
పత్తి రైతుపై విత్తన భారం
● పెరిగిన ధరలతో అన్నదాతల్లో ఆందోళన ● ప్యాకెట్ ధర ప్రస్తుతం రూ.864 ● వచ్చే వానాకాలం నుంచి రూ.901
సాక్షి, పెద్దపల్లి: వచ్చే వానాకాలం నుంచి పత్తి రైతులపై విత్తన ధరలు ఆర్థికభారం కానున్నాయి. విత్తనాల ధర పెంపుతో మోయలేని భారం పడనుంది. ఇప్పటికే పత్తి సాగులో రైతులు అనేక వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్నారు. ఏటా దిగుబడి తగ్గుతుండగా.. పెరుగుతున్న పెట్టుబడులు, ప్రకృతి వైపరీత్యాలు, ఎరువుల ధరలు అన్నదాతలను సతమతం చేస్తున్నాయి. ఇవి చాలవన్నట్లు ప్రస్తుతం పెరిగిన ప త్తి విత్తన ధరలు పిడుగులా తయారయ్యాయి.
475 గ్రాములు.. రూ.901
కేంద్ర వ్యవసాయ శాఖ పత్తి విత్తన ప్యాకెట్(475 గ్రాములు)ధరను రూ.901గా నిర్ణయిస్తూ ఇటీవల ప్రకటన విడుదల చేసింది. పత్తి పంట సాగులో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న తాము పెరిగిన విత్తన ధరతో మరింత నష్టపోవాల్సి వస్తుందని అ న్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రెండెకరాల విస్తీర్ణంలో పత్తి సాగుకు 475 గ్రా ముల 5 ప్యాకెట్లు అవసరమవుతాయి. జూన్ మొద టి, రెండోవారంలో విత్తనాలు వేస్తుండగా.. అక్టోబ రు చివరివారంలో దిగుబడి ప్రారంభమవుతుంది. ఎకరా పత్తి సాగుకు దాదాపు రూ.40 వేల – రూ.50 వేల దాకా ఖర్చు చేస్తున్నా గిట్టుబాటు కావడం లేద ని రైతులు వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు పత్తి విత్తనాలకు సబ్సిడీ ఇచ్చి రైతులు న ష్టపోకుండా చూడాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
విత్తన ధరలు (475 గ్రాములు
ప్యాకెట్ రూ.లలో)
సంవత్సరం ధర
2021 767
2022 810
2023 853
2024 864
2025 901