
న్యాయవాదవృత్తి మహోన్నతమైనది
● హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రయ్య
సుల్తానాబాద్(పెద్దపల్లి): సమాజంలో ఉత్పన్నమయ్యే సమస్యలకు పరిష్కారం చూపించే న్యాయవాద వృత్తి మహోన్నతమైనదని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గుండా చంద్రయ్య అన్నారు. సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. న్యాయవాదులతో మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను సమాజంలో అమలు చేసేలా అవగాహన కల్పించాలన్నా రు. ఇందుకోసం న్యాయవాదులు నిస్వార్థంగా సేవలు అందించాలని ఆయన సూచించారు. మానవ హక్కుల ఉల్లంఘనలను అడ్డుకుని, వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడాలని జడ్జి కోరారు. సుల్తానాబాద్ జడ్జి గణేశ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో జస్టిస్ చంద్రయ్యను ఈ సందర్భంగా సన్మానించారు. సు ల్తానాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యద ర్శి బోయిని భూమయ్య, న్యాయవాదులు ఆవుల లక్ష్మీరాజం, పబ్బతి లక్ష్మీకాంతరెడ్డి, భూసారపు బాలకిషన్‌ప్రసాద్, మాడూరి ఆంజనేయులు, జోగుల రమేశ్, సామల రాజేంద్రప్రసాద్, ఆవుల శివకృష్ణ, గుడ్ల వెంకటేశ్, బొబ్బిలి శ్యాం, మ ల్యాల కరుణాకర్, లెక్కల గంగాధర్, తిరుపతి, సారయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.