
దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో ముందుకెళ్లాలి
● అడిషనల్ కలెక్టర్ డి.వేణు
పెద్దపల్లిరూరల్: దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూ ర్తి అందరికీ ఆదర్శమని అడిషనల్ కలెక్టర్ డి. వేణు అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన కొమురయ్య 98వ జయంతి కార్యక్రమంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చేందుకు ప్రా ణాలు పణంగా పెట్టిన గొప్ప యోధుడు కొమురయ్య అని, ఆయన చూపిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. మహనీయులను ఒక కులానికో, వర్గానికో పరిమితం చేయకుండా వారి ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. బీసీ సంక్షే మ అధికారి రంగారెడ్డి, సంఘం అధ్యక్షుడు మల్లే శం, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
విగ్రహం ఏర్పాటు చేయాలని వినతి
సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని జిల్లా కేంద్రంలోని ట్యాంక్‌బండ్‌పై ఏ ర్పాటు చేయాలని, జనగామ జిల్లాకు దొడ్డి కొ మురయ్య పేరు పెట్టాలని అడిషనల్ కలెక్టర్ వేణుకు బీసీ సంఘం నాయకులు గురువారం వినతి పత్రం అందించారు. ఆకుల స్వామి, పొ ట్యాల మల్లేశం, కర్ర కుమారస్వామి పాల్గొన్నారు.