
పతకాలు సాధించిన విద్యార్థులకు ప్రశంసలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు జాతీయ కరాటే పోటీల్లో బంగారు పతకాలు సాధించారని కరాటే మాస్టర్ సతీశ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ఆరో జాతీయస్థాయి కుంగ్ ఫూ చాంపియన్‌షిప్ – 2025లో స్థానిక గవర్నమెంట్ హైస్కూల్‌కు చెందిన చరిష్మా, మీనాక్షి, మేఘన, సంరక్షిత, మైథిలి, అభినయ్, విజ్ఞాన్ హైస్కూల్‌కు చెందిన విఘ్నేష్, సాయికార్తీక్, కీర్తన, హరిణి, శ్రీహర్షిణి వివిధ విభాగాల్లో బంగారు, వెండి పతకాలు సాధించారని ఆయన వివరించారు. విద్యార్థులను ప్రభుత్వ హైస్కూల్ హెచ్‌ఎం రత్నాకర్‌రెడ్డి తదితరులు అభినందించారు.