
ఒకే పాడైపె తల్లీకొడుకుల మృతదేహాలు
రుద్రంగి(వేములవాడ): ఫుడ్ పాయిజన్‌తో ఆదివారం మృతిచెందిన తల్లీకొడుకులు కాదాసు పుష్పలత, నిహాల్ అంత్యక్రియలను మంగళవారం నిర్వహించారు. ఒకే పాడైపె తల్లీకొడుకుల మృతదేహాలను అంత్యక్రియలకు తరలించడంతో రుద్రంగి ఘొల్లుమంది. రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన తల్లీకొడుకులు పుష్పలత, నిహాల్ శుక్రవారం రాత్రి రొట్టెలు తిని పడుకోగా.. వాంతులు, విరోచనాలతో ఆస్పత్రిలో చేరి చనిపోయిన విషయం తెలిసిందే. అయితే వీరి మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పుష్పలత భర్త రాజు దుబాయిలో ఉండడంతో అంత్యక్రియలు నిర్వహించలేదు. దుబాయి నుంచి రాజు మంగళవారం మధ్యాహ్నం చేరుకుని భార్య, కొడుకుల మృతదేహాలను చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, రుద్రంగి ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.