
వసతులు కల్పించాలి
కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలి. ఎండ తీవ్రత అధికంగా ఉంది. నీడ కోసం పందిర్లు వేయించాలి. తాగునీటి వసతి కల్పించాలి. నాణ్యతను బట్టి ధాన్యం తూకం వేసేలా అధికారులు చొరవ చూపాలి.
– వేణుగోపాల్‌రావు, రైతు, నిట్టూరు
సాఫీగా కొనుగోళ్లు
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందుల్లేకుండా కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకున్నాం. కనీస వసతులు కల్పిస్తాం. రైతులు కూడా నాణ్యమైన ధాన్యం తీసుకొస్తే త్వరగానే తూకం వేసేందుకు వీలు ఉంటుంది.
– ప్రవీణ్, డీఎం, సివిల్ సప్లయీస్
సమస్యలుంటే చెప్పండి
కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు విక్రయించి రైతులు మద్దతు ధర పొందాలి. ఒక్కగింజ కూడా దండి కొట్టకుండా కొనుగోలు చేస్తారు. ఏమైనా సమస్యలు తలెత్తితే నా దృష్టికి తీసుకురండి. వాటిని సత్వరమే పరిష్కరిస్తాం.
– విజయరమణారావు, ఎమ్మెల్యే, పెద్దపల్లి

వసతులు కల్పించాలి

వసతులు కల్పించాలి