
ఆరోగ్య రక్షణ అవసరం
పెద్దపల్లిరూరల్: ప్రజలు తమ ఆరోగ్య రక్షణకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వప్నరాణి సూచించారు. పెద్దకల్వలలో శుక్రవారం ఆరోగ్య పరిరక్షణపై నిర్వహించిన సదస్సులో జడ్జి మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం, పోషకవిలువలున్న ఆహా పదార్థాలు తీసుకోవడంతో ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. పల్లె దవాఖానా డాక్టర్ రాజేశ్‌కుమార్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
‘పద్య వైభవం’ పుస్తకంలో రాకుమార పద్యాలకు చోటు
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని చెందిన ప్ర ముఖ కవి, రచయిత రాసి న ఐదు కందపద్యాలు, ప ద్యాశారస్వత పీఠం ఆధ్వర్యంలో ప్రచురితమైన ప్ర ముఖ ‘పద్య వైభవం’ పుస్తకంలో ప్రచురితమయ్యాయి. రాష్ట్రంలోని పలువురు అవధానులతో సహా 180 మంది పద్యకవులు 900 పద్యాలు ఇందులో రాశారు. గోదావరిఖనికి చెందిన కవి రాకుమార పద్యాలకూ ఇందులో చోటు లభించింది. ఈనెల 5న హైదరాబాద్‌లో పుస్తకావిష్కరణ చేస్తారు. ఈ సందర్భంగా కవి రాకుమారను సన్మానించనున్నట్లు పద్య సారస్వత పీఠం అధ్యక్షుడు ఆవుసుల భానుప్రకాశ్ తెలిపారు.