
బ్రాస్‌బ్యాండ్ కళాకారుల సంక్షేమానికి కృషి
● పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ● సుల్తానాబాద్‌లో వర్కర్స్ యూనియన్ రెండోమహాసభలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): బ్రాస్‌బ్యాండ్ కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చొరవ తీసుకుంటామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. స్థానిక సాయిరాం గార్డెన్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్రాస్ బ్యాండ్ వర్కర్స్ యూనియన్ రెండో మహాసభ మంగళవారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, పెళ్లిళ్లు, పేరంటాలు, శుభ, అశుభకార్యాలకు బ్రాస్‌బ్యాంక్‌కు మరింత ఆదరణ పెరుగుతోందని అన్నారు. ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించేలా, బ్రాస్ బ్యాండ్ పరికరాలను రాయితీపై అందించేలా, 50ఏళ్ల వయసు దాటిన వారికి పింఛన్ మంజూరు చేసేలా, బ్రాస్‌బ్యాండ్ కళ అంతరించిపోకుండా సీఎం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. అంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి తరలివచ్చిన కళాకారులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. బ్రాస్‌బ్యాండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పారుపల్లి గుణపతి, నాయకులు అంతటి అన్నయ్యగౌడ్, మినుపాల ప్రకాశ్‌రావు, సాయిరీ మహేందర్, కల్లేపల్లి జానీ, సూర శ్యామ్, మహ్మద్ రఫీక్, రామన్న, సాహెబ్ హుస్సేన్, విజయ్ కుమార్, శ్రీకాంత్‌గౌడ్, జహంగీర్ గోపాల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.