సమ్మె జయప్రదం చేయండి
గోదావరిఖని(రామగుండం): లేబర్‌కోడ్స్ రద్దుకోసం పోరాటం చేయాలని, ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొనాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ పేర్కొన్నారు. గురువారం స్థానిక శ్రామికభవన్‌లో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన సామాజిక ఉద్యమ నిధి రూ.38,640 ిసింగరేణి అనుబంధ ఎస్‌సీఈయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు చేతుల మీదుగా రాష్ట్ర నాయకత్వానికి అందించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలపై పనిచేస్తున్న కేవీపీఎస్, స్వచ్ఛంద సంస్థలకు అండగా నిలవాలని రాష్ట్ర కమిటీ భావించి సామాజిక సంఘీభావ ఉద్యమ నిధి సేకరించారన్నారు. సమావేశంలో నాయకులు వేల్పుల కుమారస్వామి, మెండె శ్రీనివాస్, బిక్షపతి, ఎం.రామాచారి, ఎంఏ గౌస్ తదితరులు పాల్గొన్నారు.


