తగ్గుతున్న పర్మినెంట్‌.. పెరుగుతున్న ప్రైవేట్‌ | - | Sakshi
Sakshi News home page

తగ్గుతున్న పర్మినెంట్‌.. పెరుగుతున్న ప్రైవేట్‌

Published Sat, Apr 19 2025 9:48 AM | Last Updated on Sat, Apr 19 2025 9:48 AM

తగ్గు

తగ్గుతున్న పర్మినెంట్‌.. పెరుగుతున్న ప్రైవేట్‌

గోదావరిఖని: లాభాల బాటలో పయనిస్తున్న సింగరేణి బొగ్గు గనులు, ఎన్టీపీసీ విద్యుత్‌ సంస్థ, యూ రియా తయారీ కర్మాగారం ఆర్‌ఎఫ్‌సీఎల్‌, అల్ట్రాటెక్‌(కేశోరాం) సిమెంట్‌ పరిశ్రమల్లో ఏటికేడు పర్మినెంట్‌ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుండగా.. అదేస్థాయి లో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. యాంత్రీకరణ, కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణతో పరిశ్రమల యాజమా న్యాలు పర్మినెంట్‌ ఉద్యోగాలపై వేటు వేస్తున్నాయి.

సింగరేణిలో 1.38లక్షల నుంచి 42 వేలకు..

ఒకప్పుడు(1993కు ముందు) 1.38లక్షల మంది కార్మికులతో కళకళలాడిన సింగరేణిలో ప్రస్తుతం ప ర్మినెంట్‌ కార్మికుల సంఖ్య సుమారు 42 వేలకు పడిపోయింది. ఇదే సమయంలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య దాదాపు 60 వేలకు చేరుకుందని పలు కార్మి క సంఘాల నాయకులు చెబుతున్నారు. మరోవై పు.. వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 40 మిలియన్‌ టన్నుల నుంచి 76 మిలియన్‌ టన్నులకు చేరింది.

వేతనం తక్కువ.. పని ఎక్కువ..

కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెంచడంతో పరిశ్రమలు లాభాల బాటలో పయనిస్తున్నాయి. వీరికి ఉద్యోగ భద్రత, క్వార్టర్‌, వైద్యం, విద్య తదితర సౌకర్యాల కల్పనలో పెద్దగా ఆసక్తిచూపకపోవడం, జీతభత్యాల విషయంలో కొర్రీలు పెట్టడం, సామాజిక బాధ్యతల నుంచి తప్పుకోవడంతో తరచూ పారిశ్రామిక సంబంధాలు దెబ్బతింటున్నాయి.

తగ్గిన ఉద్యోగులు.. పెరిగిన విద్యుత్‌ ఉత్పత్తి

ఎన్టీపీసీలో ప్రస్తుతం 520 మంది అధికారులు పనిచేస్తుండగా, 270మంది పర్మినెంట్‌ ఉద్యోగులు ఉన్నారు. ఈ సంస్థలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య సుమారు 4,500కు చేరింది. కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరిగి, పర్మినెంట్‌ ఉద్యోగుల సంఖ్య తగ్గినా.. విద్యుత్‌ ఉత్పత్తి ఏటా రికార్డుస్థాయిలో పెరుగుతూ రావడం గమనార్హం.

800 మంది కాంట్రాక్టు కార్మికులు..

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో 100 మంది అధికారులు ఉండగా, 580 పర్మినెంట్‌ ఉద్యోగులు, మరో 800 మంది కాంట్రాక్టు కార్మికులు యూరియా ఉత్పత్తిలో భాగస్వాలవుతున్నారు. రెండేళ్ల క్రితమే పునరుద్ధరించిన ఈ సంస్థలో ఎరువులు ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో 680 మంది పర్మినెంట్‌ ఉద్యోగులు ఉంటే.. అంతకు మించి 800 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేయడం గమనార్హం.

అల్ట్రాటెక్‌(కేశోరాం) సిమెంట్‌లో..

బసంత్‌నగర్‌లోని కేశోరాం సిమెంట్‌ పరిశ్రమ ఇటీవల అల్ట్రాటెక్‌గా పేరు మార్చుకుంది. ఇందులో పర్మినెంట్‌ ఉద్యోగుల కన్నా కాంట్రాక్టు కార్మికులే అధికంగా ఉన్నారు. వీరికి పర్మినెంట్‌ ఉద్యోగుల కన్నా తక్కువ వేతనాలు కావడం, అధిక పనులు చేయడంతో సిమెంట్‌ ఉత్పత్తి పెరుగుతోంది. ఏటా లాభాలు ఆర్జిస్తోంది. ప్రస్తుతం 200మంది అధికారులు, 375 పర్మినెంట్‌ ఉద్యోగులు, 750మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.

సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, ‘కోశోరాం’లో ప్రైవేట్‌ జోరు

వేగంగా పెరుగుత్తున్న కాంట్రాక్టు కార్మికుల సంఖ్య

చాలీచాలని వేతనాలు.. గ్యారెంటీ లేని బతుకులు

సింగరేణిలోని పర్మినెంట్‌ ఈపీ ఆపరేటర్‌ నెల వేతనం రూ.1.50లక్షలు

ప్రైవేట్‌ ఓబీ వోల్వో ఆపరేటర్‌(కాంట్రాక్టు కార్మికుడు) నెల వేతనం రూ.20 వేలు

ఎన్టీపీసీలోని పర్మినెంట్‌ ఇంజినీర్‌ నెల వేతనం రూ.1.50లక్షలు

అదేస్థాయి కాంట్రాక్టు కార్మికుడి నెల వేతనం రూ.30వేలు

పరిశ్రమల్లో పర్మినెంట్‌, కాంట్రాక్టు ఉద్యోగుల సమాచారం

సింగరేణి

రకం అధికారులు పర్మినెంట్‌ కాంట్రాక్టు

అప్పుడు 2300 1.38 లక్షలు –

ఇప్పుడు 2,200 42వేలు 60వేలు

ఎన్టీపీసీ

అప్పుడు 300 830 3,000

ఇప్పుడు 520 27 4,500

ఆర్‌ఎఫ్‌సీఎల్‌

అప్పుడు 60 800 400

ఇప్పుడు 100 580 800

అల్ట్రాటెక్‌(కేశోరాం)

అప్పుడు 400 1,000 200

ఇప్పుడు 200 375 750

కాంట్రాక్టు కార్మికులకు అన్యాయం

సింగరేణిలో ఒకప్పుడు 1.38 లక్షల మంది ఉన్న కార్మికులు ప్రస్తుతం 42వేల మందికి తగ్గిపోయారు. వారిస్థానంలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరిగింది. యాంత్రీకరణ, కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ శరవేగంగా సాగుతోంది. విద్య, వైద్యం, సంక్షేమంలో కాంట్రాక్టు కార్మికులకు అన్యాయం జరుగుతోంది.

– రాజారెడ్డి, అధ్యక్షుడు, సీఐటీయూ

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

ఎన్టీపీసీలోని కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. పర్మినెంట్‌ ఉద్యోగులను తగ్గించి కాంట్రాక్టు కార్మికులతో పనిచేయిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు లాభాపేక్షతో కాంట్రాక్టు కార్మికులకు అన్యాయం చేస్తున్నాయి. చట్టబద్ధ హక్కులను కాలరాయొద్దు.

– భూమళ్ల చందర్‌, జిల్లా అధ్యక్షుడు, ఐఎన్‌టీయూసీ

శ్రమదోపిడీ చేస్తున్నారు

కాంట్రాక్టు కార్మికులను శ్రమదోపిడీ చేస్తున్నారు. లాభాల కోసమే ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పనిచేస్తోంది. పర్మినెంట్‌ కార్మికుల సంఖ్య తక్కువ, కాంట్రాక్టు కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉంది. వారందరికీ చట్టబద్ధమైన హక్కులు కల్పించాలి. లాభాల బోసన్‌ ఇవ్వాలి. విద్య, వైద్యం, గృహ వసతి కల్పించాలి.

– అంబటి నరేశ్‌, అధ్యక్షుడు, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ మజ్దూర్‌ యూనియన్‌

తగ్గుతున్న పర్మినెంట్‌.. పెరుగుతున్న ప్రైవేట్‌1
1/4

తగ్గుతున్న పర్మినెంట్‌.. పెరుగుతున్న ప్రైవేట్‌

తగ్గుతున్న పర్మినెంట్‌.. పెరుగుతున్న ప్రైవేట్‌2
2/4

తగ్గుతున్న పర్మినెంట్‌.. పెరుగుతున్న ప్రైవేట్‌

తగ్గుతున్న పర్మినెంట్‌.. పెరుగుతున్న ప్రైవేట్‌3
3/4

తగ్గుతున్న పర్మినెంట్‌.. పెరుగుతున్న ప్రైవేట్‌

తగ్గుతున్న పర్మినెంట్‌.. పెరుగుతున్న ప్రైవేట్‌4
4/4

తగ్గుతున్న పర్మినెంట్‌.. పెరుగుతున్న ప్రైవేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement