
సత్వర చికిత్స.. సింగరేణి భరోసా
● ధీర్ఘకాలిక వ్యాధుల జాబితాలో ‘లివర్ సిర్రోసిస్’ ● ఆమోదించిన కోలిండియా యాజమాన్యం ● సింగరేణి కార్మికులకు ఎంతోప్రయోజనం
నిర్ణయం సంతోషం
లివర్ సిర్రోసిస్‌ను ధీర్ఘకాలిక వ్యాధుల జాబితాలో చేర్చడం సంతోషకరం. ఈ నిర్ణయం బాధితులకు ఎంతోఊరటనిస్తుంది. సింగరేణి అండగా ఉంటుందనే భరోసా ఉంటుంది.
– కల్లూరి రాజయ్య,
ఈపీ ఆపరేటర్, ఓసీపీ–3
అనేక ప్రయోజనాలు
కోలిండియా యాజమాన్యం లివర్ సిర్రోసిస్‌ను ధీర్ఘకాలిక వ్యాధుల జాబితాలో చేర్చడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. కాలేయం పనిచేయని వారికి సరైన సమయంలో సరైన చికిత్స అందుతుంది.
– మేడ రాంమూర్తి,
ఎంవీ డ్రైవర్, జీడీకే–5 ఓసీపీ
దీర్ఘకాలిక వ్యాధులు ఇవే..
● గుండె సంబంధిత, టీబీ, కాన్సర్, లెప్రసీ, పక్షవాతం, మూత్రపిండ సంబంధిత, హెచ్‌ఐవీ, మెదడు సంబంధిత, తాజాగా లివర్ సిర్రోసిస్..
గోదావరిఖని: బొగ్గు గని కార్మికుల ధీర్ఘకాలిక వ్యాధుల జాబితాలో లివర్ సిర్రోసిస్ వచ్చి చేరింది. కోలిండియా యాజమాన్యం ఈవ్యాధిని అధికారికంగా ఆమోదించింది. దీంతో బొగ్గు గని కార్మికులకు ప్రత్యేక వేతనంతో కూడిన సెలవు పొందే అవకాశం లభించింది. ఇప్పటివరకు ఉన్న వ్యాధులకు తోడు మెడికల్ అటెండెన్స్ రూల్స్ ప్రకారం దీర్ఘకాలిక వ్యాధుల జాబితాలో లివర్ సిర్రోసిస్‌ను కూడా చేర్చింది. దీంతో సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 40వేల మంది పైచిలుకు కార్మికులకు దీని ద్వారా ప్రయోజనం కలుగనుంది.
దీర్ఘకాలిక వ్యాధుల బారినపడితే..
బొగ్గు గనుల్లో పనిచేస్తూ దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడితే సింగరేణి సంస్థ వైద్యం కోసం అయ్యే పూర్తి ఖర్చులు భరించనుంది. ఇప్పటివరకు బొగ్గుగని కార్మికులకు గుండె సంబంధిత, టీబీ, కాన్సర్, లెప్రసీ, పక్షవాతం, మూత్రపిండ సంబంధిత, హెచ్‌ఐవీ, మెదడు సంబంధిత వ్యాధులకు అయ్యే వైద్య ఖర్చులను యాజమాన్యం భరిస్తోంది. కోలిండియా యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందంతో తాజా గా లివర్ సిర్రోసిస్‌కు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తద్వారాఈవ్యాధి బారిన పడిన సింగరేణి ఉద్యోగులు పలు ప్రయోజనాలు పొందనున్నారు.
కార్మిక సంఘాల డిమాండ్ మేరకు..
గతేడాది డిసెంబర్ 12న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో జరిగిన 11వ నేషనల్ కోల్‌వేజ్ ఒప్పందం నాలుగో స్టాండర్డరైజేషన్ సమావేశంలో లివర్ సిర్రోసిస్‌ను కూడా ధీర్ఘకాలిక వ్యాధుల జాబితాలో చేర్చాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశా యి. ఈక్రమంలో దీనికి కోలిండియా యాజమా న్యం అంగీకరించింది. దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించిన విధంగా లివర్ సిరోసిస్‌ను కూడా లిస్టులో చేర్చారు. ఈమేరకు సింగరేణి సంస్థ మెడికల్ బోర్డు మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ ఆస్పత్రికి పంపించేందుకు అంగీకరించింది.
మిగతా వాటి మాదిరిగానే..
తాజా నిర్ణయం ద్వారా లివర్ సిర్రోసిస్ వ్యాధిని మె డికల్ బోర్డు నిర్ధారణ చేసేవరకు బాధితుడికి ప్ర త్యేక సెలవు మంజూరు చేసి 50 శాతం (మూల వేతనం+ వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్+ స్పెషల్ డియర్ నెస్ అలవెన్స్) చెల్లించనున్నారు. దీంతో ప్రత్యేక సెలవుతో కూడిన వేతనం చెల్లించనున్నారు.
లివర్ సిర్రోసిస్ అంటే..
లివర్(కాలేయ)సిర్రోసిస్ అనేది దీర్ఘకాలిక సమస్య. కాలేయ సంబంధిత వ్యాధులు, మద్యపానంతో వ స్తుంది. కాలేయం మచ్చ కణజాలాలు(ఫైబ్రోసిస్) పెరిగి లివర్ సిర్రోసిస్‌కు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది చివరి దశ. శరీరంలోని హానికర వ్యర్థాలను తొలగించి, రక్తాన్ని శుభ్రం చేయడంలో కాలేయం కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యమైన పోషకాలను తయారు చేస్తుంది. సింగరేణి ప్రాంతంలో ఈ వ్యాధి బారినపడేవారి సంఖ్య అధికంగా ఉంటోందని డాక్టర్లు వివరిస్తున్నారు. ప్రధానంగా ఆల్కహాల్, వైరల్ డిసీజ్, ఫ్యాటీ లివర్‌తో ఈ వ్యాధి బారినపడుతున్నారని అంటున్నారు.
బాధితులు ఎక్కువే
లివర్ సిర్రోసిస్ వ్యాధి బారిన పడుతున్న సింగరేణి కార్మికుల సంఖ్య ఎక్కువగానే ఉంది. దీర్ఘకాలికంగా ఆల్కాహాల్ తాగితే లివర్ సిర్రోసిస్ బారినపడతారు. వైరల్ ఇన్‌ఫెక్షన్, ఫ్యాటీ లివర్‌తో లివర్ దెబ్బతిని ఈ వ్యాధికి దారితీస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే లివర్ బండగా మారి ఫంక్షనింగ్ ఆగిపోతుంది.
– డాక్టర్ కిరణ్‌రాజ్‌కుమార్, సీఎంవో, సింగరేణి
బీఎంఎస్ కృషితోనే..
మా యూనియన్ కృషితోనే లివర్ సిర్రోసిస్ దీర్ఘకాలిక వ్యాధుల జాబితాలో చేర్చారు. యూనియన్ బొగ్గు ప రిశ్రమల ఇన్‌చార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి గతేడాది జరిగిన సమావేశంలో ఈ డిమాండ్ చేశారు. దీంతో కోలిండియా యాజమాన్యం అంగీకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కార్మికుల సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం చేస్తాం. – యాదగిరి సత్తయ్య, బీఎంఎస్ అధ్యక్షుడు

సత్వర చికిత్స.. సింగరేణి భరోసా

సత్వర చికిత్స.. సింగరేణి భరోసా

సత్వర చికిత్స.. సింగరేణి భరోసా

సత్వర చికిత్స.. సింగరేణి భరోసా