
కోతలు లేకుండా కొనుగోళ్లు
● చివరి గింజవరకూ ధాన్యం సేకరిస్తాం ● సన్నవడ్లకు బోనస్‌తో రైతుల్లో సంబురం ● ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంథని/కమాన్‌పూర్/రామగి రి: రైతులు త మ పంట అమ్ముకునేందు కు అసౌకర్యం కలుగకుండా ఏ ర్పాట్లు చేస్తున్నామని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించా రు. జూలపల్లిలో కమాన్‌పూర్ పీఏసీఎస్ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు ప్రారంభించారు. మంథని, రామగిరి, కమాన్‌పూర్ తదితర ప్రాంతాల్లో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపా దరావు వర్ధంతి సభల్లో ఆయన పాల్గొని శ్రీపాదరా వుకు ఘనంగా నివాళి అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుల కష్టాలు దూరమయ్యాయ న్నారు. గతప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో క్వింటాల్‌పై 4కిలోల కోత విధించిందని, ఇప్పు డు గింజ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చే స్తూ, రైతుల బ్యాంకు ఖాతాల్లో వెంటనే డబ్బులు జ మచేస్తున్నామన్నారు. సన్నవడ్లకు రూ.500 బోనస్ చెల్లించడంతో రైతుల్లో సంబురం నెలకొందన్నారు. ప్రతినిధులు శ్రీనివాస్, ప్రకాశ్‌రెడ్డి, రాజబాబు, సతీశ్‌కుమార్, ఓదెలు, కిషన్‌రెడ్డి, లక్ష్మి ఉన్నారు.

కోతలు లేకుండా కొనుగోళ్లు