
వైభవంగా నృసింహుని రథోత్సవం
జూలపల్లి(పెద్దపల్లి): పెద్దాపూర్ శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో ఆదివారం ర థోత్సవం నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు, ప్రతినిధులు సురేశ్‌రెడ్డి, గొట్టెముక్కుల రజని, జెల్ల శేఖర్‌యాదవ్, నర్సింహ యాదవ్, భారతి పాల్గొన్నారు.
ఆకట్టుకున్న గాంధీ వేషధారణ
జాతరలో దుకాణాలు ఏర్పాటు చేశారు. కొంద రు వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఓ బాలు డు మహాత్ముడి వేషధారణతో ఆకట్టుకున్నాడు.
ఓదెల మల్లన్నకు పట్నాలు
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి స న్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఉ మ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు మహారాష్ట్ర నుంచి కూడా పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఒగ్గు పూజారులతో స్వామివారికి పట్నాలు వేయించారు. ఆలయ జూనియర్ అసిస్టెంట్ కుమారస్వామి ఏర్పాట్లు పర్యవేక్షించారు.
ప్రజాసమస్యల్ని ఎత్తిచూపారు
గోదావరిఖనిటౌన్: నిస్పక్షపాతంగా, నిర్భయంగా వార్తలు రాసి కార్మిక, ప్రజాసమస్యలను ఎ త్తిచూపిన కలం యోధుడు కేపీ రామస్వామి అ ని పలువురు వక్తలు అన్నారు. సీనియర్ జర్న లిస్ట్ కేపీ రామస్వామి వర్ధంతి సందర్భంగా ఆదివారం నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. జ్యోతి ఫౌండేషన్ నిర్వహణలో కేపీ రామస్వామి కుటుంబ సభ్యులు స్థానిక బస్టాండ్ సమీపంలోని ప్రగతి నిరాశ్రయుల ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. విఠల్‌నగర్ లోని అమ్మపరివార్ ఆశ్రమంలో అన్నదానం చే శారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు పూదరి కూమార్ మాట్లాడుతూ, నిజాలను నిర్భయంగా రాసిన జర్నలిస్టు కేపీ రామస్వామి అని అన్నారు. ప్రతినిధులు సుభద్ర, కేపీ శ్రీనివాస్, కేపీ రాజ్‌కుమార్, మొగిలిపాక శ్రీనివాస్, జనగామ గట్ట య్య, తిరుపతిరెడ్డి, కుమార్, దండె విజయ్‌కుమార్, దబ్బెట శంకర్, కరాటే శ్రీనివాస్, మూ ల శంకర్, శివ, శ్రీనివాస్‌ఽ, ధరణి వంశీ, ఆశ్రమ నిర్వాహకులు నాగరాజు, కరణ్ పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం
పెద్దపల్లిరూరల్: జిల్లా కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసి యేషన్ ఎన్నికలు ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. పెద్దపల్లికి చెందిన మాడూరి వినోద్ వరుసగా మూడోసారి ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. స్థానిక న్యాయవాది ఉప్పు రాజు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అధ్యక్షుడిగా వినోద్, ప్రధాన కార్యదర్శిగా కె.రాజేందర్, కోశాధికారిగా పోలు సతీశ్ ఎన్నిౖకైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
‘కాలనీ’లో క్రైస్తవుల ర్యాలీ
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): స్థానిక సీ ఎస్‌ఐ సెయింట్ జాన్స్ చర్చిలో క్రైస్తవులు మ ట్టల ఆదివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం చర్చి ఆవరణను శుభ్రం చేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్ కెబ్యులా వాట్సప్ మాట్లాడారు. ఈకార్యక్రమంలో చర్చి కమిటీ సభ్యులు, విద్యార్థులు, క్రైస్తవులు పాల్గొన్నారు.

వైభవంగా నృసింహుని రథోత్సవం

వైభవంగా నృసింహుని రథోత్సవం

వైభవంగా నృసింహుని రథోత్సవం

వైభవంగా నృసింహుని రథోత్సవం