
నీడ లేదు.. నీరూ లేదు..!
కూర్చునేందుకు కుర్చీ ఉండదు.. నిలబడదామంటే నీడ ఉండదు.. కనీసం తాగునీరు దొరకదు.. అత్యవసర పరిస్థితుల్లో మరుగుదొడ్లను వినియోగించుకుందా మంటే ముక్కుపుటాలు అదిరే కంపు.. ఇవీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్లలో కనిపించే పరిస్థితులు. నియోజకవర్గ కేంద్రాల్లో బస్టాండ్లు ఉన్నా సౌకర్యాలు లేకపోగా.. మండల కేంద్రాల్లో కనీసం బస్టాండ్లు కూడా కరువయ్యాయి. మరికొన్ని ప్రధాన గ్రామాల్లో ప్రయాణ ప్రాంగణాలు లేక ప్రయాణికులు ఎండలోనే బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయడంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. వీరంతా ఎండలోనే నిల్చొని బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం.. అంటూ ప్రచారం చేసుకునే అధికారులు ప్రయాణ ప్రాంగణాలలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ఉమ్మడి జిల్లాలో ప్రయాణ ప్రాంగణాలు లేక.. ఉన్నా సౌకర్యాలు కరువై ప్రయాణికులు పడుతున్న కష్టాలపై ‘సాక్షి’ ఫోకస్. – వివరాలు 8లో..

నీడ లేదు.. నీరూ లేదు..!

నీడ లేదు.. నీరూ లేదు..!