
గ్రూప్–1లో యువకుడి సత్తా
మంథని: ఖాన్‌సాయిపేట గ్రామానికి చెందిన జక్కుల అరుణ్‌కుమార్ గ్రూప్–1లో రాష్ట్ర స్థాయి లో 114, మల్టీజోన్‌లో–1లో 64వ ర్యాంకు సాధించాడు. గ్రూపు –2లోనూ ఆయన రాష్ట్రస్థాయిలో 35, గ్రూపు–3లో 81వ ర్యాంకు సాధించాడు. అరుణ్‌కుమార్ తల్లి అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నా రు. అదేవిధంగా తండ్రి లక్ష్మీనారాయణ కమాన్‌పూర్ ఎంపీపీఎస్‌లో ప్రధానోపాధ్యాయుడు, సోదరి సాయిప్రసన్న బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అరుణ్‌కుమార్‌ను తల్లిదండ్రులు, సోదరితోపాటు గ్రామస్తులు అభినందించారు.