ఫలించిన పదేళ్ల పోరాటం
● ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగులకు కొత్త పింఛన్ అమలు
జ్యోతినగర్(రామగుండం): దేశానికి వెలుగులు పంచుతున్న ఎన్టీపీసీలో నిర్విరామంగా విధులు నిర్వహించడంలో ముఖ్యపాత్ర పోషించిన ఉద్యోగులకు ఉద్యోగ విరమణ తర్వాత అరకొర పింఛన్ వచ్చేది. ఈపీఎస్–95 పద్ధతి ద్వారా ఇలా తక్కువ మొత్తంలో డబ్బులు చేతికి అందడంతో వారి కుటుంబాలకు ఆర్థికంగా అనేక ఇబ్బందు లు ఎదుర్కొనేవి. ఈ పద్ధతి మార్చాలని సుమా రు పదేళ్లుగా రిటైర్డ్ ఉద్యోగులు అనేక పోరాటలు చేస్తూ వస్తున్నాయి. వీటి ఫలితంగా బేసిక్‌పై పింఛన్ మంజూరు కావడంతో వారిశేష జీవితంలో ఎన్టీపీసీ మళ్లీ వెలుగులు ప్రసరింపజేస్తోంది.
రిటైర్డ్ ఉద్యోగులు 368 మంది..
రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టులో ఇప్పటివరకు సుమారు 368 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేశారు. రిటైర్‌మెంట్ తర్వాత కేటగిరీల ఆధారంగా రూ.2వేల – రూ.4వేల వరకే పింఛన్ వచ్చేది. ప్రభుత్వరంగ సంస్థలో పనిచేసినా ఇంత తక్కువ మొత్తంలో పింఛన్ రావడంతో అవసరా లు తీరక తీవ్ర ఆవేదన చెందేవారు. 01–09– 2014లో సుప్రీంకోర్టు తీర్పు వీరి పింఛన్ పెంపుదలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగ విరమణ పొందిన వారికి నిజవేతనంపై పింఛన్ మంజూరు చేయాలని ఉత్తర్వులు విడుద ల చేసింది. దీంతో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు అధిక పింఛన్ పొందేందుకు అర్హులుగా తేలామని ఊరట చెందారు.
2022లో సుప్రీంకోర్టుకు..
పింఛన్ వ్యవహారంలో తమకు న్యాయం చేయాలంటూ ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగులు 2022లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు వాయిదాల అనంతరం ఈపీఎస్–95ని మార్పుచేయడంతోపాటు నిజవేతనం, సర్వీసు ఆధారంగా పింఛన్ మంజూరు చేయాలని తీర్పునిచ్చింది. ఈమేరకు రీజినల్ పీఎఫ్ కమిషన్ తానయ్య రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్ మంజూరు పత్రాలను అందించారు. ఈనెల ఐదుగురు ఉద్యోగ విరమణ పొందేవారు తొలిసారి పెరిగిన పింఛన్ అందుకోనున్నారు. మిగతావారు విడతల వారీ గా పీఎఫ్ బకాయిలను చెల్లించిన అనంతరం వారి సర్వీసు, నిజవేతనాలను లెక్కించి పింఛన్ మంజూరు చేయనున్నారు.
కొత్త పింఛన్ పత్రాలు అందజేత
ఎన్టీపీసీలో ఉద్యోగ విరమణ చేసిన వారికి బేసిక్–పే, సర్వీసును బట్టి కొత్త పింఛన్ విధానం అమలవుతోందని ఏజీఎం(హెచ్‌ఆ ర్) బిజయ్‌కుమార్ సిగ్దర్ అన్నారు. ఈపీఎస్–95 పింఛన్ విధానంలో భాగంగా రిటైర్డ్ ఉద్యోగులకు శనివారం ఆయన కొత్త పింఛ న్ మంజూరు పత్రాలను అందించి మాట్లాడారు. అధిక వేతనాలపై ఈపీఎస్–95 పింఛన్ సులభతరం చేయడంలో రామగుండం ఎన్టీపీసీ ముఖ్యమైన మైలురాయిని చేరుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.
ఫలించిన పదేళ్ల పోరాటం


