
కనీస పింఛన్ రూ.5వేలు ఇవ్వాలి
గోదావరిఖని: దేశంలోని బొగ్గు గనికార్మికుల కనీ స పింఛన్‌ను రూ.5వేలకు పెంచాలని సీఎంపీఎ ఫ్ ట్రస్టీ బోర్డు నాయకులు డిమాండ్ చేశారు. గు రువారం న్యూఢిల్లీలో కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ట్రస్టీ (బీవోటీ)184వ సమా వేశం జరిగింది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్మన్ విక్రమ్ దేవ్‌దత్ అధ్యక్షత వహించారు. ఎఫ్‌పీఎఫ్ 1971 పింఛనుదారులకు రూ.వెయ్యి కనీస పింఛన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈటీఎఫ్(ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్)లో పెట్టుబడుల శాతాన్ని 7 నుంచి 10 వరకు పెంచేటప్పుడు జాగ్రత్తలు తీసుకో వాలని, సీఎంపీఎఫ్ హెడ్డాఫీస్‌లో కూడా పెట్టుబడులను అజమాయిషీ చేసే యంత్రాంగం ఉండా లని, నూరుశాతం ఆన్‌లైన్ పద్ధతి అమలు చే యాలని కోరారు. మే నెలాఖరు వరకు పూర్తయ్యేటట్లు చూస్తామని బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపా రు. కోలిండియా నిర్ణయించినట్లు సింగరేణి కూ డా పింఛన్ ఫండ్‌లో టన్ను బొగ్గుపై రూ.20 జమచేయాలని సభ్యులు సూచించగా, సింగరేణి సీ ఎండీ బలరాంనాయక్ అంగీకరించారన్నారు.