ప్రతీ క్యాంటీన్‌లో ఏర్పాటు చేయాలి
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లలో కూడా గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈక్రమంలో నూనె తక్కువగా ఉపయోగించే అల్పాహారం వైపు కార్మికులు మొగ్గుచూపుతున్నారు. యాజమాన్యం చపాతీల యంత్రాలను ప్రతీక్యాంటీన్‌లో ఏర్పాటు చేయాలి. కార్మికులకు మిల్లెట్స్ ఉప్మా, మిల్లెట్స్ ఇడ్లీ, రాగి ఇడ్లీ.. ఇలా కొత్తతరహా అల్పాహారం అందించాలి.
– వాసిరెడ్డి సీతారామయ్య, అధ్యక్షుడు, ఏఐటీయూసీ
వినియోగంలోకి తీసుకొస్తాం
చపాతీలు తయారు చేసే యంత్రాలను సింగరేణి యాజమాన్యం గతంలో కొనుగోలు చేసిన మాట వాస్తవమే. యంత్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాటిని వినియోగించడం లేదు. ఇటీవల గుర్తింపు కార్మిక సంఘం నాయకులు ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారు. సాధ్యమైనంత త్వరగా వాటిని వినియోగంలోకి తీసుకొస్తాం. కార్మికులకు చపాతీలతో కూడిన అల్పాహారం అందిస్తాం.
– లలిత్‌కుమార్, ఆర్జీ–1 జీఎం
ప్రతీ క్యాంటీన్‌లో ఏర్పాటు చేయాలి


