
అభివృద్ధి పనుల పరిశీలన
ఎలిగేడు(పెద్దపల్లి): ఉపాధిహామీ ద్వారా ధూళికట్ట గ్రామంలో చేపట్టిన మట్టిరోడ్డు పనులను డీఆర్డీవో కాళిందిని బుధవారం పరిశీలించారు. నిర్మాణం తీరు, ఉపాధిహామీ కూలీలకు కల్పించి తాగునీరు, నీడ తదితర సౌకర్యాలపై ఆరా తీశారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆరబోసిన ధాన్యం, తేమశాతం తనిఖీ చేశారు. ఎలిగేడు, ఽసుల్తాన్‌పూర్ గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిచారు. ఈకార్యక్రమంలోఎంపీడీవో భాస్కర్‌రావు, టీ సెర్ప్ ఏపీఎం సుధాకర్, ఈజీఎస్ ఏపీవో సదానందం, సీసీలు, ఫీల్డ్‌అసిస్టెంట్‌లు ఉపాధిహామీ కూలీలు పాల్గొన్నారు.
వివరాలు సేకరిస్తున్న డీఆర్డీవో కాళిందిని