
పేదలకు సరిపడా సన్నబియ్యం
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సరిపడా సన్నబియ్యం సరఫరా చేస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్ రేషన్ దుకాణంలో బుధవారం తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీని ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 413 రేషన్‌దుకాణాల ద్వారా ప్రతీనెల సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. ఇందుకోసం 4 లక్షల క్వింటాళ్ల బియ్యం అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లా అవసరాలు తీర్చడంతోపాటు ఆసిఫాబాద్ జిల్లాకు కూడా ఎగుమతి చేశామని వెల్లడించారు. ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, పెద్దపల్లి నియోజకవర్గంలోని 55 రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఆర్డీవో గంగయ్య, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, డీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. నిట్టూరులో రూ.20లక్షల వ్యయంతో చేపట్టిన కల్వర్టు పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
పేదల సంక్షేమమే ధ్యేయం
జూలపల్లి(పెద్దపల్లి): ప్రజాసంక్షేమమే ధ్యేయంగా, పేదల కడుపునింపేందుకే సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. జూలపల్లి మండలం కాచాపూర్, కుమ్మరికుంటలో అదనపు కలెక్టర్ వేణు, డీఎస్‌వో రాజేందర్, ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ స్వర్ణతో కలిసి ఆయన సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. నాయకులు గండు సంజీవ్, వేణుగోపాలరావు, రమాదేవి, నర్సింహాయాదవ్ తదితరులు ఉన్నారు.
తెల్లరేషన్‌కార్డుదారులకు..
ఎలిగేడు(పెద్దపల్లి): పేదల కడుపునింపేందుకే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఎలిగేడు మండలం ధూళికట్ట, ఎలిగేడులో తెల్లరేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించి మాట్లాడారు. అధికారులు రాజేందర్, గంగయ్య, బషీరొద్దీన్, భాస్కర్‌రావు, జయలక్ష్మి, పున్నమయ్య, అంజలి, నాయకులు దుగ్యాల సంతోష్‌రావు, సామ రాజేశ్వర్‌రెడ్డి, బాలుసాని పరుశరాములుగౌడ్, అర్షనపల్లి వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
సుల్తానాబాద్(పెద్దపల్లి): పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పట్టణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ కోయ శ్రీహర్ష