
వైభవం.. రాములోరి కల్యాణం
● సీతాదేవిని వివాహమాడిన శ్రీరాముడు ● ఊరూరా అంగరంగ వైభవంగా ఉత్సవాలు ● పులకించిన భక్తజనులు
పెద్దపల్లిరూరల్/గోదావరిఖని: ఆకాశమంతా పందిరి వేశారు.. రకరకాల పూలు అలంకరించారు.. ఊరంతా మామిడితోరణాలు కట్టారు.. శ్రీసీతారాముల విగ్రహాలను అందంగా ముస్తాబు చేశారు.. అద్భుతంగా నిర్మించిన కల్యాణ వేదికపైకి తీసుకొచ్చారు.. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో రాములోరి కల్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిపించారు. జిల్లాలోని గోదావరిఖని, పెద్దపల్లి శ్రీకోదండ రామాలయాలు, ఎన్టీపీసీ, రామగుండం, యైటింక్లయిన్‌కాలనీ, మంథని, సుల్తానాబాద్‌తోపాటు ఓదెల శ్రీమల్లికార్జునస్వామి ఆలయాల్లో సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిపించారు. ఆయా ప్రాంతాల్లో ప్రములుఖులు హాజరయ్యారు. భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చి స్వామివారల కల్యాణాన్ని కనులారా వీక్షించారు.

వైభవం.. రాములోరి కల్యాణం