
రూ.4.5 కోట్లు.. 20 ఆఫీసులు
● అన్ని ప్రభుత్వ ఆఫీసులు ఒకేచోట ● ఇటీవల శంకుస్థాపన చేసిన ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు ● పనులు పట్టాలెక్కేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు ● ప్రజలకు మరింత చేరువలో సర్కారు సేవలు ● మండల కేంద్రాల్లోనూ నిర్మించేందుకు సన్నాహాలు
మంథని: జిల్లాల పునర్విభజన తర్వాత గతప్రభు త్వం అన్ని జిల్లాల్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలను ఒకేచోట నిర్మించింది. ప్రజలకు సర్కారు సేవలను మరింత చేరువ చేయాలనే ల క్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. అనుకున్నట్లే ప్ర భుత్వ ఆశయం నేరవేరింది. ఇదే తరహాలో డివిజన్ కేంద్రమైన మంథనిలోనూ రెవెన్యూ డివిజనల్ కా ర్యాలయంతోపాటు మిగతా అన్నిప్రభుత్వ శాఖలతో కలిపి సమీకృత కార్యాలయాల నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు.
ప్రగతిలో అగ్రభాగాన నిలిపే దిశగా
మంథని నియోజకవర్గ రూపరేఖలు మార్చేలా మా స్టర్ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్న ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు ప్రా రంభించారు. సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో మంథనిని ప్రగతి పథంలో తీసుకెళ్లి అగ్రభాగాన నిలిపేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతు న్నారు. ఈ క్రమంలోనే ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఒకేచోట సమీకృత కార్యాలయాలు నిర్మిస్తున్నట్లు శంకుస్థాపన సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. మంథని మున్సిపల్ కార్యాలయానికి నూతన భవనం, పట్టణంలో 50 పడకల ప్రభుత్వ ఆస్పతి.. ఇలా అనేక అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
మండల కేంద్రాల్లోనూ..
మండల కేంద్రాల్లోనూ సమీకృత ప్రభుత్వ కార్యా లయాలు నిర్మించేలా ప్రణాళిక తయారు చేశా రు. ఈ క్రమంలోనే కమాన్‌పూర్, రామగిరి మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. వీటితోపాటు ముత్తారంలో కూడా అన్ని అఫీసులు ఒకే చోట ఉండేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. అనేక ప్రభుత్వ శాఖలకు పక్కా భవనాలు లేక అద్దె భవనాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. సమీకృత కార్యాలయాలు నిర్మిస్తే అన్నిశాఖలకు సొంతభవ నాలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తా యి. ప్రభుత్వానికి అద్దెభారం తప్పనుంది. అంతేగాకుండా.. ఆ మూలకు ఓ ఆఫీ.. ఈ మూలన మరో కార్యాలయం ఉండటంతో వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు చిరునామా లభించక నానాఇబ్బందులు పడుతున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోటుకు చేరితే సమయం కలిసి వస్తుంది. ఆర్థికంగా ఆదా అవుతుంది. ప్రజలకు చిరునామా తెలుసుకోవడంలో గందరగోళం ఉండదు.
అన్ని కార్యాలయాలు ఒకేచోట
ప్రజలకు సౌకర్యం
అన్ని ప్రభుత్వ ఆఫీసులు ఒకేచోట నిర్మించడం ద్వారా ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. దళారీ వ్యవస్థ కనుమరుగవుతుంది. పనులు త్వరగా పూర్తవుతాయయి.
– బూడిద తిరుపతి, నాగారం, మంథని
పారదర్శకత ఉంటుంది
ప్రభుత్వ కార్యాయాల న్నీ ఒకేచోట ఉంటే అధికారుల్లో పారదర్శకత పెరుగుతుంది. డివిజన్‌స్థాయి అధికారి సైతం అందుబాటులో ఉంటే మండలస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉంటారు. సంక్షేమ పథకాల వివరాలు సులభంగా తెలిసే వీలుంటుంది.
– గోటికార్ కిషన్, మంథని
మంథని పట్ట ణంలో ఆర్డీవో కా ర్యాలయంలోపాటు త హసీల్దార్, ఆర్ అండ్ బీ, ఆర్ డబ్ల్యూఎస్, హార్టికల్చర్, ఎ ౖకై ్సజ్, ఎంపీడీవో, నీటిపారుదల, విద్య, వ్యవసా య, ఎస్టీవో, ఐసీడీఎస్, సబ్ రిజిస్ట్రార్, అటవీ, వెటర్నరీ, లేబర్, ఎస్సీ, బీసీ వెల్పేర్, ఎండోమెంట్ తదితర సుమారు 20 ప్రభుత్వ ఆఫీసులు ఒకేచోట ఉండేలా అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఇందుకోసం రూ.4.5కోట్లతో భవన సముదాయాలు నిర్మించనున్నారు.

రూ.4.5 కోట్లు.. 20 ఆఫీసులు

రూ.4.5 కోట్లు.. 20 ఆఫీసులు