
అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు
మంథని/ముత్తారం: ఇళ్లులేని అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నా రు. ఇళ్ల మంజూరులో పైరవీలకు తావులేదన్నారు. మంథని, ముత్తారం మండలాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. మంథని మండలం ఎక్లాస్‌పూర్ – ముత్తారం – ఖమ్మంపల్లి రోడ్డు పునరుద్ధరణకు రూ.11.90 కోట్లు, ఖమ్మంపల్లి – ఓడేడు వరకు 15 కి.మీ. బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.30 కోట్లు, మంథని – ఓడేడు వరకు 19 కి.మీ. బీటీ రోడ్డు పనులకు రూ.60 కోట్లు వెచ్చించి పనులు చేపట్టామని మంత్రి అన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం, సులభమైన ప్రయాణం కోసం రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. భగుళ్లగుట్ట వరకు భక్తులు సులభంగా ప్రయాణం చేసేందుకు రూ.2 కోట్లతో రోడ్డు నిర్మిస్తున్నామని, విద్యుత్ లైన్ పనులు పూర్తిచేసుకున్నామని మంత్రి తెలిపారు. మంథనిలో రూ.కోటి ఖర్చు చేస్తూ అన్ని హంగులతో ఎస్సీ కమ్యూనిటీహాల్ నిర్మిస్తామని, ఇందులో చిన్న గ్రంథాలయం, స్టడీ సర్కిల్ ఏర్పాటు చే స్తున్నామని అన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, ఆర్‌అండ్ బీ ఎస్‌ఈ కిషన్‌రావు, ఈఈ భావ్‌సింగ్, ఆర్డీవో సురేశ్, నాయకులు కొత్త శ్రీని వాస్, శశిభూషణ్ కాచే, తొట్ల తిరుపతి, పెండ్రు రమాదేవి, ఐలి ప్రసాద్, వొడ్నా ల శ్రీనివాస్, మంథని సత్యం, చోప్పరి సదానందం, దొడ్డ బాలాజీ, మద్దెల రాజయ్య, గోవిందుల పద్మ, యాదగిరిరావు, ఏలువాక కొమురయ్య, మామిడిపల్లి బాపన్న, రాయమల్లు, మాతంగి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.