
బియ్యం పథకంపై పీఎం ఫొటో పెట్టాలి
● బీజేపీ శ్రేణుల డిమాండ్
పెద్దపల్లిరూరల్: పేదలకు పంపిణీ చేసే బియ్యం పథకంపై ప్రధానమంత్రి ఫొటో ముద్రించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో బుధవారం చేపట్టిన సన్నబియ్యం పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో వారు నిరసన తెలిపారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాకేశ్‌తోపాటు నాయకులు రాజ్‌గోపాల్, పిట్టల వినయ్ తదితరులు.. పీఎం ఫొటో కూడా ముద్రించాలని డిమాండ్‌చేశారు. అ యితే, వారు లోనికి చొచ్చుకు వెళ్లకుండా సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై లక్ష్మణ్‌రావు, మల్లేశ్ అడ్డుకున్నా రు. ‘ఈ విషయమై మీ విన్నపాన్ని కలెక్టర్ ఇవ్వండి.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు’ అని ఎమ్మెల్యే విజయరమణారావు వారికి నచ్చజెప్పారు. అంతేకాదు.. ‘రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, అందులో ఇద్దరు మంత్రులుగా ఉండీ ఏం లాభం.. రాష్ట్రాభివృధ్దికి నిధులు సాధించలేక పోయారు.. అదే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం నలుగురే ఉన్నా నిధుల వరద పారించార’ని ఎమ్మెల్యే విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిధులు తెచ్చేందుకు పోరాడాలే.. తప్ప గీ బియ్యం పథకం కాడ ఫొటో కోసం కాదని హితవు పలికారు. అయి నా, మన ప్రధానే.. ఆయనను గౌరవించుకుందామని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే నచ్చజెప్పి వెళ్లిపోయారు.