పేద కుటుంబాలందరికీ సన్నబియ్యం
● రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ ● 43వ డివిజన్‌లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభం
గోదావరిఖని/గోదావరిఖనిటౌన్: ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. నగరంలోని 43వ డివిజన్‌లో ఆదివారం ఆయన సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు. తెల్లరేషన్‌కార్డు లోని ఒక్కో కుటుంబ సభ్యుడికి ఆరు కిలోలల చొ ప్పున సన్నబియాన్ని ఉచితంగా అందజేశారు. అ నంతరం ఆయన మాట్లాడుతూ, కార్పొరేషన్‌లోని కార్డుదారులకు 89 వేల కింటాళ్ల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, వీటితోపాటు మరో పదివేల కొ త్త రేషన్‌కార్డుదారులకూ పంపిణీ చేసేందుకు ఏర్పా ట్లు చేశామన్నారు. తహసీల్దార్ కుమారస్వామి, కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్, ముస్తాఫా, శ్రీనివాస్ పాల్గొన్నారు. విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా పవర్‌హౌస్‌కాలనీలోని శ్రీకాశీవిశ్వేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన చౌరస్తాలో వీహెచ్‌పీ చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ దంపతు లు, వీహెచ్‌పీ ప్రతినిధి అయోధ్య రవీందర్ తదిత రులు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోనూ షడ్రుచుల పచ్చడి పంపిణీచేశారు. నగరంలోని పలు ఈద్గాలను ఎ మ్మెల్యే సందర్శించి ఏర్పాట్లు పర్యవేక్షించారు.


