించాలి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడంలో, సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలకు సులువుగా వివరించేలా మాలోని కళలను సద్వినియోగం చేసుకునే అవకాశం కల్పించాలి. మా కుటుంబ పోషణకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. లేదా పింఛన్లు మంజూరు చేసి ఆదుకోవాలి. – జంగిలి పోచాలు, ఒగ్గు కళాకారుడు, రాఘవాపూర్ -
భక్తిశ్రద్ధలతో రంజాన్
మంగళవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025మంథని: రంజాన్ వేడుకలను ముస్లింలు జిల్లావ్యాప్తంగా సోమవారం ఘనంగా జరుపుకున్నారు. తొలుత ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంథనిలో మంత్రి శ్రీధర్‌బాబు, పెద్దపల్లిలో ఎమ్మెల్యే విజయరమణారావు, పలువురు అధికారులు, రాజకీయ నాయకులు తదితరులు ముస్లింలను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు.. కొన్నిచోట్ల వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లింలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. న్యూస్‌రీల్ -
స్పందన అంతంతే
● ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించలే ● అవగాహన లోపం.. సాంకేతిక సమస్యలే కారణం ● రాయితీ ప్రకటించి, ప్రచారం చేసినా నేరవేరని సర్కారు లక్ష్యం ● 4,765 మంది ఫీజు చెల్లింపు.. రూ.15.41కోట్ల ఆదాయం ● గడువు పొడిగింపుపైనే ఆశలుసాక్షి, పెద్దపల్లి: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) గడువు ముగిసింది. జిల్లావాసుల నుంచి స్పందన కరువైంది. ఆదినుంచీ గందరగోళంగా సాగిన ప్రక్రియతో ప్రభుత్వం ఆశించిన మేర ఆదాయం సమకూరలేదు. రామగుండం కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలతోపాటు 266 గ్రామా ల్లో కలిపి 25,543 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 4,765 మందే ఫీజు చెల్లించారు. ఎల్ఆర్ఎస్ ఫీజు రాయితీపై అధికార యంత్రాంగం విస్తృతంగా ప్రచారం చేసినా సాంకేతిక సమస్యలకు తోడు, దరఖాస్తుదారుల్లో అవగాహన లోపంతో ప్రజల నుంచి స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. 25 శాతం రాయితీ ప్రకటించినా.. లే అవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం 2020 ఆగ స్టు 26వ తేదీ వరకు రూ.వెయ్యి ఫీజు చెల్లించిన భూ యజమానుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వీటికోసం యూజర్ మాన్యువల్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్–2020 పేరిట ప్రభుత్వం వెబ్సైట్ రూపొందించింది. అర్జీల పరిష్కారం కోసం మూ డంచెల(లెవల్–1, లెవల్–2, లెవల్–3) విధానాన్ని అమలు చేసింది. దరఖాస్తుదారులు బల్దియాలకు బారులు తీరినా.. సర్వర్ మొరాయించడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ లెవల్–1 వద్దే దరఖాస్తులు ఆగిపోయాయి. కొందరు దరఖాస్తుదారులు ఫీజు చెల్లించేందుకు యత్నించినా వెబ్సైట్లో వివరాలు కనిపించలేదు. ఇంకొందరికి క్షేత్రస్థాయి పరిశీలన పెండింగ్‌లో ఉన్నట్లు చూపించింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు చూపిస్తే నీటిపారుదల శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. వీటన్నింటికీ ఎల్ఆర్ఎస్ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలే కారణమని అధికారులు చెబుతున్నారు. కొరవడిన సమన్వయం ఎల్ఆర్ఎస్ ప్రక్రియకు మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం కొరవడింది. నిషేధిత జాబితాలో ఉన్నట్లు కనిపిస్తున్న సర్వే నంబర్లకు సంబంధించి దరఖాస్తుదారులు హెల్ప్‌డెస్క్‌లో సంప్రదిస్తే.. సదరు సర్వే నంబర్ నిషేధిత జాబితాలో లేదని రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి లేఖ తీసుకురావాలని అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సంప్రదిస్తే.. మున్సిపాలిటీ నుంచి సర్వే నంబర్ ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో లేనట్లుగా ధ్రువీకరణపత్రం తీసుకురావాలని చెప్పారు. ఇలా అర్జీదారులు ఇబ్బందులుపడ్డారు. ఈరెండు శాఖల మధ్య సమన్వయ లోపంతోపాటు ఇరిగేషన్ శాఖలో అసలు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ వివరాలు లేకపోవడం శాపంగా మారింది. ఫీజు చెల్లించినవారు 4,765 మందే జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వానికి 25,543 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు అందాయి. ఇందులో 4,765 మంది దరఖాస్తుదారులే క్రమబద్ధీకరణకు ఫీజు చెల్లించా రు. తద్వారా 18.65శాతమే నమోదైంది. సోమవా రం రాయితీ గడువు ముగిసింది. దాదాపు మరో 13,959 మంది ఫీజు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఫీజు రాయితీ గడువు పెంచాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.దరఖాస్తుల వివరాలు ప్రాంతం దరఖాస్తులు అనుమతించినవి ఫీజు చెల్లించినవి ఆదాయం (రూ.కోట్లలో) రామగుండం 7,083 4,187 916 5.3 మంథని 895 732 208 0.6 పెద్దపల్లి 10,278 7,750 2,414 8.71 సుల్తానాబాద్ 1,537 1,156 187 0.79 గ్రామీణం 5,750 4,899 1,040 0.01 -
పేద కుటుంబాలందరికీ సన్నబియ్యం
● రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ ● 43వ డివిజన్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభం గోదావరిఖని/గోదావరిఖనిటౌన్: ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. నగరంలోని 43వ డివిజన్లో ఆదివారం ఆయన సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు. తెల్లరేషన్‌కార్డు లోని ఒక్కో కుటుంబ సభ్యుడికి ఆరు కిలోలల చొ ప్పున సన్నబియాన్ని ఉచితంగా అందజేశారు. అ నంతరం ఆయన మాట్లాడుతూ, కార్పొరేషన్‌లోని కార్డుదారులకు 89 వేల కింటాళ్ల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, వీటితోపాటు మరో పదివేల కొ త్త రేషన్‌కార్డుదారులకూ పంపిణీ చేసేందుకు ఏర్పా ట్లు చేశామన్నారు. తహసీల్దార్ కుమారస్వామి, కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్, ముస్తాఫా, శ్రీనివాస్ పాల్గొన్నారు. విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా పవర్‌హౌస్‌కాలనీలోని శ్రీకాశీవిశ్వేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన చౌరస్తాలో వీహెచ్‌పీ చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ దంపతు లు, వీహెచ్‌పీ ప్రతినిధి అయోధ్య రవీందర్ తదిత రులు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోనూ షడ్రుచుల పచ్చడి పంపిణీచేశారు. నగరంలోని పలు ఈద్గాలను ఎ మ్మెల్యే సందర్శించి ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
అందరూ సుభిక్షంగా ఉండాలి
పెద్దపల్లిరూరల్: విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లావాసులు అందరూ సుభిక్షంగా ఉండాలని ఎ మ్మెల్యే విజయరమణారావు ఆకాంక్షించారు. స్థానిక ప్రగతినగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉగాది పర్వదినం సందర్భంగా అర్చకు డు కొండపాక శ్రీనివాసాచార్యులు పంచాంగ శ్రవ ణం చేశారు. ప్రగతినగర్‌లో రెసిడెంట్ టీచర్స్ ఏ ర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభిం చారు. ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అమర్‌నగర్ ప్రాంతంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మైనార్టీలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. -
వాతావరణం ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉదయం, రాత్రివేళ చల్లని గాలులు వీచే అవకాశం ఉంది. పగలంతా ఎండగా, ఉక్కపోతగా, అసౌకర్యంగా ఉంటుంది.
ఊరూరా ఉగాది సోమవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2025పెద్దపల్లిరూరల్/కమాన్‌పూర్/ఓదెల: శ్రీవిశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సర వేడుకలను జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే స్నానాలు ఆచరించిన జిల్లావాసులు.. మామిడి ఆకులతో ఇళ్లకు తోరణాలు కట్టారు. భక్ష్యాలు, షడ్రుచులతో కూడిన పచ్చళ్లు తయారు చేసి భుజించారు. సాయంత్రం వేళ ఆలయాలకు వెళ్లి పంచాంగ శ్రవణం గావించారు. కొత్త సంవత్సరంలో భవిష్యవాణి గురించి వేదపండితులు వివరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రత్యేక పూజలు చేశారు. ఓదెల శ్రీమల్లికార్జునస్వామి, కమాన్పూర్లోని ఆదివరాహస్వామి, జనగామలోని శ్రీశివాలయం భక్తులతో రద్దీగా మారాయి. బండ్లు తిరుగుట, వాహన పూజా కార్యక్రమాలు జరిగాయి. న్యూస్‌రీల్