అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య

Published Tue, Apr 8 2025 7:45 AM | Last Updated on Tue, Apr 8 2025 7:45 AM

అప్పు

అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య

ధర్మపురి: ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో ఓ వ్యక్తి రాయపట్నం వద్ద గోదా వరిలో దూకి ఆ త్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఉదయ్‌కుమార్‌ వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన మహ్మద్‌ అలీ అహ్మద్‌(45) కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది, ఆదివారం ఇంటి నుంచి బయటికొచ్చాడు. ధర్మపురి మండలం రాయపట్నం చేరుకుని గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మృతదేహం లభ్యమైంది. మృతుడి కుమారుడు హసామ్‌ అహ్మద్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉరేసుకుని ఒకరు..

జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్‌ మండలం గోపాల్‌రావుపేట గ్రామానికి చెందిన అనుసూ రి శ్యామ్‌సుందర్‌(46) సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నా డు. శ్యామ్‌సుందర్‌కు అతని సోదరునికి మధ్య కొద్దికాలంగా భూ వివాదం కొనసాగుతోంది. భూపత్రాలు ఇవ్వడం లేదనే మనస్తాపంతో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య శ్రీలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్సై సదాకర్‌ తెలిపారు.

దుబాయ్‌లో అయిలాపూర్‌ వాసి మృతి

కోరుట్ల రూరల్‌: మండలంలోని అయిలాపూర్‌ గ్రామానికి చెందిన గాజర్ల శ్రీనివాస్‌(55) దుబాయ్‌ లో ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీనివాస్‌ గత 10ఏళ్లుగా జీవనోపాధి కోసం దుబా య్‌ వెళ్లి వస్తున్నాడు. రెండేళ్ల క్రితం సెలవుపై వచ్చి వెళ్లాడు. ఆదివారం ఉదయం తను ఉండే గదిలోనే గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీని వాస్‌కు భార్య జల, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నాడు. పెద్ద కూతురు లాస్యకు వివాహం కాగా చిన్న కూతురు రమ్య డిగ్రీ పూర్తి చేసింది, కుమారుడు రణధీర్‌ ఎంసీఏ చది వాడు. ఇంటి పెద్ద మృతి చెందటంతో శ్రీనివాస్‌ మృతదేహం కోసం ఎదురుచూస్తూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి..

మెట్‌పల్లి: పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఈ నెల 5న స్థానిక పాత నటరాజ్‌ థియేటర్‌ సమీపంలో సుమారు 25ఏళ్ల యువకుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. సమాచారమందుకున్న 108 సిబ్బంది అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మరణించాడు. అప్పటి నుంచి మృతదేహాన్ని పోస్టుమార్టం గదిలో ఉంచగా, అతని సంబంధీకులు ఎవరు రాలేదు. దీంతో మృతదేహాన్ని దహన సంస్కారాల నిమిత్తం సోమవారం మున్సిపల్‌ సిబ్బందికి అప్పగించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

స్తంభంపల్లిలో ఒకరు..

వెల్గటూర్‌: వెల్గటూర్‌ మండలం స్తంభంపల్లికి చెందిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జక్కుల రమేశ్‌(41)గత పదేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది ఈ నెల 4న పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు జగిత్యాల ఏరియా ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఆదివా రం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య వనిత ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్‌ తెలిపారు.

రైలు నుంచి పడి వివాహిత..

జమ్మికుంట(హుజూరాబాద్‌): ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి వివాహిత మృతిచెందింది. రామగుండం రైల్వే పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ తిరుపతి తెలిపిన వివరాలు.. మహా రాష్ట్రలోని రాజురా పట్ట ణానికి చెందిన వివాహిత ప్రతిభ రమేశ్‌గజ్‌ (46) వైద్యం కోసం కూతురు, సోదరుడితో కలిసి బల్హార్షా నుంచి సికింద్రాబాద్‌కు దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరింది. ఈ క్రమంలో జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో ప్రమాదవశాత్తు రైలు నుంచి కింద పడి మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భర్త రమేశ్‌కోండ్‌గజ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ తెలిపారు.

నిరుద్యోగ మహిళలు, యువతులకు ఈ ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ

చిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని నిరుద్యోగ యువతులు, మహిళలకు ఈ–ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంపీడీవో మధుసూదన్‌ సోమవారం తెలిపారు. 18 నుంచి 45ఏళ్ల వయస్సున్న వారికి 60 రోజులపాటు ఎల్‌ఎండీకాలనీలోని దుర్గాబాయి మహిళా, శిశువికాస ప్రాంగణంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 50మంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన యువతులకు ఎలక్ట్రిక్‌ ఆటో నడపడంలో శిక్షణ ఇచ్చి డ్రైవింగ్‌ లైసెన్సు జారీ చేస్తామన్నారు. ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య
1
1/2

అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య

అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య
2
2/2

అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement