
భూ సమస్యలకు పరిష్కారం
పాలకుర్తి(రామగుండం): భూభారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయని అడిషనల్ కలెక్టర్ వేణు అన్నారు. స్థానిక రైతువేదికలో శు క్రవారం నిర్వహించిన భూభారతి చట్టంపై రై తులకు ఆయన అవగాహన కల్పించారు. ధర ణి పోర్టల్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతుల కు కొత్త చట్టం ద్వారా మేలు చేకూరుతుందని తెలిపారు. తహసీల్దార్ జ్యోతి, ప్రత్యేకాధికారి జగన్మోహన్రెడ్డి, ఎంపీడీవో రామ్మోహన్‌చారి, వ్యవసాయాధికారి ప్రమోద్, సింగిల్‌విండో చైర్మన్ బయ్యపు మనోహర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కాగా, సదస్సుకు అనూహ్యంగా రైతులు అధిక సంఖ్యలో తరలిరావడంతో రైతువేదిక భవనం కిక్కిరిసిపోయింది. చాలామంది స్థలంలేక ఆరుబయట నిల్చోవాల్సి వచ్చింది.
వినియోగం పెంచాలి
గోదావరిఖని: పనిగంటలు సద్వినియోగం చే సుకోవాలని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. ఆర్జీ–2 ఏరియా ఓసీపీ–3ని ఆ యన శుక్రవారం సందర్శించారు. తొలుత కృషిభవన్‌లో బొగ్గు ఉత్పత్తిపై సమీక్షించారు. క్యాంటిన్లో సదుపాయాలు తనిఖీ చేశారు. అ ధికారులు, ఉద్యోగులతో కలిసి టిఫిన్ చేశారు. జీఎం వెంకటయ్య, ఎస్వోటూ జీఎం రాము డు, ఏరియా ఇంజినీర్ నర్సింహారావు, ఇంజినీర్ రాజాజీ, పర్సనల్ డీజీఎం అనిల్‌కుమార్, ఐఈడీ డీజీఎం మురళీకృష్ణ, ప్రాజెక్టు మేనేజర్ భారత్‌కుమార్, డీజీఎం విజయ్‌కుమార్, సీఎస్ పీ ఇన్చార్జి సదానందం పాల్గొన్నారు.
పంచాయతీ ఆఫీస్ తనిఖీ
రామగిరి: నాగెపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని డీపీవో వీరబుచ్చయ్య శుక్రవారం తనిఖీ చేశారు. పారిశుధ్యం నిర్వహణపై నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. వివిధ అభివృద్ధి పనులపై ఆయన ఆరా తీశారు.
పగిలిన పైపులైన్ పరిశీలన
రామగుండం: స్థానిక అక్బర్నగర్కాలనీ సమీపంలో పగిలిన బూడిద పైపులైన్‌ను ఎన్టీపీసీ ఈడీ చందన్‌కుమార్ సామంత శుక్రవారం పరిశీలించారు. గత బుధవారం బూడిద పైపులైన్ పగిలి కాలనీలోని పలు ఇళ్లను బూడిదనీరు ముంచెత్తిన విషయం విదిదమే. బాధిత కు టుంబాలను పరామర్శించిన ఈడీ.. నష్ట నివారణ చర్యలను చేపట్టాలని ఎన్టీపీసీ హెచ్ఆర్ ఏజీఎం సిగ్దర్ను ఆదేశించారు. తమకు మిషన్‌భగీరథ ద్వారా తాగునీటి సరఫరా చేయాలని, యాష్‌పాండ్ నుంచి వచ్చే బూడిద నివారణకు నీటిని చల్లించాలని, డ్రైనేజీ, రోడ్లు నిర్మించాల ని కాంగ్రెస్ మైనార్టీ మహిళా విభాగం ప్రతినిధులు నాజియా సుల్తానా, సంగనవేణి శేఖర్, జక్కుల నారాయణ, షేక్ ముంతాజ్ అహ్మద్ తదితరులు ఈడీని కోరారు.
మెడికోలకు సిమ్స్‌లో జిమ్
కోల్‌సిటీ(రామ గుండం): గోదావ రిఖనిలోని సిమ్స్ లో మెడికోల కో సం త్వరలో కొత్త గా జిమ్ ఏర్పాటు చేస్తామని ప్రిన్సిపాల్ హిమబింద్‌సింగ్ తెలిపారు. శుక్రవారం మెడికల్ కాలేజీలో మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీతోపాటు హాస్టల్లో రక్షిత మంచినీటిని సరఫరాకు రెండు ఆర్వో వాటర్ ప్లాంట్లు, జీజీహెచ్‌లో మరో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు అంచనాలు తయారు చేసినట్లు తె లిపారు. కాలేజీలో బయోకెమిస్ట్రీ, ఆర్థోపెడిక్, ఎమర్జెన్సీ, గైనిక్ పీజీతోపాటు పీడీయాట్రిక్, జనరల్ సర్జన్ పీజీ కోర్సుల కోసం విన్నవించామని తెలిపారు. జీజీహెచ్‌లో సేవలు మెరుగయ్యాయని ఆమె అన్నారు. కాగా, సెకండీయర్లోని 138 మంది మెడికోలు ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ తెలిపారు. ఇందులోని 28 మందికి 75 శాతానికిపైగా మార్కులు వచ్చినట్లు వెల్లడించారు. జీజీహెచ్ ఆర్ఎంవో డాక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

భూ సమస్యలకు పరిష్కారం

భూ సమస్యలకు పరిష్కారం

భూ సమస్యలకు పరిష్కారం

భూ సమస్యలకు పరిష్కారం