
హోమియోతో మొండి వ్యాధులకు చెక్
కరీంనగర్‌టౌన్: హోమియోపతి ప్రపంచవ్యాప్తంగా రెండవ ప్రధాన వైద్యంగా గుర్తించబడింది. సాంప్రదాయ వైద్యానికి స్పందించని దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఈ వైద్యం ఎంతగానో పనిచేస్తుంది. గతంలో తెలుగు రాష్ట్రాల్లో మెదడువాపును నయం చేయడంలో, చికెన్‌గున్యా, స్వైన్‌ఫ్లూ వంటి ఎన్నో వ్యాధులను నయం చేయడంలో హోమియో వైద్యం పనితనం అందరికి తెలిసింది. పలు మొండి వ్యాధులను నయం చేయగల శక్తి ఉందనే నమ్మకంతో ఈ వైద్య విధానాన్ని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. జర్మనీలో 1755 ఏప్రిల్ 10వ తేదీన జన్మించిన డాక్టర్ శామ్యూల్ హానిమన్ తన రెండు దశాబ్దాల పరిశోధన అనంతరం.. ప్రపంచానికి హోమియో వైద్యాన్ని అందించారు. ఆయన స్మృత్యర్థం ఏటా ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచ హోమియోపతి దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
జీవనశైలికి అనుగుణంగా
మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. సైడ్ ఎఫెక్ట్‌లు లేని మందులు వాడుతూ రోగాలు నయం చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఏళ్ల తరబడి మందులు వాడాల్సి వచ్చే దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసుకునేందుకు హోమియో సేవలను వినియోగంచుకుంటున్నారు. కీళ్ల, మోకాళ్ల, నడుం నొప్పులు, అర్థరైటిస్, సైనసైటిస్, షుగర్, బీపీ, థైరాయిడ్, కిడ్నీలో రాల్లు, అస్తమా, మలబద్దకం, అర్షమొలుల, సోరియాసిస్, బొల్లి వంటి చర్మవ్యాధులకు హోమియోపతిలో చికిత్స అందుబాటులో ఉంది.
శాశ్వత పరిష్కారం కోసం
రోగం నయం చేయడంలో కాస్త ఆలస్యమైనా ఖచ్చితంగా ఫలితం ఉంటుందనే నమ్మకమే హోమియోపతి సేవలు పెరగడానికి కారణంగా తెలుస్తోంది. శాశ్వత పరిష్కారం దొరుకుతుండడం ఒక కారణం. ముఖ్యంగా మొండి వ్యాధులకు మెరుగైన చికిత్స అందుతుండడంతో రోగులు హోమియోపతి వైపు మొగ్గుచూపుతున్నారు.
రెండో ప్రధాన వైద్యంగా గుర్తింపు
నేడు ప్రపంచ హోమియోపతి దినోత్సవం
అన్ని వ్యాధులకు చికిత్స
హోమియోలో అన్ని వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉంది. సంతానసాఫల్యత, కీళ్లనొప్పులు, మెడనరాల నొప్పి, నడుమునొప్పి, సయాటికా, థైరాయిడ్, హర్మోన్ సంబంధ వ్యాధులు, కిడ్నీ స్టోన్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఖచ్చితమైన చికిత్స అందుతుంది. అస్తమా, తరచు జలుబు, జ్వరం, టాన్సిల్స్ పెరుగుదల, జ్ఞాపకశక్తి తగ్గడం, నిద్రలోమూత్ర విసర్జన వంటి అన్ని వ్యాధులకు హోమియో సమాధానం చెబుతుంది. అందువల్ల హోమియోకు ఆదరణ పెరుగుతోంది.
– డాక్టర్ కొడిత్యాల శ్రీనివాస్, మాతృశ్రీ హోమియోక్లినిక్

హోమియోతో మొండి వ్యాధులకు చెక్