పేదల ఆకలి తీర్చేందుకే సన్నబియ్యం
పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్/సుల్తానాబాద్‌రూరల్/ఓదెల: పేదల ఆకలి తీర్చాలనే సదాశయంతోనే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. గురువారం పెద్దపల్లి మండలం చీకురాయి, సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్, పూసాల, శివాలయం వీధి, గర్రెపల్లి, ఓదెల మండలం కేంద్రంతోపాటు కొలనూర్‌లో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేసి మాట్లాడారు. ఇప్పటివరకు రేషన్‌కార్డుదారులకు దొడ్డుబియ్యం పంపిణీ చేస్తే వాటిని అమ్ముకుంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతోనే ఇంకా కొంత ఆర్థికభారం పెరిగినా ధైర్యంగా సీఎం సన్నబియ్యం పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని వివరించారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఈర్ల స్వరూప, మినుపాల ప్రకాష్‌రావు, తహసీల్దార్లు రాంచందర్‌రావు, సునీత, రాజయ్య, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, విండో చైర్మన్‌లు శ్రీగిరి శ్రీనివాస్, ఆళ్ల సుమన్‌రెడ్డి, పార్టీ మండలాల అధ్యక్షులు చిలుక సతీశ్, మూల ప్రేంసాగర్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే విజయరమణారావు


