
అంబేడ్కర్‌కు నివాళి
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి సోమవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతావని రాజ్యాంగాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించారని, ఈమేరకు ఆయన జయంతిని నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. ఎస్సీ వెల్పేర్ ఆఫీసర్ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీఐఎస్‌ఎఫ్ సేవలు భేష్
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ– రామ గుండం తెలంగాణ ప్రాజెక్టులో సీఐఎస్‌ఎఫ్ చేస్తున్న భద్రతా చర్యలు భేషుగ్గా ఉన్నాయని జీఎం అలోక్ కుమార్ త్రిపాఠి అన్నారు. ప్రాజెక్టులోని సీఐఎస్‌ఎఫ్ వింగ్ సోమవారం ఏర్పా టు చేసిన కార్యక్రమంలో సీనియర్ కమాండెంట్ అరవింద్ కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. అగ్నిమాపక దినోత్సవం సందర్భంగా వారంపాటు వివిధ విభాగాల్లో పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. డిప్యూటీ కమాండెంట్ (అగ్నిమాపక) వీకే శాస్త్రి, ఏజీఎం(హెచ్‌ఆర్) బిజయ్‌కుమార్ సిగ్దర్, అధికారులు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
17న సీఎంపీఎఫ్ ట్రస్ట్‌బోర్డు సమావేశం
గోదావరిఖని: సీఎంపీఎఫ్ ట్రస్ట్‌బోర్డు సమావేశం ఈనెల 17న న్యూఢిల్లీలో జరగనున్నట్లు బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య తెలిపారు. బీఎంఎస్ తరఫున లక్ష్మారెడ్డి కొత్తకాపు, ఆశిష్‌మూర్తి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సీఎంపీఎఫ్‌లో జరిగిన అవినీతి, అక్రమాలు, కనీస పింఛన్ రూ.5వేలు చెల్లించడం తదితర అంశాలపై ఇందులో చర్చిస్తారని పేర్కొన్నారు. సీఎంపీఎఫ్ ఆన్‌లైన్ చేయడం, రివైజ్డ్ పీపీవోలు, పింఛన్ ఫండ్ పెంపు, స్థిరీకరణ, పింఛన్ ఫండ్‌కు నిధులు, కాంట్రాక్ట్ కార్మికులకు తప్పనిసరిగా సీఎంపీఎఫ్ వర్తించేలా సమావేశంలో ప్రస్తావిస్తారని ఆయన వివరించారు.

అంబేడ్కర్‌కు నివాళి