
ప్రజలు ఓట్లు వేస్తేనే మంత్రి పదవి వచ్చింది
● మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్
రామగిరి(మంథని): కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేస్తేనే మంత్రి పదవి వచ్చిందని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తించాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సూచించారు. సెంటినరీకాలనీ తెలంగాణ చౌరస్తాలోని అసంపూర్తి కల్వర్టు పనులను ఆయన మంగళవారం పరిశీలించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా అభివృద్ధి పనులు చేయడంలో మంత్రి విఫలమయ్యారన్నా రు. అయినా, మళ్లీ శిలాఫలకాలు వేస్తున్నారని, కమాన్‌పూర్ తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారని విమర్శించారు. ముందుగా మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయా లని హితవు పలికారు. ఓడేడు వంతెన గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఓటు విలువ తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ, నా యకులు శంకేశీ రవీందర్, కాపురబొయిన భాస్కర్, కుమార్ యాదవ్, అల్లం తిరుపతి, దేవ శ్రీనివాస్, కొండవేన ఓదేలు, బుర్ర శంకర్, బుద్దె ఉదయ్, రోడ్డ శ్రీనివాస్, కలవేన సదానందం పాల్గొన్నారు.