
నేడు ‘డయల్ యువర్ డీఎం’
మంథని: స్థానిక ఆర్డీసీ డిపో పరిధిలో శనివా రం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ శ్రావణ్‌కుమార్ శుక్రవారం తెలిపారు. ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 వరకు ప్రయాణికులు తమ సమస్యలు, సలహాలు, సూచనలు చేయాలని ఆయన సూచించారు. ఇందు కోసం 99592 259 23 మొబైల్ నంబరుకు ఫోన్‌చేయాలని ఆయన కోరారు.
ఐఎన్టీయూసీ బలోపేతానికి కృషి
జ్యోతినగర్(రామగుండం): ఐఎన్టీయూసీ బలోపేతానికి కృషి చేస్తానని ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడైన భూమళ్ల చందర్ అన్నారు. స్థానిక ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐఎన్టీయూసీ జా తీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి తనను యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వు లు జారీచేయడం అభినందనీయమన్నారు. కా ర్మికుల పక్షాన ఉద్యమించి వారి సమస్యలను పరిష్కరించడంలో ముందు వరుసలో నిలుస్తా నని ఆయన అన్నారు. నాయకులు వేముల కృష్ణయ్య, ఆరెపల్లి రాజేశ్వర్, జమీల్‌పాషా, గోశిక రవి, బొద్దుల శ్రీనివాస్, వెంకటేశ్, లక్ష్మయ్య, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీలో ఫార్వర్డ్‌బ్లాక్ నిరసన
పెద్దపల్లిరూరల్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తు న్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో దేశరా జధాని ఢిల్లీలో శుక్రవారం ఆందోళన చేపట్టా రు. ఈ ఆందోళనలో ఏఐఎఫ్‌బీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బండ సురేందర్‌రెడ్డి, పెద్దపల్లికి చెందిన నాయకుడు బొంకూరి సురేందర్ సన్నీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, నిత్యావసర సరుకుల ధరల పెంపు తదితర అంశాలపై పోరాటం సాగిస్తామని వారు అన్నారు. కార్యక్రమంలో నాయకులు కల్లెపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.
క్వింటాల్ పత్తి రూ.7,458
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో శుక్రవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,458 ధర పలికిందని మార్కెట్ ఇన్‌చార్జి కార్యదర్శి మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. కనిష్టంగా రూ.5,608, సగటు ధర రూ.7,231గా నమోదు అయ్యిందని ఆయన పేర్కొన్నారు.
నిరుద్యోగుల కోసమే గ్రంథాలయాలు
ధర్మారం(ధర్మపురి): నిరుద్యోగ యువకుల కోసమే ఆధునిక గ్రంథాలయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షల్లో నెగ్గాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్ కోరారు. మండల కేంద్రంలో చేపట్టే గ్రంథాలయ భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. అద్దె భవనంలోని లైబ్రరీ భవనంలో ఇంటర్నెనెట్, కూలర్ సౌకర్యం కల్పించిన ఆయన.. ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ సహకారంతో త్వరలోనే భవన నిర్మాణం చేపడతామని తెలిపారనీ కార్యక్రమంలో నాయకులు లాపుడ్య రూప్లానాయక్, అరిగే లింగయ్య, పాలకుర్తి రాజేశంగౌడ్, నాగభూషణం, గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, సోగాల తిరుపతి, కాంపెల్లి రాజేశం, కమలేశ్, ఓరం చిరంజీవి, పాలకుర్తి సాయివినీత్ తదితరులు పాల్గొన్నారు.
బల్దియా అటెండర్ సస్పెన్షన్
పెద్దపల్లిరూరల్: మున్సిపల్ అటెండర్ పోల రమేశ్‌ను సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తుండడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ తెలిపారు. ఈనెల 1 నుంచి విధులకు గైర్హాజరు కావడంతోపాటు మెమో జారీచేసినా వివరణ ఇవ్వలేదని ఆయన వివరించారు.

నేడు ‘డయల్ యువర్ డీఎం’

నేడు ‘డయల్ యువర్ డీఎం’